ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్

TG : ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 10న ఉదయం 10 గంటలకి జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాయ్స్, గర్ల్స్ కబడ్డీ సెలక్షన్స్ జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రాష్ట్రపాల్ తెలిపారు. సబ్ జూనియర్స్‌కి 16 ఏళ్ల లోపు, జూనియర్స్‌కి 20 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్స్ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ మెమోలతో నేరుగా హాజరుకావాలని చెప్పారు.



