Latest

రైల్వే స్టేషన్లో నీళ్లు తాగుతున్నారా? CAG Big Alert 🚨
Politics· 16 Aug 2026

రైల్వే స్టేషన్లో నీళ్లు తాగుతున్నారా? CAG Big Alert 🚨

రైల్వే స్టేషన్ల తాగునీటిపై CAG ఆడిట్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 512 స్టేషన్లలో చెక్ చేస్తే, 458 స్టేషన్లలో సరైన సౌకర్యాలు లేవు. తాగునీటి కూలర్లలో E-coli బాక్టీరియా పాజిటివ్ వచ్చిన లిస్టులో హైదరాబాద్ కూడా ఉంది. ఈ బ్యాక్టీరియా వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. <br>వాష్‌రూమ్‌లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని రిపోర్ట్ చెప్పింది. CAG ఈ రిపోర్ట్ పార్లమెంటుకు సమర్పించింది.

విద్యార్థిని అలీనా కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
Local· 16 Aug 2026

విద్యార్థిని అలీనా కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

TG: పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్టు కొమ్మ విరిగిపడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందడం విషాదం నింపింది. యాదాద్రి జిల్లా భువనగిరి భగాయత్‌ జడ్పీ పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. బలమైన గాలులకు భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి విద్యార్థులపై పడటంతో ఏడుగురు గాయపడ్డారు. వారిలో అలీనా అనే విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అలీనా కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు.

వానలతో పాటు బలమైన గాలులు.. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్!
Infotainment· 16 Aug 2026

వానలతో పాటు బలమైన గాలులు.. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. నార్త్‌వెస్ట్ బే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో AP, తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. APలో నార్త్ కోస్ట్, యానాం, సౌత్ కోస్ట్, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో వర్షాలు, పిడుగుల ముప్పు ఉందని సూచించింది.

రోడ్డు ప్రమాదం కాదు.. పక్కా హత్యే
Crime· 16 Aug 2026

రోడ్డు ప్రమాదం కాదు.. పక్కా హత్యే

AP: కడప జిల్లా టి.సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి వద్ద జూలై 22న జరిగిన జయరాం(44), రవీంద్ర (45) మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. తొలుత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేయగా ఇంటి స్థల వివాదమే హత్యలకు కారణమని తేలింది. ప్లాన్ ప్రకారం ఇద్దరినీ ట్రాలీ ఆటోతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులు శివప్రసాద్, శరణ్ రాజ్‌లను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

బడి కోసం 8 కి.మీ. నడక.. దొనబైలు పిల్లల ఆవేదన!
AP· 16 Aug 2026

బడి కోసం 8 కి.మీ. నడక.. దొనబైలు పిల్లల ఆవేదన!

AP: 'సార్‌.. మా గ్రామానికి రోడ్డు వేయండి.. మేము బడికి వెళ్లాలి' అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె దగ్గర్లోని దొనబైలు గ్రామ విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు. సరైన రోడ్డు లేకపోవడంతో స్టూడెంట్స్ ప్రతిరోజూ దాదాపు 8 కి.మీ. నడిచి స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్నారు. వృద్ధులు, మహిళలు, రైతులు, కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ టైమ్‌లో హాస్పిటల్‌కు చేరుకోవడం కష్టంగా మారిందని, గ్రామానికి త్వరగా రోడ్డు వేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

‘August Theory’ అంటే ఏంటి?
Viral· 16 Aug 2026

‘August Theory’ అంటే ఏంటి?

ఆగస్టు వచ్చింది.. సోషల్ మీడియాలో ఇప్పుడు ‘ఆగస్టు థియరీ’ అనే డేటింగ్ ట్రెండ్ తెగ చర్చలో ఉంది. ఈ థియరీ ప్రకారం ఆగస్టు వచ్చేసరికి కొందరు తమ పాత రిలేషన్‌షిప్స్, సిట్యుయేషన్‌షిప్స్ గురించి మళ్లీ ఆలోచించడం మొదలుపెడతారట. దూరమైన వ్యక్తి మళ్లీ మెసేజ్ చేయడం, పాత కనెక్షన్స్ తిరిగి స్టార్ట్ అవ్వడం లేదా కొన్ని రిలేషన్‌షిప్స్‌కు పూర్తిగా ఎండ్ కార్డ్ పడటం జరగొచ్చనేది ఈ వైరల్ ఐడియా. అయితే “ఆగస్టు వచ్చింది కాబట్టి Ex తిరిగొస్తాది” అని వెయిట్ చేయకండి బ్రో😂.. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమీ లేదు.

ప్రశంసాపత్రం అందుకున్న కొన్ని గంటల్లోనే విషాదం
Local· 16 Aug 2026

ప్రశంసాపత్రం అందుకున్న కొన్ని గంటల్లోనే విషాదం

TG: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ప్రతిభా ప్రశంసాపత్రం అందుకున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) జాంగిర్ పాషా.. కొన్ని గంటల్లోనే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జోగులాంబగద్వాల జిల్లాలో గత ఐదేళ్లుగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న జాంగిర్ పాషాను ఆయన సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ MD రిజ్వాన్ పాషా సత్కరించారు. అయితే ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో చికిత్స పొందేలోపే కన్నుమూశారు. ఆయన మృతితో 108 సిబ్బంది, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

RTC బస్సు - Private బస్సు.. అర్ధరాత్రి యాక్సిడెంట్‌ కలకలం!
TG· 16 Aug 2026

RTC బస్సు - Private బస్సు.. అర్ధరాత్రి యాక్సిడెంట్‌ కలకలం!

TG: సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు యాక్సిడెంట్‌ జరిగింది. నర్సాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును, ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న APSRTC సూపర్‌ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ టైమ్‌లో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. కొందరికి గాయాలయ్యాయి. RTC బస్సు క్యాబిన్‌లో డ్రైవర్‌ ఇరుక్కుపోగా, పోలీసులు రెండు గంటలు కష్టపడి సేఫ్‌గా బయటకు తీశారు. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

APK ఫైల్‌తో సైబర్‌ మోసం
Crime· 16 Aug 2026

APK ఫైల్‌తో సైబర్‌ మోసం

TG: వాట్సాప్‌లో వచ్చిన ఓ అపరిచిత APK ఫైల్‌ను క్లిక్ చేయడంతో జగిత్యాలలో ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.4.15 లక్షలు మాయం అయ్యాయి. జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌కు చెందిన ఎలిగేటి అశోక్‌కు ఇటీవల గుర్తుతెలియని APK ఫైల్ వాట్సాప్‌లో వచ్చింది. దానిని ఓపెన్ చేసిన కొద్దిసేపటికే ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా నగదు డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాలిటిక్స్‌లో Gen Z Voice ఎందుకు పెరుగుతోంది?
Politics· 16 Aug 2026

పాలిటిక్స్‌లో Gen Z Voice ఎందుకు పెరుగుతోంది?

ఒకప్పుడు పాలిటిక్స్ అంటే పెద్దవాళ్ల విషయం అనుకునేవారు.. ఇప్పుడు Gen Z కూడా బలంగా మాట్లాడుతోంది..! 🗳️ సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్స్ వల్ల యువత తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాలు, విద్య, AI, ఆర్థిక అవకాశాలు వంటి తమ జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై ఎక్కువగా స్పందిస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం 2029 ఎన్నికల నాటికి Gen Z భారతదేశంలో అతిపెద్ద ఓటర్ల వర్గాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా యువతను ఆకట్టుకునే విధంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

సూపర్‌స్టార్‌కి 51 ఏళ్లు.. ఆగస్ట్ 15న మరో స్పెషల్‌ మూమెంట్!
Entertainment· 16 Aug 2026

సూపర్‌స్టార్‌కి 51 ఏళ్లు.. ఆగస్ట్ 15న మరో స్పెషల్‌ మూమెంట్!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టి 51 ఏళ్లు పూర్తయ్యాయి. ఆగస్ట్ 15న ఆయన 51వ ఫిల్మ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌ను ‘ధర్మన్‌’ సినిమా సెట్స్‌లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. డైరెక్టర్ అశ్వత్‌ మారిముత్తు, మూవీ టీమ్ స్పెషల్‌గా కేక్‌ కట్‌ చేసి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. 1975 ఆగస్ట్ 15న ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమాతో రజనీకాంత్‌ సినీ జర్నీని స్టార్ట్ చేశారు. ఐదు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాల్లో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

36 గంటలు కాదు, ఇక 3 గంటల్లోనే డిలీట్!
Agriculture· 16 Aug 2026

36 గంటలు కాదు, ఇక 3 గంటల్లోనే డిలీట్!

జంతర్ మంతర్ ఆందోళన, అనఫీషియల్ డిజిటల్ సెన్సార్షిప్ నేపథ్యంలో కంటెంట్ రిమూవ్ గడువును 36 గంటల నుండి 3 గంటలకు తగ్గిస్తూ IT శాఖ కొత్త సర్క్యులర్ ఇచ్చింది. దీని నేపథ్యంలోనే Scroll.in, The Hindu లాంటి పెద్ద మీడియా సంస్థల Kashmir pellet-injury స్టోరీలు కూడా ఇన్‌స్టాలో బ్లాక్ అయ్యాయి. జర్నలిస్టులు దీన్ని ప్రెస్ ఫ్రీడమ్‌పై దాడిగా అభివర్ణిస్తున్నారు. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ వీడియోలు కూడా కారణం చెప్పకుండా మెటా రిమూవ్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

క్షమాపణ చెప్పినా తగ్గని మెటా సెన్సార్‌షిప్!
Gen Z· 16 Aug 2026

క్షమాపణ చెప్పినా తగ్గని మెటా సెన్సార్‌షిప్!

ప్రధాని మోదీ వీడియో పొరపాటున డిలీట్ చేసినందుకు పార్లమెంట్ కమిటీ మెటాను నిలదీసింది, safe harbour తీసేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దాంతో మెటా అధికారి ఢిల్లీ వచ్చి క్షమాపణ చెప్పారు. కానీ అదే టైంలో కేజ్రీవాల్, CJP నేతలు, జుబేర్ పోస్టులు కూడా బ్యాన్ అయ్యాయి. కానీ మెటా రియాక్ట్ అవ్వట్లేదని ఫిర్యాదు చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ మీడియా 'Alt News' ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది.

Instagram డిజిటల్ సెన్సార్షిప్, కంటెంట్ క్రియేటర్స్ షాక్
Gen Z· 16 Aug 2026

Instagram డిజిటల్ సెన్సార్షిప్, కంటెంట్ క్రియేటర్స్ షాక్

జులై 20 జంతర్ మంతర్ నిరసనల తర్వాత, CJP వీడియోలు, పొలిటికల్ satire పోస్టులను Instagram ఒక్కొక్కటిగా తీసేస్తోంది. "లీగల్ రిక్వెస్ట్" అని మెటా చెప్తుంది గానీ వీడియోలో ఏం తప్పు ఉందో చెప్పట్లేదు. అప్పీల్ చేసుకునే దారీ లేదు. కంటెంట్ క్రియేటర్స్ అంజలి ప్రియ, శ్రేష్ఠి ఖన్నా లాంటి వాళ్లు దీన్ని "డిజిటల్ ఎమర్జెన్సీ" అంటున్నారు. వైరల్ అయిన వీడియోలనే టార్గెట్ చేస్తున్నారని క్రియేటర్ల ఆరోపణ. ఫ్యాక్ట్ చెక్ మీడియా Alt News కథనంఓ డిజిటల్ సెన్సార్షిప్ పై చర్చ జరుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?

ఒక్కసారిగా వణికిన ఫ్లోరెస్‌ ద్వీపం.. 47 మంది మృతి!
Current Affairs· 16 Aug 2026

ఒక్కసారిగా వణికిన ఫ్లోరెస్‌ ద్వీపం.. 47 మంది మృతి!

ఇండోనేషియాలోని ఫ్లోరెస్‌ ఐలండ్ దగ్గరలో నిన్న ఉదయం 5.58 గం. 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 47 మంది చనిపోగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొన్ని ప్రాంతాల నుంచి 2 వేల మందిని టెంపరరీ క్యాంప్స్‌కు తీసుకెళ్లారు. ల్యాండ్‌స్లైడ్స్ విరిగిపడటం, రోడ్లు డ్యామేజ్ అవ్వడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలిగాయి. ముందు సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, తర్వాత వాటిని విత్‌డ్రూ చేసుకున్నారు. ఇదే రోజు ఉత్తర సుమత్రాలో 6.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
AP· 16 Aug 2026

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు

AP: కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు గల్లంతైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఓగిడి గ్రామం నుంచి తూర్పుగోదావరి జిల్లా మోరి వైపు వెళ్తుండగా ఐతంపూడి లాకుల మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. కారులో నుంచి బయటకు దూకి ఓ యువకుడు ఈత కొట్టి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే మిగిలిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిని పోతుల లక్ష్మీభాను (18), రాజారాం (17), నాగిరెడ్డి దుస్వంత (18), సాయిసూర్య (19)గా పోలీసులు గుర్తించారు.

విహారయాత్రలో ఊహించని విషాదం
Local· 16 Aug 2026

విహారయాత్రలో ఊహించని విషాదం

TG: నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీలోని నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన దుర్గం తిరుమలేష్‌ (25) ఆరుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చాడు. బ్యాక్‌వాటర్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న SI నాగేంద్రబాబు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తాం: భట్టి
TG· 16 Aug 2026

అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తాం: భట్టి

TG: రైతుల సంక్షేమంతోపాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 27లక్షల మంది విద్యార్థుల కోసం పౌష్టిక అల్పాహార పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

హస్తకళలకు అండగా పవన్‌.. వుడ్‌ బ్యాంక్‌ ప్రారంభం
AP· 16 Aug 2026

హస్తకళలకు అండగా పవన్‌.. వుడ్‌ బ్యాంక్‌ ప్రారంభం

AP: హస్తకళాకారులకు ముడిసరుకు కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఏర్పాటు చేశామని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని మరో ఆరు క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకులను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 5 వేల మంది హస్తకళాకారుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. అనంతరం పవన్ దంపతులు కళాకృతులను పరిశీలించి కళాకారులతో మాట్లాడారు.

కేంద్ర పథకాల్లో CM ఫొటో పెట్టాల్సిందే: మంత్రి
TG· 16 Aug 2026

కేంద్ర పథకాల్లో CM ఫొటో పెట్టాల్సిందే: మంత్రి

TG: కేంద్రప్రభుత్వ పథకాల్లో CM రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. GSTతో పాటు ఇతర పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం వెళ్తోందని, అందుకే రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర పథకాల్లో CM ఫొటో ఉండాలని అన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందన్నారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం ఎవరిదో కేంద్రమంత్రి బండి సంజయ్ ఆలోచించుకోవాలని విమర్శించారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే దమ్ము BJPకి ఉందా? అని ప్రశ్నించారు.

APని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం: చంద్రబాబు
AP· 16 Aug 2026

APని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం: చంద్రబాబు

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌-1గా నిలపాలన్నదే లక్ష్యమని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలకులుగా కాకుండా ప్రజాసేవకులుగా పనిచేస్తున్నామని అన్నారు. వికాసం నుంచి వైభవం, సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి కొత్త ఊపిరి వచ్చిందన్నారు.