Latest

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు బ్రాండెడ్‌ కిట్
Education· 16 Jun 2026

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు బ్రాండెడ్‌ కిట్

TG: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ, BC, SC, ST, మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన బ్రాండెడ్‌ కిట్ అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కిట్‌లో యూనిఫాంతో పాటు స్కూల్‌ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, బెడ్డింగ్‌ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా ఇలా ప్రతి వస్తువులోనూ నాణ్యతకు పెద్దపీట వేయాలని CM రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకే కాకుండా, మొదటిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే 2 లక్షల మంది విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగు, బెల్టు, టై, నల్లబూట్లు, సాక్సులను ఉచితంగా అందించనున్నారు.

ఉద్యోగాలు భర్తీ చేయాలని OUలో నిరుద్యోగుల ధర్నా▶
Jobs· 15 Jun 2026

ఉద్యోగాలు భర్తీ చేయాలని OUలో నిరుద్యోగుల ధర్నా

TG: పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుంచి 20వేలకు పెంచాలని ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. మెగా డీఎస్సీ ద్వారా 25వేల ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం OUలోని అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మోదీ అలా చేస్తే ప్రభుత్వాన్ని రద్దు చేస్తా: రేవంత్ రెడ్డి
Politics· 15 Jun 2026

మోదీ అలా చేస్తే ప్రభుత్వాన్ని రద్దు చేస్తా: రేవంత్ రెడ్డి

TG: ప్రధాని మోదీ ముందుగా తన పదవికి రాజీనామా చేసి కేంద్రప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. తాను కూడా CM పదవికి రాజీనామా చేయడంతోపాటు శాసనసభను రద్దు చేసేందుకు రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికలకు వెళ్లాలన్న BJP సవాల్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని.. అధికారంలో కొనసాగడానికి బీజేపీ మాదిరిగా ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడటం లేదని కౌంటర్ ఇచ్చారు.

'తల్లి బాధను అర్థం చేసుకోండి'
AP· 15 Jun 2026

'తల్లి బాధను అర్థం చేసుకోండి'

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 10 రోజులైనా ఇంకా లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోయి పదిరోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే చిన్నారి అదృశ్యంపై కొంతమంది పెడుతున్న కామెంట్లు తమను ఎంతో బాధిస్తున్నాయని జ్ఞానేశ్వరి తల్లి భవాని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని ఆశతో ఉన్నామని, ఆ ధైర్యాన్ని కూడా కోల్పోనివ్వద్దని ఆమె కోరారు. మరోవైపు చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.

రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ?
Politics· 15 Jun 2026

రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తొకట్టలో ఉన్న సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వభూమిని పరిరక్షించాలని BRS అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ కోరారు. సర్వే నంబర్ 157/1లో ఉన్న 8ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని తెలిపారు. 2025లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ భూమిలో 6,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారని గుర్తుచేశారు. ప్రతిపాదనలో ఈ స్థలాన్ని ప్రభుత్వభూమిగానే పరిగణించారని తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిందన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆలను కోరారు.

మీ పళ్లు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి!
Health· 15 Jun 2026

మీ పళ్లు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి!

మనం డైలీ తాగే టీ, కాఫీ, కోలా పానీయాలు పళ్లపై వేర్వేరుగా ఎఫెక్ట్ చూపిస్తాయి. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం.. పళ్లపై మొండి మరకలు పడటానికి 'బ్లాక్ టీ', 'కాఫీ'లే మెయిన్ రీజన్. వీటివల్ల పళ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఇక కోలా డ్రింక్స్ వల్ల మరకలు తక్కువైనా, అందులోని యాసిడ్స్ పళ్ల పైపొరను (ఎనామెల్) దెబ్బతీసి పిప్పిపళ్ల రిస్క్ పెంచుతాయి. వీటిని తాగిన వెంటనే వాటర్‌తో నోరు క్లీన్ చేసుకోవడం బెస్ట్.

ఆటో డ్రైవర్లను ఢీకొట్టిన చెత్త టిప్పర్
Crime· 15 Jun 2026

ఆటో డ్రైవర్లను ఢీకొట్టిన చెత్త టిప్పర్

TG: రంగారెడ్డి జిల్లాలోని మందమల్లమ్మ చౌరస్తా చంద్రా గార్డెన్స్ వద్ద సంతోష్ (26) అనే ఆటోడ్రైవర్ ఆటో రిపేర్ వచ్చి ఆగిపోయింది. ఆటోను మెకానిక్ షాపునకు తీసుకెళ్లేందుకు తన ఫ్రెండ్స్ ప్రసాద్, సునీల్(33)లకు ఫోన్ చేశాడు. వారు మరో ఆటోలో అక్కడకు వచ్చారు. ఆటోకు తాడుతో కట్టి తరలించేందుకు సునీల్, ప్రసాద్ సిద్ధమయ్యారు. LBనగర్ వైపు నుంచి వచ్చిన GHMC చెత్త టిప్పర్ రోడ్డు పక్కనున్న ఆటోడ్రైవర్లను ఢీకొట్టింది. సంతోష్ స్పాట్‌లోనే మరణించాడు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు.

కలెక్టరేట్ వద్ద గిరిజనుల ఆందోళన.. ఉద్రిక్తత
Local· 15 Jun 2026

కలెక్టరేట్ వద్ద గిరిజనుల ఆందోళన.. ఉద్రిక్తత

AP: అల్లూరి జిల్లా కలెక్టరేట్ వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత గ్రామాలకు చెందిన గిరిజనులు నిరసన నిర్వహించారు. గ్రామస్థులకు తెలియకుండానే హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే ఎలా నిర్వహిస్తున్నారని మజ్జివలస ప్రాంత గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు సాధన కమిటీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. హైడ్రో వపర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సర్వే చేయడం లేదని జిల్లా కలెక్టర్ నిషాంతి స్పష్టం చేశారు.

హైదరాబాద్ మెట్రో లోన్ అడ్డుకుంటున్నారు!
Politics· 15 Jun 2026

హైదరాబాద్ మెట్రో లోన్ అడ్డుకుంటున్నారు!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణను కిషన్ రెడ్డి, KTR కలిసి అడ్డుకుంటున్నారని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. జపాన్ సంస్థ ఇచ్చిన ₹13,600 కోట్ల తక్కువ వడ్డీ లోన్‌ను రాష్ట్రానికి రాకుండా కిషన్ రెడ్డి బ్లాక్ చేశారన్నారు. కేంద్రం ఫండ్స్ ఇవ్వకపోతే NOC ఇస్తే. 100% సొంత ఖర్చులతోనే మెట్రో విస్తరణ పూర్తి చేస్తామని సవాల్ చేశారు. KTR వెనకుండి నడిపిస్తుంటే కిషన్ రెడ్డి మెట్రో ప్రాజెక్టును ఆపుతున్నారని CM మండిపడ్డారు.

కట్నం ఇవ్వలేని నువ్వు బతకడమెందుకు..?
Crime· 15 Jun 2026

కట్నం ఇవ్వలేని నువ్వు బతకడమెందుకు..?

TG: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని చెన్నాపురానికి చెందిన నవీన్ (29) ప్రైవేట్ ఉద్యోగి. అతడి సోదరి మమతకు తుర్కయంజాల్‌కు చెందిన బొమ్మరాజు కృష్ణతో వివాహం చేశారు. 5 తులాల బంగారం, అరకిలో వెండి, ఇతర కట్న కానుకలిచ్చి మ్యారేజ్ జరిపించారు. అక్కా బావ, అత్తమామలు అదనపు కట్నం కావాలని నవీన్‌ను, అతని కుటుంబసభ్యులను వేధించారు. 'కట్నం ఇవ్వడం చేతకాని నువ్వు బతికి ప్రయోజనం ఏంటీ? నీవు చనిపోతే ఆస్తిలో వచ్చే వాటాను కట్నంగా తీసుకుంటాం' అని వేధించారు. మనస్తాపానికి గురైన నవీన్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

డైవర్ట్ అవ్వకండి: కాక్రోచ్ పార్టీ ఫౌండర్▶
Politics· 15 Jun 2026

డైవర్ట్ అవ్వకండి: కాక్రోచ్ పార్టీ ఫౌండర్

కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తనపై జరిగిన అటాక్ తర్వాత సోషల్ మీడియాలో లో ఒక వీడియో రిలీస్ చేశారు. అసలు విషయం నుండి ఎవరూ డైవర్ట్ అవ్వద్దని అలర్ట్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రిజైన్ చేయాలంటూ ఆయన మళ్లీ డిమాండ్ చేశారు. 'ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్' అనే నినాదంతో ఆయన చేస్తున్న ఈ ఫైట్ ఇప్పుడు నెట్టింట మరింత వైరల్‌గా మారింది.

ఇది రాజ్యాంగ ఉల్లంఘన: పవన్ కళ్యాణ్!▶
Politics· 15 Jun 2026

ఇది రాజ్యాంగ ఉల్లంఘన: పవన్ కళ్యాణ్!

తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించేందుకు తనకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దీన్ని 'కాన్స్టిట్యూషనల్ అబ్యూస్' అని మండిపడ్డారు. తాను తెలంగాణలో పుట్టకపోయినా ఇక్కడి అమరుల త్యాగాలు తనను కదిలించాయన్నారు. ఇండియా గేట్ దగ్గర సైనికులకు వందనం చేయాలంటే కాశ్మీర్ లేదా పంజాబ్‌లో పుట్టాలా అని ప్రశ్నించారు. ఇది నా దేశం, నా నేల కాదా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్ రోజే నీటి కష్టాలు.. విద్యార్థుల అవస్థలు
Education· 15 Jun 2026

ఫస్ట్ రోజే నీటి కష్టాలు.. విద్యార్థుల అవస్థలు

TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరత యథాతథంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తాగునీటి సమస్య, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతసంవత్సరంలో 28మంది స్టూడెంట్స్ ఉన్న ఈ స్కూల్‌లో ప్రస్తుత విద్యాసంవత్సరం తొలిరోజు కేవలం 23మంది మాత్రమే హాజరైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల కారణంగానే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

కాక్రోచ్ పార్టీ ఫౌండర్ పై దాడి!▶
Politics· 15 Jun 2026

కాక్రోచ్ పార్టీ ఫౌండర్ పై దాడి!

తనపై జరిగిన ఫిజికల్ అటాక్‌పై యాక్టివిస్ట్ అభిజీత్ దీప్కే స్ట్రాంగ్ గా రేయాక్ట్ అయ్యారు. ఇలాంటి దాడులు భయానికి, పిరికితనానికి నిదర్శనమని అన్నారు. తాను గాంధీ, అంబేద్కర్ ఫాలోవర్ నని. శాంతి, ప్రేమతోనే ఈ ఫైట్ కంటిన్యూ చేస్తానని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రిజైన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

నేతలు ఆందోళన.. గాంధీభవన్‌లో ఉద్రిక్తత
Politics· 15 Jun 2026

నేతలు ఆందోళన.. గాంధీభవన్‌లో ఉద్రిక్తత

TG: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు మరొసారి గొడవలకు దిగారు. కాంగ్రెస్ నేత చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రశేఖర్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంస్థాగత నియమాకాల్లో ఆయన తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అమెరికా-ఇరాన్ వార్‌కు ఎండ్ కార్డ్! శాంతి ఒప్పందంలో కీలక పాయింట్స్ ఇవే!
Politics· 15 Jun 2026

అమెరికా-ఇరాన్ వార్‌కు ఎండ్ కార్డ్! శాంతి ఒప్పందంలో కీలక పాయింట్స్ ఇవే!

దాదాపు 107 రోజుల యుద్ధం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం. 30 రోజుల్లో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరవాలి, అలాగే ఇరాన్‌పై అమెరికా నావికా ఆంక్షలు తొలగించాలి. ఇరాన్ రీకన్స్ట్రక్షన్ కోసం అమెరికా, దాని ఫ్రెండ్లీ కంట్రీస్ 300 బిలియన్ డాలర్ల ప్లాన్ ఇవ్వాలి. అంతేకాదు, అమెరికా హోల్డ్ లో పెట్టిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల మనీని కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్ ఇంట్లో నారా లోకేష్, బ్రాహ్మణి స్పెషల్ పూజలు!
Politics· 15 Jun 2026

హైదరాబాద్ ఇంట్లో నారా లోకేష్, బ్రాహ్మణి స్పెషల్ పూజలు!

సోమవతి అమావాస్య సందర్భంగా నారా లోకేష్, బ్రాహ్మణి తమ హైదరాబాద్ ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య మహాశివుడికి రుద్రాభిషేకం చేసి. అందరినీ చల్లగా చూడాలంటూ ఆ దేవుడిని కోరుకున్నట్లు బ్రాహ్మణి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయోధ్య రామాలయం సీన్ లోకి SIT!
Crime· 15 Jun 2026

అయోధ్య రామాలయం సీన్ లోకి SIT!

అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం కేసులో పోలీసులు ఒక టెంపుల్ ఎంప్లాయ్ ఇంట్లో ₹12 లక్షల క్యాష్ సీజ్ చేశారు. దాదాపు ₹7 కోట్ల వరకు విరాళాలు చోరీ అయ్యాయనే ఆరోపణల మధ్య ఈ రైడ్ జరగడం సంచలనంగా మారింది. అయితే తన కొడుకును ఇరికించడానికి ఎవరో ఈ పని చేశారని ఆ ఎంప్లాయ్ తండ్రి చెప్తున్నాడు. ఈ కేసు తీవ్రతను బట్టి UP M యోగి ఆదిత్యనాథ్ త్రీ-మెంబర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని కూడా ఏర్పాటు చేశారు.

ట్రంప్ డీల్‌తో మాకు సంబంధం లేదు: ఇజ్రాయెల్
Politics· 15 Jun 2026

ట్రంప్ డీల్‌తో మాకు సంబంధం లేదు: ఇజ్రాయెల్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన డీల్‌పై ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటమార్ బెన్-గ్విర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ డీల్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇజ్రాయెల్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని స్పష్టం చేశారు. తాము అమెరికాకు బానిసలం కాదని. ప్రెసిడెంట్ ట్రంప్‌ను తాము గౌరవిస్తామని, కానీ పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే ఈ డీల్‌పై డెసిషన్ తీసుకుంటామని బెన్-గ్విర్ క్లియర్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ రోజు గోల్డ్ రేట్స్ ఇవే!
Politics· 15 Jun 2026

ఈ రోజు గోల్డ్ రేట్స్ ఇవే!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటనతో ఇరాన్ టెన్షన్స్ తగ్గినా, అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్‌తో భారత్‌లో గోల్డ్ రేట్స్ మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 15న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,070గా, 22 క్యారెట్ల ధర రూ.1,36,640గా ఉంది. AP లోని విజయవాడ, వైజాగ్‌లలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,48,580 వద్ద కొనసాగుతోంది. Note: గోల్డ్ కొనే ముందు రేట్స్ ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్.

కరెంట్ పోల్‌పై కూర్చొని లంచ్!▶
Viral· 15 Jun 2026

కరెంట్ పోల్‌పై కూర్చొని లంచ్!

లైఫ్ కోసం ఎంతటి రిస్క్ అయినా చేయాలనేదానికి ఈ వైరల్ వీడియోనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎత్తైన ఎలక్ట్రిక్ పోల్‌పై చాలా డేంజరస్ కండిషన్స్‌లో వర్క్ చేస్తూ, అదే పోల్‌పై కూర్చొని లంచ్ చేస్తున్న ఒక యంగ్ వర్కర్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి హార్ట్స్ టచ్ చేస్తోంది. మనం డైలీ వాడుకునే కరెంట్ వెనుక ఇలాంటి వేలాది మంది వర్కర్స్ కష్టం, లైఫ్ రిస్క్ చేసే ధైర్యం ఉన్నాయి. ఈ రియల్ హీరోస్ కష్టానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.