Latest

ఏనుగుల బీభత్సం.. పంటలు, తోటలు ధ్వంసం
Local· 18 Jun 2026

ఏనుగుల బీభత్సం.. పంటలు, తోటలు ధ్వంసం

AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగులు మామిడితోటలపై దాడి చేశాయి. రాత్రి వేళల్లో పంటలు, మామిడి తోటలలోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకుప్పం మండలంలో, అదేవిధంగా ననియాల, ఎస్ గొల్లపల్లి ప్రాంతాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగుల కదలికలపై అధికారులు నిఘా పెంచారు.

ఎండ తట్టుకోలేక షూటింగ్ ఆపేసిన మహేష్ బాబు.. రూ. 2 కోట్ల సెట్ వేస్ట్!
Cinema· 18 Jun 2026

ఎండ తట్టుకోలేక షూటింగ్ ఆపేసిన మహేష్ బాబు.. రూ. 2 కోట్ల సెట్ వేస్ట్!

రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 2 కోట్లతో వేసిన ఓపెన్ ఎయిర్ సెట్‌లో షూటింగ్ స్టార్ట్ అయిన అరగంటకే మహేష్ బాబు అక్కడ ఉన్న ఎండను తట్టుకోలేక 'నా వల్ల కాదు' అని వెళ్ళిపోయారట. దీంతో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయి భారీగా నష్టం వచ్చింది. గతంలో 'బ్రహ్మోత్సవం' టైమ్‌లో కూడా ఎండ వల్ల అవుట్‌డోర్ సాంగ్ షూటింగ్‌ను ఇలాగే ఇన్‌డోర్‌కి షిఫ్ట్ చేయించారు. ప్రస్తుతం మూవీ టీమ్ సౌత్ ఆఫ్రికా షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రాతో కలిసి బిజీగా ఉంది. నవంబర్‌లో ఈ సినిమా ప్రీలుక్ రిలీజ్ కానుంది.

రౌడీషీటర్ సాయికృష్ణ బతికిలేడు: అంబటి
Politics· 18 Jun 2026

రౌడీషీటర్ సాయికృష్ణ బతికిలేడు: అంబటి

AP: విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సన్సెషనల్ కామెంట్ చేశారు. సాయికృష్ణను వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు, కానీ అతడు బతికిలేడని అన్నారు. ఈ ఘటనపై తాము రాజకీయాలు చేయడంలేదని ఒక తల్లి ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నామని అంబటి చెప్పారు. హత్య చేయడం మొదటి నేరమైతే, డెడ్‌బాడీని మాయం చేయడం రెండో నేరం అని అన్నారు. ఘటనపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని, బాధ్యులందరికీ కఠినంగా శిక్షించాలన్నారు.

సమంత ప్రెగ్నెంటా? వైరల్ వార్తలపై అసలు నిజం ఇదీ!
Cinema· 18 Jun 2026

సమంత ప్రెగ్నెంటా? వైరల్ వార్తలపై అసలు నిజం ఇదీ!

స్టార్ హీరోయిన్ సమంత నెక్స్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత సామ్ రీ-ఎంట్రీ ఇస్తుండడంతో భారీ అంచనాలున్నాయి. అయితే, సమంత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై సామ్ సన్నిహితులు స్పందిస్తూ. ఈ ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తను ప్రస్తుతం కేవలం కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. సమంత ప్రెగ్నెన్సీ వార్తల పై త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

జర్నలిస్ట్ ఫోటో మార్ఫింగ్ చేసిన వారిని శిక్షించాలి: DMJU
TG· 18 Jun 2026

జర్నలిస్ట్ ఫోటో మార్ఫింగ్ చేసిన వారిని శిక్షించాలి: DMJU

మహిళా జర్నలిస్టు ఫోటోను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాన్ని ఖండిస్తున్నట్లు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(DMJU) రాష్ట్ర అధ్యక్షులు కే.రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ తెలిపారు. హైదరాబాద్‌లో CJP నిర్వహించిన సమావేశాన్ని వార్త కవరేజ్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టును లక్ష్యంగా చేసుకుని ఆమె ఫోటోలను మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. ఫోటోను మార్ఫింగ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవాళ్టి గోల్డ్ రేట్స్.. పెరిగాయా? తగ్గాయా?
Business· 18 Jun 2026

ఇవాళ్టి గోల్డ్ రేట్స్.. పెరిగాయా? తగ్గాయా?

బంగారం కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ పెద్దగా మారకుండా స్టడీగా సాగుతున్నాయి. వెస్ట్ ఆసియాలో టెన్షన్స్ తగ్గడమే దీనికి మెయిన్ రీజన్. ఇవాళ (జూన్ 18) హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,090 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,490 గా ఉంది. రేట్లు ఎప్పుడైనా మారొచ్చు, సో షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి ప్రైస్ చెక్ చేసుకోండి.

10 మందిపై పోక్సో కేసు నమోదు▶
Crime· 18 Jun 2026

10 మందిపై పోక్సో కేసు నమోదు

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఓ ఇంట్లో మైనర్ బాలుడు, బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో గమనించిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. సదరు బాలుడిని గ్రామస్థులంతా కలిసి ఒక చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. బాలుడు, అతనితో పాటు ఉన్న మరికొందరు కలిసి తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించారంటూ బాలిక తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో పదిమంది నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడు హల్‌చల్▶
AP· 18 Jun 2026

చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడు హల్‌చల్

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సై 12రోజులు దాటినా ఆచూకీ దొరకలేదు. గురువారం తెలంగాణకు చెందిన ఓ జ్యోతిష్యుడు జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హల్‌చల్ చేశాడు. తాను జ్ఞానిని అని చెప్పుకుంటూ, పాప భూదేవి వద్ద ఉందని, అర్ధరాత్రి పూజలు చేస్తే తిరిగి వస్తుందని హంగామా సృష్టించాడు. చిన్నారిది కారణజన్మ అని, ఏ అడవి జంతువులు ఎత్తుకుపోలేదని, రాత్రి ఒంటి గంటకు కచ్చితంగా తోటలో ప్రత్యక్షమవుతుందని చెప్పాడు. తాను చెప్పినట్లు పూజలు చేస్తేనే పాప వస్తుందంటూ ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాడు.

బాసర ట్రిపుల్ ITలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
TG· 18 Jun 2026

బాసర ట్రిపుల్ ITలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TG: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ITలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన మరోసారి తీవ్ర కలకలం రేపింది. PUC ఫస్టియర్ విద్యార్థిని అస్మితా బేగం హాస్టల్ భవనంపై నుంచి దూకింది. తీవ్ర గాయాలైన ఆమెను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని సంగారెడ్డి జిల్లా మానూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన అస్మితా బేగంగా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రస్తుతం బాసర ట్రిపుల్ ITలో PUC మొదటి సంవత్సరం చదువుతోంది. అస్మితా ఎవరితోనూ మాట్లాడకుండా తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నట్లు తోటి స్నేహితులు తెలిపారు.

కృష్ణలంక ఘటనపై ప్రభుత్వం సీరియస్
AP· 18 Jun 2026

కృష్ణలంక ఘటనపై ప్రభుత్వం సీరియస్

విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం APలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నెలరోజుల క్రితం సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి అతను కనిపించకుండా పోయారు. సాయికృష్ణ గురించి పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలు బయటకు చెప్పలేదు. జూన్ 29లోపు సాయికృష్ణను తమ ఎదుట హాజరుపరచాలన్న హైకోర్టు ఆదేశాలతో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీని ఛేదించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ కు త్వరలోనే వంద  కోట్ల ప్రాజెక్టు
Politics· 18 Jun 2026

హైదరాబాద్ కు త్వరలోనే వంద కోట్ల ప్రాజెక్టు

హైదరాబాద్ లో త్వరలోనే వంద కోట్ల పెట్టు బడితో ఇండస్ట్రీ రీసెర్చ్ టెక్నాలజీ , ఇన్నోవేషన్ పార్కు ఏర్పాటు అవుతోంది. హైదరాబాద్ బిట్స్ పిలానీ శాఖ, యాక్సిస్ బ్యాంకు కలిపి ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఇండస్ట్రీ రీసెర్చ్, టెక్నాలజీ ఇన్నోవేషన్ను అభివృద్ది చేయడమే ఈ ఒప్పందం అసలు ఉద్దేశం.

కోతుల కొట్లాటలో మహిళ మృతి
Local· 18 Jun 2026

కోతుల కొట్లాటలో మహిళ మృతి

TG: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీలో కొనపర్తి సత్యనారాయణ, పద్మ(55) దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మ బుధవారం సాయంత్రం ఇంటి ముందు కూర్చొని మరో మహిళతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఆ ఇంటిపై రెండు కోతులు తీవ్రంగా కొట్లాడుకోసాగాయి. రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన సిమెంట్ ఇటుక కింద కూర్చున్న పద్మ తలపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.మహేష్ తెలిపారు.

ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతుల ఫిర్యాదు
AP· 18 Jun 2026

ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతుల ఫిర్యాదు

AP: రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి రైతులు తమ భూముల విలువ నిర్ధారణలో జరుగుతున్న అన్యాయంపై గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ రైతులు ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. భూముల విలువకు సంబంధించి పరిహారం ఇచ్చేటప్పుడు భూముల విలువను తక్కువగా చూపుతూ, అప్పులు తెచ్చుకునేటప్పుడు మాత్రం ఎకరాకు రూ. కోట్లలో చూపిస్తున్నారని రైతులు అందులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన వరల్డ్ బ్యాంకు అధికారి ఒలీవర్ CRDAకు లేఖ పంపారు. ఉండవల్లి గ్రామంలో భూముల విలువ నిర్ధారణ, రక్షణ నిబంధనల ఉల్లంఘనలపై కొత్త ఫిర్యాదు వచ్చిందని దీనిపై పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.

జీ7 సమ్మిట్ లో మోడీకి ట్రంప్ సర్ ప్రైజింగ్  ప్రామిస్
World· 18 Jun 2026

జీ7 సమ్మిట్ లో మోడీకి ట్రంప్ సర్ ప్రైజింగ్ ప్రామిస్

మోడీ అధికారంలో ఉండగా ఇండియాపై ఎవరైనా దాడి చేస్తే అమెరికా భారత్ కు అండగా నిలుస్తుందని యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 సమ్మిట్ లో నేతలిద్దరూ సమావేశమయ్యారు.2025 మే ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ, ట్రంప్ ఫేస్ టు ఫేస్ కలవడం ఇదే తొలిసారి. మోడీ అధికారంలో ఉన్నంత వరకూ తమ సహాయం కొనసాగుతుందని ట్రంప్ అన్నారు.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు
Education· 18 Jun 2026

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు

ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు AP ఇంటర్మీడియట్ విద్యామండలి సర్వం సిద్ధం చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నం.. చివరికీ
Crime· 18 Jun 2026

సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నం.. చివరికీ

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే దంపతులకు మూడున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆమెను 2019 జూన్ 12 నుంచి స్థానికంగా ఓ ప్లేస్కూల్‌కు పంపించారు. పాఠశాలలో కరాటే కోచ్‌గా పనిచేసే కిరణ్‌సాయి(24) పాపపై అత్యాచారం చేశాడు. విషయాన్ని అమ్మమ్మకు పాప చెప్పింది. ఆమె పోలీసులకు చెప్పడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ప్లేస్కూల్ ప్రిన్సిపల్ దీపిక సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించారు. కేసును విచారించిన రాజేంద్రనగర్ పోక్సో కోర్టు నిందితుడు కిరణ్‌సాయికి 20ఏళ్ల జైలుశిక్ష, ప్రిన్సిపల్‌కు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

సీఎం విజయ్ పై సమంత ఎమోషనల్ పోస్ట్ !
Cinema· 18 Jun 2026

సీఎం విజయ్ పై సమంత ఎమోషనల్ పోస్ట్ !

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు బుధవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమాలను వదిలి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సీఎం పీఠాన్ని అధిష్టించిన విజయ్‌కు ఆమె తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ, విజయ్‌లోని లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాశారు. విజయ్ ఏదో గొప్ప కార్యాన్ని సాధించడానికే పుట్టారంటూ ప్రశంసించారు.

నేటి నుంచి తెలంగాణ వన మహోత్సవం
TG· 18 Jun 2026

నేటి నుంచి తెలంగాణ వన మహోత్సవం

TG : రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 16.06 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,242 ప్రభుత్వ నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, పర్యావరణాన్ని కాపాడటంలో తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఎకోపార్క్‌లో సీఎం 'నాగలింగం' మొక్కను నాటి "వనమహోత్సవం 2026" కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

43 మంది డాక్టర్లు డిస్మిస్
AP· 18 Jun 2026

43 మంది డాక్టర్లు డిస్మిస్

AP: విధుల్లో నిర్లక్ష్యం వహించిన 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ AP వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్లుగా 118 మంది వైద్యులు విధులకు దూరంగా ఉంటున్నారని గుర్తించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సైతం రిప్లై ఇవ్వలేదు. అనధికారికంగా వైద్యులు దూరంగా ఉండటాన్ని వైద్యారోగ్య శాఖ సీరియస్ తీసుకుంది. ఇప్పటికే రాజీనామా చేసిన 34 మందిలో 15 మందికి ఆమోదం తెలిపింది. మరో 34 మంది వైద్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.

అలా చేయకపోతే HCA వృద్ధి చెందదు: అజహరుద్దీన్
Sports· 18 Jun 2026

అలా చేయకపోతే HCA వృద్ధి చెందదు: అజహరుద్దీన్

TG: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'TG20 లీగ్'పై మంత్రి అజహరుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం HCAలో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలు క్రికెట్ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని కామెంట్ చేశారు. HCAలో ఉన్న లొసుగులు, సమస్యలను పూర్తిగా పరిష్కరించనంత కాలం.. హైదరాబాద్ క్రికెట్ ఏమాత్రం వృద్ధి చెందదని, ఇక్కడి నుంచి కొత్తగా ప్రతిభావంతులు ముందుకు రాలేరని అన్నారు.

చిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం: హోంమంత్రి
AP· 18 Jun 2026

చిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం: హోంమంత్రి

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని AP హోంమంత్రి అనిత పరామర్శించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారి అదృశ్యం దర్యాప్తు పురోగతిని జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. 11 రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలను మంత్రికి SP వివరించారు. అనంతరం బాలిక అదృశ్యమైన ప్రదేశానికి అనిత వెళ్లి పరిశీలించారు. అడవి జంతువులు వచ్చే అవకాశముందా? అని ఆరా తీశారు. అటవీశాఖ అధికారులు కెమెరాలు, డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నారని పోలీసులు మంత్రికి వివరించారు.