Sports

గంగూలీ బయో పిక్ దాదా ఫస్ట్ లుక్  పై నెటిజన్ల ట్రోల్స్ !
Sports· 9 Jul 2026

గంగూలీ బయో పిక్ దాదా ఫస్ట్ లుక్ పై నెటిజన్ల ట్రోల్స్ !

సౌరవ్ గంగూలీ బయోపిక్ 'దాదా': రాజ్‌కుమార్ రావు ఫస్ట్ లుక్‌పై నెటిజన్ల ట్రోల్స్! మాజీ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ నుంచి హీరో రాజ్‌కుమార్ రావు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. లార్డ్స్ స్టేడియంలో గంగూలీ జెర్సీ విప్పిన ఐకానిక్ మూమెంట్‌ను ఇందులో రీక్రియేట్ చేశారు. అయితే, ఈ పోస్టర్ నెటిజన్లను అస్సలు ఆకట్టుకోలేదు. ఇది చాలా వరస్ట్‌గా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. "దీనికంటే ChatGPT ఇంకా మంచి పోస్టర్ డిజైన్ చేసేది", "ఇది ఒక డిజాస్టర్ VFX" అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

పవర్ ఫుల్ లోయర్ బాడీకి గాబ్లెట్ స్క్వాట్స్
Sports· 5 Jul 2026

పవర్ ఫుల్ లోయర్ బాడీకి గాబ్లెట్ స్క్వాట్స్

ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కు అత్యంత పరిచయమైన వర్కవుట్స్‌లో 'స్క్వాట్స్' (Squats) ఒకటి. అయితే, సాధారణ స్క్వాట్స్ కంటే 'గాబ్లెట్ స్క్వాట్స్' (Goblet Squats) చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఒక డంబెల్ లేదా కెటిల్‌బెల్‌ను ఛాతీకి దగ్గరగా పట్టుకుని చేసే ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ వల్ల లోయర్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. బాడీకి సరైన పొశ్చర్ వస్తుంది.నడుము , పొత్తికడుపు కండరాలు యాక్టివేట్ అయి బలపడతాయి. జిమ్‌లో భారీ బరువులు ఎత్తలేక పోయినా.. ఇంట్లోనే ఒక చిన్న డంబెల్‌తో ఈ 'గాబ్లెట్ స్క్వాట్స్' చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు!
Sports· 18 Jun 2026

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు!

ఈ నెల 21 నుంచి స్టార్ట్ కాబోతున్న 'టీజీ టీ20' లీగ్‌కు షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు ఇచ్చింది. బీసీసీఐ నుండి ఎలాంటి అఫీషియల్ పర్మిషన్ లేకుండానే ఈ మ్యాచ్‌లు ఆడిస్తున్నారని టీసీఏ అంటోంది. విజయ్‌తో పాటు క్రికెటర్లు తిలక్ వర్మ, సిరాజ్, అంబటి రాయుడు లాంటి మరో ఎనిమిది మంది సెలబ్రిటీలకు కూడా నోటీసులు పంపబోతున్నారు. ఈ లీగ్ వెనుక రూ. 100 కోట్ల పొలిటికల్, రియల్ ఎస్టేట్ లాభాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ ఈ మ్యాటర్ క్రికెట్, సినీ ఇండస్ట్రీలో ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది.

దావూద్  చంపుతానన్నాడు.. అందుకే దానికి దూరమయ్యా- లలిత్ మోడీ
Sports· 4 Jun 2026

దావూద్ చంపుతానన్నాడు.. అందుకే దానికి దూరమయ్యా- లలిత్ మోడీ

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుండి వచ్చిన మర్డర్ త్రెట్స్ కు భయపడే తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి శాశ్వతంగా తప్పుకోవడానికి కారణమని మాజీ IPL కమిషనర్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఇల్లీగల్ బెట్టింగ్ నెట్‌వర్క్స్‌కు సపోర్ట్ చేయకపోవడం వల్లే D-Company తనను టార్గెట్ చేసిందని, ఎన్నో ఎక్స్‌టార్షన్ అటెంప్ట్స్ మరియు అస్సాస్సినేషన్ ప్లాట్స్ జరిగాయని చెప్పారు. ముఖ్యంగా 2012లో లండన్‌లో ఒక ఇంటర్మీడియరీ ద్వారా తెల్లవారుజామున దావూద్‌తో శాటిలైట్ ఫోన్‌లో మాట్లాడించారని, ఆ టైమ్‌లో తాను తీవ్రమైన భయానికి లోనయ్యానని లలిత్ మోదీ వెల్లడించారు.