Latest

హైదరాబాద్ మెట్రో లోన్ అడ్డుకుంటున్నారు!
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణను కిషన్ రెడ్డి, KTR కలిసి అడ్డుకుంటున్నారని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. జపాన్ సంస్థ ఇచ్చిన ₹13,600 కోట్ల తక్కువ వడ్డీ లోన్‌ను రాష్ట్రానికి రాకుండా కిషన్ రెడ్డి బ్లాక్ చేశారన్నారు. కేంద్రం ఫండ్స్ ఇవ్వకపోతే NOC ఇస్తే. 100% సొంత ఖర్చులతోనే మెట్రో విస్తరణ పూర్తి చేస్తామని సవాల్ చేశారు. KTR వెనకుండి నడిపిస్తుంటే కిషన్ రెడ్డి మెట్రో ప్రాజెక్టును ఆపుతున్నారని CM మండిపడ్డారు.

కట్నం ఇవ్వలేని నువ్వు బతకడమెందుకు..?
TG: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని చెన్నాపురానికి చెందిన నవీన్ (29) ప్రైవేట్ ఉద్యోగి. అతడి సోదరి మమతకు తుర్కయంజాల్‌కు చెందిన బొమ్మరాజు కృష్ణతో వివాహం చేశారు. 5 తులాల బంగారం, అరకిలో వెండి, ఇతర కట్న కానుకలిచ్చి మ్యారేజ్ జరిపించారు. అక్కా బావ, అత్తమామలు అదనపు కట్నం కావాలని నవీన్‌ను, అతని కుటుంబసభ్యులను వేధించారు. 'కట్నం ఇవ్వడం చేతకాని నువ్వు బతికి ప్రయోజనం ఏంటీ? నీవు చనిపోతే ఆస్తిలో వచ్చే వాటాను కట్నంగా తీసుకుంటాం' అని వేధించారు. మనస్తాపానికి గురైన నవీన్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
డైవర్ట్ అవ్వకండి: కాక్రోచ్ పార్టీ ఫౌండర్
కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తనపై జరిగిన అటాక్ తర్వాత సోషల్ మీడియాలో లో ఒక వీడియో రిలీస్ చేశారు. అసలు విషయం నుండి ఎవరూ డైవర్ట్ అవ్వద్దని అలర్ట్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రిజైన్ చేయాలంటూ ఆయన మళ్లీ డిమాండ్ చేశారు. 'ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్' అనే నినాదంతో ఆయన చేస్తున్న ఈ ఫైట్ ఇప్పుడు నెట్టింట మరింత వైరల్‌గా మారింది.
ఇది రాజ్యాంగ ఉల్లంఘన: పవన్ కళ్యాణ్!
తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించేందుకు తనకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దీన్ని 'కాన్స్టిట్యూషనల్ అబ్యూస్' అని మండిపడ్డారు. తాను తెలంగాణలో పుట్టకపోయినా ఇక్కడి అమరుల త్యాగాలు తనను కదిలించాయన్నారు. ఇండియా గేట్ దగ్గర సైనికులకు వందనం చేయాలంటే కాశ్మీర్ లేదా పంజాబ్‌లో పుట్టాలా అని ప్రశ్నించారు. ఇది నా దేశం, నా నేల కాదా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్ రోజే నీటి కష్టాలు.. విద్యార్థుల అవస్థలు
TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరత యథాతథంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తాగునీటి సమస్య, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతసంవత్సరంలో 28మంది స్టూడెంట్స్ ఉన్న ఈ స్కూల్‌లో ప్రస్తుత విద్యాసంవత్సరం తొలిరోజు కేవలం 23మంది మాత్రమే హాజరైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల కారణంగానే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కాక్రోచ్ పార్టీ ఫౌండర్ పై దాడి!
తనపై జరిగిన ఫిజికల్ అటాక్‌పై యాక్టివిస్ట్ అభిజీత్ దీప్కే స్ట్రాంగ్ గా రేయాక్ట్ అయ్యారు. ఇలాంటి దాడులు భయానికి, పిరికితనానికి నిదర్శనమని అన్నారు. తాను గాంధీ, అంబేద్కర్ ఫాలోవర్ నని. శాంతి, ప్రేమతోనే ఈ ఫైట్ కంటిన్యూ చేస్తానని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రిజైన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

నేతలు ఆందోళన.. గాంధీభవన్‌లో ఉద్రిక్తత
TG: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు మరొసారి గొడవలకు దిగారు. కాంగ్రెస్ నేత చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రశేఖర్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంస్థాగత నియమాకాల్లో ఆయన తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అమెరికా-ఇరాన్ వార్‌కు ఎండ్ కార్డ్! శాంతి ఒప్పందంలో కీలక పాయింట్స్ ఇవే!
దాదాపు 107 రోజుల యుద్ధం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం. 30 రోజుల్లో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరవాలి, అలాగే ఇరాన్‌పై అమెరికా నావికా ఆంక్షలు తొలగించాలి. ఇరాన్ రీకన్స్ట్రక్షన్ కోసం అమెరికా, దాని ఫ్రెండ్లీ కంట్రీస్ 300 బిలియన్ డాలర్ల ప్లాన్ ఇవ్వాలి. అంతేకాదు, అమెరికా హోల్డ్ లో పెట్టిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల మనీని కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్ ఇంట్లో నారా లోకేష్, బ్రాహ్మణి స్పెషల్ పూజలు!
సోమవతి అమావాస్య సందర్భంగా నారా లోకేష్, బ్రాహ్మణి తమ హైదరాబాద్ ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య మహాశివుడికి రుద్రాభిషేకం చేసి. అందరినీ చల్లగా చూడాలంటూ ఆ దేవుడిని కోరుకున్నట్లు బ్రాహ్మణి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయోధ్య రామాలయం సీన్ లోకి SIT!
అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం కేసులో పోలీసులు ఒక టెంపుల్ ఎంప్లాయ్ ఇంట్లో ₹12 లక్షల క్యాష్ సీజ్ చేశారు. దాదాపు ₹7 కోట్ల వరకు విరాళాలు చోరీ అయ్యాయనే ఆరోపణల మధ్య ఈ రైడ్ జరగడం సంచలనంగా మారింది. అయితే తన కొడుకును ఇరికించడానికి ఎవరో ఈ పని చేశారని ఆ ఎంప్లాయ్ తండ్రి చెప్తున్నాడు. ఈ కేసు తీవ్రతను బట్టి UP M యోగి ఆదిత్యనాథ్ త్రీ-మెంబర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని కూడా ఏర్పాటు చేశారు.

ట్రంప్ డీల్‌తో మాకు సంబంధం లేదు: ఇజ్రాయెల్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన డీల్‌పై ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటమార్ బెన్-గ్విర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ డీల్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇజ్రాయెల్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని స్పష్టం చేశారు. తాము అమెరికాకు బానిసలం కాదని. ప్రెసిడెంట్ ట్రంప్‌ను తాము గౌరవిస్తామని, కానీ పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే ఈ డీల్‌పై డెసిషన్ తీసుకుంటామని బెన్-గ్విర్ క్లియర్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ రోజు గోల్డ్ రేట్స్ ఇవే!
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటనతో ఇరాన్ టెన్షన్స్ తగ్గినా, అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్‌తో భారత్‌లో గోల్డ్ రేట్స్ మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 15న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,070గా, 22 క్యారెట్ల ధర రూ.1,36,640గా ఉంది. AP లోని విజయవాడ, వైజాగ్‌లలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,48,580 వద్ద కొనసాగుతోంది. Note: గోల్డ్ కొనే ముందు రేట్స్ ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్.
కరెంట్ పోల్‌పై కూర్చొని లంచ్!
లైఫ్ కోసం ఎంతటి రిస్క్ అయినా చేయాలనేదానికి ఈ వైరల్ వీడియోనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎత్తైన ఎలక్ట్రిక్ పోల్‌పై చాలా డేంజరస్ కండిషన్స్‌లో వర్క్ చేస్తూ, అదే పోల్‌పై కూర్చొని లంచ్ చేస్తున్న ఒక యంగ్ వర్కర్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి హార్ట్స్ టచ్ చేస్తోంది. మనం డైలీ వాడుకునే కరెంట్ వెనుక ఇలాంటి వేలాది మంది వర్కర్స్ కష్టం, లైఫ్ రిస్క్ చేసే ధైర్యం ఉన్నాయి. ఈ రియల్ హీరోస్ కష్టానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
కొడుకుని కాపాడబోయి తల్లి కూడా మృతి!
చిత్తూరు జిల్లా నెలవాయి గ్రామంలో ఘోర విషాదం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద తవ్విన ఒక ఫామ్ పాండ్ (వ్యవసాయ కుంట) లో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన సిద్ధు (15) అనే అబ్బాయి నీళ్లలో మునిగిపోయాడు. అది చూసి కొడుకుని కాపాడటానికి ట్రై చేసిన తల్లి రేవతి (35) కూడా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకు ఇద్దరూ చనిపోవడంతో ఆ విలేజ్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

సీరియల్ యాక్ట్రెస్ సూసైడ్!
హిందీ టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఫేమస్ సీరియల్ 'కుంకుమ భాగ్య' ఫేమ్, పాపులర్ యాక్ట్రెస్ సంచిత ఉగలే (30) సూసైడ్ చేసుకున్నారు. ముంబై నలసోపారాలోని తన ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో ఆమె చీరతో ఉరివేసుకున్నారు. స్పాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆమె మృతితో ఫ్యాన్స్, కో-స్టార్స్ ఎమోషనల్ అవుతున్నారు.
చలిచీమలు కూడా పామును చంపగలవు: పవన్ కళ్యాణ్
కాక్రాచ్ పార్టీని చూస్తుంటే తనకు చలిచీమల పద్యం గుర్తొచ్చిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంతో పవర్‌ఫుల్ అయిన పామును సైతం చలిచీమలు గ్రూప్‌గా వచ్చి చంపేస్తాయని. సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరిలోనూ ఆ పవర్ ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ ఇంకా మారలేదు: పవన్ కళ్యాణ్
గతంలో కాంగ్రెస్ పార్టీ AP, తెలంగాణలను విడదీసిన పద్ధతి అస్సలు కరెక్ట్ కాదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ మైండ్‌సెట్ ఇంకా మారలేదని, దానికి ఉదాహరణే తమ జనసేన మీటింగ్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడమేనని ఫైర్ అయ్యారు. విభజన సమయం నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఆర్మీ ఆఫీసర్‌కి CM విజయ్ బంపర్ ఆఫర్!
యాంటీ-టెర్రర్ ఆపరేషన్స్‌లో రియల్ హీరోగా నిలిచిన కీర్తి చక్ర అవార్డు విన్నర్, లాన్స్ నాయక్ ఎ. మీనాక్షి సుందరంను తమిళనాడు CM విజయ్ సెక్రటేరియట్‌లో కలిసి అభినందించారు. ఆయన చూపించిన అద్భుతమైన ధైర్యానికి గుర్తింపుగా తమిళనాడు గవర్నమెంట్ తరపున ₹48 లక్షల భారీ చెక్కును అందజేశారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి ఫైట్ చేసిన మన ఆర్మీ ఆఫీసర్‌ని CM విజయ్ ఇలా గౌరవించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

'కార్లలో తిరగడం కాదు, పాదయాత్ర చేయండి'
హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద గోడలకు పోస్టర్లు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ రమ్య అనే మహళ ఈ వినూత్న నిరసనకు దిగినట్లు తెలిపింది. CM రేవంత్ రెడ్డి కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం కాదు, నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలి, చదువుకున్నవారికి జాబ్స్ ఇవ్వాలన్నారు. నాలుగు కార్లు వేసుకుని తిరగడం కాదు, మీ కాళ్లతో పాదయాత్ర చేయండి ప్రజల తిప్పలు అర్థం అవుతుందన్నారు. పల్లెటూర్లో కాదు హైదరాబాద్‌లో పాదయాత్ర చేయండి. అప్పుడే ఎంత మంది కిరాయికి ఉంటున్నారో మీకు అర్థం అవుతుందని పోస్టర్‌లో పేర్కొంది.
యూత్ కోసం యాక్టర్ ప్రకాష్ రాజ్ చేసిన డిమాండ్!
బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన కాక్రోచెస్ ప్రొటెస్ట్‌లో యాక్టర్ ప్రకాష్ రాజ్ రూలింగ్ పాలిటిషియన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న లీడర్స్ అందరూ తప్పుకొని. ఈ దేశ యూత్‌కి ప్లేస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన కిడ్స్, యంగ్ జనరేషన్ అంతా తమ ఫ్యూచర్ కోసం రోడ్లపైకి వచ్చి ఫైట్ చేస్తున్నారని గుర్తు చేశారు. యువత పోరాటాన్ని గౌరవించి, వాళ్లకు రూలింగ్ చాన్స్ ఇవ్వాలంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

సెక్రటేరియట్ వద్ద పోస్టర్లు కలకలం
TG: హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ మీడియా సెంటర్ వద్ద గోడలకు ఉచిత పథకాలు వద్దని పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయి. ప్రతిపేద వాడికి ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని పోస్టర్లలో పేర్కొన్నారు. హైసెక్యూరిటీ జోన్‌లో పోస్టర్లు అంటించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రంగంలోకి దిగిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బంది జగిత్యాల జిల్లాకు చెందిన రమ్య అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. గతరాత్రి ఎవరికీ తెలియకుండా తానే ఈ పోస్టర్లను అతికించినట్లు సదరు మహిళ స్వయంగా వెల్లడించింది.