Latest

అన్నామలై పార్టీతో పాటు మతం వదిలేశారా?
Politics· 13 Jul 2026

అన్నామలై పార్టీతో పాటు మతం వదిలేశారా?

BJP తమిళనాడు లీడర్ అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "నేను పక్కా హిందువునే, కానీ పబ్లిక్ సర్వీస్‌లోకి వచ్చినప్పుడు నా కులాన్ని, మతాన్ని ఇంట్లోనే వదిలేస్తా" అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. పాలిటిక్స్‌లో అందరినీ సమానంగా చూడటమే తన రూట్ అని, ప్రజలందరికీ ఒకేలా సర్వీస్ చేయడమే తన మెయిన్ గోల్ అని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఆయనపై మత రాజకీయాల విమర్శలు రాగా, ఈ తాజా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

గొడ్డలికి గురయ్యే చెట్లకు సెకండ్ లైఫ్..! 🌱
Technology· 13 Jul 2026

గొడ్డలికి గురయ్యే చెట్లకు సెకండ్ లైఫ్..! 🌱

రోడ్లు, నిర్మాణాల కోసం నరికి వేయాల్సిన భారీ చెట్లను బతికేలా మరోచోటికి తరలిస్తూ తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త ఉదయ్ కృష్ణ పెద్ది రెడ్డి ప్రత్యేక మిషన్ చేపట్టారు. వేర్లతో సహా చెట్లను జాగ్రత్తగా తీసి ట్రైలర్లలో తరలించి గార్డెన్లు, కాలనీలు, శ్మశానాల్లో మళ్లీ నాటుతున్నారు. ఇప్పటివరకు వేలాది చెట్లను కాపాడారు. ఒక్కో చెట్టును సురక్షితంగా మార్పిడి చేయడానికి సుమారు 21 రోజులు పడుతుందని ఆయన చెబుతున్నారు.

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై AAP MP సంజయ్ సింగ్ ఎమోషనల్ ట్వీట్!
Politics· 13 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై AAP MP సంజయ్ సింగ్ ఎమోషనల్ ట్వీట్!

సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. దేశ యువత భవిష్యత్తు కోసం 59 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్న ఈ పోరాటంతో ఆరోగ్యం క్షీణించి, ఇప్పటికే 9 కేజీల బరువు తగ్గారు. అయితే దీనిపై నేషనల్ మీడియా సైలెంట్‌గా ఉండటంపై AAP MP సంజయ్ సింగ్ మండిపడ్డారు. పాలకుల భజన చేసే 'గోదీ మీడియా' చచ్చిపోయిందని, యువత సమస్యలు వారికి పట్టడం లేదని కామెంట్స్ చేశారు. యువశక్తి ఇకనైనా మేల్కొని జంతర్ మంతర్ చేరాలని పిలుపునిచ్చారు.

AP లో లోకల్ ఎలక్షన్స్.. డేట్ ఫిక్స్!
Politics· 13 Jul 2026

AP లో లోకల్ ఎలక్షన్స్.. డేట్ ఫిక్స్!

CM చంద్రబాబు APలో స్థానిక ఎన్నికలపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లో లేదా అక్టోబర్‌లో ఈ ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు TDP నేతలతో జరిపిన జూమ్ మీటింగ్‌లో CM వెల్లడించారు. 'సర్' ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికలు ఉంటాయని, పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అటు మున్సిపల్ ఎన్నికలు కూడా అదే టైమ్‌లో జరిగే ఛాన్స్ ఉందని, CM దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి నారాయణ కన్ఫర్మ్ చేశారు. పొలిటికల్ పార్టీస్ అలర్ట్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది!

16వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!
Education· 13 Jul 2026

16వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!

ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. దీనిపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. ప్రభుత్వం దీన్ని 'ఈగో' సమస్యగా మార్చవద్దని, ఇక్కడ హ్యూమన్ లైవ్స్ ముఖ్యం అని ట్వీట్ చేశారు. తప్పును ఒప్పుకోవడం బలహీనత కాదు, అకౌంటబిలిటీకి నిదర్శనమని పేర్కొన్నారు. స్టూడెంట్స్ ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. మరోవైపు, రోజురోజుకూ క్షీణిస్తున్న వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్‌పై ఇప్పుడు అందరిలో తీవ్ర ఆందోళన మొదలైంది.

గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ డౌన్!
Politics· 13 Jul 2026

గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ డౌన్!

బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. సోమవారం ఉదయం బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,42,910 కాగా, 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,000గా ఉంది. మరోవైపు సిల్వర్ రేట్ కూడా కిలోకు రూ.100 తగ్గి, రూ.2,39,900కు చేరింది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. షాపింగ్‌కు వెళ్లే ముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్.

కల్తీ ఫుడ్‌పై సింగిల్ క్లిక్‌తో చెక్!
Health· 13 Jul 2026

కల్తీ ఫుడ్‌పై సింగిల్ క్లిక్‌తో చెక్!

హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ లేదా బ్యాడ్ ఫుడ్ ఉంటే ఇకపై ఈజీగా చెక్ పెట్టొచ్చు. దీనికోసం FSSAI 'ఫుడ్ సేఫ్టీ కనెక్ట్' యాప్‌ను తెచ్చింది. ఎక్కడైనా అపరిశుభ్రంగా కనిపిస్తే ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. రీసెంట్‌గా ఎక్స్‌పైరీ డేట్ ప్రొడక్ట్స్, కుళ్లిన గుడ్లు డెలివరీ చేస్తున్నారనే కంప్లైంట్స్‌తో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు ఇచ్చింది. కస్టమర్ల హెల్త్‌తో ఆటలాడితే లీగల్ యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. యాప్ ద్వారా పబ్లిక్ కూడా అలెర్ట్‌గా ఉండాలని కోరింది.

ఇరాన్పై విరుచుకుపడుతున్న అమెరికా!
World· 13 Jul 2026

ఇరాన్పై విరుచుకుపడుతున్న అమెరికా!

ఇరాన్‌పై అమెరికా దాడులను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. అర్ధరాత్రి నుంచి మిస్సైళ్లు, బాంబులతో గట్టిగా ఎటాక్ చేస్తోంది. బందర్ అబ్బాస్ పోర్ట్, ఖెర్మ్ ఐలాండ్, మర్కాజీ ఏరియాల్లో భారీగా బ్లాస్ట్‌లు జరిగాయి. హార్ముజ్ దగ్గరున్న ఒక టెలికాం టవర్‌ని కూడా అమెరికా పేల్చేసింది. ఇంకోవైపు, కువైట్‌లోని యూఎస్ రాకెట్ సిస్టమ్ మిస్సైల్ లాంచర్స్ స్టోరేజీపై తాము కూడా కౌంటర్ ఎటాక్ చేశామని ఇరాన్ అనౌన్స్ చేసింది. దీంతో అక్కడ సిట్యువేషన్ చాలా సీరియస్‌గా మారింది.

ACP భార్య ఆత్మహత్య!
Crime· 13 Jul 2026

ACP భార్య ఆత్మహత్య!

హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. చార్మినార్ డివిజన్ ACPగా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య హేమలత ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు. బృందావన కాలనీలోని తమ ఇంట్లో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మార్నింగ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా? ఈ తప్పులు చేయకండి!
Health· 13 Jul 2026

మార్నింగ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా? ఈ తప్పులు చేయకండి!

డయాబెటిస్ ఉన్నవాళ్లకి మార్నింగ్ లేవగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడాన్ని 'డాన్ ఫినామినన్' అంటారు. దీన్ని కంట్రోల్ చేయడానికి హెల్త్ ఎక్స్‌పర్ట్స్ కొన్ని క్రేజీ టిప్స్ చెబుతున్నారు. ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి షుగర్ కంట్రోల్ అవుతుంది. రోజూ 30 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయడం, నైట్ నిద్రకు 3 గంటల ముందే లైట్ డిన్నర్ ముగించడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. టీ, కాఫీలను లిమిట్‌గా తీసుకుంటూ, రోజుకు 7-8 గంటలు పక్కాగా నిద్రపోతే ఉదయం పూట షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు.

దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? అసలు రీజన్ ఇదే!
Health· 13 Jul 2026

దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? అసలు రీజన్ ఇదే!

ఒకే గదిలో అందరూ ఉన్నా దోమలు కొందరినే ఎక్కువగా కుడతాయా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. మన బాడీ నుండి రిలీజ్ అయ్యే కార్బన్ డయాక్సైడ్, చెమటలోని లాక్టిక్ యాసిడ్ వాసనల వల్లే దోమలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ వర్కౌట్స్ చేసేవాళ్లు, బాడీ హీట్ ఎక్కువగా ఉన్నవాళ్లు, ప్రెగ్నెంట్ ఉమెన్‌ను ఇవి ఈజీగా గుర్తుపడతాయి. అంతేకాదు, రీసెర్చ్ ప్రకారం 'A' గ్రూప్ కంటే 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లనే దోమలు ఎక్కువగా కుడతాయట. చర్మంపై ఉండే బ్యాక్టీరియా, జెనెటిక్స్ కూడా దీనికి మెయిన్ కారణాలు.

ఖమేనీ అంత్యక్రియలు: ఆ ‘మాస్క్ మ్యాన్’ మిస్టరీ వీడింది!
World· 13 Jul 2026

ఖమేనీ అంత్యక్రియలు: ఆ ‘మాస్క్ మ్యాన్’ మిస్టరీ వీడింది!

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో బ్లాక్ మాస్క్, క్యాప్ ధరించి మొదటి వరుసలో కూర్చున్న మిస్టరీ వ్యక్తి ఎవరనేది ఎట్టకేలకు తేలింది. ఆయన ఖమేనీ పెద్ద మనవడు మహ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మోజ్తబానే ఆ మాస్క్ మ్యాన్ అని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఫిబ్రవరి నాటి వైమానిక దాడుల్లో మహ్మద్ జవాద్ ముఖానికి తీవ్ర గాయాలు, కాలిన గాయాలు కావడంతోనే ఆయన ముఖం కనపడకుండా మాస్క్ ధరించినట్లు స్పష్టమైంది.

6 ఏళ్ల మనవరాలితో డ్రైవింగ్.. SIపై కేస్ ఫైల్!
Legal· 13 Jul 2026

6 ఏళ్ల మనవరాలితో డ్రైవింగ్.. SIపై కేస్ ఫైల్!

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో SIగా పనిచేస్తున్న పూజారి తిరుపతి.. గంధంగూడ రోడ్డుపై తన 6 ఏళ్ల మనవరాలికి కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ దొరికిపోయారు. గంధంగూడ రోడ్డుపై చిన్నపిల్లకి డ్రైవింగ్ నేర్పించడంతో లోకల్స్ కార్ ఆపి SIని నిలదీశారు. ఇది ఆటోమేటిక్ కార్ అని, కంట్రోల్ తన చేతుల్లోనే ఉందంటూ SI కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు SIపై కేస్ ఫైల్ చేశారు.

ఆమిర్ ఖాన్ మ్యారేజ్‌ 'లవ్ జిహాద్'! - మంత్రి సంచలనం
Politics· 13 Jul 2026

ఆమిర్ ఖాన్ మ్యారేజ్‌ 'లవ్ జిహాద్'! - మంత్రి సంచలనం

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆమిర్ ఖాన్‌ను 'లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం ఇలాంటి వాళ్ల సినిమాలను చూడాలా వద్దా అని ఆలోచించుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఇటీవల ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో నెగెటివ్, పాజిటివ్ కామెంట్స్‌తో పెద్ద డిబేట్ నడుస్తోంది.

ఓటర్ అలర్ట్: కొత్త ఓటు రిజిస్ట్రేషన్‌కు 'సర్‌' రూల్స్ చేంజ్!
Legal· 13 Jul 2026

ఓటర్ అలర్ట్: కొత్త ఓటు రిజిస్ట్రేషన్‌కు 'సర్‌' రూల్స్ చేంజ్!

కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకునేవారికి ఎన్నికల సంఘం (EC) కొత్త రూల్ పెట్టింది. ఇకపై ఆన్‌లైన్ ఫామ్-6 దరఖాస్తులో ఒక అదనపు డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. దీని ప్రకారం, గత ఓటర్ల సర్వే లో ఉన్న మీ లేదా మీ పేరెంట్స్ ఓటు వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్ ఫామ్‌లో 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకవేళ గత సర్వేలో ఎవరి పేర్లు లేకపోతే మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేక్ ఓట్లను తొలగించడానికే EC ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాసెస్ రన్ అవుతోంది.

ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి?
Health· 13 Jul 2026

ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి?

ఉదయం లేవగానే బెడ్ టీ లేదా కాఫీ తాగే అలవాటుందా? అయితే మార్చుకోండి. ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల బాడీకి ఇన్స్టంట్ ఎనర్జీ అందుతుంది. రాత్రంతా నీరు లేకపోవడం వల్ల వచ్చే డీహైడ్రేషన్ తగ్గి, మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, వెయిట్ లాస్‌కు హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివ్ అయి కాన్సంట్రేషన్ పెరుగుతుంది. స్కిన్ గ్లో పెరగడానికి, తలనొప్పి తగ్గడానికి ఇది బెస్ట్. ఉదయాన్నే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం హెల్త్ కు చాలా మంచిది.

పాలక్కాడ్ టు స్పేస్ :  ఒకే జిల్లా-ముగ్గురు ఆస్ట్రోనాట్లు
News· 13 Jul 2026

పాలక్కాడ్ టు స్పేస్ : ఒకే జిల్లా-ముగ్గురు ఆస్ట్రోనాట్లు

కేరళలోని పాలక్కాడ్ జిల్లా అంతర్జాతీయ స్సేస్ హిస్టరీలోనే ఒక అరుదైన మైలు రాయిని అందుకుంది. నాసా తరపున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లనున్న భారత సంతతి డాక్టర్ అనిల్ మీనన్, స్పేస్-ఎక్స్ ‘పోలారిస్ డాన్’ మిషన్ ద్వారా స్పేస్‌లోకి వెళ్లిన ఆయన భార్య అన్నా మీనన్, భారత ‘గగన్‌యాన్’ మిషన్‌కు ఎంపికైన ఎయిర్ కమోడోర్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్.ఈ ముగ్గురూ పాలక్కాడ్ తో రిలేట్ అయినవారే. అమెరికా, రష్యా కాకుండా ఇంత స్పేస్ టాలెంట్, ట్రాక్ రికార్డ్ కలిగిన ఈ ముగ్గురి గురించి కేరళ ఇప్పుడు గ్రేట్ గా ఫీలవుతోంది.

మార్నింగ్ లేవగానే ఇలా అస్సలు చేయొద్దు
Health· 13 Jul 2026

మార్నింగ్ లేవగానే ఇలా అస్సలు చేయొద్దు

ఉదయం ఎలా ప్రారంభమవుతుందో, రోజంతా మన శరీరం, మనసు కూడా అలాగే స్పందిస్తాయి. మనం చేసే చిన్న తప్పులు శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఉదయం లేవగానే ఏ పని ఎప్పుడు చేయాలో ముందే ప్లాన్ లేకపోతే చివరి నిమిషంలో హడావుడి మొదలవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. చాలామంది కళ్లు తెరవగానే ఫోన్ తీసుకుని సోషల్‌మీడియా, మెసేజ్‌లు, వార్తలు చూస్తుంటారు. రోజును ఇలా ప్రారంభించడం మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టిఫిన్ అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత బిజీగా ఉన్నా అల్పాహారం తీసుకోవాలి

మహిళ పట్ల డెలివరీ బోయ్ అసభ్య ప్రవర్తన !
Crime· 12 Jul 2026

మహిళ పట్ల డెలివరీ బోయ్ అసభ్య ప్రవర్తన !

బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ డెలివరీ బోయ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి బలవంతంగా ఓ యువతి ఫ్లాట్ లోకి చొరబడి అడ్డుకుంటున్నా యూరినల్స్ అర్జెంట్ అంటూ డైరక్ట్ గా తోసుకుని లోపలికి వెళ్లి బాత్ రూమ్ లో దూరాడు. ఆపై బయటకొచ్చి తన ప్రైవేట్ పార్ట్ ను ఆ యువతికి చూపిస్తూ అసభ్యంగా బిహేవ్ చేసాడు. హడలి పోయిన బాధితురాలు అంత షాక్ లోనూ ఆ ఘటనను వీడియో తీసింది. ఈ దారుణంపై కన్నీరు మున్నీరవుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. పోలీసులకు కంప్లైట్ చేస్తానని హెచ్చరించడంతో ఆ డెలివరీ బాయ్ అక్కడనుంచి జారుకున్నాడు. ఐటీ హబ్ బెంగళూరులో పట్టపగలు ఈ ఇన్సిడెంట్ మహిళలను భయపెడుతోంది.

నేపాల్ లో జెన్ జీ ఆగ్రహావేశాలు !
World· 12 Jul 2026

నేపాల్ లో జెన్ జీ ఆగ్రహావేశాలు !

నేపాల్‌లో యువత సపోర్ట్ తో అధికా రం లోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే 'జెన్-జీ' ఆగ్రహాన్ని ఫేస్ చేస్తోంది.అక్కడ జరుగుతున్న తీవ్ర నిరసనలు, ఆత్మహత్యా యత్నాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వ్యవస్థ మారుతుందని ఆశించిన యువతకు రోజులు గడుస్తున్నా నిరాశే ఎదురవడంతో, నిరుద్యోగం, అవినీతిపై వారు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. తాము నమ్మిన యువ నాయకులే తమను మోసం చేశారనే అసంతృప్తి వారిలో తీవ్రంగా ఉంది. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి.

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ!
Cinema· 12 Jul 2026

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ!

పాపులర్ డ్యాన్స్ డైరక్టర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూపుల మధ్య ఘర్షణ చివరకు కొట్టుకోడానికి దారి తీసింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు చివరకు ఫైటింగ్ కి దారి తీశాయి. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాల మీద రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవ రేగింది. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు వచ్చి ఇద్దరినీ విడ దీశారు.ఈ ఘర్షణతో ఒక్కసారిగా డ్యాన్సర్ల అసోసియేషన్ వాతావరణం వేడెక్కింది.!