Latest

ప్రజల సందర్శన కోసం రుషికొండ
News· 18 Jun 2026

ప్రజల సందర్శన కోసం రుషికొండ

గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన రుషికొండ భవన సముదాయాన్ని (ప్యాలెస్)పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్‌గా మార్చాలని, ప్రజల సందర్శనార్థం వినియోగించాలని ప్రాథమిక నిర్ణయించినట్లు మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. సుమారు రూ. 450 కోట్ల ప్రజాధనంతో, నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ఈ రాజప్రాసాదాన్ని కూల్చివేయకుండా, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా 'హాస్పిటాలిటీ' రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది.

ఉస్మానియా యూనివర్సిటీకి ISO గుర్తింపు
TG· 18 Jun 2026

ఉస్మానియా యూనివర్సిటీకి ISO గుర్తింపు

TG: ఉస్మానియా యూనివర్సిటీ(OU) సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే మరే ఇతర విశ్వవిద్యాలయానికి సాధ్యం కాని రీతిలో ఒకేసారి నాలుగు వేర్వేరు విభాగాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపు సాధించింది. హైదరాబాద్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో, దక్షిణ ప్రాంత BIS డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా చేతుల మీదుగా OU వైస్ ఛాన్సలర్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ధ్రువపత్రాలను అందుకున్నారు.

ఐదు రూపాయల  కోసం తల్లిని చంపేశాడు !
Crime· 17 Jun 2026

ఐదు రూపాయల కోసం తల్లిని చంపేశాడు !

చత్తిస్ గఢ్ లో ఓ యువకుడు ఐదు రూపాయల కోసం తల్లిని చంపేశాడు. గుట్కాకు బానిస అయిన అతగాడు తల్లిని ఐదు రూపాయలిమ్మని వత్తిడి చేశాడు. ఆమె ఇవ్వక పోవడంతో ఆమెను ఏకంగా హత్య చేశాడు. లఖన్ మాలి అనే ఆ యువకుడు తల్లి తిహ్రిన్ మాలి భోజనం వడ్డిస్తుందగా ఆమెను ఐదు రూపాయలు ఇవ్వమని వేధించాడు. ఆమె లేవని చెప్పడంతో కోపం పట్టలేక ఆమెను తీవ్రంగా కొట్టాడు. తప్పించుకుని పారిపోతున్న ఆమె తలపై రాయితో బలంగా కొట్టాడు. ఆమె మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి లఖన్ ఆలీని అరెస్టు చేశారు.

జర్నలిస్టు విప్లవశ్రీకి పెరుగుతున్న మద్దతు
News· 17 Jun 2026

జర్నలిస్టు విప్లవశ్రీకి పెరుగుతున్న మద్దతు

హైదరాబాద్ లో కాక్రోచెస్ ప్రొటెస్ట్ కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టు విప్లవ శ్రీని ట్రోల్ చేసిన వారికి వ్యతిరేకంగా అనేక మంది జర్నలిస్టులు ముందుకొచ్చారు. విప్లవ శ్రీకి తమ మద్దతు తెలియ చేశారు. విధి నిర్వహణ కోసం వెళ్లేవారిని అలా అపహాస్యం చేస్తూ , ట్రోల్ చేసే వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ పెరుగుతోంది. జర్నలిస్టు తులసీ చందు కూడా విప్లవ శ్రీకి మద్దతు పలికారు.

ఒకే కార్లో ఇద్దరు మాజీ భార్యలు, ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ తో ఆమిర్ ఖాన్!
News· 17 Jun 2026

ఒకే కార్లో ఇద్దరు మాజీ భార్యలు, ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ తో ఆమిర్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. విడాకులు అయినా తన ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులతో ఫ్రెండ్లీగా ఉండే ఆమిర్. తాజాగా వాళ్లతో కలిసి ఒకే కార్లో కనిపించారు. విశేషం ఏంటంటే, వెనుక సీట్లో ఇద్దరు ఎక్స్-వైఫ్స్‌తో పాటు ఆయన ప్రెజెంట్ గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ కూడా ఉంది. ఇది చూసిన నెటిజన్లు "ఇంతటి లైఫ్ బ్యాలెన్సింగ్ ఒక్క ఆమిర్ ఖాన్‌కే సాధ్యం" అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.

G7 సమ్మిట్‌లో మోదీ-మెలోని!▶
Politics· 17 Jun 2026

G7 సమ్మిట్‌లో మోదీ-మెలోని!

ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లెస్-బైన్స్ వేదికగా జరుగుతున్న G7 సమ్మిట్‌లో భారత్ PM నరేంద్ర మోదీ, ఇటలీ PM జార్జియా మెలోనిల ఇంటరాక్షన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వరల్డ్ లీడర్స్ అంతా గ్రూప్ ఫొటో కోసం సిద్దమవుతున్న టైమ్‌లో వీరిద్దరూ ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. గతంలో మోదీ ఆమెకు 'మెలోడీ' చాక్లెట్లు గిఫ్ట్‌గా ఇవ్వడం, ఆ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం తెలిసిందే. ఇప్పుడు తాజా సమ్మిట్‌లో వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ చూసి నెటిజన్లు 'Melodi' ట్రెండ్‌ను మళ్లీ గుర్తు చేస్తున్నారు.

డిప్యూటీ CM ఇక ప్రతిరోజూ సాయంత్రం అందుబాటులో!
Politics· 17 Jun 2026

డిప్యూటీ CM ఇక ప్రతిరోజూ సాయంత్రం అందుబాటులో!

ప్రజాప్రతినిధుల కోసం తెలంగాణ డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన MLAల అందరికీ పర్సనల్‌గా లెటర్స్ రాశారు. ఇకపై ప్రతిరోజూ సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల వరకు ఒక గంట పాటు సెక్రటేరియట్ (సచివాలయం) లేదా ప్రజా భవన్‌లో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గాల ఇష్యూస్, ప్రజల సమస్యలపై చర్చించేందుకు లీడర్స్‌కు స్పెషల్ టైమ్ కేటాయించడం ఇప్పుడు పాలిటిక్స్‌లో గుడ్ సైన్‌గా మారింది.

రోడ్డెక్కిన మాజీ CM మమతా బెనర్జీ!▶
Politics· 17 Jun 2026

రోడ్డెక్కిన మాజీ CM మమతా బెనర్జీ!

వెస్ట్ బెంగాల్ మాజీ CM మమతా బెనర్జీ మళ్లీ జనం మధ్యకు వచ్చారు. ధర్మతలాలో స్ట్రీట్ వెండర్స్ (రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేవారు) నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె స్వయంగా పాల్గొన్నారు. వారితో కలిసి రోడ్డుపై నడుస్తూ నిరసనలో భాగమయ్యారు. మమతా బెనర్జీతో పాటు పలువురు TMC కీలక నేతలు కూడా ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొని స్ట్రీట్ వెండర్స్‌కు మద్దతు ప్రకటించారు. మమత బెనర్జీ మళ్ళీ ఇప్పుడు రోడ్డు ఎక్కడం బెంగాల్ రాజకీయాల్లో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేసిన అధికారిణి!▶
Legal· 17 Jun 2026

ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేసిన అధికారిణి!

గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఒక ప్యాసింజర్‌తో వాగ్వాదానికి దిగిన రైల్వే కమర్షియల్ అధికారిణి కె. జ్యోతి, తీవ్ర ఆగ్రహంతో ఆ ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రైల్వే శాఖ సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఆమెను తక్షణమే సస్పెండ్ చేస్తూ దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోలర్ ఆర్డర్స్ జారీ చేశారు.

ఉద్యోగ భద్రత కోసం విజయవాడలో మెడికల్ స్టాఫ్ రోడ్డెక్కారు!▶
News· 17 Jun 2026

ఉద్యోగ భద్రత కోసం విజయవాడలో మెడికల్ స్టాఫ్ రోడ్డెక్కారు!

విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH)లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నా తమకు సరైన సెక్యూరిటీ లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనతో ఆసుపత్రి ప్రాంగణంలో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తమిళనాడులో ఇక నుండి ఫ్లెక్సీలు, కటౌట్లు పెడితే యాక్షన్ తప్పదు!▶
Politics· 17 Jun 2026

తమిళనాడులో ఇక నుండి ఫ్లెక్సీలు, కటౌట్లు పెడితే యాక్షన్ తప్పదు!

రాజకీయాల్లో మార్పు అంటే ఇదేనంటూ తమిళనాడు CM విజయ్ ట్రెండ్‌ సెట్ చేశారు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఎలాంటి పోస్టర్లు, ఫ్లెక్స్ బోర్డులు, భారీ కటౌట్లు పెట్టకూడదంటూ ఆయన స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. ఒకవేళ ఈ రూల్‌ను ఉల్లంఘిస్తే, సొంత పార్టీ కార్యకర్తలైనా సరే వారిపై కఠినమైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్‌కి ఇబ్బంది కలగకుండా విజయ్ తీసుకున్న ఈ డెసిషన్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

చెట్ల నరుకుతుండగా కరెంట్ షాక్.. స్పాట్‌డెడ్!
Crime· 17 Jun 2026

చెట్ల నరుకుతుండగా కరెంట్ షాక్.. స్పాట్‌డెడ్!

హైదరాబాద్ అల్వాల్‌లోని MES కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. చెట్ల కొమ్మలు నరుకుతుండగా కరెంట్ తీగలు తగిలి సూర్యనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కరెంట్ సప్లై ఆపకుండానే చెట్లు నరకాలని చెప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది ముమ్మాటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన సూర్యనారాయణకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

భారత్‌కు అమెరికా బిగ్ షాక్!
News· 17 Jun 2026

భారత్‌కు అమెరికా బిగ్ షాక్!

ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భేటీకి ముందే ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. 'US Indo-Pacific Command' పేరులోని "ఇండో" అనే పదాన్ని అమెరికా తొలగించింది. దీన్ని మళ్లీ పాత పేరు అయిన "US Pacific Command"గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, తమ అఫీషియల్ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పాకిస్థాన్ భూభాగంగా చూపించడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఈ రెండు దేశాల కీలక మీటింగ్‌కు ముందే ఇలాంటి డెవలప్‌మెంట్స్ జరగడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

APలో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్!
AP· 17 Jun 2026

APలో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్!

APలోని పలు జిల్లాల్లో మరో మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. వర్షం పడేటప్పుడు ఎవరూ చెట్ల కింద, కరెంట్ స్తంభాల దగ్గర నిలబడొద్దని, ఉరుములు వచ్చేటప్పుడు బయట తిరగొద్దని అధికారులు సూచించారు.

ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన కంపెనీ!
Legal· 17 Jun 2026

ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన కంపెనీ!

నీట్ (NEET) రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై ఈ నెల 22 వరకు టెంపరరీ బ్యాన్ విధించింది. ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్ జరగనుండటంతో, ఎలాంటి పేపర్ లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ బ్యాన్‌ను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం విధించిన టెంపరరీ బ్యాన్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఈ హైకోర్టు డ్రామా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లిన కారు!
Crime· 17 Jun 2026

తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లిన కారు!

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఒక అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ పార్కింగ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రితికా శర్మ తన ఐదేళ్ల కూతురు ఆర్యతో కలిసి కారులోంచి సామాన్లు తీస్తుండగా. ఒక కారు వేగంగా వచ్చి వాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి ఆర్య స్వల్ప గాయాలతో బయటపడగా, క్రితికాకు తీవ్ర గాయాలవ్వడంతో ఐసీయూ (ICU)లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ భయానక దృశ్యాలు సిసిటివి (CCTV)లో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్ వెనక్కి..
News· 17 Jun 2026

రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్ వెనక్కి..

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' సినిమా నుండి తప్పుకున్నాక, FWICE యూనియన్ ఆయనపై విధించిన ఇన్‌ఫార్మల్ బ్యాన్‌ను వెనక్కి తీసుకుంది. ఈ ఇష్యూతో ఫిల్మ్ యూనియన్లకు ఇండస్ట్రీలో ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నా, లీగల్ పవర్స్ మాత్రం చాలా లిమిటెడ్‌గా ఉంటాయని తేలింది. ఈ యూనియన్లు ప్రైవేట్ ట్రేడ్ గ్రూప్స్ మాత్రమే కానీ, ప్రభుత్వ సంస్థలు కావు. అందుకే ఎవరినీ లీగల్‌గా పని చేయకుండా ఆపలేవు. ఒకవేళ బ్యాన్ లాంటివి విధిస్తే, అది ఒకరి బ్రతుకుదెరువును దెబ్బతీయడమే అవుతుందని, కోర్టులో సవాల్ చేయొచ్చని లీగల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

మిగతా ఫోన్ల కంటే డిఫరెంట్.. స్క్రీన్ సైజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Technology· 17 Jun 2026

మిగతా ఫోన్ల కంటే డిఫరెంట్.. స్క్రీన్ సైజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

మోటోరోలా కంపెనీ మార్కెట్‌లోకి 'రేజర్ ఫోల్డ్' (Motorola Razr Fold) పేరుతో సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చింది. మిగతా బ్రాండ్స్ లాగా ఫోన్‌ను స్లిమ్‌గా చేయడంపై కాకుండా. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ ఫీచర్స్ ఇవ్వడంపై ఫోకస్ పెట్టారు. ఇందులో ఏకంగా 6,000mAh బిగ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, మరియు లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రొసెసర్‌ను వాడారు. ఫోన్ ఓపెన్ చేస్తే 8.8 ఇంచుల పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ 50MP కెమెరా ఉంది. దీని స్టార్టింగ్ ప్రైస్ ₹1,49,999 గా ఉంది.

AP హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 529 జాబ్స్!
AP· 17 Jun 2026

AP హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 529 జాబ్స్!

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద కాంట్రాక్ట్ బేసిస్‌పై 529 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో 419 స్టాఫ్ నర్స్, 24 ఫార్మసిస్ట్, 86 మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం మెరిట్ బేసిస్‌పైనే సెలెక్షన్ ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 30, 2026 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శాలరీ ₹23,393 నుండి ₹27,675 వరకు ఉంటుంది.

హైదరాబాద్‌ హాస్పిటల్‌కి AP CM చంద్రబాబు!
Politics· 17 Jun 2026

హైదరాబాద్‌ హాస్పిటల్‌కి AP CM చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ (AIG) హాస్పిటల్‌కు రానున్నారు. ప్రతి సంవత్సరం ఆయన రెగ్యులర్‌గా చేయించుకునే హెల్త్ చెకప్‌లో భాగంగానే ఈరోజు హాస్పిటల్‌కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. CM రాక సందర్భంగా హాస్పిటల్ దగ్గర పోలీసులు భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఈ రొటీన్ మెడికల్ టెస్ట్‌లు పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ APకి తిరిగి వెళ్లనున్నారు.

కూల్‌గా ఉండటం ఎలా? సైకాలజిస్టులు చెప్తున్న 5 బెస్ట్ టిప్స్ ఇవే!
Health· 17 Jun 2026

కూల్‌గా ఉండటం ఎలా? సైకాలజిస్టులు చెప్తున్న 5 బెస్ట్ టిప్స్ ఇవే!

ఈ రోజుల్లో ట్రాఫిక్ జామ్ అయినా, వర్క్ లేట్ అయినా, చిన్న చిన్న వాటికే చాలామందికి వెంటనే కోపం వచ్చేస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ స్ట్రాటజీలతో పేషెన్స్ పెంచుకోవచ్చని సైకాలజిస్టులు చెప్తున్నారు. 1. కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా డీప్ బ్రీత్ తీసుకోవాలి. 2. ఆ సిట్యుయేషన్ గురించి ఆలోచించకుండా మైండ్ డైవర్ట్ చేసుకోవడం. 3. ప్రెజెంట్ మూమెంట్‌లో బ్రతకడం నేర్చుకోవాలి. 4. పీస్ఫుల్ గా మెడిటేషన్ చేయడం. 5. ఇతరులతో క్యాజువల్‌గా మాట్లాడటం వల్ల కూడా మూడ్ సెట్ అవుతుంది. లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి ఓపిక చాలా ఇంపార్టెంట్.