అభిమానికి సమంత రిప్లై!

3ఇయర్స్ గ్యాప్ తర్వాత సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.73 కోట్ల కలెక్షన్లు సాధించి, నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. తాజాగా ఓ ఫ్యాన్ ఇన్‌స్టాలో.. "ఇంట్లో ఆడపిల్లలు ఎప్పుడూ మహాలక్ష్మిలానే కాదు, ఒక్కోసారి కాళీమాతలా కూడా మారాలని నిరూపించావు" అంటూ పెట్టిన పోస్ట్‌ని సమంత షేర్ చేశారు. "తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనిచేయాలి.. మన పనే మన విజయాన్ని చూపిస్తుంది" అంటూ థాంక్స్ చెప్పారు.



