Latest

అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం
Local· 31 Aug 2026

అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం

కరప మండలంలోని నడకుదురు గ్రామంలో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని, అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని తెలిపారు. ​గత 35 రోజులుగా పర్యటిస్తున్న సమయంలో గ్రామాల్లో అనేకమంది పింఛన్లు అందడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.

తెలంగాణ స్కూల్స్‌లో ‘No Bag Day’.. బ్యాగ్‌కు బ్రేక్!
Education· 31 Aug 2026

తెలంగాణ స్కూల్స్‌లో ‘No Bag Day’.. బ్యాగ్‌కు బ్రేక్!

TG: రాష్ట్రంలో 2026-27 అకడమిక్ ఇయర్‌లో ప్రతి నెల మూడో శనివారం ‘No Bag Day’గా ఇంప్లిమెంట్ చేయనున్నారు. 1st - 10th క్లాస్ Govt. స్టూడెంట్స్‌కి బ్యాగులు, పుస్తకాలు లేకుండా స్కూల్‌కు అటెండ్ అవుతారు. రెగ్యులర్ క్లాసులకు బదులుగా గేమ్స్, క్రియేటివ్ యాక్టివిటీస్, ప్రాక్టికల్ లెర్నింగ్ వంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. స్టూడెంట్స్‌పై బ్యాగ్ భారం, స్ట్రెస్ తగ్గించి లెర్నింగ్‌ను మరింత ఫన్‌గా మార్చడమే ఈ ప్రోగ్రామ్ టార్గెట్. 2027 మార్చ్ వరకు నో బ్యాగ్ డే డేట్స్‌ను ఎడ్యుకేషన్ డిపాట్మెంట్ కన్ఫర్మ్ చేసింది.

డియర్ స్టూడెంట్స్.. Sports ఆడేద్దామా.. అయితే చలో..
Local· 31 Aug 2026

డియర్ స్టూడెంట్స్.. Sports ఆడేద్దామా.. అయితే చలో..

రామగుండంలో క్రీడా పండుగ మొదలైంది. Sept 1, 2 తేదీల్లో గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మండల స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయlr రామగుండం MEO జింక మల్లేష్ చెప్పారు. Sept 1: బాలురు (అండర్ 14, 17) – కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, Sept 2: బాలికలు (అండర్ 14, 17) – ఇవే గేమ్స్! ఆటల్లో పాల్గొనే స్టూడెంట్స్ తమ స్కూల్ ప్రిన్సిపాల్స్ నుంచి NGF సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. More info కోసం ఫిజికల్ డైరెక్టర్ ఎం. రామాదేవి: 9491480393, జడ్పీహెచ్ఎస్ జనగామ ఫిజికల్ డైరెక్టర్ రమ్య: 9182669825 కు కాల్ చేయాలి.

యూరియా వచ్చేసింది.. ఆన్లైన్లో బుక్ చేసుకోండి!
Local· 31 Aug 2026

యూరియా వచ్చేసింది.. ఆన్లైన్లో బుక్ చేసుకోండి!

వేంసూరు రైతులకు గుడ్ న్యూస్! లచ్చన్నగూడెం, భరణిపాడు, దుద్దేపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, మర్లపాడు గ్రోమోర్ సెంటర్లో యూరియా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం మండల వ్యవసాయశాఖ అధికారి పచ్చల రామ్మోహన్ రావు చెప్పారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. యాప్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే తమకు తెలపాలని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఐ సమరశంఖం
Local· 31 Aug 2026

కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఐ సమరశంఖం

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే బహిరంగ సభకు భీమదేవరపల్లి మండలం నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు ప్రయోజనం కల్పిస్తామని హామీలు ఇచ్చిందన్నారు. ఆ హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

భీమదేవరపల్లి మండల కమిటీ ఏర్పాటు
Local· 31 Aug 2026

భీమదేవరపల్లి మండల కమిటీ ఏర్పాటు

ఎమ్మార్పీఎస్ భీమదేవరపల్లి మండల నూతన కమిటీని ఏర్పాటు చేసింది. ముల్కనూరులోని విశ్వశాంతి హైస్కూల్‌లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి వెంకటేశ్వరరావు మాదిగ, జిల్లా కో-ఇన్‌చార్జి తనుగుల విజయ్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భీమదేవరపల్లి మండల అధ్యక్షుడిగా వేల్పుల ప్రశాంత్ మాదిగ, అధికార ప్రతినిధిగా మాడుగుల ప్రణయ్‌దేవ్, ప్రధాన కార్యదర్శిగా మిట్టపల్లి రమేష్, ఉపాధ్యక్షులుగా ఎర్రబెల్లి దిలీప్ ఎన్నికయ్యారు.

పల్లె సమస్యలే ఎజెండా.. అభివృద్ధే లక్ష్యం!
Local· 31 Aug 2026

పల్లె సమస్యలే ఎజెండా.. అభివృద్ధే లక్ష్యం!

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. “పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా ముత్తారం, గొల్లపల్లి, ముస్తఫాపూర్, వీరభద్రనగర్, గట్ల నర్సింగాపూర్, బొల్లోనిపల్లి గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి, పలువురు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించారు. ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.

గోల్డ్ రేట్లకు బ్రేక్.. ఈ వారం కూడా తగ్గే ఛాన్స్!
Infotainment· 31 Aug 2026

గోల్డ్ రేట్లకు బ్రేక్.. ఈ వారం కూడా తగ్గే ఛాన్స్!

దేశంలో గోల్డ్ రేట్లు గత వారం దాదాపు 3 శాతం డౌన్ అయ్యాయి. US Federal Reserve వడ్డీ రేట్లు పెంచొచ్చన్న అంచనాలు, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్‌తో గోల్డ్‌పై ప్రెజర్ పెరిగింది. ఈ వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు ఉ. 9.30 గం.లకు పసిడి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రా. రూ.1,56,770 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,700గా ఉంది. కిలో వెండి రూ.2,60,000గా కొనసాగుతోంది.

ఫ్యూచర్ సిటీలో దేశంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం!
Sports· 31 Aug 2026

ఫ్యూచర్ సిటీలో దేశంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం!

TG: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు స్థలం కోసం సెర్చ్ చేస్తున్నారు. డిసెంబరులో స్టేడియం పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. 100 ఎకరాల్లో 1.32 లక్షల సీట్లకు మించి దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. కన్‌స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ఖర్చులను BCCI చేసుకోగా, ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వనుంది. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, భారీ కాన్సర్ట్స్‌కు కూడా వేదికగా ఉండనుంది.

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్!
Crime· 31 Aug 2026

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్!

TG: హైదరాబాద్‌ తుక్కుగూడలో యువతి (21) దారుణంగా హత్యకు గురైంది. ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఆమె.. శుక్రవారం రాత్రి తన రూమ్‌లో ఒంటరిగా ఉన్న టైమ్‌లో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పంక్చర్ లివర్‌తో గట్టిగా కొట్టి మర్డర్ చేసినట్లు గుర్తించారు. దగ్గరలోని మెకానిక్‌ షాపులో పనిచేసే బిహార్‌ వ్యక్తిని (సాధావుల్లా) అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం జరిగిందనే ఆరోపణలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. పోస్టుమార్టం, మెడికల్‌ రిపోర్టులు వచ్చాకే లైంగికదాడిపై క్లారిటీ వస్తుందని పోలీసులు చెప్పారు.

వరల్డ్ చెస్ No 1 ప్రజ్ఞానంద
Sports· 31 Aug 2026

వరల్డ్ చెస్ No 1 ప్రజ్ఞానంద

చెస్‌లో భారత్ మరో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. 21 ఏళ్ల ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఫైనల్లో అమెరికా స్టార్ ఫాబియానో కరువానాపై 15-13 తేడాతో గెలిచాడు. చివరి రోజు 6 పాయింట్లు వెనుకబడి ఉండి కూడా కమ్ బ్యాక్ ఇచ్చి.. 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలిచాడు. దీనిపై విశ్వనాథన్ ఆనంద్ "ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ 1 ప్లేయర్ ప్రజ్ఞానందే" అని అభినందించారు.

రౌడీషీట్ తొలగింపుకు ఛాన్స్.. ఎస్ఐ ఆఫర్!
Local· 31 Aug 2026

రౌడీషీట్ తొలగింపుకు ఛాన్స్.. ఎస్ఐ ఆఫర్!

గురజాలలో ఆదివారం ఓ ప్రత్యేక కౌన్సెలింగ్ జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినోద్ కుమార్ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. "సత్ప్రవర్తనతో మెలిగితే భవిష్యత్తులో రౌడీషీట్ తొలగించే అవకాశం ఉంది. కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలు ప్రయోగిస్తాం. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు."ని ఆయన చెప్పారు. వాస్తవానికి పిడియాక్టు అనేది హెచ్చరిక అయినప్పటికీ చట్టాన్ని గౌరవిస్తే రౌడీ షీట్ నుంచి మినహాయింపునిచ్చే అవకాశం కూడా ఇందులో ఉందని, ఇది మంచి ప్రయోగమని స్థానికులు చెబుతున్నారు.

బస్సు కోసం గంటల కొద్దీ వెయిటింగ్..  వచ్చినవి ఆగవు
Local· 31 Aug 2026

బస్సు కోసం గంటల కొద్దీ వెయిటింగ్.. వచ్చినవి ఆగవు

గుంటూరు జిల్లా నరసరావుపేట రోడ్డు మీద ఉన్న ఊరు పేరు వేములూరుపాడు.. ఇక్కడి ప్రజలకు బస్సు రాకపోవడం ఓ రోజువారీ టెన్షన్. నరసరావుపేట డిపో నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉండాలి. కానీ టైముకు రావు. వస్తే 4 బస్సులు ఒకేసారి వస్తాయి. లేదంటే గంటలు గడిచినా రావు. వచ్చినా ఆపకుండా వెళ్లిపోతాయి. APSRTC యాప్‌లో మాత్రం ప్రతి 15 నిమిషాలకు బస్సు చూపిస్తుంది. కానీ అది just Display మాత్రమే. స్టూడెంట్స్, ఉద్యోగులు ఇలా అందరికీ ఇబ్బందే. RTC పట్టించుకుంటుందా? చూడాలి. వ్యూయర్స్! మీ ఊళ్లో ఇలాగే ఉందా? కామెంట్ చేయండి.

నీళ్లొచ్చాయ్.. కానీ కళ్లలో కన్నీళ్లే!
Local· 31 Aug 2026

నీళ్లొచ్చాయ్.. కానీ కళ్లలో కన్నీళ్లే!

వెలిగొండ ట్రయల్ రన్‌తో కల్నూతలకు నీళ్లొచ్చాయి. కానీ ఆ గ్రామస్తుల కళ్లలో ఆనందం లేదు. ఎందుకంటే వారి గ్రామంతో పాటు మరో 10 గ్రామాలు మునిగిపోతున్నాయి. సుమారు 7500 ఫ్యామిలీస్ ఇల్లు, ఊరు వదిలి వెళ్లాలి. ''భూమిలేదు. ఇల్లులేదు. ఇంకా 1000 మంది పేర్లు ప్యాకేజీలో చేరాలి. పోనీ పునరావస ఊళ్లకు పోతే అక్కడ రోడ్లు లేవు. తాగునీళ్లు లేవు. 18 yrs వారికి రూ.2 లక్షలు, వంశధారలో 18 yrs వారికి రూ.6 లక్షలు ఇస్తామన్నారు. అవి ఎప్పుడొస్తవో తెల్వదు. మాకు త్యాగమనే బిరుదిచ్చారు. కానీ బతుకు బజార్న పడ్డది''.. ఇదీ నిర్వాసితుల ఘోష!

తెలంగాణలో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
TG· 31 Aug 2026

తెలంగాణలో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

TG: రాష్ట్రంలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Bay of Bengalలో వాతావరణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో రుతుపవనాలు యాక్టివ్‌గా ఉన్నాయి. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు ఉండొచ్చని తెలిపారు. నార్త్, ఈస్ట్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

రాఖీకి RTC షాక్.. ఛార్జీలు డబుల్!
Local· 31 Aug 2026

రాఖీకి RTC షాక్.. ఛార్జీలు డబుల్!

పెద్ద కడ్మూర్–నార్వా నుంచి హైదరాబాద్‌కి సాధారణం రూ.280 టికెట్‌ని రాఖీ పండుగ పేరుతో రూ.380కి పెంచేశారు. Aug 27 నుంచి 31 వరకు ఈ అదనపు చార్జీ. టికెట్‌పై రూ.380 ముద్రించేశారు – ముందస్తు సమాచారం లేదు, క్లారిటీ లేదు. "పండుగ రద్దీ" అని చెప్పి రూ.100 extra వసూలు చేసేశారు. "రెగ్యులర్‌గా రూ.300 ఉంటే, ఇప్పుడు రూ.400 కట్టాల్సి వచ్చింది. బోర్డింగ్ తర్వాతే హైక్ తెలిసింద''ని ఓ ప్రయాణీకుడు చెప్పారు. ఈ ఛార్జీ పెంపు మీకు న్యాయమేనా? మీ ఊరి రూట్‌లో కూడా ఇలాంటి హైక్ ఉందా? కామెంట్స్‌లో మీ అనుభవం షేర్ చేయండి.

1000 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్.. బిగ్ ఈవెంట్స్!
TG· 31 Aug 2026

1000 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్.. బిగ్ ఈవెంట్స్!

TG: CM రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా 1,000 రోజుల బిగ్ మైల్‌స్టోన్‌ను పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా సర్కార్ చేసిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేసింది. రైతులు, మహిళలు, యువతపై ఫోకస్‌తో కొన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ 1,000 రోజుల పాలనను ప్రజా ప్రభుత్వంగా ప్రొజెక్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రజల ఆశలకు ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపింది.

₹47 వేల నుంచి ₹22 లక్షల వరకు..
National· 31 Aug 2026

₹47 వేల నుంచి ₹22 లక్షల వరకు..

భారత్‌, అమెరికాలో వైద్యం ఖర్చుల మధ్య ఎంత తేడా ఉంటుందో చెబుతూ ఓ భారతీయుడు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువాన్ ఇబానెజ్ గర్వారే తన అనుభవాన్ని పంచుకుంటూ.. భారత్‌లో పరీక్షలు, ప్రైవేట్ గది, చికిత్సకు కలిపి సుమారు రూ.47 వేల ఖర్చయిందని చెప్పారు. అమెరికాలో ఛాతి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా.. బిల్లు సుమారు రూ.22 లక్షలు వచ్చిందని, ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన జేబు నుంచి దాదాపు రూ.6.7 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.

నేడు వెలిగొండకు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్ట్ ఓపెనింగ్‌
AP· 31 Aug 2026

నేడు వెలిగొండకు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్ట్ ఓపెనింగ్‌

AP: చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మార్కాపురం జిల్లా, వెలిగొండ ప్రాజెక్టు కల నేడు నిజం కానుంది. CM చంద్రబాబు నాయుడు ఈరోజు Phase-Iను ప్రారంభించి 10.70 TMC కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. ఈ Phase-Iతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. 6 వేల మంది మహిళలకు చీర, గాజులు, పసుపు, కుంకుమతో ప్రత్యేక కిట్లు ఇవ్వనున్నారు. షిఫ్ట్ అవుతున్న కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

భారత్‌కు ఉజ్బెకిస్థాన్‌ నుంచి యురేనియం
National· 31 Aug 2026

భారత్‌కు ఉజ్బెకిస్థాన్‌ నుంచి యురేనియం

భారత్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవడానికి మరో కీలక అడుగు వేసింది. ఉజ్బెకిస్థాన్‌ నుంచి భారత్‌కు దీర్ఘకాలంగా యురేనియం సరఫరా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అణు విద్యుత్‌ కేంద్రాలకు యురేనియం కీలక ఇంధనం కావడంతో.. ఒకే దేశంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను పెంచుకోవడం భారత్‌కు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారత్‌ వచ్చే సంవత్సరాల్లో అణు విద్యుత్‌ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యం పెరిగింది.

Lavender Marriage అంటే ఏంటి?
General· 31 Aug 2026

Lavender Marriage అంటే ఏంటి?

లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ తెలుసు.. మరి Lavender Marriage అంటే ఏంటో తెలుసా? లవ్ లేదా ఫిజికల్ అట్రాక్షన్ కంటే ఫ్యామిలీ ప్రెజర్, సమాజం లేదా ప్రైవసీ కోసం పరస్పర అంగీకారంతో చేసుకునే పెళ్లి. గతంలో LGBTQ+ వ్యక్తులు తమ సెక్సువల్ ఐడెంటిటీని దాచుకోవడానికి ఇలాంటి మ్యారేజ్‌లను ఎంచుకునేవారు. ఇప్పుడు ఫ్యామిలీ ప్రెజర్, కెరీర్, పర్సనల్ రీజన్స్ వల్ల కూడా కొందరు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవి కూడా చట్టపరంగా సాధారణ మ్యారేజ్‌లాగే చెల్లుబాటు అవుతాయి.