Latest

ఫ్రెండ్ షిప్ కి నో చెప్పిందని.. ఓ పూజారి వికృత చేష్టలు !
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి తన స్నేహాన్ని తిరస్కరించిందనే కోపంతో, ఢిల్లీకి చెందిన సుమిత్ నెంచంద్ శర్మ అనే పూజారి ఘాతుకానికి ఒడిగట్టాడు. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టూల్స్ ఉపయోగించి ఆ యువతి, ఆమె తల్లికి సంబంధించిన అసభ్యకర మార్ఫింగ్ ఫొటోలను సృష్టించి, నకిలీ సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేశాడు. గుజరాత్‌కు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 'మిషన్ సైబర్ రక్షిక' కింద నిందితుడిని ఢిల్లీలో ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో మతపరమైన ప్రసంగాలు చేసే ఈ పూజారి వికృత చేష్టలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి.

దీదీ పార్టీలో లుకలుకలు మొదలు !!
బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో ముఠా తగాదాలు, తిరుగుబాటు మొదలయ్యాయి. గత 15 ఏళ్లుగా బీజేపీ దాడులను తట్టుకుని నిలబడిన ఈ పార్టీ, ఇప్పుడు ఓటమితో వీక్ గా అయిపోయింది. నేతలు మమతా బెనర్జీ వ్యూహాలను, ఆమెపై తమకున్న నమ్మకాన్ని క్వశ్చన్ చేస్తున్నారు.. సీనియర్ నేత కాకోలి ఘోష్ దస్తీదార్ తన రాజీనామా లేఖలో మమతా బెనర్జీ ఓల్డ్ మోడల్ లోనే పార్టీని నడపాలని కోరారు. దీంతో పార్టీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేవాళ్లకు హైపర్ ఆది గట్టి కౌంటర్!
సుగాలి ప్రీతికి న్యాయం జరిగింది ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్లేనని కమెడియన్ హైపర్ ఆది అన్నారు. ఎవరో పక్కన ఉండేవాళ్ల మాటలు విని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ఆపితే బెటర్ అని చెప్పారు. అమిత్ షా పవన్ కళ్యాణ్‌తో అలా మాట్లాడారంటూ నాగేశ్వర్ రావు ఫేక్ ముచ్చట్లు చెబుతుంటే. "ఇతను డబ్బులు తీసుకున్నాడు" అని జనసైనికులు అనడంలో తప్పేంటని క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణ్ ని అనవసరంగా విమర్శిస్తే, ఆయనను ఇష్టపడేవాళ్లు ఊరుకోరు గట్టిగా రియాక్ట్ అవుతారని ఆది వార్నింగ్ ఇచ్చారు.

'సమస్యల సుడిగుండంలో సూర్యాపేట'
TG: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం జూన్ 2వ తేదీ నుంచి సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేటలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అలుపెరగని ఉద్యమ పోరాటాలు చేసి, ఎందరో ఉద్యమకారులకు జన్మనిచ్చిన సూర్యాపేట నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు.
హైదరాబాద్‌లో అమ్మాయి అరుపులతో అలర్ట్ అయిన లోకల్స్!
హైదరాబాద్ బషీర్‌బాగ్ CCS ఆఫీస్ దగ్గర ఒంటరిగా వెళ్తున్న ఒక అమ్మాయి చేయి పట్టుకుని కొందరు నేపాలీ యువకులు చాలా రూడ్‌గా బిహేవ్ చేశారు. ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో అలర్ట్ అయిన లోకల్స్. వెంటనే ఆ పర్సన్స్ ని పట్టుకుని గట్టిగా బుద్ధి చెప్పారు. అబిడ్స్ పోలీసులు సీన్లోకి ఎంటర్ అయి, ఆ పర్సన్స్ లోకల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్‌లుగా identify చేసి కేసు ఫైల్ చేశారు.

బెంగళూరులో ప్రాస్టిట్యూషన్ గుట్టు రట్టు!
బెంగళూరులో ఒక మేజర్ ప్రోస్టిట్యూషన్ రాకెట్ ని పోలీసులు బస్ట్ చేశారు. ఈ రాకెట్ రన్ చేస్తున్న ఏడుగురు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రైవేట్ హౌస్‌లో ఈ ఇల్లీగల్ వర్క్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ రావడంతో, పోలీసులు సీక్రెట్ రైడ్ చేసి క్యాచ్ చేశారు. విక్టిమ్స్ ని రెస్క్యూ చేసి, ఈ బిజినెస్ వెనుక ఉన్న వాళ్ళని కస్టడీ లోకి తీసుకున్నారు. పోలీస్ ఇప్పుడు ఈ హోల్ నెట్వర్క్ పై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ: సునీతా లక్ష్మారెడ్డి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. గురువారం మెదక్ జిల్లా వెల్దుర్తిలోని కుకునూరు చౌరస్తా వద్ద రైతులు నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యానికి కాంగ్రెస్ గవర్నమెంటే కారణమన్నారు. ధాన్యం కొనుగోలు చేసే ముందు సాధారణ ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. స్టేట్ గవర్నమెంట్ వెంటనే తడిచిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసి మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు.

సంపూర్ణ అక్షరాస్యత సాధించిన సిక్కిం- దేశంలో అయిదో రాష్ట్రంగా ఘనత
సిక్కిం సంపూర్ణ అక్షరాస్యతని సాధించింది. కేంద్రం ULLAS ప్రోగ్రామ్ కింద ఈ ఘనతని సాధించిన అయిదో రాష్ట్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ తర్వాత సిక్కిం ఐదో స్థానంలో నిలిచింది. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఉల్లాస్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 15 ఏళ్లు పై బడిన వారిలో చదవడం, రాయడంతో పాటు డే టు డే లైఫ్‌లో ఉపయోగపడే చిన్న చిన్న లెక్కలు చెయ్యగలగాలి. అలా 95% జనాభా చేస్తే ఆ రాష్ట్రం ఫుల్లీ లిటరేటెడ్ స్టేట్ అవుతుందన్నమాట.

CM సిద్ధరామయ్య రిజైన్!
కర్ణాటక CM సిద్ధరామయ్య తన పదవికి రిజైన్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆర్డర్‌తో ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బెంగళూరులో లేకపోవడంతో. లోక్ భవన్‌కు వెళ్లిన సిద్ధరామయ్య తన రిజిగ్నేషన్ లెటర్‌ను గవర్నర్ స్పెషల్ సెక్రటరీ ప్రభు శంకర్‌కు అందజేశారు. అల్మోస్ట్ 3 ఇయర్స్ CMగా ఉన్న ఆయన ప్లేస్‌లో. ఇప్పుడు Diputy CM DK శివకుమార్ కర్ణాటక నెక్స్ట్ CMగా బాధ్యతలు తీసుకోబోతున్నారు.
మనసున్న మారాజు! పెళ్లికూతురు చేతిలో ₹10 పెట్టి షాక్ ఇచ్చాడు!
అస్సాంలో జరిగిన ఒక మ్యారేజ్ ఈవెంట్లో హార్ట్ టచింగ్ సీన్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇన్విటేషన్ లేకపోయినా పెళ్లికి వెళ్లిన ఒక మానసిక దివ్యాంగుడు, అక్కడ అందరితో కలిసి భోజనం చేశాడు. రిటర్న్ వెళ్లేటప్పుడు తన దగ్గరున్న పది రూపాయల నోటును పెళ్లికూతురు చేతిలో పెట్టి బ్లెస్ చేశాడు. ఆయన మంచి మనుసు చూసి పబ్లిక్ ఫిదా అవుతున్నారు. అలాగే ఆయనను ఆప్యాయంగా చూసుకున్న పెళ్లి ఫ్యామిలీని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి మహానాడు తీర్మానం
TDP వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి భారత రత్న ఇవ్వాలని మహానాడు తీర్మానం చేసింది. దేశానికి, తెలుగు జాతికి NTR చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని మరణానంతరం భారత రత్న పురస్కారం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
NTR ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టం!
సీనియర్ NTR పై ఆక్టర్ రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. NTR నాకు దేవుడు. ఏదో జన్మలో నేను చేసుకున్న పుణ్యం వల్లే ఆయన ఫ్యామిలీలో పుట్టాను, అంటూ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ షేర్ చేశారు. అసలు NTR తెలుగువాడిగా పుట్టడం మనందరి అదృష్టం అని చెప్పారు. NTR birthday సందర్భంగా రాజేంద్రప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హుక్కా బార్ నడపడం ప్రాథమిక హక్కు కాదు
హుక్కా బార్ నడపడం ఎవరి ప్రాథమిక హక్కు కాదని..ప్రజల ఆరోగ్యం కోసం స్టేట్ గవర్నమెంట్‌కి దాన్ని మూసేనే హక్కు ఉందని లక్నో హైకోర్టు చెప్పింది. తమ వ్యాపారాన్ని మూసేసారని హుక్కా బార్ యజమానులు కోర్టులో కేసు ఫైల్ చేయగా, ఆ కేసుపై తీర్పు ఇచ్చింది. హుక్కా ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతుందని, అది కూడా తాగుడు, జూదం లాంటిదే అని చెప్పింది. దాన్ని సాధారణ వ్యాపారంలా చూసి కాపాడటం కుదరదని కన్ఫర్మ్ చేసింది. జనం ఆరోగ్యం కోసం దాని మీద రిస్ట్రిక్షన్స్ విధించే హక్కు గవర్నమెంట్‌కి ఉందని వివరించింది.
అమెరికాలో ఇండియన్స్‌కి ఇన్సల్ట్!
అమెరికాలో ఇండియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. ఒక అమెరికన్ వ్యక్తి ఇండియన్స్‌ని టార్గెట్ చేస్తూ చాలా రూడ్‌గా మాట్లాడాడు. "మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా కంట్రీలో మీరు ఉండటం మాకు నచ్చట్లేదు, వెంటనే మీ కంట్రీకి వెళ్ళిపోండి" అంటూ ఇన్సల్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
TDP అకౌంట్లో చీప్ ట్రిక్స్.. తులసి చందు సీరియస్ క్వశ్చన్స్!
TDP అఫీషియల్ ట్విట్టర్ పేజీ ఒక ‘ట్రోల్ పేజీ’ లాగా మారిపోయిందని జర్నలిస్ట్ తులసి చందు ఫుల్ ఫైర్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఫోటోకు YSRCP కండువా వేసి, దాన్ని TDP అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం చాలా దారుణమన్నారు, ఒక పెద్ద పొలిటికల్ పార్టీ అయ్యుండి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో "HOW DARE YOU TDP!" అంటూ గట్టిగా క్వశ్చన్ చేశారు.

ఉత్తర భారతానికి చల్లని న్యూస్
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ రాష్ట్రాలకు ఎండల నుంచి బిగ్ రిలీఫ్ . కొత్తగా ఏర్పడిన వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావంతో మే 29 నుంచి ఎండలు తగ్గుతాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది., గంటకు 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 6 నుండి 8 డిగ్రీల వరకు తగ్గొచ్చు. మరో వైపు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతూ ముందుకు సాగుతున్నాయి.

నీటమునిగిన ధాన్యం.. ఫార్మర్స్‌కు తీవ్ర నష్టం
TG: అకాల వర్షాలతో ఫార్మర్స్ ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఉమ్మడి మెదక్ జిల్లా, యాదాద్రిభువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ సహా పలు జిల్లాల్లోని ధాన్యం కల్లాలు చిన్నపాటి చెరువులను తలపించాయి. సరిపడా టార్ఫాలిన్ కవర్లు లేకపోవడం, కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు లోతట్టులో ఉండడంతో ధాన్యం తడిసి అన్నదాతలకు తీవ్ర నష్టం జరిగింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు గవర్నమెంట్‌ను రిక్వెస్ట్ చేశారు.

'బక్రీద్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి'
TG: బక్రీద్ ఫెస్టివల్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల చెప్పారు. బక్రీద్ పండుగ సందర్భంగా భైంసా టౌన్‌లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన పటిష్ట పోలీస్ బందోబస్తును ఆమె స్వయంగా పరిశీలించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పట్టణంలో గట్టి భద్రతా ఏర్పాటు చేశామన్నారు. ఈ పండుగ నేపథ్యంలో ఇదివరకే ఇరువర్గాల ప్రజలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు.

సిద్దరామయ్య ఆశీస్సులు తీసుకున్న శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం క్యాబినెట్ సహచరులకు బ్రేక్‌ఫాస్ట్ మీట్ ఇచ్చి థాంక్స్ చెప్పారు. ఈ మీట్ కి హాజరైన కాబోయే సీఎం శివకుమార్ సిద్ధరామయ్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం ఈ మొత్తం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్. ముంబై వెళ్లిన ఆయన ఎప్పుడు తిరిగి వస్తారో క్లారిటీ లేదు.
ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ నివాళులు
TDP వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 103 వ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.
మామిడి పళ్లు కెమికల్స్ తో పండించారా ? జస్ట్ 10 సెకండ్లలో తెలుసుకోవచ్చు
మామిడి పండ్లు సీజన్ వచ్చిందంటే అందరికీ వచ్చే ఒకే ఒక్క డౌట్. అవి సహజంగా పండాయా ? కెమికల్స్ వేసి పండించారా ? అందుకే ఎంతో ఇష్టమైన మామిడి పండ్లని తినడానికి కూడా ముందు వెనక ఆలోచిస్తూ ఉంటారు. కానీ జస్ట్ పదే సెకండ్లలో వాటిని ఎలా పండించారో తెలుసుకోవచ్చు. ఒంగోలుకు చెందిన డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ఏం చెబుతున్నారో మీరూ వినేయండి మరి.