Latest

విద్యార్థి డైరీలో మత ప్రార్థనలు
TG· 16 Jul 2026

విద్యార్థి డైరీలో మత ప్రార్థనలు

TG: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పరిధిలో ఉన్న సక్సెస్ స్కూల్ 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి కల్మా చదువుకుని రావాలని ఓ టీచర్ హోమ్ వర్క్ ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా మరికొన్ని మత ప్రార్థనలను కూడా నేర్చుకుని రావాలని విద్యార్థి డైరీలో రాసి పంపించింది. అయితే ఆ డైరీ చూసిన విద్యార్థి పేరెంట్స్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్న వయసులోనే విద్యార్థులపై మతపరమైన అంశాలను రుద్దే ప్రయత్నం చేయడం సరికాదని, అసలు హిందూ బాలుడికి కల్మా చదవాలని ఎలా నేర్పిస్తారని ఫైరయ్యారు. కల్మా హోమ్‌వర్క్ చేయాలని ఒత్తిడి చేసిన టీచర్‌ను వెంటనే తొలగించాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.

యువకుడు దారుణ హత్య
Crime· 16 Jul 2026

యువకుడు దారుణ హత్య

AP: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేట గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రాకేష్(28) తన అమ్మమ్మ అంత్యక్రియలకు మూలపేటకు వచ్చాడు. ఓ దుకాణం వద్ద రాకేష్ చెల్లితో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. తన చెల్లిపై ఎందుకు కామెంట్ చేశారని రాకేష్ నిలదీయడంతో ఘర్షణ జరిగింది. అమ్మమ్మ ఖననం కోసం స్మశాన వాటికకు వెళ్లిన రాకేష్‌పై వంశీ అనే యువకుడు, మరో నలుగురు చాకులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు.

మాజీ మంత్రిపై కేసు నమోదు
AP· 16 Jul 2026

మాజీ మంత్రిపై కేసు నమోదు

AP: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నిన్న ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే క్రమంలో అంబటి రాంబాబు, YCP నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. తమ విధులకు ఆటకం కలిగించారని, తమను నెట్టివేశారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో FIR నమోదైంది.

డ్రగ్స్ కేసులో MLC కొడుకు అరెస్ట్
TG· 16 Jul 2026

డ్రగ్స్ కేసులో MLC కొడుకు అరెస్ట్

TG: MLC, BRS పార్టీ నేత కుమారుడు భరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో నిన్న రాత్రి డ్రగ్స్ తీసుకుంటుండగా భరత్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తాండూరు మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి ఏకంగా డ్రగ్స్ పార్టీ నిర్వహించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు ఎంపీ, టీడీపీ నేత సహా పలువురు ప్రముఖులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. తాజా ఘటనతో మరోసారి డ్రగ్స్ కేసు చర్చనీయాంశమైంది.

BCల జోలికొస్తే తరిమికొడతాం
Politics· 16 Jul 2026

BCల జోలికొస్తే తరిమికొడతాం

TG: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైరయ్యారు. హైదరాబాద్‌లోని LBనగర్ చింతలకుంటలో ఆమె నివాసానికి వెళ్లి ఈశ్వరమ్మకు సంఘీభావం తెలిపారు. అగ్రకుల అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈశ్వరమ్మ ఒంటరిది కాదని, ఆమె వెంట BC, SC, ST, మైనార్టీలు అంతా ఉన్నారన్నారు. BC బిడ్డల జోలికొస్తే తరిమికొడతామని హెచ్చరించారు.

పోక్సో కేసులో కోర్ట్ సంచలన తీర్పు
TG· 16 Jul 2026

పోక్సో కేసులో కోర్ట్ సంచలన తీర్పు

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి PS పరిధిలో బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురికి జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జీవితఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితులు రాజేశ్‌(22), సాయికుమార్‌ (21), అనిల్‌ (19), శివ (19), వెంకటేశ్‌(22)లపై 2020 అక్టోబర్‌లో మెట్‌పల్లి PSలో పోక్సో కేసు నమోదు అయింది. కేసులో ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ఐదుగురు నిందితులకు జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా, బాధిత బాలికకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

అమెరికాలో AP యువతి మృతి
AP· 16 Jul 2026

అమెరికాలో AP యువతి మృతి

AP: పల్నాడు జిల్లాకు చెందిన మక్కెన ప్రసన్న (27) అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మల పెద్ద కుమార్తె ప్రసన్న 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. ఆమె ఇటీవలే MS పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. న్యూజెర్సీలో తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రసన్న స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, ఆమె స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి.

యువ సంగ్రామ సభను సక్సెస్ చేయాలి
Jobs· 16 Jul 2026

యువ సంగ్రామ సభను సక్సెస్ చేయాలి

TG: నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జూలై 18వ తేదీన BRS పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగ సమస్యలను విస్మరించిందన్నారు. నిరుద్యోగ యువత గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించేలా యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అమెరికాలో తెలుగు యువకుడు మృతి
AP· 16 Jul 2026

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

AP: విజయవాడకు చెందిన గడ్డం మణిచంద్ర తేజ (28) అమెరికాలో మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన చంద్రతేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో కోర్సు పూర్తయిన అనంతరం బోస్టన్‌లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఆరెంజ్ నగరంలో స్కైడైవింగ్ కోసం వెళ్లారు. గాల్లో ఎగిరిన తర్వాత పారాచూట్ కిందకు దిగే సమయంలో గాలి తీవ్రంగా వీయడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించేలోగా చనిపోయాడు.

429 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం
TG· 16 Jul 2026

429 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం

TG: ధరణి పోర్టల్‌లో సాఫ్ట్‌వేర్ లొసుగులను ఆసరాగా చేసుకుని యాజమాన్య హక్కులు మార్చినట్లు ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో 429ఎకరాల ఇనాం భూములను మాయం చేశారు. ఈ భూములపై పలువురు తమకు హక్కులు ఉన్నాయని రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకోవడం, కోర్టులో కేసులు వేశారు. అదే అదనుగా కొందరు మెదక్ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, RDOలు, తహీసీల్దార్‌లతో కుమ్మక్కై ఈ భూములను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిట్ ఏర్పాటుచేయాలని ఆదేశించింది.

విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా
AP· 16 Jul 2026

విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా

AP: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తిరుపతిలోని APSPDCL కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు. రెగ్యులరైజేషన్, పాత పెన్షన్ విధానం అమలు, PRC ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి రూ.48 వేల వేతనాన్ని ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని కోరారు.

ముందుచూపు లేకపోతే నష్టమే
AP· 16 Jul 2026

ముందుచూపు లేకపోతే నష్టమే

AP: రాష్ట్రంలో వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోయాయని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని CM చంద్రబాబు అన్నారు. NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ఆయన జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయని ముందుచూపు లేకుండా పంటలు వేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. రైతులు ఈ ఏడాది ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.

తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానం
TG· 16 Jul 2026

తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానం

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట గ్రామ పరిధిలోని బేగరికంచలో నిర్మిస్తున్న అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ డేటా సెంటర్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపడమే ప్రధాన లక్ష్యంగా దేశ GDPలో రాష్ట్రం వాటాను 10 శాతానికి పెంచే దిశగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణ రైజింగ్‌ పాలసీని రూపొందించామన్నారు. పారదర్శక పాలన ఉండి మౌలికవసతులు కల్పిస్తే పారిశ్రామికంగా తెలంగాణ అన్‌స్టాపబుల్‌గా నిలుస్తుందన్నారు.

తండ్రి అంత్యక్రియలను టీవీలో చూస్తూ ముద్రగడ కుమార్తె కన్నీటి పర్యంతం !
AP· 15 Jul 2026

తండ్రి అంత్యక్రియలను టీవీలో చూస్తూ ముద్రగడ కుమార్తె కన్నీటి పర్యంతం !

దివంగత కాపు నేత ముద్రగడ పద్మనాభం కడసారి చూపుకు ఆయన కుమార్తె క్రాంతిని అనుమతించకపోవడంతో ఆమె ఇంట్లోనే టీవీ చూస్తూ ఎమోషనల్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కన్నతండ్రి చివరి చూపుకు అనుమతించక పోవడం దారుణమని కొందరు విమర్శిస్తుంటే ముద్రగడ చివరి కోరిక అదేనని తన కుమార్తెను అనుమతించవద్దని స్పష్టంగా చెప్పారని అందుకే రానివ్వలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. మరోవైపు క్రాంతి ఇంట్లోనే టీవీలో తండ్రి అంత్యక్రియలు చూస్తూ గుండెల విసేలా రోదించడం పలువురిని కదిలించింది.

బెంగాల్ లో గిగ్ వర్కర్ పైత్యానికి పోలీస్ రియాక్షన్
Crime· 15 Jul 2026

బెంగాల్ లో గిగ్ వర్కర్ పైత్యానికి పోలీస్ రియాక్షన్

తాను వేధిస్తున్నది సాక్షాత్తు ఒక కానిస్టేబుల్ ని అన్న సంగతి తెలీక బెంగాల్ లో ఓ గిగ్ వర్కర్ ఓ లేడీని ఏడ్పించి అడ్డంగా బుక్కైయ్యాడు.. ఖార్దా జిల్లాలో వీధిలో కనిపించిన ఓ లేడీని ఓ గిగ్ వర్కర్ అసభ్యకర సైగలతో వేధించాడు. ఆమె సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీస్ అని తెలిసే సరికి షాకయ్యాడు. కాలర్ పట్టుకుని ఆ లేడీ కానిస్టేబుల్ ఆ వర్కర్ ను ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. లేడి కానిస్టేబుల్ టైమ్ లీ యాక్షన్ పై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వీడియో వైరల్ గా మారింది.

సోనం వాంగ్ చుక్ ను కాపాడండి - ఢిల్లీ హై కోర్టులో పిటిషన్
News· 15 Jul 2026

సోనం వాంగ్ చుక్ ను కాపాడండి - ఢిల్లీ హై కోర్టులో పిటిషన్

ఢిల్లీ హైకోర్టులో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు కాపాడాలని ఒక పిటిషన్ దాఖలైంది. నీట్ (NEET) పరీక్ష అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ ఆయన 18 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారని, మరో రెండు రోజుల్లో ఆయన ప్రాణాలకే ప్రమాదమని పిటిషనర్ పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి 'ఫోర్స్ ఫీడింగ్' (బలవంతంగా ద్రవాహారం ఇవ్వడం) చేయాలని కోరారు. దీనిపై రేపు విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి !
Crime· 15 Jul 2026

పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి !

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో పోలీసుల నిర్లక్ష్యానికి ఒక 22 ఏళ్ల కార్ మెకానిక్ బలైపోయాడు. ఆటో డ్రైవర్‌తో కేవలం 20 రూపాయల విషయంలో వచ్చిన గొడవ కారణంగా, బాధితుడు రాజ్‌కుమార్ అక్కడే ఉన్న పింక్ పోలీస్ బూత్ తలుపులు బాదాడు. ఆ సమయంలో అద్దాలు పగిలి అతని చేతికి తీవ్ర గాయమైంది. భయపడిన మహిళా పోలీసులు లోపలే తలుపులు వేసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో 40 నిమిషాల పాటు రోడ్డుపై సాయం కోసం అరిచినా ఎవరూ పట్టించుకోకపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

అమెరికా మాల్ లో ఇండియన్ పై కత్తితో దాడి !
World· 15 Jul 2026

అమెరికా మాల్ లో ఇండియన్ పై కత్తితో దాడి !

అమెరికాలోని ఉటా రాష్ట్రంలో వ్యాలీ ఫెయిర్ మాల్ లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మాల్ లో పనిచేస్తున్న సొహైల్ అనే వ్యక్తిని పీటర్ మైఖేల్ లార్సన్ అనే వ్యక్తి నువ్వు ముస్లింవా అని అడిగి మరీ 15 సార్లు కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి వెనుక విద్వేషపూరిత కోణం (హేట్ క్రైమ్) ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న ఇటువంటి దాడులు స్థానిక ప్రవాస సమాజంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

హసీనా  వస్తే ఉరిశిక్ష పై పునరాలోచిస్తాం-బంగ్లాదేశ్
World· 15 Jul 2026

హసీనా వస్తే ఉరిశిక్ష పై పునరాలోచిస్తాం-బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలను బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వాగతించింది. మానవతా వ్యతిరేక నేరాల కింద గత ఏడాది ఆమెకు అక్కడ మరణశిక్ష పడింది. ఆమె తిరిగి వస్తే చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్ తెలిపారు. అయితే, ఈ విచారణ అత్యంత పారదర్శకంగా సాగుతుందని, ఒకవేళ ఆమె నిర్దోషిగా తేలితే కోర్టు తన పాత తీర్పును సవరించడం లేదా కొట్టివేయడం కూడా సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు.

డిగ్రీలు కాదు.. స్కిల్ కావాలి అంటున్న ఫ్యాక్టరీలు!
Jobs· 15 Jul 2026

డిగ్రీలు కాదు.. స్కిల్ కావాలి అంటున్న ఫ్యాక్టరీలు!

భారత్‌లో ఫ్యాక్టరీలు వేగంగా పెరుగుతున్నా, స్కిల్డ్ యువత కొరత పెద్ద సవాల్‌గా మారింది. వచ్చే ఐదేళ్లలో 1–1.2 కోట్ల కొత్త కార్మికులు అవసరమని అంచనా. ప్రస్తుతం 1.85 కోట్ల మంది మాత్రమే పెద్ద ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. తక్కువ వేతనాలు, స్కిల్ గ్యాప్, మహిళల తక్కువ భాగస్వామ్యం, గ్రామీణ ఉపాధి మార్పులు తయారీ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. యువతకు స్కిల్ ట్రైనింగ్ పెరిగితేనే 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యాలు వేగం అందుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

₹80 వేల స్కాలర్‌షిప్‌కు బ్రేక్..? విద్యార్థుల్లో టెన్షన్!
News· 15 Jul 2026

₹80 వేల స్కాలర్‌షిప్‌కు బ్రేక్..? విద్యార్థుల్లో టెన్షన్!

కేంద్ర విజ్ఞాన & సాంకేతిక శాఖ (DST) ఇచ్చే ఏడాదికి ₹80 వేల INSPIRE-SHE స్కాలర్‌షిప్‌పై సందేహాలు రేగుతున్నాయి.. 2025 నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. RTIలకు కూడా స్పష్టమైన సమాధానం రాక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ప్రతి ఏడాది సుమారు 12 వేల మంది ఈ స్కాలర్‌షిప్ పొందుతారు. బడ్జెట్ కోతలు, పథకాల విలీనంతో ఆలస్యం జరిగిందనే చర్చ నడుస్తోంది. ల్యాప్‌టాప్‌లు, చదువు ఖర్చులు వాయిదా పడుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.