Latest

బాలాఘాట్‌లో చిన్నారుల వరుస మరణాలు
Current Affairs· 5d ago

బాలాఘాట్‌లో చిన్నారుల వరుస మరణాలు

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా బిర్సా ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో చిన్నారుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 24–25 మంది వరకు పిల్లలు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన మరణాల సంఖ్య దీనికంటే తక్కువగా ఉంది. మలేరియా, మీజిల్స్, మాల్ న్యూట్రీషియన్, అంటువ్యాధులు ఈ మరణాలకు కారణమని అనుకుంటున్నా, అన్ని మరణాలకూ ఒకే కారణమేదీ ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు. ప్రభావిత గ్రామాల్లో వైద్య పరీక్షలు, టీకాలు, మలేరియా నివారణ చర్యలు కొనసాగుతున్నాయి.

సముద్రం నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది?
Education· 5d ago

సముద్రం నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది?

సముద్రం నీరు ఉప్పగా ఉండటం వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదు.. కోట్ల ఏళ్లుగా జరుగుతున్న ఒక సహజ ప్రక్రియే దీనికి కారణం. వర్షం భూమిపై పడినప్పుడు రాళ్లలోని చిన్న చిన్న ఖనిజాలను కరిగిస్తుంది. నదులు వాటిని సముద్రంలోకి తీసుకెళ్తాయి. సముద్రపు నీరు ఆవిరై మేఘాలుగా మారినా.. అందులోని ఉప్పు, ఖనిజాలు మాత్రం అక్కడే మిగిలిపోతాయి. ఇలా ఏళ్ల తరబడి అవి సముద్రంలో చేరుతూనే ఉంటాయి. అంతేకాదు, సముద్రపు అడుగున జరిగే అగ్నిపర్వత చర్యలు, రసాయన మార్పులు కూడా కొంత ఉప్పును కలుపుతాయి. అందుకే సముద్రం నీరు మనకు ఉప్పగా రుచి ఇస్తుంది.

నల్ల బ్యాడ్జీలతో పెన్షన్ విద్రోహం! చలో కలెక్టరేట్ విజయం
Local· 5d ago

నల్ల బ్యాడ్జీలతో పెన్షన్ విద్రోహం! చలో కలెక్టరేట్ విజయం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విద్రోహ దినాన్ని నిర్వహించారు. టీజీఈజేసీ (TGEJAC) పిలుపు మేరకు ఈ ధర్నా జరిగిందని, అది విజయవంతమైందని జిల్లా చైర్మన్ బొంకూరి, శంకర్ తెలిపారు.తెలంగాణ సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించినా, నేడు వారి హక్కులు నిర్లక్ష్యం కావడం బాధాకరమన్నారు. ఇది కేవలం పెన్షన్ సమస్య కాదని, ఉద్యోగుల గౌరవం, భద్రతకు సంబంధించిన ఉద్యమమని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో మహాధర్నా చేస్తామన్నారు.

AP ఓటర్లకు బిగ్ అప్‌డేట్.. SIR డెడ్‌లైన్ Extend!
AP· 5d ago

AP ఓటర్లకు బిగ్ అప్‌డేట్.. SIR డెడ్‌లైన్ Extend!

AP: రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ SIR ప్రాసెస్‌కు Election Commission of India (ECI) డెడ్‌లైన్ ఎక్స్‌టెండ్ చేసింది. ఓటర్ లిస్ట్‌లో పేరు లేకపోయినా, పేరు/అడ్రస్ వంటి వివరాల్లో తప్పులున్నా సెప్టెంబర్ 10 వరకు క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. వచ్చిన క్లెయిమ్స్‌ను వెరిఫై చేసి అక్టోబర్ 5 వరకు సాల్వ్ చేయనున్నారు. SIR పూర్తయ్యాక అక్టోబర్ 9న ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఓటర్లు లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్వాసితుల ఆందోళన
Current Affairs· 5d ago

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్వాసితుల ఆందోళన

AP: విజయనగరం కలెక్టరేట్‌ వద్ద భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తమ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భూములు ఇచ్చామని, అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

భూమిపూజై 2 ఏళ్లు.. రోడ్డు పని Start కాలేదు
Local· 5d ago

భూమిపూజై 2 ఏళ్లు.. రోడ్డు పని Start కాలేదు

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రోడ్డు నిర్మాణం పేరుకే పరిమితమైంది. మంత్రి పొన్నం, ప్రభాకర్ శంకుస్థాపన చేసి రెండేళ్లయినా అధికారులు పని మొదలుపెట్టలేదు. ఈ నిర్లక్ష్యంతో సర్పంచ్ కుమారస్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులంతా రోడ్డెక్కి ధర్నా చేశారు. మహిళలు రోడ్డుపై నాట్లు వేస్తూ, "రోడ్డు లేక మా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి" అంటూ నిరసన తెలిపారు. భీమదేవరపల్లి నుంచి వంగర వరకు ఈ రోడ్డు చాలా అవసరమని, వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూపై కలెక్టర్ స్పందించకపోతే, ప్రజల ఆందోళన మరింత పెరుగనుంది.

పిల్లాణ్ని చూసుకోమని చెప్తే.. దారుణానికి పాల్పడ్డాడు
Crime· 5d ago

పిల్లాణ్ని చూసుకోమని చెప్తే.. దారుణానికి పాల్పడ్డాడు

ఆసుపత్రి క్యాంటీన్‌లో ఓ మహిళ తన ఒకటిన్నరేళ్ల కొడుకును 15 నిమిషాలు చూసుకోమని 20 ఏళ్ల యువకుడిని అడిగింది. అతను పిల్లవాడిని ఆసుపత్రి వెనుకకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో జరిగింది. నిందితుడు పరిచయస్తుడే కావడంతో బాలుడి తల్లి నమ్మి అతనికి బిడ్డను అప్పగించింది. ఆ తర్వాత తన బిడ్డ కనిపించకపోవడంతో వెతికింది. చివరకు ఆసుపత్రి వెనక భాగంలో జరిగిన దారుణాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.

ఇప్పపువ్వు సారాకు చట్టబద్ధత..! ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్
Local· 5d ago

ఇప్పపువ్వు సారాకు చట్టబద్ధత..! ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్

మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలనం రేపారు.మంగళవారం మిడ్జిల్ మండలంలోని ఈదులబాయి తండాతో పలు గ్రామాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇప్పపువ్వు సారా తయారీని చట్టబద్ధం చేయడానికి కృషి చేస్తాను" అని హామీ ఇచ్చారు. గిరిజనులు ఈ సారానే జీవనాధారంగా చేసుకున్నారని, వారికి ఇబ్బంది కలగకూడదని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, ఆ దిశగా ప్రయత్నిస్తానని చెప్పారు.

Nov 17న సామూహిక సెలవుకు సిద్ధం! పాత పెన్షన్ ఇవ్వండి
Local· 5d ago

Nov 17న సామూహిక సెలవుకు సిద్ధం! పాత పెన్షన్ ఇవ్వండి

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలంటూ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. సెప్టెంబర్ 1న జిల్లావ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన మానిఫెస్టో లో ప్రకటించిన దానినే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, అందుకే నవంబరు 17న సామూహిక లీవ్ పెట్టాలని యూనియన్ నాయకులు పిలునిచ్చారు. ఆ రోజున ఉద్యోగులంతా ఏకమై ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు.

పెన్షన్‌కు గడువు పెంపు! ఈ 15లోగా దరఖాస్తు చేయండి
Local· 5d ago

పెన్షన్‌కు గడువు పెంపు! ఈ 15లోగా దరఖాస్తు చేయండి

చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. రాయుడుపాలెం గ్రామం సర్పంచ్ ఇందిరమ్మ మరియు పంచాయతీ కార్యదర్శి వేణు ఈ విషయం వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 15వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేయని వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ చెప్పారు. స్థానికులు సంతోషంగా, "మళ్లీ అవకాశం ఇవ్వడం మంచిది" అంటున్నారు. ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకోకపోతే వారే నష్టపోతారు. మీకు పెన్షన్ కావాలా? వెంటనే పంచాయతీ కార్యాలయానికి వెళ్లండి.

లంక భూములకు పట్టాలు..! పాస్ పుస్తకాలు ఇవ్వాలి
Local· 5d ago

లంక భూములకు పట్టాలు..! పాస్ పుస్తకాలు ఇవ్వాలి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపుర, నూతక్కి వ్యవసాయ సొసైటీల రైతులు నిరసనకు దిగారు. పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆన్‌లైన్ నమోదు తహసీల్దార్ కార్యాలయం దగ్గర తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. నూతక్కి సొసైటీలో 62 మంది రైతులకు రైతు భరోసా, ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారు. రామచంద్రాపురంలో వరదల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, వేంద్రపాడు లంక భూముల ఆక్రమణలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.<br>భూములు లేకుంటే రైతులు ఎలా బతుకుతారు?

బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నారా? RRBsలో భారీ నోటిఫికేషన్!
Jobs· 5d ago

బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నారా? RRBsలో భారీ నోటిఫికేషన్!

బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్న వారికి IBPS RRB CRP-XV నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 13వేలకు పైగా జాబ్స్ ఫిల్ చేయనున్నారు. ఇందులో <a href="https://ibpsreg.ibps.in/rrboaxvaug26/">Office Assistant (Multipurpose)</a>, <a href="https://ibpsreg.ibps.in/rrbxvaug26/">Officer Scale-I, II, III</a> పోస్టులు ఉన్నాయి. ఈనెల 1 నుంచి 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో Apply చేసుకోవచ్చు. ఫీజు General/OBC/EWS క్యాండిడేట్స్‌కు రూ. 850, SC/ST/PwBD వారికి రూ. 175. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, లోకల్ లాంగ్వేజ్‌పై పట్టు ఉండాలి. ఏజ్ పోస్టును బట్టి 18 - 40 ఏళ్లలోపు ఉండాలి. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://www.ibps.in/index.php/rural-bank-xv/">Click</a> చేయండి.

సీపీఎస్ విధానం రద్దు కోసం జనగామలో నిరసన
Local· 5d ago

సీపీఎస్ విధానం రద్దు కోసం జనగామలో నిరసన

సీపీఎస్ (కొత్త పెన్షన్ విధానం)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది మంగళవారం లంచ్ అవర్‌లో నిరసన చేపట్టారు. సీపీఎస్‌ విద్రోహ దినం సందర్భంగా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ‘సీపీఎస్ అంతం.. మన పంతం’ అంటూ నినదించారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.

సీపీఎస్ విధానం రద్దు చేయాలని నిరసన
Local· 5d ago

సీపీఎస్ విధానం రద్దు చేయాలని నిరసన

వర్ధన్నపేట: సీపీఎస్ (కొత్త పెన్షన్ విధానం)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సబ్ ట్రెజరీ కార్యాలయ సిబ్బంది మంగళవారం లంచ్ అవర్‌లో నిరసన చేపట్టారు. సీపీఎస్‌ విద్రోహ దినం సందర్భంగా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ‘సీపీఎస్ అంతం.. మన పంతం’ అంటూ నినదించారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.

నల్లబజారుకు యూరియా తరలింపు ఆపాలంటూ ధర్నా
Local· 5d ago

నల్లబజారుకు యూరియా తరలింపు ఆపాలంటూ ధర్నా

ఖమ్మంజిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదుట రైతులు మంగళవారం ధర్నా చేశారు.యూరియా రైతులకు అందకుండా నల్లబజారుకు తరలిస్తున్నారని ఆరోపించారు.యాప్ లో ఇతర మండలాలకు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారులు బుక్ చేయగా వారికి pacs అధికారులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తమకు యూరియా ఇచ్చి,యాప్ పద్ధతి ఎత్తి వేయాలని రైతులు డిమాండ్ చేశారు.

గద్వాలలో 24 గంటలు కరెంటు కావాలని ధర్నా
Local· 5d ago

గద్వాలలో 24 గంటలు కరెంటు కావాలని ధర్నా

జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. సబ్ స్టేషన్ ఆఫీస్ దగ్గర వ్యవసాయానికి 24 గంటలు కరెంటు కావాలంటూ ధర్నా చేశారు. వారికి సంఘీభావంగా BRS పార్టీ ఇంచార్జ్ బాసు, హనుమంతు నాయుడు పాల్గొన్నారు. AE చెన్నయ్యకు వినతిపత్రం ఇచ్చి, "కొంతకాలంగా 3 ఫేజ్ కరెంటుకు కోతలు పెడుతున్నారు" అని ఫిర్యాదు చేశారు. 24 గంటలు రావాల్సిన కరెంటు 12 గంటలు మాత్రమే వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, దీని పాలనలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని అన్నారు.

మిడిల్‌ ఈస్ట్‌ టెన్షన్‌.. మన జేబుపై ప్రభావం పడుతుందా?
International· 5d ago

మిడిల్‌ ఈస్ట్‌ టెన్షన్‌.. మన జేబుపై ప్రభావం పడుతుందా?

మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా–ఇరాన్‌ మధ్య టెన్షన్‌ మళ్లీ పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఆయిల్‌ సరఫరాకు కీలమైన హోర్ముజ్‌ మార్గంలో ఇబ్బందులు పెరగడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 90 డాలర్లను దాటింది. భారత్‌ క్రూడ్‌ ఆయిల్‌ అవసరాల్లో 90%కి పైగా దిగుమతులపై ఆధారపడుతున్నందున, క్రూడ్‌ ధరలు ఎక్కువకాలం అధికంగా ఉంటే రవాణా ఖర్చులు, వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం పడొచ్చు. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు లేకపోయినా.. టెన్షన్‌ కొనసాగితే భారం మన జేబుపై పడే అవకాశం ఉంది.

భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీగా రీ సర్వే
Local· 5d ago

భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీగా రీ సర్వే

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రీ సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మొలచింతలపల్లి గ్రామ శివారులో రీ సర్వే పనులను పరిశీలించిన ఆయన, రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలని సూచించారు. ప్రతి సర్వే నంబర్ వివరాలను పక్కాగా నమోదు చేసి డిజిటలైజ్ చేయడంతో పాటు డిజిటల్ మ్యాపులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

పల్నాడులో YCP కి షాక్! చైర్మన్‌ సహా 7 కౌన్సిలర్లు TDP లో
Local· 5d ago

పల్నాడులో YCP కి షాక్! చైర్మన్‌ సహా 7 కౌన్సిలర్లు TDP లో

పల్నాడు జిల్లా గురజాల మున్సిపాలిటీలో రాజకీయ మార్పులు జరిగాయి. పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బడే జానీతో పాటు ఏడుగురు కౌన్సిలర్లు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వారికి టీడీపీ కండువాలు కప్పి ఎమ్మెల్యే యరపతినేని, శ్రీనివాసరావు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందని, అదే కారణంతో వైసీపీని వీడుతున్నామని చైర్మన్ స్పష్టం చేశారు. గురజాల మండలంలో పలు కుటుంబాలు కూడా టీడీపీలో చేరినట్లు సమాచారం.దీనిపై వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

చేయూత పెన్షన్‌కు గడువు పొడిగింపు..! సెప్టెంబర్ 15 వరకే
Local· 5d ago

చేయూత పెన్షన్‌కు గడువు పొడిగింపు..! సెప్టెంబర్ 15 వరకే

అయిజ మున్సిపాలిటీలో చేయూత పెన్షన్ దరఖాస్తుదారులకు శుభవార్త. Aug 31తో ముగియాల్సిన గడువును ప్రభుత్వం Sept 15 వరకు పొడిగించింది. ఈ పెన్షన్ కింద వితంతువు, వికలాంగత, ఒంటరి మహిళ, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు అర్హులే. ఇప్పటివరకు మున్సిపాలిటీ పరిధిలో 494 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇంకా అర్హత ఉన్నవాళ్లు ఎవరైనా అప్లై చేయకుంటే, ఇదే వారి చివరి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పి. చంద్రశేఖర్ రావుస్పష్టంగా కోరారు. ఇక డేట్ మిస్ అయితే.. మీరే బాధ్యులు!

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై సర్కార్‌కు బిగ్ రిలీఫ్!
TG· 5d ago

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై సర్కార్‌కు బిగ్ రిలీఫ్!

TG: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్. ఈ రెండు స్కీమ్స్ అమలుపై సింగిల్ బెంచ్ విధించిన స్టేను CJ బెంచ్ రద్దు చేసింది. స్టే వల్ల పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని గవర్నమెంట్ తరపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పథకాలతో ఎంతోమంది పేదలకు బెనిఫిట్ అవుతోందని వివరించారు. వాదనలు విన్న CJ బెంచ్.. సర్కార్ వాదనను అంగీకరించి స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.