డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

AP: నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. హన్మకొండ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు హైవేపై డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంలో ఊపరి పీల్చుకున్నారు.



