Latest

AP జెన్‌కోలో AEE ఉద్యోగాలు..
Education· 29 Jun 2026

AP జెన్‌కోలో AEE ఉద్యోగాలు..

గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్న Btech స్టూడెంట్స్‌కి AP జెన్‌కో (APGENCO) గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. జూన్ 30 నుంచి జులై 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయి. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.

అరకు సీట్లన్నీ జనసేనకేనా? నాగబాబు ఓపెన్ స్టేట్‌మెంట్!
AP· 29 Jun 2026

అరకు సీట్లన్నీ జనసేనకేనా? నాగబాబు ఓపెన్ స్టేట్‌మెంట్!

రాబోయే ఎలక్షన్స్ లో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ MLC నాగబాబు అనౌన్స్ చేశారు. కేవలం గిరిజన ప్రజల బాగు కోసమే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారని ఆయన క్లియర్ చేశారు. అరకు ఏరియా డెవలప్‌మెంట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్‌తో ఉన్నారని, రాబోయే రోజుల్లో అక్కడ జనసేన గెలవడం ఖాయమని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.

హత్యకు అరగంట ముందే ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!
Crime· 29 Jun 2026

హత్యకు అరగంట ముందే ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!

పుణె బిజినెస్‌మెన్ కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నవంబర్‌లో పెళ్లి ఇష్టం లేక సియా గోయల్, జూన్ 18న కేతన్‌ను కొండపై నుంచి తోసి చంపేసింది. హత్యకు అరగంట ముందు ఆమె తన ప్రియుడు చేతన్‌తో సీక్రెట్ కాల్ మాట్లాడినట్లు సీడీఆర్ (CDR) ద్వారా పోలీసులు కనుగొన్నారు. కేతన్ ఉన్న లొకేషన్‌ను ప్రియుడికి చెప్పడానికే ఈ కాల్ చేసింది. డిజిటల్ ఎవిడెన్స్ దాచడానికి వీరిద్దరూ 3 నెలల సోషల్ మీడియా చాట్స్ కూడా డిలీట్ చేశారు.

65 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష!
Legal· 29 Jun 2026

65 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష!

పుణెలో 3 ఏళ్ల చిన్నారిపై రేప్ అండ్ మర్డర్‌కి పాల్పడిన 65 ఏళ్ల భిమ్‌రావ్ కాంబ్లేకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఇన్సిడెంట్‌ను 'అత్యంత అరుదైన కేసు'గా జడ్జి పేర్కొన్నారు. మే 1న నిందితుడు బాలికను పశువుల షెడ్డులోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. గతంలోనూ ఇతనిపై పోక్సో (POCSO) కేసులు ఉన్నాయి. జూన్ 25న నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు, తాజాగా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది.

మూవింగ్ క్యాబ్‌లో బాంబ్ బ్లాస్ట్!▶
Crime· 29 Jun 2026

మూవింగ్ క్యాబ్‌లో బాంబ్ బ్లాస్ట్!

కర్ణాటకలోని తుమకూరు సమీపంలో NH-48పై ప్రయాణిస్తున్న క్యాబ్‌లో ఒక దారుణ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన మాజీ లవర్ ని కిడ్నాప్ చేసి, కారులోనే కత్తితో దాడి చేయడమే కాకుండా బాంబ్ పేల్చాడు. అయితే నిందితుడు బాంబ్ పేల్చే టైమ్‌లో అలర్ట్ అయిన క్యాబ్ డ్రైవర్, వెంటనే కారు ఆపి తీవ్రంగా గాయపడిన ఆ మహిళను బయటకు లాగాడు. వారు బయటకు వచ్చిన కొద్దిసేపటికే కారు భారీగా బ్లాస్ట్ అవ్వడంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల ప్రాణాలతో బయటపడిన మహిళను హాస్పిటల్‌కి తరలించారు. ప్రెజెంట్ ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.

పేదరికంతో 45 సార్లు ఎగ్స్ దానం చేసిన మహిళ!
News· 29 Jun 2026

పేదరికంతో 45 సార్లు ఎగ్స్ దానం చేసిన మహిళ!

మహారాష్ట్రలో పేద మహిళల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సాగుతున్న ఒక భారీ ఇల్లీగల్ అండాల సేకరణ మాఫియా గుట్టురట్టయింది. ఉల్హాస్‌నగర్‌కు చెందిన నీతా ప్రసాద్ (30) అనే మహిళ, కుటుంబ ఖర్చుల కోసం ఏజెంట్ల ట్రాప్‌లో పడి ఏకంగా 45 సార్లు ఎగ్స్ ని దానం చేసింది. నిజానికి చట్టం ప్రకారం ఒక మహిళ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఎగ్ దానం చేయాలి. కానీ ఏజెంట్లు నకిలీ ఆధార్ కార్డులతో ఫేక్ రికార్డులు సృష్టించి, ఆమె ప్రాణాలను రిస్క్‌లో పడేస్తూ హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి ఈ దందా చేస్తున్నారు. బాద్లాపూర్ పోలీసులు జరిపిన రైడ్స్‌లో డాక్టర్లు, ఏజెంట్లతో కలిపి 15 మందిపై కేసులు బుక్ చేశారు.

అభిమానికి సమంత రిప్లై!
Cinema· 29 Jun 2026

అభిమానికి సమంత రిప్లై!

3ఇయర్స్ గ్యాప్ తర్వాత సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.73 కోట్ల కలెక్షన్లు సాధించి, నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. తాజాగా ఓ ఫ్యాన్ ఇన్‌స్టాలో.. "ఇంట్లో ఆడపిల్లలు ఎప్పుడూ మహాలక్ష్మిలానే కాదు, ఒక్కోసారి కాళీమాతలా కూడా మారాలని నిరూపించావు" అంటూ పెట్టిన పోస్ట్‌ని సమంత షేర్ చేశారు. "తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనిచేయాలి.. మన పనే మన విజయాన్ని చూపిస్తుంది" అంటూ థాంక్స్ చెప్పారు.

హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకిన ఇంటర్ స్టూడెంట్!▶
News· 29 Jun 2026

హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకిన ఇంటర్ స్టూడెంట్!

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్ గుర్తి వద్ద అర్ధరాత్రి ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడి ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ పైనుంచి మహేశ్వరి అనే ఇంటర్ సెకండియర్ స్టూడెంట్ కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా ఫ్రాక్చర్ అవ్వడంతో, ఫస్ట్ తాండూరు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కి తరలించారు. ఆ తర్వాత బెటర్ ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. అసలు ఆ స్టూడెంట్ బిల్డింగ్ పైనుంచి ఎందుకు దూకింది అనే రీజన్ ఇంకా తెలియాల్సి ఉంది.

అయోధ్య వివాదంలో చర్చలను సమర్థించిన నద్వీ కన్నుమూత!
News· 29 Jun 2026

అయోధ్య వివాదంలో చర్చలను సమర్థించిన నద్వీ కన్నుమూత!

ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా సల్మాన్ నద్వీ(72) లఖ్‌నవూలో అనారోగ్యంతో కన్నుమూశారు. అయోధ్య వివాదాన్ని కోర్టుల ద్వారా కాకుండా హిందూ-ముస్లింల మధ్య చర్చలతో సాల్వ్ చేయాలని ఆయన గట్టిగా నిలబడ్డారు. 2018లో వివాదాస్పద స్థలంలో రామమందిరం కట్టి, మసీదును వేరే ప్లేస్‌లో నిర్మించవచ్చని ఆయన ఇచ్చిన ఓపెన్ ప్రపోజల్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఈ డెసిషన్‌తో విభేదించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) ఆయన్ని దూరం పెట్టడంతో, నద్వీ ఆ సంస్థ నుండి వైదొలిగారు. ఇస్లామిక్ న్యాయశాస్త్రం, మత సామరస్యంపై ఆయనకు మంచి పట్టుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!
News· 29 Jun 2026

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఒక టాటా టియాగో కారు రివర్స్ చేస్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ క్రాష్‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి సీరియస్ ఇంజూరీస్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. బాధితులంతా హర్యానాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఓవర్‌స్పీడ్, కేర్‌లెస్ డ్రైవింగే ఈ యాక్సిడెంట్‌కి కారణం. దీనికి సంబంధించిన CCTV విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత తగ్గిన బంగారం ధరలు!
General· 29 Jun 2026

మరింత తగ్గిన బంగారం ధరలు!

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్! మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,43,020 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100 గా ఉంది. అయితే, గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, మీరు షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి కరెంట్ లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెస్ట్.

బన్నీ, రష్మికా  కాంబినేషన్లో మరో పాన్ ఇండియన్ మూవీ !
Cinema· 29 Jun 2026

బన్నీ, రష్మికా కాంబినేషన్లో మరో పాన్ ఇండియన్ మూవీ !

పుష్ప హీరోయిన్ రష్మికా మందన్నా విలన్‌ అవతారం ఎత్తుతోంది. డైరక్టర్ అట్లీ కుమార్ తీయబోతున్న రాకా అనే మూవీలో రష్మికా యాక్ట్ చేస్తోంది. టెంపరరీగా AA22 అని పేరు పెట్టిన ఈ మూవీ పాన్ ఇండియా అప్ కమింగ్ యాక్షన్ మూవీ కాబోతోంది. రాకా లో రష్మికా అల్లూ అర్జున్ తో క లిసి నటిస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే హిట్ పెయిర్ టాక్ సొంతం చేసుకున్నారు. రష్మికా హీరోయిన్ రోల్స్ కి భిన్నంగా తొలిసారిగా విలన్ రోల్ పోషించడంతో ఫ్యాన్స్ లో ఆతృత పెరిగిపోతోంది.

పిల్లలు యాక్టివ్ గా, బలంగా ఎదగాలంటే !
Health· 29 Jun 2026

పిల్లలు యాక్టివ్ గా, బలంగా ఎదగాలంటే !

పిల్లలు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగడానికి కేవలం మంచి ఆహారం మాత్రమే సరిపోదని తాజా హెల్త్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. చిన్నతనం నుంచే వారిలో రోగనిరోధక శక్తి పెంచే పోషకాలు అందించడంతో పాటు, శారీరక శ్రమ (Physical activity) ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా స్క్రీన్ టైమ్‌ను తగ్గించి, అవుట్‌డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించడం వల్ల వారి ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి. దీంతో పాటు పిల్లలకు కనీసం 8-10 గంటల గాఢ నిద్ర, మానసిక ప్రశాంతత లభించినప్పుడే వారు యాక్టివ్‌గా, బలంగా ఎదుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.

మష్రూమ్స్ మ్యాజిక్ - డిప్రెషన్‌కు సరికొత్త చికిత్స!
News· 29 Jun 2026

మష్రూమ్స్ మ్యాజిక్ - డిప్రెషన్‌కు సరికొత్త చికిత్స!

మ్యాజిక్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు) మానసిక ఆరోగ్య చికిత్సలో అద్భుతంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడేవారికి ఈ పుట్టగొడుగులలోని ‘సిలోసిబిన్’ అనే రసాయనం ఒక వరంలా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై మెడికల్ ట్రయల్స్ సక్సెస్ కావడంతో.. వీటిని లీగలైజ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. కేవలం మూడ్ మార్చడమే కాకుండా, బ్రెయిన్ సెల్స్ రీ-కనెక్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుందని సైంటిస్టులు కనుగొన్నారు. సరైన మెడికల్ గైడెన్స్‌తో వాడితే.. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కు ఇది బెస్ట్ సొల్యూషన్ కానుంది.

టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించేది- మధుబాల
Cinema· 29 Jun 2026

టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించేది- మధుబాల

టాలీవుడ్ సీనియర్ నటి మధు బాల (రోజా ఫేమ్) తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్‌పై ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.. ప్రస్తుతం డిఫరెంట్ క్యారెక్టర్స్, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్‌లో వస్తున్న రోల్స్ తనకు ఎంతో తృప్తినిస్తు న్నాయని, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల నటీనటులకు అద్భుతమైన అవకాశాలు దొరుకుతున్నాయని చెప్పారు.అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం ఒక ఛాలెంజ్‌గా అనిపించిందని, కానీ ప్రేక్షకుల ప్రేమే తనను ముందుకు నడిపిస్తోందని మధు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో నెపోటిజం పై స్పందిస్తూ టాలెంట్ ఉంటేనే ఎవరైనా రాణిస్తారని అన్నారు.

గ్లోబల్ పవర్ ప్లే గా మారిన ఫిఫా  ఫీవర్
News· 28 Jun 2026

గ్లోబల్ పవర్ ప్లే గా మారిన ఫిఫా ఫీవర్

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇష్టపడే ఫుట్‌బాల్ గేమ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. దాని వెనుక భారీ బిజినెస్, గ్లోబల్ పాలిటిక్స్ ఉన్నాయని ‘ది షార్టెస్ట్ హిస్టరీ ఆఫ్ ఫుట్‌బాల్’ బుక్ విశ్లేషించింది. పూర్వకాలం నుండి నేటి మెస్సి జనరేషన్ వరకు ఈ ఆట ఎలా ఎదిగిందో ఇందులో వివరించారు. హిట్లర్, ముస్సోలిని కాలం నుండి మొన్నటి ఖతార్, రాబోయే సౌదీ వరల్డ్ కప్స్ వరకు.. లీడర్స్ తమ పొలిటికల్ మైలేజ్ కోసం, ఇమేజ్ బిల్డింగ్ కోసం ఫుట్‌బాల్‌ను ఎలా వాడుకుంటున్నారో ఈ బుక్ రివ్యూ కళ్ళకు కట్టింది. బుక్ లవర్స్, సాకర్ లవర్స్ కి బాగా నచ్చే బుక్ ఇది..

అమెరికా , ఇరాన్ మధ్య మళ్లీ డేంజరస్ వార్
News· 28 Jun 2026

అమెరికా , ఇరాన్ మధ్య మళ్లీ డేంజరస్ వార్

యుద్ధం ముగిసిందంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేసి 48 గంటలు గడవకుండానే మళ్లీ అమెరికా, ఇరాన్ భీకర దాడులు చేసుకుంటు న్నాయి. రెండు దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈసారి అమెరికా సైనిక స్థావరాలు ఇరాన్ టార్గెట్ చేసింది. అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రెయిన్ లను కూడా ఇరాన్ వదలడం లేదు. దీనికి కౌంటర్ గా అమెరికా ఇరాన్ మిసైల్స్ ని, డ్రోన్ స్టోరేజీ స్థావరాలను పేల్చేస్తోంది. అమెరికా ఎయిర్ అటాక్స్ కు మండిపడిన ఇరాన్ ఈ ప్రతిదాడి మొదలు పెట్టింది.

ఫ్రాన్స్‌లో ఎండదెబ్బకు 1,000 మంది మృతి
News· 28 Jun 2026

ఫ్రాన్స్‌లో ఎండదెబ్బకు 1,000 మంది మృతి

ఐరోపా ఖండాన్ని వణికిస్తున్న రికార్డు స్థాయి హీట్‌వేవ్ (ఎండతీవ్రత) కారణంగా ఫ్రాన్స్‌లో గత కొన్ని రోజులుగా ఏకంగా 1,000 మందికి పైగా అదనపు మరణాలు నమోదైనట్లు అక్కడి ప్రజారోగ్య సంస్థ నేడు (జూన్ 28న) వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. మరణించిన వారిలో 85 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే ఈ తీవ్రమైన పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పర్యావరణంలో మార్పులు -డేంజర్ లో చింకారాలు
General· 28 Jun 2026

పర్యావరణంలో మార్పులు -డేంజర్ లో చింకారాలు

వాతావరణంలో వస్తున్న వేగవంతమైన మార్పుల వల్ల దేశంలో అరుదైన 'చింకారా' (జింకల జాతి) జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, వర్షపాతంలో మార్పుల వల్ల ఇవి నివసించే అటవీ, పొడి ప్రాంతాలు దెబ్బతింటున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ మూగజీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, వీటి రక్షణకు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

జెండర్ పెయిన్ గ్యాపే మహిళల ఆరోగ్యానికి అసలు సమస్య !
Health· 28 Jun 2026

జెండర్ పెయిన్ గ్యాపే మహిళల ఆరోగ్యానికి అసలు సమస్య !

వైద్య రంగంలో మగవారితో పోలిస్తే మహిళల శారీరక నొప్పులు, ఆరోగ్య సమస్యలను తక్కువగా అంచనా వేసే ధోరణి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. దీన్నే 'జెండర్ పెయిన్ గ్యాప్' అంటారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ప్పటికీ, మహిళల సమస్యలను కేవలం మానసిక ఆందోళనగా లేదా సాధారణ విషయంగా కొట్టిపారేయడం వల్ల వారికి సరైన సమయంలో సరైన వైద్యం అందడం లేదు. ముఖ్యంగా ఎండోమెట్రియాసిస్, పీరియడ్స్ నొప్పులు సమస్యల నిర్ధారణకు ఏళ్ల తరబడి సమయం పడుతోంది. వైద్య పరిశోధనల్లో కూడా మహిళల శరీరతత్వంపై తగినంత రీసెర్చ్ జరగకపోవడం ఈ వివక్షకు ప్రధాన కారణం.వైద్య రంగంలో జెండర్ గ్యాప్ తొలగించాల్సిన అవసరముంది.

రెండు ఎయిర్ యాక్సిడెంట్స్ లో 25 మంది మృతి
News· 28 Jun 2026

రెండు ఎయిర్ యాక్సిడెంట్స్ లో 25 మంది మృతి

ఫ్రాన్స్, సౌదీ అరేబియా దేశాలలో జరిగిన రెండు వేర్వేరు విమాన ప్రమాదాల్లో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఫ్రాన్స్‌లో స్కైడైవింగ్ శిక్షణ విమానం కూలిపోయి 11 మంది మృతి చెందారు. అలాగే సౌదీ అరేబియాలోని రాస్ తనురా సమీపంలో అరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలడంతో 14 మంది మరణించారు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాలే ఈ ఘోర ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.