Latest

అంత్యోదయ రేషన్‌కు కత్తెర..? దక్షిణాది రాష్ట్రాల ఆందోళన!
కేంద్రం అంత్యోదయ అన్న యోజన (AAY)లో రేషన్ పంపిణీ విధానం మార్చాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం కుటుంబానికి 35 కేజీలు ఇస్తుండగా, ఇకపై వ్యక్తికి 7 కేజీలు (గరిష్ఠంగా 35 కేజీలు) ఇవ్వాలనేది ప్లాన్. దీంతో చిన్న కుటుంబాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సగటున 15.89 కేజీలు, తెలంగాణకు 15.61 కేజీలు, తమిళనాడుకు 13.56 కేజీలు, కేరళకు 11.69 కేజీలు తగ్గే అవకాశం ఉంది. బిహార్‌కు మాత్రం నష్టం ఉండదు. దీంతో దక్షిణ రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఫిఫా రేస్ నుంచి అర్జెంటీనాని బ్యాన్ చేయాలని డిమాండ్ !
2026 ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టుకు, ముఖ్యంగా కెప్టెన్ లియోనెల్ మెస్సీకి అనుకూలంగా రిఫరీలు పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభమైంది. argentinaout.com అనే వెబ్‌సైట్‌లో ఇప్పటికే కోటి మందికి పైగా సంతకాలు చేసి, అర్జెంటీనాను టోర్నీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈజిప్ట్‌తో జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో వివాదాస్పద ‘VAR’ నిర్ణయాల వల్ల ఈ వివాదం మరింత పెద్దదైంది. అయితే, నేటి సాంకేతికత యుగంలో రిఫరీ పక్షపాతం చూపడం అస్సలు సాధ్యం కాదని అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని ఈ ఆరోపణలను ఖండించారు.

కూదన్ కుళ్లం అణు రియాక్టర్ నుంచి కీలకఫైళ్లు మాయం !
తమిళనాడులో ఉన్న దేశంలోని బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టర్ సర్వర్ల నుండి సుమారు 19,000 పైగా సున్నితమైన ఫైళ్లు, ఇంజనీరింగ్ బ్లూప్రింట్లు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయి. అయితే, ప్రధాన రియాక్టర్ వ్యవస్థలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, కేవలం నిర్మాణంలో ఉన్న యూనిట్లకు సంబంధించిన కొన్ని పత్రాలు మాత్రమే లీక్ అయ్యాయని అణు నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. కానీ ఈ ఇష్యూ అణు నిపుణుల వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రమాదం ఏదీ లేదని అధికారులు చెబుతున్నా న్యూక్లియర్ పవర్ శాఖ వర్గాల్లో ఈ వార్త సెన్సేషనల్ గా మారింది.

మీ పర్సనల్ డేటాపై కన్నేసిన AI కంపెనీలు!
ఇకపై AI టూల్స్ గూగుల్, మెటా వంటి టెక్ జెయింట్స్ మీ సెర్చ్ హిస్టరీ మాత్రమే కాదు.. మీ చాట్స్, ఫొటోస్, వాయిస్ రికార్డింగ్స్‌ను కూడా ట్రాక్ చేయనున్నాయి. తమ AI మోడల్స్ ట్రైనింగ్ కోసం ఈ డేటాను వాడుకోనున్నట్లు ప్రకటించాయి. గూగుల్ జూలై 2026 నుండి కొత్త సెర్చ్ హిస్టరీ సెట్టింగ్స్ తెచ్చింది. ఒకవేళ మీ డేటా AI ట్రైనింగ్‌కు వెళ్లకూడదనుకుంటే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'Opt-out' (ఆఫ్) చేసుకోవచ్చు. అయితే మెటా, చాట్‌జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ప్రైవసీ కంట్రోల్స్ వేర్వేరుగా ఉన్నాయి. యూజర్స్ అలర్ట్‌గా ఉండాలని ఎక్స్పర్ట్ చెప్తున్నారు.

అంతర్థానమవుతున్న ఆడబిడ్డలు!
తెలంగాణలో ఆడపిల్లల జననాల రేటు (Birth Ratio) ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 2024 రిపోర్ట్ ప్రకారం.. ఇక్కడ ప్రతి 1,000 మంది అబ్బాయిలకు కేవలం 910 మంది అమ్మాయిలే పుడుతున్నారు. ఇది నేషనల్ యావరేజ్ (933) కంటే చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ ఉన్నా.. దేశంలో అత్యల్ప బర్త్ రేషియో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. కాగా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేషియో 929గా రికార్డ్ అయింది.

20కే బట్టతల.. పెళ్లి కష్టమేనా?
ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకు 20–25 ఏళ్లకే జుట్టు బాగా ఊడిపోతోంది. దాంతో చిన్న వయసులోనే బట్టతల కనిపిస్తోంది. ఇది లుక్‌కే కాదు... పెళ్లి సంబంధాల మీద కూడా ప్రభావం చూపుతోందని అంటున్నారు. జుట్టు తగ్గిందని కొందరిని తిరస్కరిస్తుండటంతో, చాలామంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, హెయిర్ ప్యాచ్‌ల వైపు వెళ్తున్నారు. కానీ నిపుణులు మాత్రం... జుట్టు విషయం దాచిపెట్టకుండా ముందే చెప్పడం మంచిదని, అదే నమ్మకమైన బంధానికి బాట వేస్తుందని సజెస్ట్ చేస్తున్నారు.

హీరోయిన్ సమంత సీమంతం సెలబ్రేషన్స్!
హీరోయిన్ సమంత త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఆమె ఇంట్లో 'సీమంతం' వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో సాంప్రదాయబద్ధంగా ఈ ఫంక్షన్‌ను సెలబ్రేట్ చేశారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత కొత్త జర్నీ స్టార్ట్ అవుతుండడంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్తున్నారు.

CM రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ లేఖ!
చిల్డ్రన్ సేఫ్టీ, జస్టిస్ కోసం AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, తెలంగాణ CM రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాశారు. తెలంగాణలో POCSO యాక్ట్‌ను మరింత స్ట్రాంగ్‌గా అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా పోక్సో కేసుల ఇన్వెస్టిగేషన్‌ను 60 నుండి 90 రోజుల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు 24 గంటల్లో మెడికల్ టెస్ట్‌లు చేయాలని, నిందితుల బెయిల్‌ను గట్టిగా వ్యతిరేకించాలని సూచించారు. ప్రతి జిల్లాలో 'Special Monitoring Cell' ఏర్పాటు చేసి, నిర్లక్ష్యం వహించే అధికారులపై యాక్షన్ తీసుకోవాలని ఈ లెటర్ లో రేవంత్‌ను పవన్ కల్యాణ్ కోరారు.

స్టూడెంట్స్ బీ అలర్ట్!
తెలంగాణలోని విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టేందుకు DGP C.V. ఆనంద్ 'ఈగల్' అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. క్యాంపస్‌లలో 'Zero Tolerance' పాలసీని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి కాలేజ్, స్కూల్‌లో 'Anti-Drugs and Safety Committees' తో పాటు ఒక 'Safety Coordinator'ని తప్పనిసరిగా నియమించాలి. రూల్స్ బ్రేక్ చేసే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం 'SOPs' రిలీజ్ చేయనున్నారు. స్టూడెంట్స్ కోసం సైకాలజిస్ట్‌లు, కౌన్సెలర్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇరాన్‌కు ట్రంప్ బిగ్ షాక్!
అమెరికా-ఇరాన్ మధ్య వార్ ముదురుతోంది. శాంతి చర్చలకి ఇరాన్ సహకరించకపోతే, వచ్చే వారం నుండి మిలిటరీ అటాక్స్ మరింత తీవ్రం చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ స్టేట్‌మెంట్ వచ్చిన కొద్దిసేపటికే, US సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై డ్రోన్లతో మరో విడత దాడులు స్టార్ట్ చేసింది. సాధారణంగా రాత్రిపూట దాడులు చేసే అమెరికా, ఈసారి పగటిపూటే ఇరాన్ రక్షణ, క్షిపణి స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడటం గమనార్హం. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే తమ టార్గెట్ అని అమెరికా ప్రకటించింది.

జంతర్ మంతర్ చేరిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్!
UP నగీనా MP, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రోటెస్ట్‌లో జాయిన్ అయ్యారు. 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్‌కు, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేస్తున్న నిరసనకు ఆయన తన పూర్తి సపోర్ట్ ప్రకటించారు. నిరసనకారులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ స్వయంగా వచ్చి సంఘీభావం తెలపడంతో ఈ ప్రోటెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
అధికారులపై చీపుర్లతో దాడి చేసిన రైతులు!
కర్ణాటకలోని బీదడి గ్రామంలో టౌన్‌షిప్ కట్టేందుకు 508 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, ల్యాండ్ సర్వే కోసం వచ్చిన ప్రభుత్వ అధికారులపై స్థానిక రైతులు, ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. కోపంతో అధికారులను చీపుర్లతో కొట్టి, అక్కడి నుంచి పరుగెత్తించారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బస్సులో కండక్టర్ బ్యాగ్ మిస్
బెంగళూరు నగరంలోని ఓ ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ బ్యాగ్ మిస్సయ్యింది. టికెట్ బ్యాగ్ దొరకకపోతే సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని కండక్టర్ ఆందోళనకు గురయ్యారు. బస్సును మధ్యలోనే నిలిపేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ప్రయాణికుల బ్యాగులు వెతకగా టికెట్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్ తీసుకున్నట్లు చూశామని ప్రయాణికులు చెప్పారు. ఆ టైంలో ఆమె వీడియోను కూడా రికార్డు చేశారు.

తిరుపతిలో ₹85 లక్షల స్కామ్!
తిరుపతిలో శ్రీవారి దర్శనం, రూమ్స్, సేవా టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడిన TTD మాజీ ఉద్యోగి అరుణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు భక్తుల నుంచి ఇతడు ₹3.20 లక్షలు వసూలు చేశాడు. నిందితుడి బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయగా.. ఏకంగా ₹85 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2023లో ఇలాంటి ఫ్రాడ్స్ చేయడంతో TTD ఇతడిని జాబ్ లోంచి తీసేసింది. అరుణ్‌కుమార్ నుంచి ₹99 వేల క్యాష్, మొబైల్, 3 బ్యాంక్ పాస్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ లాంఛనాలు వద్దన్న ముద్రగడ ఫ్యామిలీ!
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రొటోకాల్‌ను రిజెక్ట్ చేశారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని అఫిషియల్స్‌కు స్పష్టం చేశారు. సాధారణ పద్ధతిలోనే సొంత గ్రామం అయిన కిర్లంపూడిలో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. ముద్రగడ చనిపోవడంతో ఆయన ఫాలోవర్స్, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తెలంగాణ ఓటర్లకు అలర్ట్: SIR గడువును పొడిగింపు!
తెలంగాణ ఓటర్లకు అలర్ట్! రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పొడిగించింది. రీసెంట్ షెడ్యూల్ ప్రకారం, ఈ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగిస్తూ ECI అఫీషియల్ డెసిషన్ తీసుకుంది. బీఎల్ఓ (BLO)ల డోర్-టు-డోర్ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత పక్కాగా పూర్తి చేసేందుకు, ప్రజల్లో అవేర్‌నెస్ పెంచేందుకు ఈ ఎక్స్ట్రా టైమ్ ఇచ్చారు. అర్హులైన సిటిజన్స్ ఈ డెడ్‌లైన్ లోపు తమ ఓటర్ కార్డు వివరాలను చెక్ చేసుకుని, అప్‌డేట్ చేసుకోవచ్చు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు: పాడె మోసిన YS జగన్!
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఆయన సొంతూరు కిర్లంపూడిలో జరిగాయి. YCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి ఈ అంతిమయాత్రకు హాజరై, ముద్రగడ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణతో కలిసి జగన్ ముద్రగడ పాడె మోశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో హైదరాబాద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ముద్రగడ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలు ముగిసే వరకు జగన్ అక్కడే ఉన్నారు.

'జై భారత్' రమణమూర్తి పై దాడికి నిరసనగా భారీ సభ
TG: హిందూ ధర్మాన్ని జై భారత్ మూమెంట్ ద్వారా ప్రచారం చేస్తున్న ‘విజయవిహారం’ రమణమూర్తి మీద ఒక ఛానెల్లో జరిగిన దాడిపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయ్. హిందుత్వవాదుల దాడుల్నిని ఖండిస్తూ గురువారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాలోచన సభ నిర్వహిస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (KVPS), తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(TPSK) సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు.

కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే నిందితుడికి బెయిల్
TG: కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే రంగారెడ్డి జిల్లా షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్‌కి బెయిల్ వచ్చిందని BRS పార్టీ జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ భిక్షపతి గౌడ్ షాబాద్ పోక్సో నిందితుడు రాజ్‌కుమార్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నాడన్నారు. కాంగ్రెస్ నాయకులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇచ్చి మహిళలను రక్షించాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

చెత్తకుప్పలో బతుకమ్మ చీరలు
TG: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం మున్సిపల్ అధికారులకు సరఫరా చేసింది. అయితే, ఆ చీరలు పంపిణీ చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ స్టోర్‌రూమ్ పక్కన చెత్తకుప్పలో పడేయడం తీవ్ర కలకలం రేపింది. సుమారు 30వేలకుపైగా చీరలు అక్కడ ఉన్నట్లు సమాచారం. మహిళల కోసం లక్షల ప్రజాధనంతో కొనుగోలు చేసిన చీరలు మహిళలకు ఇవ్వకుండా చెత్తకుప్పలో పడేయడం పట్ల మున్సిపల్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దినకర్మ సామాగ్రి తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం
TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులోని కంకర క్రషర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురు దినేష్(26), జుంజురు రమేష్(24) దినకర్మ సామాగ్రి తీసుకుని బైక్‌పై వెళ్తున్నారు. గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో దినేష్ స్పాట్‌లోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందినట్లు SI శివకుమార్ తెలిపారు.