Latest

బీటెక్ విద్యార్థులకు ఊహించని గుడ్‌న్యూస్
ఇంజినీరింగ్ పూర్తి చేసినవాళ్లకి ఇండియన్ ఆర్మీ గుడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) ద్వారా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. బీటెక్‌లో సాధించిన మార్కులను బట్టి షార్ట్‌లిస్ట్ చేసి, ఆ తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్లకి ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం వస్తుంది. అలవెన్సులతో కలిపి నెలకు రూ.1.5 లక్షల వరకు జీతం ఉంటుంది.

యువ సంగ్రామ సభకు బ్రేక్
TG: హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న BRS యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదని MLA సుధీర్ రెడ్డి ఫైరయ్యారు. సదస్సు ఏర్పాట్లను MLC శంభిపూర్ రాజు, పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. 18 రోజుల క్రితమే దరఖాస్తు చేసినా ఇప్పటికీ పర్మిషన్ రాలేదన్నారు. యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తారనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కోర్టు నుంచి అనుమతి వస్తుందనే విశ్వాసం తమకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తామన్నారు.

మిక్స్‌డ్ వెజిటబుల్ బాత్‌తో ఆరోగ్యానికి మేలు
రోజూ ఒకే రకమైన ఫుడ్ కాకుండా బీట్‌రూట్, టమాటా, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలతో మిక్స్‌డ్ వెజిటబుల్ బాత్ తయారు చేసుకుని తింటే బాడికి అవసరమైన అనేక Nutrients అందుతాయి. బీట్‌రూట్‌లో ఐరన్, క్యారెట్‌లో విటమిన్–A, టమాటాలో యాంటీఆక్సిడెంట్లు, బీన్స్‌లో ఫైబర్, ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్లు సరిపడా ఉంటాయి. ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుపడటంతో పాటు ఎనర్జీ కూడా వస్తుంది. టస్టీగా ఉండే ఈ వెజిటబుల్ బాత్‌ను పిల్లలు, పెద్దలు అందరూ తమ ఆహారంలో తీసుకుంటే హెల్త్ కి మంచిది.

35 ఏళ్ళ తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు
చైనాలో రెండేళ్ల వయసులో తప్పిపోయిన జోంగ్ ఫెంగ్లిన్ అనే అమ్మాయి 35 ఏళ్ల తర్వాత డీఎన్ఏ పరీక్షతో మళ్లీ తన కన్నతల్లిని చేరుకుంది. 1991లో మార్కెట్‌లో జనాల మధ్య తప్పిపోయిన ఆమెను ఒక బట్టల వ్యాపారి పెంచి పెద్ద చేశాడు. జోంగ్ తనపై ఉన్న గాయాల వల్ల పేరెంట్స్ వదిలేశారని అనుకుంది. కానీ ఆమె కోసం కుటుంబం వెతుకుతూనే ఉంది. 'బేబీ కమ్ హోమ్' సేవా సంస్థ ద్వారా నిజం తెలుసుకొని జులై 7న ఆమె తన తల్లిని కలుసుకుంది.

రేవంత్ రెండు ఓట్లపై చర్యలు?
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు చోట్ల ఓటరుగా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ 'SIR' సమన్వయ కమిటీ గురువారం ఫిర్యాదు చేసింది. BRS నాయకురాలు మమత, కమిటీ సభ్యులు కలసి ఆయనకు వినతిపత్రం అందచేశారు. ఎపిక్ నంబర్ టీఈఎస్0274035తో కొడంగల్, కొండారెడ్డిపల్లి/అచ్చంపేట ఓటరు నమోదుపై టైమ్ స్టాంపుతో కూడిన ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు.

స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు
వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఒక స్కూల్ బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. బస్సు పూర్తిగా దెబ్బతింది. లోపలున్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రైల్వేగేట్లు తెరిచే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

వసతుల కోసం గురుకులంలో బాలికల ధర్నా
TG: సరైన వసతులు లేవని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు గురువారం గేట్ ముందు ధర్నాకి దిగారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని నెల రోజులుగా చెబుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఏదైనా రిపేర్ వస్తే తమ దగ్గర డబ్బులు అడుగుతారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షడు రూప్‌సింగ్ వారికి ధైర్యం చెప్పి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కతో మాట్లాడించారు. వెంటనే వసతులు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థినులు ధర్నా విరమించారు.

రూ.2 వేలు దాటిన UPI పేమెంట్స్‌పై ఛార్జీలకు ప్లాన్
కేంద్ర ప్రభుత్వం UPI పేమెంట్స్‌పై కొత్త మార్పులకు సిద్ధమవుతోంది. పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో దేశంలో కోట్లాది మంది ఈ విధానాన్ని వాడుతున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం రూ.2 వేలకు పైన ఉన్న పేమెంట్స్‌కు మర్చెంట్ డిస్కౌంట్ రేట్(MDR ) వర్తించనుంది. ఇది కేవలం పెద్ద వ్యాపారస్తులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని చెబుతున్నారు. వచ్చే రెండు వారాల్లో దీనిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఓపెన్ జైలులో..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నఇద్దరు ఖైదీలు ప్రేమలో పడ్డారు. ఈ లవ్‌స్టోరీకి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఓపెన్ జైలు వేదికగా మారింది. మాండోర్ ఓపెన్ జైలు పొలాల్లో పనిచేసేటప్పుడు పరిచయమైన మూలారామ్, సీమా ఘడ్సే అనే ఇద్దరు ఖైదీలు ప్రేమలో పడ్డారు. వారు పెళ్లి చేసుకోవడానికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్ట్రిక్ట్ సెక్యూరిటీ మధ్య జరగబోయే ఈ పెళ్లికి ఇరువైపులా కలిపి 21 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.
సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే?
సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న హంగర్ స్ట్రైక్ నేటితో 20వ రోజుకు చేరింది. టుడే ఆయన హెల్త్ అప్‌డేట్ చూస్తే, ఈ 20 రోజుల్లో ఏకంగా 9.5 Kgల వెయిట్ లాస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బ్లడ్ ప్రెజర్ (BP) 108/68 గా ఉంది. బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గి డీహైడ్రేషన్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. రోజు రోజుకు ఆయన హెల్త్ కండిషన్‌పై అందరిలో టెన్షన్ పెరుగుతోంది.

పార్శి డైయిరీ ఫామ్ లైసెన్సు రద్దు
ముంబైలో 110 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక పార్శీ డెయిరీ ఫామ్ లైసెన్స్‌ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) రద్దు చేసింది. జూలై 14న మెరైన్ లైన్స్‌లోని ఈ డెయిరీలో అధికారులు చేసిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. ముడి పదార్థాలను నేలపైనే పడేయడం, ఉత్పత్తులపై ఎక్స్‌పైరీ డేట్లు వేయకపోవడంతోపాటు పాల్ఘర్‌లోని మరో బ్రాంచ్‌పై దాడి చేసి రూ.32 లక్షల కల్తీ అనుమానిత వెన్న, పనీర్, జున్ను పాలను అధికారులు సీజ్ చేశారు. జూలై 15 నుండి అన్ని రకాల తయారీ, అమ్మకాలను నిషేధించారు.

Wi-Fi స్లోగా ఉందా..ఎందుకు?
ఇంట్లో వైఫై సడన్‌గా స్లో అవుతోందా? దానికి చాలా కారణాలుంటాయి. అపార్ట్‌మెంట్‌లు లేదా దగ్గర దగ్గరగా ఉన్న ఇళ్లల్లో అనేక వైఫై రూటర్లు ఒకే ఛానల్‌లో పనిచేయడంతో ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా 2.4 GHz బ్యాండ్‌లో ఇది ఎక్కువగా జరుగుతుంది. మైక్రోవేవ్ పనిచేస్తున్నప్పుడు 2.4 GHz వైఫై సిగ్నల్‌కు అంతరాయం కలగడం ద్వారా ఆ సమయంలో వైఫై స్పీడ్ తగ్గుతుంది. బ్లూటూత్ స్పీకర్లు, హెడ్‌ఫోన్లు, కీబోర్డులు, మౌస్ వంటి పరికరాలు కూడా 2.4 GHz ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తాయి. దీనివల్ల కూడా వైఫై స్లో అవుతుంది.

అర్జెంటీనా ప్రెసిడెంట్ సెంటిమెంట్
అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ ఓ క్రేజీ సెంటిమెంట్ వల్ల ఈసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ చూడటానికి స్టేడియానికి వెళ్లట్లేదట. 1990లో అప్పటి ప్రెసిడెంట్ కార్లోస్ మెనెమ్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన వెంటనే అర్జెంటీనా ఓడిపోయింది. దాంతో టీమ్‌కు బ్యాడ్‌లక్ రాకూడదని అక్కడి ప్రెసిడెంట్లు మ్యాచ్‌లకు దూరం ఉంటున్నారు. మిలీ కూడా ఈ ఫైనల్‌ను ఇంట్లో టీవీలో చూస్తానని చెప్పారు.

పట్టాలపైకి హైడ్రోజన్ రైలు
మెరుగైన రవాణా సేవలే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా పర్యటనలో రూ.25,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు, కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా హర్యానాలోని జింద్ వద్ద భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ రైలును ఆయన ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ 10 కోచ్‌ల రైలు, 3,200 హార్స్‌పవర్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలు సెట్‌లలో ఇదీ ఒకటి.

తెలుగు రాష్ట్రాలకు Rain Alert
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన లోప్రెజర్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కూడా కొన్ని ఏరియాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. వర్షాల సమయంలో గంటకు 40–50 కి.మీల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పారు.

నిబ్బా-నిబ్బీ.. పదాల వెనుక స్టోరీ తెలుసా?
సోషల్ మీడియాలో వినిపించే నిబ్బా..నిబ్బి పదాలు భారతీయ భాషలకు చెందినవి కావు. ఇవి అమెరికన్ మీమ్ కల్చర్ నుంచి వచ్చాయి. జాత్యహంకార పదమైన ‘నిగ్గర్’ని నేరుగా వాడకుండా, దాన్ని మార్చి ‘నిబ్బా’గా ఉపయోగించడం ప్రారంభమైందని ప్రచారంలో ఉంది. తర్వాత ఈ పదం భారత్‌కు చేరి సోషల్ మీడియాలో అతిగా ప్రేమను ప్రదర్శించే టీనేజ్ జంటలను వ్యంగ్యంగా ‘నిబ్బా-నిబ్బి’ అని పిలిచే మీమ్ ట్యాగ్‌గా మారింది.

నీట్‌లో తెలంగాణ స్టూడెంట్‌కు 13వ ర్యాంకు
TG: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురువారం రాత్రి విడుదలయ్యాయి. మొత్తం 5,440 పరీక్షల కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది స్టూడెంట్స్ ఈ పరీక్షకు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 65,087 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారని ఎన్‌టీఏ ప్రకటించింది. వీరిలో తెలంగాణలోని హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు 720కి గానూ 705 మార్కులుతో ఆలిండియాలో 13వ ర్యాంకు సాధించాడని ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ.వరదారెడ్డి తెలిపారు.

ఏపీలో మళ్లీ కరోనా కేసులు
AP: ఏపీలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు మొత్తం 13 పాజిటివ్ కేసులు గుర్తించారు. కడపలో 8, గుంటూరులో 3, విశాఖ, కాకినాడలో ఒక్కో కేసు నమోదయ్యాయి. వైరస్ ఏ వేరియంట్ అనేది తెలుసుకోవడానికి ఐదు శాంపిల్స్‌ను పూణె ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ సూచించింది.

'తల్లికి వందనం' పథకంపై Big Update
AP: తల్లికి వందనం పథకం డబ్బులు జూలై 22న లబ్ధిదారుల అకౌంట్లలో జమ కానున్నాయి. డబ్బులు రావాలంటే ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం, NPCI మ్యాపింగ్ పూర్తి చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఇవి పూర్తి కాకపోతే అకౌంట్‌లో డబ్బులు పడవని అధికారులు హెచ్చరించారు. ఈసారి 42,70,902 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది.
చనిపోతే దయ్యమై వస్తా: సోనమ్ వాంగ్‌చుక్
19రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అతని హెల్త్ బాగా వీక్ అయినప్పడికి కూడా తన హ్యుమర్‌ని కోల్పోలేదు. జూలై 20న అందరం కలిసి పార్లమెంట్‌కు పాదయాత్ర చేద్దామని పిలుపునిచ్చారు. అప్పటివరకు తాను ఎలాగైనా బతికే ఉంటానని.. ఒకవేళ జూలై 20 మార్చ్ సక్సెస్ కాకపోతే, తాను చనిపోయి దయ్యంగానైనా తిరిగి వస్తానంటూ నవ్వుతూ కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హిట్‌మ్యాన్ రిటైర్మెంట్?.. లండన్ చేరుకున్న పేరెంట్స్
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంగ్లాండ్‌తో ఆదివారం లార్డ్స్‌లో జరిగే వన్డే మ్యాచ్ అతడి చివరి మ్యాచ్ కావొచ్చని ప్రచారం జరుగుతోంది. రోహిత్ తల్లిదండ్రులు ఇప్పటికే లండన్ చేరుకున్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని BCCI సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై ఆదివారం మ్యాచ్ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.