Latest

Coffee ఎప్పుడు తాగాలి?
Education· 15 Aug 2026

Coffee ఎప్పుడు తాగాలి?

నిద్ర లేవగానే కళ్లు కూడా పూర్తిగా తెరవకముందే కాఫీ కప్పు చేతిలోకి వచ్చేస్తుందా..? ☕ అయితే కొంచెం వెయిట్ చేయడం బెటర్ అంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్. లేచిన వెంటనే మన బాడీలో కార్టిసోల్ లెవల్స్ ఎక్కువగా ఉండి సహజంగానే అలర్ట్‌గా ఉంచుతాయి. అందుకే లేచిన 60–90 నిమిషాల తర్వాత, సాధారణంగా ఉదయం 9–11 మధ్య కాఫీ తాగితే బెటర్ అని చెబుతున్నారు. అలాగే రోజుకు 400mg కెఫిన్ దాటకుండా చూసుకోవాలి. రాత్రి మంచి నిద్ర కావాలంటే బెడ్‌టైమ్‌కు 6–8 గంటల ముందే కాఫీకి బ్రేక్ ఇవ్వడం మంచిదట.

AI కొత్త వైరస్‌లను తయారు చేసిందా? 🧬
Science· 15 Aug 2026

AI కొత్త వైరస్‌లను తయారు చేసిందా? 🧬

అమెరికాలోని రీసెర్చర్లు AIని ఉపయోగించి ప్రకృతిలో కనిపించని బాక్టీరియోఫేజ్‌లను రూపొందించారు. ఇవి మనుషులను లక్ష్యంగా చేసుకునేవి కాకుండా బ్యాక్టీరియాపైనే పనిచేసే వైరస్‌లు. 2026లో జరిగిన ఈ రీసెర్చ్‌లో AI రూపొందించిన నమూనాల్లో కొన్ని ల్యాబ్‌లో పనిచేయగా, వాటిలో 16 వైరస్‌లు ఈ.కోలి బ్యాక్టీరియాను చంపగలిగాయి. మందులకు తట్టుకునే బ్యాక్టీరియాపై భవిష్యత్తులో ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఈ టెక్నాలజీపై భద్రతకు సంబంధించిన చర్చ కూడా మొదలైంది. ఇవి భవిష్యత్తులో కొత్త చికిత్సలకు ఉపయోగపడతాయని అనుకుంటున్నారా?

స్వీట్లు తిన్న వెంటనే దాహం..ఎందుకు?
Infotainment· 15 Aug 2026

స్వీట్లు తిన్న వెంటనే దాహం..ఎందుకు?

స్వీట్లు తిన్న వెంటనే చాలామందికి దాహం వేస్తుంది. ఎందుకో తెలుసా? మన రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల. దీన్నే ‘hyperglycemia’ అంటారు. స్వీట్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. ఇది రక్తంలోని నీటిని లాగుతుంది. దీంతో శరీర కణాల నుంచి నీరు రక్తంలోకి వెళ్తుంది. శరీరం డీహైడ్రేటెడ్ అయినట్టు అనిపించి దాహం వేస్తుంది. ఎక్కువగా ఉప్పు ఉన్న పదార్థాలు తిన్నా దాహం పెరుగుతుంది. అయితే ఏదైనా తిన్న వెంటనే నీరు తాగకూడదని, కాసేపు ఆగాక తాగాలని నిపుణులు చెబుతున్నారు.

‘లౌకిక భారతం కోసం గాంధీ’ పుస్తకం
Infotainment· 15 Aug 2026

‘లౌకిక భారతం కోసం గాంధీ’ పుస్తకం

ప్రజాశక్తి బుక్‌హౌస్ ‘లౌకిక భారతం కోసం గాంధీ’ పేరుతో వ్యాసాల పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, సుకుమార్ మురళీధరన్, బిపిన్ చంద్ర, కుంకుం సంఘారి, రవీందర్ కుమార్ లాంటి వారు రాసిన ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. అహింసా మార్గంలో ప్రజలను కదిలించిన రాజకీయ వ్యూహకర్తగా గాంధీ, కులవ్యవస్థ, మహిళా స్వేచ్ఛ, మతాల మధ్య ఐక్యత, లౌకికత్వం వంటి అంశాలపై గాంధీ అభిప్రాయాలను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. దీని ధర ₹100. పుస్తకాన్ని <a href="https://navatelanganabooks.com/book/%e0%b0%b2%e0%b1%8c%e0%b0%95%e0%b0%bf%e0%b0%95-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80-loukika-bhartham-kosam/">ఇక్కడ </a>కొనొచ్చు.

📞 మొదటి Phone Call ఎవరికి చేశారు?
Technology· 15 Aug 2026

📞 మొదటి Phone Call ఎవరికి చేశారు?

ఇప్పుడు రోజుకు ఎన్నో Calls చేస్తుంటాం.. కానీ మొబైల్ చరిత్రలో మొదటి కాల్ ఎవరికి చేశారో తెలుసా? 😏 1973 ఏప్రిల్ 3న Motorola ఇంజనీర్ మార్టిన్ కూపర్ న్యూయార్క్‌లోని ఓ వీధి నుంచి ప్రపంచంలోనే తొలి హ్యాండ్‌హెల్డ్ మొబైల్ కాల్ చేశారు. ఆశ్చర్యంగా.. ఆయన కాల్ చేసింది తన ప్రత్యర్థి సంస్థ Bell Labs ఇంజనీర్ జోయెల్ ఎంగెల్‌కే! అప్పటి Motorola DynaTAC ప్రోటోటైప్ దాదాపు 1 కిలో బరువు ఉండేది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 20–30 నిమిషాలే మాట్లాడగలిగేది. ఆ ఒక్క కాల్‌తో మొబైల్ కమ్యూనికేషన్‌లో కొత్త శకం మొదలైంది.📱

తెలుగులో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ పుస్తకం
Infotainment· 15 Aug 2026

తెలుగులో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ పుస్తకం

రాజకీయాలు, గూఢచర్యం, సెక్స్ వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఉదంతం తెలిసిందే. సముద్రం మధ్య అతడు సృష్టించిన దీవిలో మహిళలు, చిన్నారులపై అకృత్యాలు జరిగాయని అనేక వార్తలు వచ్చాయి. ఈ అంశాలన్నీ వివరిస్తూ.. వ్యవస్థ వైఫల్యాలను ఎండగడుతూ రచయిత కృష్ణ కానూరి ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ అనే పుస్తకం రాశారు. ప్రజాశక్తి బుక్‌హౌజ్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దీని ధర రూ.200/-.

‘విక్టోరియా మెమోరియల్’..చరిత్ర తెలుసా?
Current Affairs· 15 Aug 2026

‘విక్టోరియా మెమోరియల్’..చరిత్ర తెలుసా?

హైదరాబాద్ మెట్రో మార్గంలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ ఒకటి. చైతన్యపురి, ఎల్బీనగర్ స్టేషన్ల మధ్యలో ఉండే స్టేషన్ ఇది. ‘విక్టోరియా మెమోరియల్’ చరిత్రేమిటో తెలుసా? 1901లో హైదరాబాద్ నిజాం మహబూబ్ అలీ ఖాన్ సరూర్‌నగర్‌లో ‘మహల్-ఎ-సరూర్‌నగర్’ అనే భవన నిర్మాణం మొదలుపెట్టి, అసంపూర్తిగా వదిలేశారు. 1901 జనవరిలో క్వీన్ విక్టోరియా మరణించారు. అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్ బార్ నిజాంను కోరి, ఆ భవనాన్ని పూర్తి చేసి ‘Victoria Memorial Orphange’గా మార్చారు. ఇప్పటికీ అది విక్టోరియా మెమోరియల్ హోమ్‌గా కొనసాగుతోంది.

DNAను Repair చేయడం వల్ల జీవితకాలం పెరగొచ్చా? 🧬
Science· 15 Aug 2026

DNAను Repair చేయడం వల్ల జీవితకాలం పెరగొచ్చా? 🧬

మన DNAలో రోజూ ఎన్నో చిన్నచిన్న నష్టాలు జరుగుతుంటాయి. వాటిని మన శరీరంలోని కణాలు సహజంగానే రిపేర్ చేస్తుంటాయి. వయసు పెరిగేకొద్దీ ఈ రిపేర్ సామర్థ్యం తగ్గడం వల్ల DNAలో నష్టం పేరుకుపోవచ్చు. అందుకే DNAను మరింత సమర్థంగా రిపేర్ చేయగలిగితే వృద్ధాప్యాన్ని నెమ్మదించవచ్చా అనే దానిపై రీసెర్చ్ జరుగుతోంది. 2026లో వచ్చిన కొత్త రీసెర్చ్‌లు కూడా DNA రిపేర్, దీర్ఘాయుష్షు మధ్య సంబంధంపై దృష్టి పెడుతున్నాయి. అయితే మనుషుల జీవితకాలాన్ని పెంచే నిరూపితమైన చికిత్స ఇంకా లేదు.

కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా
Current Affairs· 15 Aug 2026

కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో తన తండ్రి గురించి, తమ మతవిశ్వాసాల గురించి ఆమె వివరించారు. తన తండ్రి ఇష్టంతో ఇస్లాంలోకి మారారని, తన ఎప్పుడూ ఇస్లాంలోని మంచిని చూశానని చెప్పారు. తనను ద్వేషించేవాళ్లకు సైతం మంచి జరగాలనే తను కోరుకుంటానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇటీవల బోనాల పండగ సందర్భంగా తెలంగాణ సంస్కృతి గొప్పతనం, బోనాల గురించి ఆమె మాట్లాడిన <a href="https://www.theclearcutnews.com/n/eVQ3VXD">మాటలు</a> వైరల్ అయ్యాయి.

స్వాతంత్ర్య వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు
Local· 15 Aug 2026

స్వాతంత్ర్య వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు

TG: పరకాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అమరధామంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరైనప్పటికీ కార్యక్రమం ప్రారంభ సమయంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఫ్లెక్సీలతో భూ నిర్వాసితుల నిరసన
Local· 15 Aug 2026

ఫ్లెక్సీలతో భూ నిర్వాసితుల నిరసన

TG: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామంలో భూ నిర్వాసితులు నిరసన తెలిపారు.2016 పుష్కరాల తరుణంలో రోడ్డు విస్తరణలో తమ ఇళ్ళను, స్ధలాలను కోల్పోయిన సుమారు 60 కుటుంబాలు దీక్ష చేపట్టారు. మంత్రి నారా లోకేష్ తమ గ్రామానికి వచ్చి బాధితుల పరిస్థితిని గమనించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి తమ గ్రామానికి రావాలంటూ చంద్రాల గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రాణాలు పోతున్నా పరిహారం చెల్లించడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్య వేడుకల్లో చిన్నారుల సందడి
Local· 15 Aug 2026

స్వాతంత్ర్య వేడుకల్లో చిన్నారుల సందడి

TG: వరంగల్ జిల్లా పరకాల ఎంపీపీఎస్‌ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, భారతమాత తదితరుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, దేశ స్వాతంత్ర్య ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. వేషధారణల్లో పాల్గొన్న చిన్నారులను అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి. రాజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హైకోర్టుల్లో 30 శాతం జడ్జి పోస్టులు ఖాళీ
National· 15 Aug 2026

హైకోర్టుల్లో 30 శాతం జడ్జి పోస్టులు ఖాళీ

దేశంలో ఉన్న హైకోర్టు జడ్జి పోస్టుల్లో 30 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 1,122 పోస్టుల్లో జూలై నాటికి 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే భారీగా వర్క్ లోడ్‌తో న్యాయమూర్తులపై ఒత్తిడి పెరుగుతోంది. హైకోర్టుల్లో 60 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో సగం కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 52 ఖాళీలు ఉన్నాయి. కలకత్తా హైకోర్టులో 31, పంజాబ్-హర్యానా హైకోర్టులో 30 ఖాళీలు ఉన్నాయి.

బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి: చల్లా ధర్మారెడ్డి
TG· 15 Aug 2026

బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి: చల్లా ధర్మారెడ్డి

TG: బీఆర్‌ఎస్‌ హయాంలో పూర్తి చేసిన వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాలలకు రంగులు వేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం తామే అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటోందని వరంగల్ జిల్లా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో పరకాల పట్టణానికి కొత్తగా చేసిన అభివృద్ధి ఏమిటో ఎమ్మెల్యే ప్రజలకు చూపించాలని సవాల్‌ విసిరారు. పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని ఇంతకాలం ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారో ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

పుస్తకాలు కూడా మాట్లాడతాయా..? 🤔
Technology· 15 Aug 2026

పుస్తకాలు కూడా మాట్లాడతాయా..? 🤔

ఒక పుస్తకం చదువుతుంటే.. "ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు చేశాడు?" అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇక నుంచి గూగుల్‌లో వెతకాల్సిన అవసరం లేకపోవచ్చు. కొత్తగా వస్తున్న AI Book Companion టూల్స్‌తో పుస్తకాన్నే నేరుగా ప్రశ్నించొచ్చు. క్యారెక్టర్ల గురించి, కథలోని సంఘటనలు, హిస్టరీ లేదా కష్టమైన కాన్సెప్ట్స్ గురించి అడిగితే.. అదే పుస్తకంలోని సమాచారంతో AI సమాధానం చెబుతుంది. ఇప్పటికే Amazon Kindle, Audible, ElevenLabs లాంటి కంపెనీలు ఇలాంటి ఫీచర్లను తీసుకొచ్చాయి. ఇక డౌట్ వస్తే.. పుస్తకమే మీతో మాట్లాడుతుంది.

పరకాలలో 16న సీఎం పర్యటన
TG· 15 Aug 2026

పరకాలలో 16న సీఎం పర్యటన

TG: హనుమకొండ జిల్లా పరకాలలో 16న సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వివిధ ర్యాంకులకు చెందిన వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తులో ముగ్గురు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 45 మంది ఎస్‌ఐలతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. హెలిప్యాడ్‌, సభా ప్రాంగణం, సీఎం రాకపోకల మార్గాలు, వీఐపీ ప్రాంతాలు, పార్కింగ్‌ ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డుల విధానం అమలు
TG· 15 Aug 2026

తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డుల విధానం అమలు

TG: భువనగిరి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులతో పాటు ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ కార్డులు అందిస్తోందన్నారు.

AI వీడియో నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి? 🤖
Technology· 15 Aug 2026

AI వీడియో నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి? 🤖

AIతో తయారైన వీడియోలు నిజమైనవిగా కనిపించడంతో వాటిని గుర్తించడం అంత ఈజీ కాదు. ముఖం, పెదవుల కదలికలు, చేతులు, నీడలు, వెలుతురు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా వింతగా ఉందా చూడాలి. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో, మొదట ఎవరు పోస్ట్ చేశారో చెక్ చేయాలి. రివర్స్ సెర్చ్‌తో వీడియో పాతదా, వేరే సందర్భంలోనిదా తెలుసుకోవచ్చు. కంటెంట్ క్రెడెన్షియల్స్ లేదా SynthID ఉంటే వీడియో మూలం, ఎలా రూపొందిందనే వివరాలను కూడా చెక్ చేయొచ్చు. అయితే ఏ ఒక్క టూల్ కూడా 100% ఖచ్చితంగా చెప్పదు. అందుకే నమ్మకమైన సోర్సెస్‌తో క్రాస్‌చెక్ చేయడం మంచిది.

తిరంగా యాత్రలో అస్వస్థతకు గురైన చిన్నారులు
Current Affairs· 15 Aug 2026

తిరంగా యాత్రలో అస్వస్థతకు గురైన చిన్నారులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సింగ్రౌలి జిల్లా చిత్రంగి వద్ద తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 200 మందికి పైగా విద్యార్థులు చిత్రంగి మార్కెట్ చేరుకోవడానికి సుమారు 6 కి.మీ. నడిచారు. రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి రాధాసింగ్ కోసం గంటసేపు వెయిట్ చేశారు. ఆ తర్వాత మరో 1.5 కి.మీ. నడిచారు. దీంతో 12 మంది కళ్లు తిరిగి కిందపడ్డారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఏర్పాట్లలో నిర్లక్ష్యం లేదని, మార్గంలో చాలా చోట్ల నీరు అందించామని చెప్పారు.

🤖 AI ఎన్నికలనే ప్రభావితం చేయగలదా?
Technology· 15 Aug 2026

🤖 AI ఎన్నికలనే ప్రభావితం చేయగలదా?

AI ఇప్పుడు ఎన్నికలను ప్రభావితం చేసేంత శక్తివంతంగా మారిందా? 👀 ఒక నాయకుడు చెప్పని మాటను చెప్పినట్టు చూపించే డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు, తప్పుడు వార్తలను AI వేగంగా తయారు చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేయగలదు. ఎన్నికల సమయంలో ఇవి ఓటర్లలో గందరగోళం, తప్పుడు అభిప్రాయాలను కలిగించొచ్చు. అయితే AI ఎన్నికల ఫలితాలను మార్చేస్తోందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ కంటెంట్‌ను వేగంగా వ్యాప్తి చేయడం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతోంది. అందుకే వైరల్ కంటెంట్‌ను నమ్మే ముందు మూలం, తేదీ చెక్ చేయడం ముఖ్యం.

Terror Groupతో సంబంధం..బెంగాల్ యువకుడి అరెస్ట్
Crime· 15 Aug 2026

Terror Groupతో సంబంధం..బెంగాల్ యువకుడి అరెస్ట్

అఫ్గానిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న‌ Terror Groupతో సంబంధం ఉన్న అసఫూల్ మాలిక్‌ అనే యువకుణ్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిది పశ్చిమబెంగాల్‌. అతను ఏడాదిగా బెంగళూరులోని జిగాని ప్రాంతంలోని ఓ టెక్‌ కంపెనీలో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(TTP) సభ్యుడితో కలిసి ఆ సంస్థలో చేరడానికి అతను ట్రై చేస్తున్నట్లు గుర్తించారు. అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలపై వివరాలు అందడంతో అతడిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.