Latest

Uberలో భారీ లేఆఫ్స్.. 3,300 మందిపై ఎఫెక్ట్
ప్రముఖ రైడ్ హైలింగ్ సంస్థ ఉబర్ భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. వరల్డ్‌వైడ్‌గా దాదాపు 3,300 మంది ఎంప్లాయీస్‌ను తొలగించనుంది. ఇది కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఆల్‌మోస్ట్ 10 శాతం. మేనేజ్‌మెంట్ లెవల్స్‌ను తగ్గించి, ఆర్గనైజేషన్‌ను మరింత సింపుల్‌గా, ఫాస్ట్‌గా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మేనేజర్ల సంఖ్యను కూడా 20% తగ్గించనుంది. అయితే అందరూ ఉద్యోగాలు కోల్పోరు.. కొందరిని ఇతర రోల్స్‌లోకి షిఫ్ట్ చేయనున్నారు. 2020 కోవిడ్ తర్వాత ఉబర్‌లో ఇదే అతిపెద్ద లేఆఫ్.

గొల్లప్రోలు ఎన్నికలకు రెడీ.. 23 వార్డుల పరిశీలన!
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 20 నుంచి 23కు పెరుగుతున్నాయ్. గెజిట్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్కంలో కమిషనర్ దివిజ సంపతి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కొత్త కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బీవీఎస్ ప్రసాద్, కార్యాలయ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హిందూపురంలో జనసేన భారీ బైక్ ర్యాలీ!
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జనసేన సందడి చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుగూరు ఆంజనేయస్వామి ఆలయం నుంచి చౌడేశ్వరీ కాలనీ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రోడ్లన్నీ జెండాలతో నిండిపోయాయి. ఫంక్షన్ హాల్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్ఈడీ తెరపై పవన్ ప్రసంగాన్ని శ్రేణులు ఆసక్తిగా వీక్షించారు.

బుగ్గారంలో మండల క్రీడలు.. సెప్టెంబర్ 9 నుంచి!
జగిత్యాల జిల్లా బుగ్గారంలో క్రీడల సందడి మొదలవ్తోంది. MEO మోహన్ రెడ్డి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈనెల 9న బుగ్గారం జడ్పీ హైస్కూల్ ఆవరణలో SGF క్రీడలు స్టార్ట్! మొదటి రోజు అండర్-14, 17 బాయ్స్ కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలు. 10న అండర్-14, 17 గర్ల్స్ కబడ్డీ, కోకో, వాలీబాల్. 11న అండర్-14, 17 బాయ్స్, గర్ల్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరుగుతాయి. బుధవారం పీఈటీలు, పీడీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వణుకు వస్తే.. శరీరంలో ఏం జరుగుతుంది?
చలిలో బయటికి వెళ్లగానే మన శరీరం వణకడం మొదలవుతుంది కదా.. అసలు ఎందుకు వణుకుతామో తెలుసా? శరీరం తన వేడిని కాపాడుకునే సహజ మార్గం ఇది! చలి పెరిగినప్పుడు మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ శరీరం చల్లబడుతోందని గుర్తిస్తుంది. వెంటనే కండరాలు చాలా వేగంగా కుదించుకుని వదులుకోవడం మొదలుపెడతాయి. ఈ చిన్న చిన్న కండరాల కదలికల వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. అందుకే మనకు వణుకు వస్తుంది. అంటే వణకడం బలహీనత కాదు.. శరీరం తన ఉష్ణోగ్రతను నిలబెట్టుకునేందుకు చేస్తున్న సహజ ప్రయత్నం అన్నమాట! ఇలా శరీరం వేడిని తిరిగి పొందుతుంది.

ముంబైకర్లను.. తెలంగాణ స్థానికులుగా గుర్తించాలి!
ముంబైలోని తెలంగాణ వలస కార్మికుల కోసం ఓ డిమాండ్ వినిపిస్తోంది. బుధవారం ధోబీఘాట్‌లోని సంత్ గాడ్గేబాబా విగ్రహం వద్ద ఉద్యమ నేత బట్టు శ్రీధర్ గంగపుత్ర, రాజు మాదిగ మాట్లాడారు. ’’ముంబైకర్లు రెండు రాష్ట్రాల మధ్య నాన్-లోకల్‌గా మిగిలిపోతున్నారు. ఇది బాధాకరమ‘‘ని శ్రీధర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కె.కె. కమిటీ ప్రతిపాదించిన సౌకర్యాలు ముంబై ఉద్యమకారులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రజక సమాజం, ఎంటిజెఏసి నేతలు కల్లూరి సురేష్, తడ్కపల్లి నరేష్, సిద్దిరాములు, ఎస్.రాజు, భూమేష్, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.

ప్రైవేటీకరణ.. సింగరేణి క్లారిటీ!
పెద్దపల్లి జిల్లా సింగరేణి గనుల ప్రైవేటీకరణ వార్తలు అవాస్తవమని యాజమాన్యం స్పష్టం చేసింది. ’’ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన కూడా పరిశీలనలో లేదు. 21 భూగర్భ గనులు, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర.. ఇలా 5 రాష్ట్రాలకు కోల్ సరఫరా చేస్తుంది. కొన్ని గనులు నష్టాల్లో ఉన్నా.. ఉద్యోగ భద్రత కోసం వాటిని కొనసాగిస్తున్నామ’’ని తెలిపింది. శాంతిఖని ఈఓఐ ఆధారంగా ప్రైవేటీకరణ ప్రచారం వాస్తవ విరుద్ధమని పేర్కొంది. శాంతిఖని ఈఓఐకి స్పందన రాని సంగతి తెలిసిందే.

దిశా సాలియన్ కేసులో కీలక ట్విస్ట్.. CBIకు అప్పగింత!
దిశా సాలియన్ మృతి కేసులో ఆరేళ్ల తర్వాత కీలక అప్‌డేట్ వచ్చింది. 2020లో ముంబైలో ఓ బిల్డింగ్‌పై నుంచి పడి దిశా మృతి చెందారు. అప్పట్లో పోలీసులు దీన్ని యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేశారు. దిశా తండ్రి సతీశ్ సాలియన్ తన కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేశారని, పూర్తి ఇన్వెస్టిగేషన్ కోరుతూ బాంబే హైకోర్టులో న్యాయం కోరారు. దీంతో సీబీఐ FIR నమోదు చేసి ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇది హత్య జరిగిందనే నిర్ధారణ కాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్రలో ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది.

లుధియానా బోణి.. నందిపేట్ స్టూడెంట్స్ సెలక్ట్!
నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో ఓ సంతోష వార్త. అక్షర హైస్కూల్‌కు చెందిన 16 మంది విద్యార్థులు జాతీయ కురష్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న పంజాబ్‌లోని లుధియానాలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్లో పాల్గొనే విద్యార్థులను ఛైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్, డైరెక్టర్ దివ్య రామావత్, కరస్పాండెంట్ గంగాధర్, హెడ్‌మాస్టర్ మహేష్ స్టూడెంట్స్‌ను అభినందించారు.

రోడ్డుపై గుండెపోటు.. పల్నాడులో దారుణం!
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. వీరమ్మ కాలవ సమీప హైవేపై ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నారు. కొండమోడు నుంచి నకరికల్లు వైపు వెళ్తుండగా.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయన నడిరోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మీకు ఈ వ్యక్తి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే.. వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయండి. ఇలాంటి హఠాత్ మరణం ఎంత బాధాకరమో కదా?

వైఎస్ వర్ధంతి.. కొత్తగూడెంలో కాంగ్రెస్ నివాళులు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వైఎస్ వర్ధంతి ఘనంగా జరిగింది. సూర్యా ప్యాలెస్ సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వైఎస్ పేదల సంక్షేమానికి పనిచేసిన మహానేత అని కొనియాడారు. 108 ఆరోగ్యశ్రీ, రెండు రూపాయల బియ్యం, పింఛన్లు.. ఇంకా ఎన్నో పథకాలను పేదలకు అందించారన్నారు.

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!
ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు. కోజికోడ్‌లో ఓ జ్యువెల్లరీ ఈవెంట్‌కు వచ్చిన ఆమె.. ఆ తర్వాత కేరళం CM వి.డి. సతీశన్‌ను కలిశారు. ఇక్కడ రొనాల్డోకు భారీ ఫ్యాన్ బేస్ ఉందని CM చెప్పగా, ఈ విషయం తనకు తెలియదని ఎల్మా అన్నారు. ఈ విషయాన్ని రొనాల్డోతో చెబుతానని చెప్పారు. చివర్లో ‘CM సార్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ ఫొటో అడగడంతో ఈ మూమెంట్ వైరల్‌గా మారింది. తరువాత CMతో దిగిన ఫొటోలను ఎల్మా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. <a href="https://x.com/vdsatheesan/status/2095026237718806895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2095026237718806895%7Ctwgr%5E0150c68c6d23d9ff94230cf5dcecf2cd9b6551b7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fcristiano-ronaldos-sister-elma-visits-kerala-smr-1554789.html">వీడియో లింక్</a>

కారులో గంజాయి.. భద్రాద్రిలో కేసు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయి సీజ్ చేశారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో అశ్వాపురం పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఒడిశా నుంచి షిర్డీకి కారులో 40.56 కిలోల గంజాయి తరలిస్తున్నారు. రూ.20 లక్షల విలువ చేసే ఈ గంజాయిని గొల్లగూడెం కెనాల్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒడిస్సాకు చెందిన దంపతులు అరబిందో బిశ్వాస్, సుప్రియలను అరెస్ట్ చేశారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

CJP విజిట్ ఎఫెక్ట్.. పాత స్కూల్ బిల్డింగ్ కూల్చివేత!
రాజస్థాన్ సంగనేర్‌లోని కన్వర్‌పురా ప్రైమరీ స్కూల్‌లో కొన్ని రోజుల క్రితం CJP ప్రతినిధులు విజిట్ చేశారు. స్కూల్ పాత బిల్డింగ్ డ్యామేజ్‌డ్ కండిషన్‌లో ఉందని, స్టూడెంట్స్‌కు డేంజరస్‌గా మారిందని వారి విజిట్‌లో బయటపడింది. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. తాజాగా బుల్డోజర్లతో పాత బిల్డింగ్‌ను కూల్చే పనులు స్టార్ట్ చేశారు. కొత్త స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18 లక్షలు ఫండ్స్ ఇచ్చింది. CJP విజిట్ తర్వాత వచ్చిన ఈ యాక్షన్‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గోడౌన్‌లో దారుణం.. కోట్ల విలువైన ఉల్లి కుళ్లిపోయింది!
మహారాష్ట్ర నాశిక్‌లోని లాల్‌గావ్ CWC గోడౌన్‌లో కోట్ల విలువైన ఉల్లి స్టాక్ కుళ్లిపోయి బ్యాడ్ స్మెల్ వస్తోంది. రేట్లలను కంట్రోల్ చేసేందుకు NAFED, NCCF కొన్న 1.20 లక్షల టన్నుల ఉల్లి స్టాక్ వేస్ట్ అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన ఉల్లిని వర్కర్స్ మాస్కులు, గ్లౌజులు లేకుండానే తొలగిస్తున్నారు. అధికారుల నెగ్లిజెన్స్‌పై రైతులు, స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒంటి కాలితోనే.. కుంటుతూ బడికెళ్తోంది
UPలోని బల్లియా జిల్లా మానియర్ బ్లాక్‌లోని రానీపూర్ గ్రామానికి చెందిన రాగిణికి ఏడేళ్లు. ఆరు నెలల వయసులోనే రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోయింది. తను 1వ తరగతి చదువుతోంది. ఇంటి నుంచి 400 మీటర్ల దూరంలోని బడికి ఒంటికాలితో గెంతుతూ వెళ్తోంది. అయినా చదువు మాత్రం విడిచిపెట్టలేదు. SMలో వైరల్ అయిన తన ఉదంతం జిల్లా కలెక్టర్ మంగళా ప్రసాద్ సింగ్‌ను కదిలించింది. ఆయన రాగిణి ఇంటికి వచ్చి ట్రైసైకిల్, పుస్తకాలు, బొమ్మలు ఇచ్చారు. AAP నాయకులు ఆర్థికసాయం అందించారు. కృత్రిమ కాలు పెట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

OTP లు షేర్ చేయొద్దు.. ఖమ్మంలో అవగాహన!
ఖమ్మం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సైబర్ నేరాల అవగాహన సదస్సు జరిగింది. ఎస్ఐ పల్లెల ప్రదీప్ మాట్లాడుతూ.. అపరిచితుల ఫోన్ కాల్స్ నమ్మొద్దని హెచ్చరించారు. ’’బ్యాంక్ సిబ్బంది అని చెప్పి OTP లు అడిగితే జాగ్రత్త! ఆ వివరాలు ఎవరికీ చెప్పొద్దు. మీ వ్యక్తిగత వివరాలు కూడా పంచుకోవద్దు. మోసపోతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీను, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

డిజిటల్ అరెస్ట్.. ఎస్పీ రోహిత్ హెచ్చరిక!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు జరిగింది. అబ్దుల్ కలాం కళాశాలలో SP రోహిత్ రాజు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డిజిటల్ అరెస్ట్, నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. OTPలు, ఫోటోలు, వ్యక్తిగత వివరాలు అపరిచితులకు పంచుకోవద్దని స్పష్టం చేశారు. మోసం జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని, సినిమాల చెడు ప్రభావాలను అనుకరించవద్దని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీ హక్కుల కోసం.. సెప్టెంబర్ 6న ఛలో ఢిల్లీ!
ఆంధ్రప్రదేశ్ ఆదివాసీలు హక్కుల కోసం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. 1/70 భూ బదలాయింపు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 2000లో వచ్చిన జీఓ-3కి బదులుగా కొత్త జీఓ జారీ చేయాలని కోరుతున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల అక్రమ ఒప్పందాల జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ’’అడవి, భూమి, నీటిపై ఆదివాసీలకే సర్వహక్కులు ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. సర్కారు ఉల్లంఘిస్తోంది. అందుకే సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింద’’ని నాయకులు చెప్పారు.

IPPB 9వ యానివర్సిరీ..మూడు కొత్త సర్వీసెస్ ప్రారంభం
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తన 9వ ఫౌండేషన్ డే సందర్భంగా వ్యాపారులు, బీమా, పెట్టుబడుల రంగాల్లో మూడు కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించింది. అవి DakPay Sound Box, Digital Insurance Technology Platform, Digital Mutual Fund Platform. ప్రస్తుతం బ్యాంకుకు దేశవ్యాప్తంగా 13.25 కోట్ల మంది Account Holders ఉన్నారు. వీళ్లల్లో 77 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. 49 శాతం మంది మహిళలు. బ్యాంకు ఇప్పటివరకు ₹21.61 లక్షల కోట్ల విలువైన డిజిటల్ ట్రాన్‌సాక్షన్స్ నిర్వహించింది.

టెట్ మినహాయింపు కోరి.. గుంటూరులో టీచర్ల ధర్నా!
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని విద్యాభవన్ ఎదుట ఇన్‌సర్వీస్ టీచర్లు నిరసనకు దిగారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాస్ మార్కులను 40 శాతానికి తగ్గించాలని, ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని కోరారు. అంతేకాదు.. మ్యాథ్స్, సైన్స్ టీచర్లకు సంబంధిత సబ్జెక్టుల్లోనే టెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ స్పందించకపోతే విజయవాడలో భారీ ధర్నా చేస్తామని ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు.