Latest

అప్పులు తీర్చలేక తల్లిని చంపిన కొడుకు
AP: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన రఘువంశీ హైదరాబాద్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన యువకుడు భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం విస్సన్నపేటలో ఉన్న తమ ఇల్లు అమ్మాలంటూ తన తల్లి రమాదేవిపై గత కొంతకాలంగా ఫ్రెజర్ చేశాడు. అయితే ఇల్లు అమ్మడానికి ఆమె నిరాకరించడంతో తీవ్ర కక్ష పెంచుకున్న కుమారుడు దారుణంగా కొట్టి ఆమెను హతమార్చాడు. విస్సన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
హిస్టరీ క్రియేట్ చేసిన మోదీ!
ఇండియా హిస్టరీలోనే ఎక్కువ కాలం పీఎంగా రికార్డ్ క్రియేట్ చేసిన నరేంద్ర మోదీకి కేంద్ర క్యాబినెట్ కంగ్రాట్స్ తెలిపింది. దేశం కోసం ఆయన రాత్రి పగలు కష్టపడే తత్వాన్ని, లీడర్‌షిప్‌ని మెచ్చుకుంటూ మంత్రులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి విషెస్ చెప్పారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మోదీకి ఇటలీ PM జార్జియా మెలోని స్పెషల్ విషెస్!
ఇండియాలో ఎక్కువ కాలం పీఎంగా ఉండి రికార్డ్ క్రియేట్ చేసిన నరేంద్ర మోదీకి కంగ్రాట్స్ చెప్తూ ఇటలీ పీఎం జార్జియా మెలోని ట్వీట్ చేశారు. రీసెంట్ గా రోమ్ లో మోదీని కలవడం చాలా హ్యాపీగా ఉందంటూ ఆమె పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజల ఫ్యూచర్ కోసం, సరికొత్త అవకాశాల కోసం ఒక స్పెషల్ డీల్ సెట్ చేసుకున్నామని చెప్పారు. ప్రజెంట్ మెలోని పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
The Clear Cut News Headlines- ముఖ్యాంశాలు
* డిగ్రీ ఉంటే చాలు.. SBI లో 7,150 జాబ్స్! * విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి చేరుకున్న YS జగన్.. *క్యాన్సర్ పిల్లల మధ్య బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్! *తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

గంజాయి ముఠా రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు
AP: అల్లూరిసీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న ముఠా సభ్యులు హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడిచేశారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, నలుగురిని పట్టుకున్నారు. నిందితులు ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. 290కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

అవినీతి అనకొండకు 14రోజుల రిమాండ్
TG: తెలంగాణ R & B ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్‌కు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACB అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికారులు ఆయన్ను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. మియాపూర్‌లోని ఆయన నివాసం, నిజామాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.

సినిమా మేకింగ్ లో రియలిజానికి కేరాఫ్ అడ్రస్ !
భారతీ రాజా మూవీస్ లో సాంగ్స్ కి ప్రయారిటీ ఎక్కువ. మాస్ట్రో ఇళయ రాజా, ఆయనది గోల్డెన్ కాంబో. ఆ తర్వాత ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా భారతీ రాజాకు మంచి హిట్స్ ని ఇచ్చింది. వారిద్దరితోనూ ఈగో క్లాషెస్ వచ్చినా కాలక్రమంలో ఓల్డేజ్ కు వచ్చాక వారితో మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేశారు. భారతీ రాజా డైరక్టరే కాదు.. నటుడు కూడా. తమిళ్ బేస్డ్ తెలుగు ఫిలింస్ యువ, తిరు సినిమాల్లో ఆయన రోల్స్ అందరినీ మెప్పించాయి. ఇండస్ట్రీ కి చేసిన సేవలకి గుర్తింపుగా ఆయనకు అనేక జాతీయ అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది.
డిగ్రీ ఉంటే చాలు.. SBI లో 7,150 జాబ్స్!
బ్యాంక్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్లకి SBI గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 7,150 ట్రైనీ పోస్టుల అప్లికేషన్ లాస్ట్ డేట్‌ను జూన్ 15, 2026 వరకు పొడగించింది. ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు దీనికి ఎలిజిబుల్. సెలెక్ట్ అయిన వాళ్లకి one year ట్రైనింగ్ ఇచ్చి, నెలకు 15 వేల పాకెట్ మనీ (స్టైపెండ్) ఇస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామ్ బేస్ చేసుకొని సెలెక్షన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు SBI అఫీషియల్ సైట్ లో అప్లై చేసుకోవచ్చు.

తెలుగులో సూపర్, డూపర్ హిట్ సాంగ్స్ భారతీ రాజావే
ఇళయరాజాతో ఆయన కాంబినేషన్ ఒక గోల్డెన్ ఎరా. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్‌ను కూడా తన 'కిజక్కు చీమయిలే' (తెలుగులో 'పలనాటి పౌరుషం') సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చేలా ప్రోత్సహించారు. సీతాకోక చిలుక మూవీలో మిన్నేటి సూరీడు పాట, ఆరాధన మూవీలో అరె ఏమైందీ సాంగ్, ఎర్రగులాబీలులో ఎదలో లయలు, పెదవుల శ్రుతులు లాంటి సాంగ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. భారతీ రాజా మూవీస్ లో ఈ సాంగ్స్ వినడానికే కాదు, పల్లెటూరి పచ్చదనం కళ్లముందు కదలాడుతుంది.

జెన్ జీ లొ నయా ట్రెండ్... ఏకాంత ప్రదేశాలలోనే రిలాక్సేషన్ !
ప్రస్తుత డిజిటల్ యుగంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న జెన్ జీ యువత సరికొత్త మార్గాల వైపు మొగ్గు చూపుతోంది. రద్దీగా ఉండే నగరాలు, సోషల్ మీడియాకు దూరంగా... మాల్స్, ఆఫీసుల్లోని ఖాళీగా ఉండే ప్రదేశాలలోవారు మానసిక ప్రశాంతతను, ఉపశమనాన్ని పొందుతున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ కొత్త లైఫ్‌స్టైల్ ట్రెండ్ యువతలో ఒంటరితనాన్ని దూరం చేస్తూ, కొత్త ఊరటనిస్తోంది.

నామినేషన్ రిజెక్ట్.. ECI ఆఫీస్‌కి మీనాక్షి నటరాజన్!
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ రిజెక్ట్ అవ్వడంతో కాంగ్రెస్ కాండిడేట్ మీనాక్షి నటరాజన్ అలర్ట్ అయ్యారు. నామినేషన్ క్యాన్సిల్ అయిన మరుసటి రోజే ఆమె ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ (ECI) ఆఫీస్‌కి వెళ్లారు. అసలు నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందో క్లారిటీ తెచ్చుకోవడానికి ఈసీఐ అధికారులను కలవనున్నారు. ప్రజెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ ఇష్యూ ఫుల్ హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు ఇండస్ట్రీకి క్లాసిక్స్ నిచ్చిన గ్రేట్ డైరక్టర్ !
తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన తన చిత్రాలను తెలుగులో కూడా రీమేక్ చేసి ఇక్కడి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మేటి డైరక్టర్ భారతీ రాజా. ముఖ్యంగా కమల్ , శ్రీదేవి నటించిన "ఎర్ర గులాబీలు" (తమిళంలో సిగప్పు రోజాక్కళ్), కే జె యేసుదాస్ అద్భుతమైన పాటలతో వచ్చిన "కొత్త జీవితాలు", అలాగే "సీతాకోకచిలుక" వంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. పరిశ్రమకు ఎందరో నటీనటులను, టెక్నీషియన్లను పరిచయం చేసిన క్రెడిట్ ఆయనదే. ప్రముఖ యాక్ట్రెస్ రాధిక, రాధ, రేవతి, విజయశాంతి, కాజల్ కిరణ్ వంటి ఎందరో స్టార్ హీరోయిన్లు ఆయన సినిమాల ద్వారానే పరిచయం అయ్యారు.

Today CM రేవంత్ రెడ్డి షెడ్యూల్!
తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించనున్నారు. సాయంత్రం 5:30PM కు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఆఫీస్ బిల్డింగ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత CM రేవంత్ రెడ్డి అక్కడ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

మూవీ ఇండస్ట్రీ అల్లా ఉద్దీన్ భారతీ రాజా !
మూవీ ఇండస్ట్రీకి అల్లావుద్దీన్ లాంటి వాడు భాగ్యరాజా . తమిళ సినిమాను స్టూడియో గోడలు బద్దలు కొట్టి సరికొత్త తీరాలకు చేర్చారు. 1977 లో ఇండస్ట్రీలోకి వచ్చి 16 వయదనిలే సినిమాతో రూరల్ బ్యాక్ గ్రౌండ్ సహజ అందాలను, ఆ పచ్చదనాన్ని సిల్వర్ స్క్రీన్ కి ఎక్కించారు. సినిమా క్రేజ్ ఆయన్ను చెన్నైకి చేర్చితే ఆయన సినిమాను పల్లెలకు తీసుకెళ్లారు. ఇదే విషయం ఆయన పబ్లిగ్గా చెప్పేవారు. హీరో ఓరియంటెడ్ స్టోరీస్ ను బ్రేక్ చేసి సాధారణ ప్రజల జీవితాలను తెరకెక్కించి వాళ్లని హీరోలను చేశారు. భారతీ రాజా సినిమాలు డైరక్టరే హీరో అనిపిస్తాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి చేరుకున్న YS జగన్..
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రీసెంట్ గా జరిగిన ఘోర ప్రమాద బాధితులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ చేరుకున్నారు.

'అటు వైపు ఎవరూ వెళ్లొద్దు'
AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దేవీపట్నం మండలం నేలకోట సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. అధునాతన థర్మల్ డ్రోన్లతో పులి కదలికలను రాత్రి పగలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ రెస్క్యూ టీమ్‌లు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు, ఫీల్డ్ సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించారు. అవసరమైనప్పుడు వెంటనే చర్యలు తీసుకునేందుకు అన్ని టీమ్‌లు రెడీగా ఉన్నాయి. కొండ వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు.
క్యాన్సర్ పిల్లల మధ్య బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్!
నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యాయి. ఆయన తన పుట్టినరోజున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను విజిట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్న పిల్లల మధ్య బాలయ్య కేక్ కట్ చేసి, వాళ్లతో కాసేపు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ చెప్తున్నారు.

బీహార్ లో కుప్ప కూలిన కొత్త రైలు, రోడ్ బ్రిడ్జ్
బీహార్‌లోని బక్సర్ వద్ద ఇటార్హీ రైల్వే క్రాసింగ్ సమీపంలో, ధన్‌సోయ్ లేదా బరుణా వైపు లింక్ చేసే కొత్త రైలు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ చేశారో లేదో అలా కుంగిపోయింది. ఒక స్తంభం సమీపంలో స్లాబ్ కుంగిపోవడంతో పెద్ద గ్యాప్ ఏర్పడగా, కొన్ని చోట్ల కాంక్రీట్ కూడా ఊడిపడింది. ట్రాఫిక్ ప్రారంభించిన కేవలం 3–4 రోజులకే ఈ వంతెనలో తీవ్రమైన నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఈ వంతెన ను మొన్న మే నెల 31 నుంచి ఓపెన్ చేయగా లోపాలు జూన్ 4–6 మధ్య బయటపడ్డాయి. సుమారు ₹26.4 కోట్ల వ్యయంతో కట్టిన బ్రిడ్జి దుస్థితి ఇది..

పిల్లల ఫ్యూచర్ మారాలంటే.. ఈ సీక్రెట్స్ ఫాలో అవ్వండి!
పిల్లల పెంపకంపై కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వాళ్ల ఫ్యూచర్ ని మారుస్తాయి. ముఖ్యంగా గుడ్ ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం, మాట్లాడే ముందు ఆలోచించడం, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే సోషల్ మీడియా లో పర్సనల్ విషయాలు అందరితో షేర్ చేయకూడదు, కోపం లాంటి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చిన్నప్పుడే పేరెంట్స్ నేర్పించాలి. ఈ వాల్యూస్ పిల్లల పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కి బాగా యూజ్ అవుతాయని exeperts చెపుతున్నారు.
భారతీరాజా మృతదేహానికి విజయ్ నివాళులు!
తమిళ సినిమా డైరెక్టర్ భారతీరాజా మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. CM విజయ్ స్వయంగా వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం భారతీరాజా ఫ్యామిలీ మెంబర్స్‌ని పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు.

కొండగట్టు అంజన్న సన్నిధిలో NTR తల్లి షాలిని
TG: జూనియర్ NTR తల్లి షాలిని నందమూరి, అత్తమ్మ నార్నే మల్లీశ్వరి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. హనుమాన్ దీక్షలో భాగంగా నార్నే మల్లీశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.