Entertainment· 7 Apr 2026
రామాయణంలో రావణుడి మరో కోణం
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణ' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రావణుడిని కేవలం విలన్గా కాకుండా, ఆయనలోని మేధస్సు, ప్రజలను జాగ్రత్తగా చూసుకునే రాజు, అద్భుతమైన సంగీత విద్వాంసుడు, శివభక్తి వంటి గొప్ప లక్షణాలను కూడా చూపిస్తామని దర్శకుడు తెలిపారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ దీపావళికి విడుదల కానుంది. రావణుడి అహంకారం వల్ల ఒక గొప్ప వ్యక్తి ఎలా పతనమవుతాడో ఈ సినిమా ద్వారా సందేశాన్ని ఇవ్వనున్నారు.