ఓటర్ అలర్ట్: కొత్త ఓటు రిజిస్ట్రేషన్‌కు 'సర్' రూల్స్ చేంజ్!

కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకునేవారికి ఎన్నికల సంఘం (EC) కొత్త రూల్ పెట్టింది. ఇకపై ఆన్‌లైన్ ఫామ్-6 దరఖాస్తులో ఒక అదనపు డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. దీని ప్రకారం, గత ఓటర్ల సర్వే లో ఉన్న మీ లేదా మీ పేరెంట్స్ ఓటు వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్ ఫామ్‌లో 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకవేళ గత సర్వేలో ఎవరి పేర్లు లేకపోతే మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేక్ ఓట్లను తొలగించడానికే EC ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాసెస్ రన్ అవుతోంది.



