Latest

షాబాద్ ఘటనతో భయాందోళన
TG· 12 Jul 2026

షాబాద్ ఘటనతో భయాందోళన

TG: రిమాండ్‌లో ఉన్న నిందితులు బెయిల్‌పై బయటికి వస్తే ఎలాంటి దారుణాలకు దారి తీస్తుందో నిన్న జరిగిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుహత్యల ఘటనే ఉదాహరణగా మారింది. నిందితుడు రాజ్‌కుమార్ సుమారు రూ.20 లక్షలు షాబాద్ PS అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని స్టేషన్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం. షాబాద్ ఘటనతో బండి భగీరథ్ బాధిత కుటుంబం కూడా తీవ్ర భయాందోళనకు గురవుతుందని BRS నేత RS ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తనకు బాలిక, ఆమె తల్లి ఫోన్ చేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని, ఇతను కూడా బెయిల్‌పై వచ్చాడు. మా పరిస్థితి ఏంటోనని టెన్షన్ పడ్డారని ఆయన తెలిపారు.

డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
AP· 12 Jul 2026

డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

AP: నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. హన్మకొండ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు హైవేపై డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంలో ఊపరి పీల్చుకున్నారు.

ఆ బాధ్యత తండ్రులు కూడా తీసుకోవాలి
AP· 12 Jul 2026

ఆ బాధ్యత తండ్రులు కూడా తీసుకోవాలి

AP: నేటి యువత యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని CM చంద్రబాబు సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలే మన రాష్ట్ర సంపద అని, వారితోనే మన ఆర్థిక ప్రగతి ముడిపడి ఉందన్నారు. పిల్లల్ని పెంచే బాధ్యతను కేవలం తల్లులే కాకుండా తండ్రులు కూడా తీసుకోవాలని సూచించారు. ఆడవాళ్లకు మగవాళ్లు అన్ని పనుల్లోనూ సహాయం చేయాలని, ఇంటిపని, వంటపని అని తేడా చూడకూడదన్నారు.

రైలు ప్రయాణాలలో  ఇకపై ఒరిజినల్ టిక్కెట్ చూపాల్సిందే !
News· 12 Jul 2026

రైలు ప్రయాణాలలో ఇకపై ఒరిజినల్ టిక్కెట్ చూపాల్సిందే !

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన గమనిక! రైల్లో జర్నీ చేసేటప్పుడు మీ ఫోన్‌లో ఉండే వాట్సప్‌ ఫార్వర్డ్ మెసేజ్‌లు లేదా స్క్రీన్‌షాట్ టికెట్లను చూపిస్తే ఇకపై టికెట్ కలెక్టర్లు (TC) ఒప్పుకోరు. రైల్వే శాఖ తాజా నిబంధనల ప్రకారం... ప్రయాణికులు ఒరిజినల్ టికెట్‌ను మాత్రమే చూపించాల్సి ఉంటుంది. రైల్వే యాప్ (IRCTC) ద్వారా బుక్ చేసుకున్న ఒరిజినల్ టికెట్ పిడిఎఫ్ (PDF) లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే అధికారిక ఎస్ఎంఎస్ (SMS) మాత్రమే చెల్లుబాటు అవుతాయి. టికెట్ల మిస్ యూజింగ్ అరి కట్టేందుకు, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

బాలుడిని లాక్కెళ్లి  చంపేసిన సింహం▶
News· 12 Jul 2026

బాలుడిని లాక్కెళ్లి చంపేసిన సింహం

గుజరాత్‌లోని గిర్నార్ కొండపై ఘోర ప్రమాదం జరిగింది. వందలాది మంది భక్తుల సమక్షంలో ఒక సింహం, 11 ఏళ్ల బాలుడిని లాకెళ్లి అడవిలో చంపేసింది. ఖేడా జిల్లాకు చెందిన ఒక కుటుంబం గిర్నార్ కొండపైకి ఎక్కుతుండగా, 50వ మెట్టు వద్ద సింహం హఠాత్తుగా దాడి చేసింది. బాలుడిని అడవిలోకి లాక్కెళ్లగా.. 100 మీటర్ల దూరంలో శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఈ ఇష్యూ తో అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి, దాడికి పాల్పడిన సింహంతో పాటు మరో రెండింటిని పట్టుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రుల హామీ
AP· 12 Jul 2026

ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రుల హామీ

AP: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో AP ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉద్యోగుల అంశాలపై మంత్రులు మాట్లాడారు. ఉద్యోగసంఘాల ప్రతినిధులు మొత్తం 23 డిమాండ్లతో వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై CM చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 21న సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

బిగ్ అలర్ట్.. SIR సర్వేకు ఇక 3 రోజులే
AP· 12 Jul 2026

బిగ్ అలర్ట్.. SIR సర్వేకు ఇక 3 రోజులే

AP: SIR ఇంటింటి సర్వే ప్రక్రియ మరో మూడు రోజుల్లో ముగుస్తుందని, జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి సర్ మ్యాపింగ్ యాప్ పని చేయడం ఆగిపోతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు డిజిటలైజ్డ్ అయిన ఓటర్లలో సుమారు 10 శాతం మంది ఓటర్లలో మరణించిన వాళ్లు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వారు, దొరకని ఓటర్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జూలై 11 సాయంత్రం 4గంటల వరకు మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 3,61,23,312 ఓటర్ల వివరాలు డిజిటలైజ్డ్ అయ్యాయని పేర్కొన్నారు.

అలా చేస్తే బ్యారేజీలు మొత్తం తెగిపోతాయి
Politics· 12 Jul 2026

అలా చేస్తే బ్యారేజీలు మొత్తం తెగిపోతాయి

TG: ప్రాణహితలో నీరు పారుతున్నా ఎత్తిపోయడం లేదంటూ BRS నేతలు రాద్ధాంతం చేస్తున్నారని.. పారే నీటిని ఎత్తిపోయగలిగితే ఇక బ్యారేజీలు ఎందుకు కట్టారని CM రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. HYDలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. KCR, KTR, హరీష్ రావులు బ్యారేజీలు కొట్టుకుపోవాలనే ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసి, నీళ్లు నిల్వచేస్తే తప్ప నీటిని ఎత్తిపోయలేమని.. అలా నీళ్లు నిల్వచేస్తే బ్యారేజీలు తెగిపోయే ముప్పు ఉందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (NDSA) తేల్చి చెప్పిందని అన్నారు.

నా హృదయం కలచివేసింది-  చిరంజీవి
Cinema· 11 Jul 2026

నా హృదయం కలచివేసింది- చిరంజీవి

లెజెండరీ సింగర్ జానకి మరణం తన హృదయాన్ని కలచివేసిందని నటుడు చిరంజీవి ట్వీట్ చేశారు. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు అపురూపమైన గాత్రాన్ని అందించారు. సంగీత ప్రపంచంక ధ్రువతారను కోల్పోయింది. కానీ ఆమె ఆలపించిన గీతాలు తరతరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఈ కష్టసమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమాను లకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం అని చిరంజీవి ట్వీట్ చేశారు. నటులు రజనీకాంత్, కమల్ హాసన్ లతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు జానకికి ఘన నివాళు లర్పిస్తున్నారు.

సింగర్ ఎస్. జానకి చివరి వీడియో ఇదే▶
Cinema· 11 Jul 2026

సింగర్ ఎస్. జానకి చివరి వీడియో ఇదే

లెజెండరీ సింగర్ ఎస్. జానకి చివరి వరకూ సంగీతంతోనే గడిపారు. ఇటీవల చెన్నైలోని ఆమె నివాసానికి గాయని సునీత వెళ్లి, ఆమె పాదాల చెంత కూర్చొని పాటలు పాడారు. దీనికి ఎస్. జానకి ఎంతో సంతోషించి, చప్పట్లతో ప్రోత్సహించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే జానకమ్మ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో అభిమానులు, సంగీత కళాకారులు, గాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

గాయని జానకికి పవన్ కల్యాణ్ నివాళులు !
News· 11 Jul 2026

గాయని జానకికి పవన్ కల్యాణ్ నివాళులు !

గాయని జానకి మరణం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు గాయనీమణుల్లో ఆణిముత్యం లాంటి వారని ప్రశంసిం చారు. నిరీక్షణ, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, స్వాతిముత్యం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ప్రతిఘటన, అంతః పురం లాంటి చిత్రాల్లో ఆమె గీతాలను ఎప్పటికీ మరిచిపోలే మన్నారు.ఉత్తమ గాయనిగా ఎన్నో అవార్డులు , సత్కారాలు సొంతం చేసుకున్నారన్నారు. ఈ విషాద సమయంలో ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నామన్నారు.

ఆస్ట్రేలియాలో ఇండియన్ ట్రక్ డ్రైవర్లకు రేసిజం బాధలు !
World· 11 Jul 2026

ఆస్ట్రేలియాలో ఇండియన్ ట్రక్ డ్రైవర్లకు రేసిజం బాధలు !

ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న భారతీయ ట్రక్ డ్రైవర్లు ఘోరమైన రేసిజం బారిన పడుతున్నారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు "మంచి భారతీయుడంటే చచ్చిన భారతీయుడే" (good indian is a dead indian) అంటూ కొందరు దుర్భాష లాడుతున్నట్లు డ్రైవర్లు ఆవేదన పడుతున్నారు. ప్రాణాలు తీస్తామనే బెదిరింపులు, శారీరక దాడులు పెరిగిపోయాయని వారు వాపోయారు. స్థానిక డ్రైవర్ల నుంచి ఎదురవుతున్న ఈ జెనోఫోబియా వల్ల తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నామంటున్నారు.

కెరీర్ ఎదుగుదలకు భర్త ప్రోత్సాహం !
Cinema· 11 Jul 2026

కెరీర్ ఎదుగుదలకు భర్త ప్రోత్సాహం !

సింగర్ జానకి కెరీర్ లో ఆమె భర్త రాం ప్రసాద్ ప్రోత్సాహం ఎంతైనా ఉంది. ఆమె సంగీత ప్రపంచంలో అంత ఎత్తుకు ఎదగడానికి ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు. వీరికి మురళీ కృష్ణ అనే కుమారుడు ఉన్నారు. మురళీ కృష్ణ కొన్ని సినిమాల్లో నటించినా ఆ తర్వాత బిజినెస్ కే పరిమితమయ్యారు. 2002లో భర్త చనిపోయిన నాటినుంచి ఆమె కుంగిపోయారు. చెన్నైలో కొడుకు, కోడలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తున్న జానకమ్మను ఇటీవల కాలంలో వృద్ధాప్య సమస్యలు వెంటాడాయి. ఇంత పేరు ప్రతిష్టలు సాధించినా ఆమె నిరాడంబరంగా నవ్వుతూ ఉండేవారు.

17 భాషలు .. వేల వేల పాటలు
Cinema· 11 Jul 2026

17 భాషలు .. వేల వేల పాటలు

గాయని శిష్ట్లా జానకిది చాలా పాపులర్, మెలోడియస్ వాయిస్. ఆమె బహుభాషల్లో పాడి రికార్డు సృష్టించారు. ఒక్క దక్షిణాది భాషలే కాకుండా హిందీ, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ లాంటి దాదాపు 17 భాషల్లో 48 వేల కంటే ఎక్కువ పాటలు పాడారు. పైగా ఒకేరోజు వేర్వేరు భాషల్లో పలు పాటలను రికార్డు చేసిన అరుదైన రికార్డు కూడా ఆమెకు ఉంది. స్వాతి ముత్యంలోని చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో ఒకేసారి నటి రాధికకు, మరో చిన్నారికి ఒకే పాటలో రెండు వాయిస్ లు అనుకరిస్తూ పాడటం ఆమె ప్రతిభకు నిదర్శనం.

దక్షిణాది అవార్డుల్లో ఆమెది ఒక రికార్డు !
Cinema· 11 Jul 2026

దక్షిణాది అవార్డుల్లో ఆమెది ఒక రికార్డు !

జానకమ్మని వరించని అవార్డులు లేవు. ఉత్తమ నేపధ్య గాయనిగా నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వ జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. పదహారేళ్ళ వయసు (తెలుగు) చిత్రంలోని "సిరిమల్లె పువ్వా" పాటకు గాను ఆమెకు జాతీయ అవార్డు దక్కింది.మలయాళం, తమిళ భాషల్లోనూ ఆమె నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు. ఇక నంది అవార్డుల కైతే కొదవేలేదు. దాదాపు 10 సార్లు నంది అవార్డు పొందారు. మలయాళం లో 14 సార్లు , తమిళంలో 7రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు పొందారు. 2013 లొనే కేంద్రం ఆమెకు పద్మ భూషణ్ ప్రకటించినా చాలా ఆలస్యంగా తనకు అవార్డు ఇచ్చారని, దక్షిణాదికి ప్రాధాన్యత లేదంటూ ఆమె సున్నితంగా తిరస్కరించారు.

వాయిస్ మోడ్యులేషన్ లో దిట్ట !
Cinema· 11 Jul 2026

వాయిస్ మోడ్యులేషన్ లో దిట్ట !

జానకమ్మకు ఉన్న అరుదైన ప్రతిభ గొంతు మార్చడం. ఒకే పాటలో చిన్న పిల్లవాడిలా, ముసలి ముత్తవ్వలా, నవ వధువులా రకరకాల వయసుల వారి హావభావాలను కేవలం తన గొంతుతోనే పలికించగలరు. స్వాతి ముత్యం సినిమాలో "చిన్నారి పొన్నారి కిట్టయ్య" పాట దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. అలాగే చాలా హై పిచ్ లో పాడగలగడం ఆమెకు మాత్రమే సాధ్యమైన విద్య.. నీ లీల పాడెద దేవా పాట ఎంత కష్టసాధ్యమైనదో సంగీతంపై అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. కానీ నాదస్వరంతో పాడే ఐదు నిమిషాల నిడివి కలిగిన ఆ పాటను ఆమె సునాయాసంగా, అనాయాసంగా పాడారు. ఇప్పటికీ జానకి ని ఈ విషయంలో ఎవరూ బీట్ చేయలేరు.

సింగర్ ఎస్. జానకి కన్నుమూత!
Cinema· 11 Jul 2026

సింగర్ ఎస్. జానకి కన్నుమూత!

సంగీత ప్రపంచంలో తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ గాయని, గానకోకిల ఎస్. జానకి (88) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మైసూర్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో దాదాపు 50 వేలకంటే ఎక్కువ పాటలు పాడి రికార్డు సృష్టించారు. 4 సార్లు జాతీయ అవార్డులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు ఉత్తమ గాయనిగా పురస్కారాలు అందుకున్నారు. జానకి గారి మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.

రెండు చేతులు లేకపోయినా పార పట్టిన రైతు!▶
Motivational· 11 Jul 2026

రెండు చేతులు లేకపోయినా పార పట్టిన రైతు!

రెండు చేతులు లేకపోయినా, పట్టుదలతో మట్టిని నమ్ముకుని బతుకుతున్న ఓ రైతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. భుజం, మెడ సహాయంతోనే పారను గట్టిగా పట్టుకుని, బురదలో కాలువ తవ్వుతున్న ఆయన విజువల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వైకల్యం శరీరానికే కానీ సాధించాలనే సంకల్పానికి కాదని ఆయన ప్రూవ్ చేశారు. ఎలాంటి కష్టాలనైనా ఎదిరించి నిలబడొచ్చని చూపిస్తున్న ఈ వీడియో అందరికీ ఒక గ్రేట్ ఇన్‌స్పిరేషన్.

వియత్నాంలో 15 మంది భారతీయ టూరిస్ట్స్ మృతి!▶
News· 11 Jul 2026

వియత్నాంలో 15 మంది భారతీయ టూరిస్ట్స్ మృతి!

వియత్నాంలోని 'హాన్ మే రుట్ అన్గోయ్' ఐలాండ్ సమీపంలో 32 మంది ఇండియన్ టూరిస్ట్స్, నలుగురు క్రూ మెంబర్స్‌తో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ దారుణంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ఇండియన్స్ చనిపోయినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఒక ప్రైవేట్ మొబైల్ కంపెనీ యాన్యువల్ మీటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టూరిస్ట్స్ ఈ ట్రిప్‌కి వెళ్లినట్లు సమాచారం. గాయపడిన వారిని లోకల్ హాస్పిటల్స్‌కి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. యాక్సిడెంట్‌కి గల కారణాలపై వియత్నాం అధికారులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

ముగిసిన ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన!
World· 11 Jul 2026

ముగిసిన ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన!

ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల పాటు చేసిన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు సక్సెస్‌ఫుల్‌గా ముగిశాయి. 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లిన మొదటి భారత ప్రధానిగా మోదీ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ట్రిప్‌లో ఇండియా బిజినెస్, డిఫెన్స్ రంగాలను పెంచేలా ఏకంగా 18 ఒప్పందాలు జరిగాయి. 2030 నాటికి 35 వేల కోట్ల వ్యాపారమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. అలాగే ఆస్ట్రేలియా నుండి యురేనియం ఇంపోర్ట్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

భర్తపై యాసిడ్ పోసిన భార్య!▶
Crime· 11 Jul 2026

భర్తపై యాసిడ్ పోసిన భార్య!

కుటుంబ కలహాల కారణంగా భర్తపై భార్య బాత్రూమ్ యాసిడ్ పోసిన షాకింగ్ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో శనివారం జరిగింది. పులపకూరి అర్జున్ కుమార్‌ అనే వ్యక్తిపై అతని భార్య దుర్గా భవాని యాసిడ్‌తో దాడి చేసింది. ఈ ఇన్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలైన అర్జున్‌ను వెంటనే అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.