Latest

RTC బస్సు - Private బస్సు.. అర్ధరాత్రి యాక్సిడెంట్ కలకలం!
TG: సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న APSRTC సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ టైమ్‌లో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. కొందరికి గాయాలయ్యాయి. RTC బస్సు క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోగా, పోలీసులు రెండు గంటలు కష్టపడి సేఫ్‌గా బయటకు తీశారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

APK ఫైల్‌తో సైబర్ మోసం
TG: వాట్సాప్‌లో వచ్చిన ఓ అపరిచిత APK ఫైల్‌ను క్లిక్ చేయడంతో జగిత్యాలలో ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.4.15 లక్షలు మాయం అయ్యాయి. జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌కు చెందిన ఎలిగేటి అశోక్‌కు ఇటీవల గుర్తుతెలియని APK ఫైల్ వాట్సాప్‌లో వచ్చింది. దానిని ఓపెన్ చేసిన కొద్దిసేపటికే ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా నగదు డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాలిటిక్స్‌లో Gen Z Voice ఎందుకు పెరుగుతోంది?
ఒకప్పుడు పాలిటిక్స్ అంటే పెద్దవాళ్ల విషయం అనుకునేవారు.. ఇప్పుడు Gen Z కూడా బలంగా మాట్లాడుతోంది..! 🗳️ సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్స్ వల్ల యువత తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాలు, విద్య, AI, ఆర్థిక అవకాశాలు వంటి తమ జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై ఎక్కువగా స్పందిస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం 2029 ఎన్నికల నాటికి Gen Z భారతదేశంలో అతిపెద్ద ఓటర్ల వర్గాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా యువతను ఆకట్టుకునే విధంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

సూపర్‌స్టార్‌కి 51 ఏళ్లు.. ఆగస్ట్ 15న మరో స్పెషల్ మూమెంట్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టి 51 ఏళ్లు పూర్తయ్యాయి. ఆగస్ట్ 15న ఆయన 51వ ఫిల్మ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌ను ‘ధర్మన్’ సినిమా సెట్స్‌లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు, మూవీ టీమ్ స్పెషల్‌గా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 1975 ఆగస్ట్ 15న ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో రజనీకాంత్ సినీ జర్నీని స్టార్ట్ చేశారు. ఐదు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాల్లో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

36 గంటలు కాదు, ఇక 3 గంటల్లోనే డిలీట్!
జంతర్ మంతర్ ఆందోళన, అనఫీషియల్ డిజిటల్ సెన్సార్షిప్ నేపథ్యంలో కంటెంట్ రిమూవ్ గడువును 36 గంటల నుండి 3 గంటలకు తగ్గిస్తూ IT శాఖ కొత్త సర్క్యులర్ ఇచ్చింది. దీని నేపథ్యంలోనే Scroll.in, The Hindu లాంటి పెద్ద మీడియా సంస్థల Kashmir pellet-injury స్టోరీలు కూడా ఇన్‌స్టాలో బ్లాక్ అయ్యాయి. జర్నలిస్టులు దీన్ని ప్రెస్ ఫ్రీడమ్‌పై దాడిగా అభివర్ణిస్తున్నారు. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ వీడియోలు కూడా కారణం చెప్పకుండా మెటా రిమూవ్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

క్షమాపణ చెప్పినా తగ్గని మెటా సెన్సార్‌షిప్!
ప్రధాని మోదీ వీడియో పొరపాటున డిలీట్ చేసినందుకు పార్లమెంట్ కమిటీ మెటాను నిలదీసింది, safe harbour తీసేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దాంతో మెటా అధికారి ఢిల్లీ వచ్చి క్షమాపణ చెప్పారు. కానీ అదే టైంలో కేజ్రీవాల్, CJP నేతలు, జుబేర్ పోస్టులు కూడా బ్యాన్ అయ్యాయి. కానీ మెటా రియాక్ట్ అవ్వట్లేదని ఫిర్యాదు చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ మీడియా 'Alt News' ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది.

Instagram డిజిటల్ సెన్సార్షిప్, కంటెంట్ క్రియేటర్స్ షాక్
జులై 20 జంతర్ మంతర్ నిరసనల తర్వాత, CJP వీడియోలు, పొలిటికల్ satire పోస్టులను Instagram ఒక్కొక్కటిగా తీసేస్తోంది. "లీగల్ రిక్వెస్ట్" అని మెటా చెప్తుంది గానీ వీడియోలో ఏం తప్పు ఉందో చెప్పట్లేదు. అప్పీల్ చేసుకునే దారీ లేదు. కంటెంట్ క్రియేటర్స్ అంజలి ప్రియ, శ్రేష్ఠి ఖన్నా లాంటి వాళ్లు దీన్ని "డిజిటల్ ఎమర్జెన్సీ" అంటున్నారు. వైరల్ అయిన వీడియోలనే టార్గెట్ చేస్తున్నారని క్రియేటర్ల ఆరోపణ. ఫ్యాక్ట్ చెక్ మీడియా Alt News కథనంఓ డిజిటల్ సెన్సార్షిప్ పై చర్చ జరుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?
ఒక్కసారిగా వణికిన ఫ్లోరెస్ ద్వీపం.. 47 మంది మృతి!
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ఐలండ్ దగ్గరలో నిన్న ఉదయం 5.58 గం. 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 47 మంది చనిపోగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొన్ని ప్రాంతాల నుంచి 2 వేల మందిని టెంపరరీ క్యాంప్స్‌కు తీసుకెళ్లారు. ల్యాండ్‌స్లైడ్స్ విరిగిపడటం, రోడ్లు డ్యామేజ్ అవ్వడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలిగాయి. ముందు సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, తర్వాత వాటిని విత్‌డ్రూ చేసుకున్నారు. ఇదే రోజు ఉత్తర సుమత్రాలో 6.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
AP: కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు గల్లంతైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఓగిడి గ్రామం నుంచి తూర్పుగోదావరి జిల్లా మోరి వైపు వెళ్తుండగా ఐతంపూడి లాకుల మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. కారులో నుంచి బయటకు దూకి ఓ యువకుడు ఈత కొట్టి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే మిగిలిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిని పోతుల లక్ష్మీభాను (18), రాజారాం (17), నాగిరెడ్డి దుస్వంత (18), సాయిసూర్య (19)గా పోలీసులు గుర్తించారు.

విహారయాత్రలో ఊహించని విషాదం
TG: నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీలోని నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన దుర్గం తిరుమలేష్ (25) ఆరుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చాడు. బ్యాక్‌వాటర్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న SI నాగేంద్రబాబు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తాం: భట్టి
TG: రైతుల సంక్షేమంతోపాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 27లక్షల మంది విద్యార్థుల కోసం పౌష్టిక అల్పాహార పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

హస్తకళలకు అండగా పవన్.. వుడ్ బ్యాంక్ ప్రారంభం
AP: హస్తకళాకారులకు ముడిసరుకు కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఏర్పాటు చేశామని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని మరో ఆరు క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకులను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 5 వేల మంది హస్తకళాకారుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. అనంతరం పవన్ దంపతులు కళాకృతులను పరిశీలించి కళాకారులతో మాట్లాడారు.

కేంద్ర పథకాల్లో CM ఫొటో పెట్టాల్సిందే: మంత్రి
TG: కేంద్రప్రభుత్వ పథకాల్లో CM రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. GSTతో పాటు ఇతర పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం వెళ్తోందని, అందుకే రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర పథకాల్లో CM ఫొటో ఉండాలని అన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందన్నారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం ఎవరిదో కేంద్రమంత్రి బండి సంజయ్ ఆలోచించుకోవాలని విమర్శించారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే దమ్ము BJPకి ఉందా? అని ప్రశ్నించారు.

APని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం: చంద్రబాబు
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్-1గా నిలపాలన్నదే లక్ష్యమని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలకులుగా కాకుండా ప్రజాసేవకులుగా పనిచేస్తున్నామని అన్నారు. వికాసం నుంచి వైభవం, సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి కొత్త ఊపిరి వచ్చిందన్నారు.

ఎవరేం చేశారో అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం: CM
TG: పదేళ్ల BRS పాలనలో ఏంచేశారు.. రెండున్నరేళ్లలో మేం ఏంచేశామో అసెంబ్లీలో చర్చిద్దాం.. సిద్ధమా? అని KCRకు CM రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సంగారెడ్డిలో నిర్వహించిన సభలో రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. 37 నెలల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.36వేల కోట్ల రైతుబంధు నిధులు జమ చేశామని తెలిపారు. రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి రూ.90వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. రైతు రుణమాఫీతో పాటు ఉచిత విద్యుత్ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

జిమ్ చేసేవారు జాగ్రత్త!
జిమ్ చేసేవారికి అండ్ హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి అలర్ట్! బాడీ బిల్డింగ్ కోసం అవసరానికి మించి ప్రొటీన్ తింటే మేలు కంటే డేంజరే ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై ప్రెజర్ పడి పాడైపోయే ఛాన్స్ ఉంది. అంతేకాదు గ్యాస్, మలబద్ధకం, హై బిపి, లివర్ ప్రాబ్లమ్స్‌తో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే ప్రొటీన్‌తో పాటు ఫైబర్ ఉన్న ఫుడ్స్ తింటూ, డైటీషియన్ సలహా తీసుకోవడం బెటర్.

Coffee ఎప్పుడు తాగాలి?
నిద్ర లేవగానే కళ్లు కూడా పూర్తిగా తెరవకముందే కాఫీ కప్పు చేతిలోకి వచ్చేస్తుందా..? ☕ అయితే కొంచెం వెయిట్ చేయడం బెటర్ అంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్. లేచిన వెంటనే మన బాడీలో కార్టిసోల్ లెవల్స్ ఎక్కువగా ఉండి సహజంగానే అలర్ట్‌గా ఉంచుతాయి. అందుకే లేచిన 60–90 నిమిషాల తర్వాత, సాధారణంగా ఉదయం 9–11 మధ్య కాఫీ తాగితే బెటర్ అని చెబుతున్నారు. అలాగే రోజుకు 400mg కెఫిన్ దాటకుండా చూసుకోవాలి. రాత్రి మంచి నిద్ర కావాలంటే బెడ్‌టైమ్‌కు 6–8 గంటల ముందే కాఫీకి బ్రేక్ ఇవ్వడం మంచిదట.

AI కొత్త వైరస్‌లను తయారు చేసిందా? 🧬
అమెరికాలోని రీసెర్చర్లు AIని ఉపయోగించి ప్రకృతిలో కనిపించని బాక్టీరియోఫేజ్‌లను రూపొందించారు. ఇవి మనుషులను లక్ష్యంగా చేసుకునేవి కాకుండా బ్యాక్టీరియాపైనే పనిచేసే వైరస్‌లు. 2026లో జరిగిన ఈ రీసెర్చ్‌లో AI రూపొందించిన నమూనాల్లో కొన్ని ల్యాబ్‌లో పనిచేయగా, వాటిలో 16 వైరస్‌లు ఈ.కోలి బ్యాక్టీరియాను చంపగలిగాయి. మందులకు తట్టుకునే బ్యాక్టీరియాపై భవిష్యత్తులో ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఈ టెక్నాలజీపై భద్రతకు సంబంధించిన చర్చ కూడా మొదలైంది. ఇవి భవిష్యత్తులో కొత్త చికిత్సలకు ఉపయోగపడతాయని అనుకుంటున్నారా?

స్వీట్లు తిన్న వెంటనే దాహం..ఎందుకు?
స్వీట్లు తిన్న వెంటనే చాలామందికి దాహం వేస్తుంది. ఎందుకో తెలుసా? మన రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల. దీన్నే ‘hyperglycemia’ అంటారు. స్వీట్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. ఇది రక్తంలోని నీటిని లాగుతుంది. దీంతో శరీర కణాల నుంచి నీరు రక్తంలోకి వెళ్తుంది. శరీరం డీహైడ్రేటెడ్ అయినట్టు అనిపించి దాహం వేస్తుంది. ఎక్కువగా ఉప్పు ఉన్న పదార్థాలు తిన్నా దాహం పెరుగుతుంది. అయితే ఏదైనా తిన్న వెంటనే నీరు తాగకూడదని, కాసేపు ఆగాక తాగాలని నిపుణులు చెబుతున్నారు.

‘లౌకిక భారతం కోసం గాంధీ’ పుస్తకం
ప్రజాశక్తి బుక్‌హౌస్ ‘లౌకిక భారతం కోసం గాంధీ’ పేరుతో వ్యాసాల పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, సుకుమార్ మురళీధరన్, బిపిన్ చంద్ర, కుంకుం సంఘారి, రవీందర్ కుమార్ లాంటి వారు రాసిన ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. అహింసా మార్గంలో ప్రజలను కదిలించిన రాజకీయ వ్యూహకర్తగా గాంధీ, కులవ్యవస్థ, మహిళా స్వేచ్ఛ, మతాల మధ్య ఐక్యత, లౌకికత్వం వంటి అంశాలపై గాంధీ అభిప్రాయాలను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. దీని ధర ₹100. పుస్తకాన్ని <a href="https://navatelanganabooks.com/book/%e0%b0%b2%e0%b1%8c%e0%b0%95%e0%b0%bf%e0%b0%95-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80-loukika-bhartham-kosam/">ఇక్కడ </a>కొనొచ్చు.

📞 మొదటి Phone Call ఎవరికి చేశారు?
ఇప్పుడు రోజుకు ఎన్నో Calls చేస్తుంటాం.. కానీ మొబైల్ చరిత్రలో మొదటి కాల్ ఎవరికి చేశారో తెలుసా? 😏 1973 ఏప్రిల్ 3న Motorola ఇంజనీర్ మార్టిన్ కూపర్ న్యూయార్క్‌లోని ఓ వీధి నుంచి ప్రపంచంలోనే తొలి హ్యాండ్‌హెల్డ్ మొబైల్ కాల్ చేశారు. ఆశ్చర్యంగా.. ఆయన కాల్ చేసింది తన ప్రత్యర్థి సంస్థ Bell Labs ఇంజనీర్ జోయెల్ ఎంగెల్‌కే! అప్పటి Motorola DynaTAC ప్రోటోటైప్ దాదాపు 1 కిలో బరువు ఉండేది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 20–30 నిమిషాలే మాట్లాడగలిగేది. ఆ ఒక్క కాల్‌తో మొబైల్ కమ్యూనికేషన్‌లో కొత్త శకం మొదలైంది.📱