Latest

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 3d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.

మనిషి మారిపోయాడా.. లేక పరిస్థితులే మార్చాయా?
Motivational· 3d ago

మనిషి మారిపోయాడా.. లేక పరిస్థితులే మార్చాయా?

ఒకప్పుడు ఎంతో క్లోజ్‌గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు ఎందుకు పూర్తిగా మారిపోయినట్టు అనిపిస్తాడు? నిజానికి మనిషి ఒక్కసారిగా మారిపోడు. ఎదురైన అనుభవాలు, బాధలు, బాధ్యతలు, కొత్త పరిచయాలు.. ఇవన్నీ అతని ఆలోచనల్ని, ప్రవర్తనని నెమ్మదిగా మార్చుతాయి. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్టు మారడం అవసరం కూడా. అందుకే ఎవరో మారిపోయారని అనుకునే ముందు.. వాళ్లను మార్చిన పరిస్థితులేంటో కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనిషిని అర్థం చేసుకోవాలంటే.. అతని ప్రవర్తన మాత్రమే కాదు, అతను దాటిన దారిని కూడా చూడాలి.

Gen Z Instagram గ్రిడ్‌ను ఎందుకు ‘Ghost’ చేస్తోంది?
Gen Z· 3d ago

Gen Z Instagram గ్రిడ్‌ను ఎందుకు ‘Ghost’ చేస్తోంది?

ఒకప్పుడు Instagramలో ఏ చిన్న విషయం జరిగినా పోస్ట్ చేయడం కామన్‌.. కానీ ఇప్పుడు Gen Zలో ఆ ట్రెండ్‌ మెల్లగా మారుతోంది. చాలామంది పబ్లిక్ గ్రిడ్‌లో పోస్టులు పెట్టడం తగ్గించి, Stories, Close Friends, DMs, ప్రైవేట్ గ్రూపుల్లోనే ఎక్కువగా షేర్ చేస్తున్నారు. దీనినే “Ghost-posting” అని పిలుస్తున్నారు. కారణం కూడా ఆసక్తికరమే.. ప్రతి పోస్ట్‌కు లైక్స్, వ్యూస్, ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించడం, సోషల్ మీడియా ఫాటిగ్‌ పెరగడం. అందరికీ కనిపించకుండా తమకు నచ్చిన వాళ్లతో మాత్రమే షేర్ చేయడం కొత్త ట్రెండ్‌గా మారుతోంది.

సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట: SI
Local· 3d ago

సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట: SI

AP: దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గుత్తి ఎస్‌ఐ అమిర్ ఖాన్ సూచించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎస్‌ అవెన్యూలో మంగళవారం రాత్రి నిర్వహించిన ప్రజల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పట్టణంలో చోటుచేసుకున్న దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వెంచర్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 100కు ఫోన్ చేయాలని సూచించారు.

హమరా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
Local· 3d ago

హమరా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

TG: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమరా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని దత్తాపూర్ అంబేద్కర్ యువజన సభ్యులు నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వ్యాఖ్యలు అంబేద్కర్‌ను గౌరవించే అభిమానులు, వివిధ వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత వ్యాఖ్యలను పూర్తిగా పరిశీలించి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు అంశాన్ని పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు యువజన సభ్యులు వెల్లడించారు.

మండల అధ్యక్షుడిగా చెన్నయ్య ఏకగ్రీవం
Local· 3d ago

మండల అధ్యక్షుడిగా చెన్నయ్య ఏకగ్రీవం

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల మాదిగ దండోరా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొందుర్గ్ మండల కేంద్రంలోని జీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో మాజీ ఎంఆర్‌పీఎస్‌ మండల అధ్యక్షుడు అనేగాళ్ల ఆనంద్‌ మాదిగ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా పరిశీలకుడు రావుగల్ల బాబు, మాజీ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆగిర్యాల గ్రామానికి చెందిన గూడెం చెన్నయ్యను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

విపత్తులపై విద్యార్థులకు అవగాహన
Local· 3d ago

విపత్తులపై విద్యార్థులకు అవగాహన

AP: విద్యార్థుల్లో విపత్తులపై అవగాహన పెంచేందుకు కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (CARDS) స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని నగరం, బాపట్ల, కొల్లూరు, వేమూరు, కొల్లిపర మండలాల్లో 30 ఉన్నత పాఠశాలల్లో ‘చైల్డ్ లెడ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్’ ప్రాజెక్ట్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా కొల్లిపర మండలం వల్లభాపురం పాఠశాలలో 36 మంది విద్యార్థులకు విపత్తుల రకాలు, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర నంబర్లపై PPT ద్వారా అవగాహన కల్పించారు.

CPSపై ఉద్యోగుల మహాగర్జన
TG· 3d ago

CPSపై ఉద్యోగుల మహాగర్జన

TG: CPSను రద్దుచేసి OPS అమలు చేయాలంటూ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌ నాంపల్లి గగన్‌ విహార్‌, అబిడ్స్‌ బీమా భవన్‌, కలెక్టరేట్‌ వద్ద, సచివాలయంలో ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. సీపీఎస్‌ రద్దు హామీని ప్రభుత్వం అమలు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. 30 ఏళ్లపాటు సేవలందించే ఉద్యోగులకు సీపీఎస్‌, ఐదేళ్ల పదవీకాలం ఉండే ప్రజాప్రతినిధులకు ఓపీఎస్‌ కొనసాగించడం అన్యాయమన్నారు.

CDలు, DVDలు తెచ్చుకుని సినిమాలు చూసిన రోజులు! 💿
General· 3d ago

CDలు, DVDలు తెచ్చుకుని సినిమాలు చూసిన రోజులు! 💿

ఇప్పుడంటే సినిమా చూడాలంటే OTTలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు VCD, DVDల్లో సినిమాలు చూసేవాళ్లు. వాటికంటే ముందు వీడియో క్యాసెట్ల కాలం ఉండేది. VCRలో క్యాసెట్ పెట్టి టీవీలో సినిమా చూస్తుంటే, చుట్టుపక్కల వాళ్లంతా ఒకచోట చేరేవాళ్లు. ఆ తర్వాత VCD, DVDలు వచ్చాయి. షాప్‌కి వెళ్లి నచ్చిన సినిమా డిస్క్ తీసుకొచ్చి, ప్లేయర్‌లో పెట్టి చూసే రోజులు కూడా చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఒక్క క్లిక్‌తో సినిమా వస్తున్నా.. అప్పటి ఆ చిన్న చిన్న ఆనందాలు మాత్రం స్పెషల్. ఆ రోజులు గుర్తున్నాయా? కామెంట్‌లో చెప్పండి.

తుక్కుగూడలో నర్సు హత్య..! కఠిన శిక్షకు SFI డిమాండ్
Local· 3d ago

తుక్కుగూడలో నర్సు హత్య..! కఠిన శిక్షకు SFI డిమాండ్

హైదరాబాద్‌లో 21 ఏళ్ల ఆదివాసీ యువతి, నర్సు దారుణ హత్యకు గురయ్యారు.<br>ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ డివిజన్‌లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వడ్ల, శ్రీకాంత్ మాట్లాడుతూ కేసును వేగంగా, పారదర్శకంగా దర్యాప్తు చేసి, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. Prime కేర్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు.

మేరా యువభారత్ వాలంటీర్ గా గజ్జల దేవేందర్
Local· 3d ago

మేరా యువభారత్ వాలంటీర్ గా గజ్జల దేవేందర్

దుగ్గొండి - నల్లబెల్లి మండలాల మై భారత్ వాలంటీర్ గా దుగ్గొండి మండలానికి చెందిన గజ్జల దేవేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియామక పత్రాన్ని జిల్లా యూత్ ఆఫీసర్ సంజీవ్ అందజేశారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో సాగస్వామ్యులను చేసేందుకు ఆయన యూత్ వాలంటీర్ గా సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అరుదైన అవకాశాన్ని సమర్థవంతంగా నిర్వహించి యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి కృషిచేస్తానన్నారు.

మహబూబాబాద్‌లో ట్రాఫిక్‌పై ఆంక్షలు! నోటీసులు జారీ
Local· 3d ago

మహబూబాబాద్‌లో ట్రాఫిక్‌పై ఆంక్షలు! నోటీసులు జారీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి, రావు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. బ్యాంకులు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ స్థలాలు ఉన్నా, వాటిని వినియోగించకుండా రోడ్లపై వాహనాలు నిలిపేవారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. "పార్కింగ్ స్థలాల్లో షాపులు ఏర్పాటు చేసి కిరాయికి ఇస్తే ఊరుకునేది లేదు" అని హెచ్చరించారు.<br>కస్టమర్లు తమ వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని, రోడ్లపై వాహనాలు పెట్టొద్దని చెప్పారు.

TGEJAC పిలుపు మేరకు MRO కార్యాలయం ముందు నిరసన
Local· 3d ago

TGEJAC పిలుపు మేరకు MRO కార్యాలయం ముందు నిరసన

పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా CPS రద్దు చేసి OPS అమలు చేయాలని రాష్ట్ర TEJAC పిలుపుమేరకు నెక్కొండ తాసిల్దార్ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి TJAC నాయకులు DTF రాష్ట్ర కమిటీ సభ్యులు జాన్ నాయక్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు అయినా రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయపరంగా , రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 2వ పిఆర్సిని జాప్యం లేకుండా ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 6 డి ఏ లను వెంటనే ఇప్పించాలని, 10,000 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు.

నందిపేట్‌లో రేషన్ బియ్యం సీజ్..! అక్రమ రవాణాపై ఉక్కుపాదం
Local· 3d ago

నందిపేట్‌లో రేషన్ బియ్యం సీజ్..! అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌ మండలం రైతుఫామ్‌ శివారులో పోలీసులు, సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు భారీ రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఎస్సై కె. వినయ్‌కు సమాచారం అందడంతో వాహనాల తనిఖీలు చేపట్టగా, AP25X9971 నంబర్‌ గల మహీంద్రా బొలేరోలో 48 సంచుల్లో 22.60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తించారు. దీని విలువ సుమారు రూ.1,12,548. రేషన్ బియ్యాన్ని వాహనాల్లో తోలుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీని వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియలేదు. ఇది పేదల పొట్ట మీద కొద్దిమంది పందికొక్కుల చేసే దాడి.

నిమ్స్‌లో MRP ముసుగులో దోపిడీ! రోగులకు టార్చర్
Local· 3d ago

నిమ్స్‌లో MRP ముసుగులో దోపిడీ! రోగులకు టార్చర్

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలోని బాలాజీ మెడికల్ షాప్ అక్రమాలకు పాల్పడుతోందని పేషంట్లు వాపోతున్నారు. అనారోగ్యంతో అల్లాడుతున్న రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని, MRP పేరుతో పూర్తి ధర వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. అత్యవసర మందులు, సర్జికల్ ఐటమ్స్, విటమిన్ ట్యాబ్లెట్లపై తీవ్రస్థాయిలో దోపిడీ సాగుతోంది. ఎక్కడా డిస్కౌంట్ లేదు, రూపాయి కూడా తగ్గించడం లేదు! ఈ షాపు గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తక్షణం డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేయాలని పేషంట్ల డిమాండ్.

సిద్దాపూర్ డంపు యార్డ్ పై ఎస్టీ కమిషన్ నోటీసులు..!
Local· 3d ago

సిద్దాపూర్ డంపు యార్డ్ పై ఎస్టీ కమిషన్ నోటీసులు..!

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ఎకో టౌన్ పేరిట డంపు యార్డు ఏర్పాటు వివాదాస్పదమైంది. ప్రభుత్వం 80 ఎకరాల్లో డంపు యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో సిద్దాపూర్, పరిసర గ్రామస్తులు గత కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ డంపు యార్డ్ వల్ల పరిసర తాండాలకు నష్టం జరుగుతుందని గిరిజన నేత రాంబల్, నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ జిల్లా కలెక్టర్‌కు, కాలుష్య నివారణ మండలికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం డంపు యార్డును తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అసైన్డ్ భూమిలో రోడ్డు.. చర్యలకు డిమాండ్!
Local· 3d ago

అసైన్డ్ భూమిలో రోడ్డు.. చర్యలకు డిమాండ్!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పీర్ల తాండలో అసైన్డ్ భూమిలో అక్రమ రోడ్డు నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 120/50/4/Aలో అధికార అనుమతులు లేకుండా సుమారు 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారని BSP నారాయణఖేడ్ ఇంచార్జి అనుముల, తుకారాం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పట్టాదారు ఆక్షేపణ లేదన్నా, నిబంధనలకు విరుద్ధంగా పనులు సాగడం ఆందోళనకరమన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తుకారాం డిమాండ్ చేశారు.

బుధవారం పలు ఆర్టీసీ సర్వీసులు రద్దు
Local· 3d ago

బుధవారం పలు ఆర్టీసీ సర్వీసులు రద్దు

బుధవారం అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలో జరగబోయే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఆర్టిసి బస్సులు కేటాయించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం డిపో పరిధిలోని 25 సాధారణ బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప , తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణికులు, ముందస్తుగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాటు చేసుకుని, ఆర్టీసీకి సహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు.

అమరావతిపై డ్రోన్ కన్ను..!
Local· 3d ago

అమరావతిపై డ్రోన్ కన్ను..!

గుంటూరు జిల్లా అమరావతిలో పోలీసులు డ్రోన్ టెక్నాలజీతో నిఘా పెంచారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో తాడేపల్లి, తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, వెలగపూడి, సీతానగరం, కృష్ణానది కరకట్ట ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. ప్రత్యేకంగా పేకాట, కోళ్ల పందేలు, గంజాయి, బహిరంగ మద్యం సేవనంపై దృష్టి పెట్టారు. రాత్రి వేళల్లో నైట్ విజన్ డ్రోన్లతో అనుమానాస్పద కదలికలను గుర్తిస్తున్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు నిఘా విస్తరించనున్నారు. అయితే ఇలాంటి నిఘాను ప్రజాందోళనల మీద ప్రయోగించకూడదని ప్రజలు కోరుతున్నారు.

చెల్పూర్‌లో కంప్యూటర్ ల్యాబ్.! విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యం
Local· 3d ago

చెల్పూర్‌లో కంప్యూటర్ ల్యాబ్.! విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యం

కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త. మంగళవారం ఆ పాఠశాలలో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్‌ను MEO శ్రీనివాస్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక విద్య అందించేందుకు ఇదొక మంచి అడుగు. అనంతరం ఆయన తరగతి గదులు పరిశీలించి, విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు. వారి చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానాన్ని పరీక్షించి, ఉపాధ్యాయులతో చర్చించారు.<br>ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ, "ప్రాథమిక నైపుణ్యాలను చిన్నతనం నుంచే పెంపొందించాలి" అని సూచించారు.

ముద్ర యోజన పేరుతో.. 6 లక్షల మోసం!
Local· 3d ago

ముద్ర యోజన పేరుతో.. 6 లక్షల మోసం!

హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఓ షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. వడ్డేపల్లి, జనార్ధన్ కు 'ప్రధానమంత్రి ముద్ర యోజన' పేరుతో ఫోన్ చేసి, లోన్ ఇప్పిస్తామని నమ్మించారు.<br>లోన్ ప్రాసెస్ కోసం డబ్బు కావాలంటూ దశలవారీగా 6 లక్షల రూపాయలు మాయం చేశారు. ఈ మోసం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఎస్సై రాజు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.<br>ఇది ఎంత పెద్ద మోసమో ఊహించడం కష్టమే! మీకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా? Xలో @CyberCrimeCell కి ట్యాగ్ చేసి అప్రమత్తం చేయండి.