Latest

స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు
News· 17 Jul 2026

స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు

వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఒక స్కూల్ బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. బస్సు పూర్తిగా దెబ్బతింది. లోపలున్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రైల్వేగేట్లు తెరిచే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

వసతుల కోసం గురుకులంలో బాలికల ధర్నా
TG· 17 Jul 2026

వసతుల కోసం గురుకులంలో బాలికల ధర్నా

TG: సరైన వసతులు లేవని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు గురువారం గేట్ ముందు ధర్నాకి దిగారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని నెల రోజులుగా చెబుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఏదైనా రిపేర్ వస్తే తమ దగ్గర డబ్బులు అడుగుతారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షడు రూప్‌సింగ్ వారికి ధైర్యం చెప్పి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కతో మాట్లాడించారు. వెంటనే వసతులు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థినులు ధర్నా విరమించారు.

రూ.2 వేలు దాటిన UPI పేమెంట్స్‌పై ఛార్జీలకు ప్లాన్
Infotainment· 17 Jul 2026

రూ.2 వేలు దాటిన UPI పేమెంట్స్‌పై ఛార్జీలకు ప్లాన్

కేంద్ర ప్రభుత్వం UPI పేమెంట్స్‌పై కొత్త మార్పులకు సిద్ధమవుతోంది. పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో దేశంలో కోట్లాది మంది ఈ విధానాన్ని వాడుతున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం రూ.2 వేలకు పైన ఉన్న పేమెంట్స్‌కు మర్చెంట్ డిస్కౌంట్ రేట్(MDR ) వర్తించనుంది. ఇది కేవలం పెద్ద వ్యాపారస్తులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని చెబుతున్నారు. వచ్చే రెండు వారాల్లో దీనిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఓపెన్ జైలులో..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
News· 17 Jul 2026

ఓపెన్ జైలులో..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నఇద్దరు ఖైదీలు ప్రేమలో పడ్డారు. ఈ లవ్‌స్టోరీకి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఓపెన్ జైలు వేదికగా మారింది. మాండోర్ ఓపెన్ జైలు పొలాల్లో పనిచేసేటప్పుడు పరిచయమైన మూలారామ్, సీమా ఘడ్సే అనే ఇద్దరు ఖైదీలు ప్రేమలో పడ్డారు. వారు పెళ్లి చేసుకోవడానికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్ట్రిక్ట్ సెక్యూరిటీ మధ్య జరగబోయే ఈ పెళ్లికి ఇరువైపులా కలిపి 21 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే?▶
Politics· 17 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే?

సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న హంగర్ స్ట్రైక్ నేటితో 20వ రోజుకు చేరింది. టుడే ఆయన హెల్త్ అప్‌డేట్ చూస్తే, ఈ 20 రోజుల్లో ఏకంగా 9.5 Kgల వెయిట్ లాస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బ్లడ్ ప్రెజర్ (BP) 108/68 గా ఉంది. బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గి డీహైడ్రేషన్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. రోజు రోజుకు ఆయన హెల్త్ కండిషన్‌పై అందరిలో టెన్షన్ పెరుగుతోంది.

పార్శి డైయిరీ  ఫామ్ లైసెన్సు రద్దు
News· 17 Jul 2026

పార్శి డైయిరీ ఫామ్ లైసెన్సు రద్దు

ముంబైలో 110 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక పార్శీ డెయిరీ ఫామ్ లైసెన్స్‌ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) రద్దు చేసింది. జూలై 14న మెరైన్ లైన్స్‌లోని ఈ డెయిరీలో అధికారులు చేసిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. ముడి పదార్థాలను నేలపైనే పడేయడం, ఉత్పత్తులపై ఎక్స్‌పైరీ డేట్లు వేయకపోవడంతోపాటు పాల్ఘర్‌లోని మరో బ్రాంచ్‌పై దాడి చేసి రూ.32 లక్షల కల్తీ అనుమానిత వెన్న, పనీర్, జున్ను పాలను అధికారులు సీజ్ చేశారు. జూలై 15 నుండి అన్ని రకాల తయారీ, అమ్మకాలను నిషేధించారు.

Wi-Fi స్లోగా ఉందా..ఎందుకు?
Infotainment· 17 Jul 2026

Wi-Fi స్లోగా ఉందా..ఎందుకు?

ఇంట్లో వైఫై సడన్‌గా స్లో అవుతోందా? దానికి చాలా కారణాలుంటాయి. అపార్ట్‌మెంట్‌లు లేదా దగ్గర దగ్గరగా ఉన్న ఇళ్లల్లో అనేక వైఫై రూటర్లు ఒకే ఛానల్‌లో పనిచేయడంతో ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా 2.4 GHz బ్యాండ్‌లో ఇది ఎక్కువగా జరుగుతుంది. మైక్రోవేవ్ పనిచేస్తున్నప్పుడు 2.4 GHz వైఫై సిగ్నల్‌కు అంతరాయం కలగడం ద్వారా ఆ సమయంలో వైఫై స్పీడ్ తగ్గుతుంది. బ్లూటూత్ స్పీకర్లు, హెడ్‌ఫోన్లు, కీబోర్డులు, మౌస్ వంటి పరికరాలు కూడా 2.4 GHz ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తాయి. దీనివల్ల కూడా వైఫై స్లో అవుతుంది.

అర్జెంటీనా ప్రెసిడెంట్ సెంటిమెంట్
Sports· 17 Jul 2026

అర్జెంటీనా ప్రెసిడెంట్ సెంటిమెంట్

అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ ఓ క్రేజీ సెంటిమెంట్ వల్ల ఈసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ చూడటానికి స్టేడియానికి వెళ్లట్లేదట. 1990లో అప్పటి ప్రెసిడెంట్ కార్లోస్ మెనెమ్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన వెంటనే అర్జెంటీనా ఓడిపోయింది. దాంతో టీమ్‌కు బ్యాడ్‌లక్ రాకూడదని అక్కడి ప్రెసిడెంట్లు మ్యాచ్‌లకు దూరం ఉంటున్నారు. మిలీ కూడా ఈ ఫైనల్‌ను ఇంట్లో టీవీలో చూస్తానని చెప్పారు.

పట్టాలపైకి హైడ్రోజన్ రైలు
News· 17 Jul 2026

పట్టాలపైకి హైడ్రోజన్ రైలు

మెరుగైన రవాణా సేవలే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా పర్యటనలో రూ.25,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు, కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా హర్యానాలోని జింద్ వద్ద భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ రైలును ఆయన ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ 10 కోచ్‌ల రైలు, 3,200 హార్స్‌పవర్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలు సెట్‌లలో ఇదీ ఒకటి.

తెలుగు రాష్ట్రాలకు Rain Alert
News· 17 Jul 2026

తెలుగు రాష్ట్రాలకు Rain Alert

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన లోప్రెజర్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కూడా కొన్ని ఏరియాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. వర్షాల సమయంలో గంటకు 40–50 కి.మీల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పారు.

నిబ్బా-నిబ్బీ.. పదాల వెనుక  స్టోరీ  తెలుసా?
General· 17 Jul 2026

నిబ్బా-నిబ్బీ.. పదాల వెనుక స్టోరీ తెలుసా?

సోషల్ మీడియాలో వినిపించే నిబ్బా..నిబ్బి పదాలు భారతీయ భాషలకు చెందినవి కావు. ఇవి అమెరికన్ మీమ్ కల్చర్ నుంచి వచ్చాయి. జాత్యహంకార పదమైన ‘నిగ్గర్’ని నేరుగా వాడకుండా, దాన్ని మార్చి ‘నిబ్బా’గా ఉపయోగించడం ప్రారంభమైందని ప్రచారంలో ఉంది. తర్వాత ఈ పదం భారత్‌కు చేరి సోషల్ మీడియాలో అతిగా ప్రేమను ప్రదర్శించే టీనేజ్ జంటలను వ్యంగ్యంగా ‘నిబ్బా-నిబ్బి’ అని పిలిచే మీమ్ ట్యాగ్‌గా మారింది.

నీట్‌లో తెలంగాణ స్టూడెంట్‌కు 13వ ర్యాంకు
Education· 17 Jul 2026

నీట్‌లో తెలంగాణ స్టూడెంట్‌కు 13వ ర్యాంకు

TG: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురువారం రాత్రి విడుదలయ్యాయి. మొత్తం 5,440 పరీక్షల కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది స్టూడెంట్స్ ఈ పరీక్షకు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 65,087 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారని ఎన్‌టీఏ ప్రకటించింది. వీరిలో తెలంగాణలోని హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు 720కి గానూ 705 మార్కులుతో ఆలిండియాలో 13వ ర్యాంకు సాధించాడని ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ.వరదారెడ్డి తెలిపారు.

ఏపీలో మళ్లీ కరోనా కేసులు
AP· 17 Jul 2026

ఏపీలో మళ్లీ కరోనా కేసులు

AP: ఏపీలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు మొత్తం 13 పాజిటివ్ కేసులు గుర్తించారు. కడపలో 8, గుంటూరులో 3, విశాఖ, కాకినాడలో ఒక్కో కేసు నమోదయ్యాయి. వైరస్ ఏ వేరియంట్ అనేది తెలుసుకోవడానికి ఐదు శాంపిల్స్‌ను పూణె ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ సూచించింది.

'తల్లికి వందనం' పథకంపై Big Update
Education· 17 Jul 2026

'తల్లికి వందనం' పథకంపై Big Update

AP: తల్లికి వందనం పథకం డబ్బులు జూలై 22న లబ్ధిదారుల అకౌంట్లలో జమ కానున్నాయి. డబ్బులు రావాలంటే ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం, NPCI మ్యాపింగ్ పూర్తి చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఇవి పూర్తి కాకపోతే అకౌంట్‌లో డబ్బులు పడవని అధికారులు హెచ్చరించారు. ఈసారి 42,70,902 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది.

చనిపోతే దయ్యమై వస్తా: సోనమ్ వాంగ్‌చుక్▶
Education· 17 Jul 2026

చనిపోతే దయ్యమై వస్తా: సోనమ్ వాంగ్‌చుక్

19రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అతని హెల్త్ బాగా వీక్ అయినప్పడికి కూడా తన హ్యుమర్‌ని కోల్పోలేదు. జూలై 20న అందరం కలిసి పార్లమెంట్‌కు పాదయాత్ర చేద్దామని పిలుపునిచ్చారు. అప్పటివరకు తాను ఎలాగైనా బతికే ఉంటానని.. ఒకవేళ జూలై 20 మార్చ్ సక్సెస్ కాకపోతే, తాను చనిపోయి దయ్యంగానైనా తిరిగి వస్తానంటూ నవ్వుతూ కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హిట్‌మ్యాన్ రిటైర్మెంట్?.. లండన్ చేరుకున్న పేరెంట్స్
Sports· 17 Jul 2026

హిట్‌మ్యాన్ రిటైర్మెంట్?.. లండన్ చేరుకున్న పేరెంట్స్

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంగ్లాండ్‌తో ఆదివారం లార్డ్స్‌లో జరిగే వన్డే మ్యాచ్ అతడి చివరి మ్యాచ్ కావొచ్చని ప్రచారం జరుగుతోంది. రోహిత్ తల్లిదండ్రులు ఇప్పటికే లండన్ చేరుకున్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని BCCI సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై ఆదివారం మ్యాచ్ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తగ్గిన బంగారం, వెండి ధరలు!
Politics· 17 Jul 2026

తగ్గిన బంగారం, వెండి ధరలు!

బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. బులియన్ మార్కెట్‌లో నేడు ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹760 తగ్గి ₹1,42,530కి చేరింది. అలాగే, 22 క్యారెట్లపై ₹700 తగ్గి ₹1,30,650 వద్ద, 18 క్యారెట్లపై ₹570 తగ్గి ₹1,06,900 వద్ద ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర కూడా తగ్గి ₹2,30,000 వద్ద స్థిరంగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల లైవ్ రేట్స్ మారుతుంటాయి కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి ప్రైస్ చెక్ చేసుకోండి.

పూరీ క్షేత్రంలో జనసంద్రం▶
Viral· 17 Jul 2026

పూరీ క్షేత్రంలో జనసంద్రం

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్రకు భక్తులు పోటెత్తారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మునుపెన్నడూ లేని విధంగా లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో ఊహించని రద్దీ ఏర్పడింది. ప్రభుత్వం 13వేల మంది పోలీసులతో పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది. పూరీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో కూడా జగన్నాథ రథయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

AP ప్రభుత్వ బోర్డులో ఉద్యోగాలు
Jobs· 17 Jul 2026

AP ప్రభుత్వ బోర్డులో ఉద్యోగాలు

AP ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 32 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్-8, జనరల్ మేనేజర్-17, మేనేజర్-7 పోస్టులు ఉన్నాయి. ప్రారంభంలో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం ఉండగా, అభ్యర్థుల పనితీరు ఆధారంగా ప్రతిఏడాది కాంట్రాక్ట్‌ను పొడిగించే అవకాశం ఉంటుంది. ఆగస్టు 2, 2026 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం APEDB అధికారిక వెబ్‌సైట్‌లోని Careers విభాగాన్ని సందర్శించాలని అధికారులు సూచించారు.

చెట్టుకొమ్మ పట్టుకుని బతికిన బాలుడు▶
TG· 17 Jul 2026

చెట్టుకొమ్మ పట్టుకుని బతికిన బాలుడు

TG: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఊరుబాటి సుధాకర్, వసంత(35) దంపతులకు నవ్య(15), కుమారుడు వేణు ఉన్నారు. సుధాకర్‌ రోజూ మద్యంమత్తులో భార్యతో గొడవపడుతూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో వసంత, ఇద్దరు పిల్లలతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు నీటిలో మునిగిపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అయితే వేణుకు నీటిపైకి వంగి ఉన్న చెట్టుకొమ్మ తగలడంతో గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉండిపోయాడు. బావుల వద్ద వెతికిన భర్తకు, కుమారుడి అరుపులు వినిపించడంతో కొడుకును రక్షించాడు.

అతిపెద్ద వివాదం తర్వాత దూసుకొచ్చిన మంగ్లీ
Entertainment· 17 Jul 2026

అతిపెద్ద వివాదం తర్వాత దూసుకొచ్చిన మంగ్లీ

తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బోనాల పండగ.. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి సరికొత్త బోనం పాటతో మీ ముందుకు వచ్చానని సింగర్ మంగ్లీ ప్రకటించారు. 'తీరు తీరు తొట్టెలల్ల..' అనే 2026 బోనాల స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఎప్పట్లాగే నన్ను నా పాటను ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. రమావత్ మధు మైక్రో ఫైనాన్స్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత మంగ్లీ మళ్లీ పాటలు చేస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ మంగ్లీ దూసుకొచ్చారు. సాంగ్ లింక్ కోసం సోర్స్ పై క్లిక్ చెయ్యండి.