← Back to news

అంత్యోదయ రేషన్‌కు కత్తెర..? దక్షిణాది రాష్ట్రాల ఆందోళన!

By DS· 15 Jul 2026· Delhi
అంత్యోదయ రేషన్‌కు కత్తెర..? దక్షిణాది రాష్ట్రాల ఆందోళన!

కేంద్రం అంత్యోదయ అన్న యోజన (AAY)లో రేషన్ పంపిణీ విధానం మార్చాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం కుటుంబానికి 35 కేజీలు ఇస్తుండగా, ఇకపై వ్యక్తికి 7 కేజీలు (గరిష్ఠంగా 35 కేజీలు) ఇవ్వాలనేది ప్లాన్. దీంతో చిన్న కుటుంబాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సగటున 15.89 కేజీలు, తెలంగాణకు 15.61 కేజీలు, తమిళనాడుకు 13.56 కేజీలు, కేరళకు 11.69 కేజీలు తగ్గే అవకాశం ఉంది. బిహార్‌కు మాత్రం నష్టం ఉండదు. దీంతో దక్షిణ రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

More in India