← Back to news

బీహార్ లో కుప్ప కూలిన కొత్త రైలు, రోడ్ బ్రిడ్జ్

By DS· 10 Jun 2026· Bihar
బీహార్ లో కుప్ప కూలిన కొత్త రైలు, రోడ్ బ్రిడ్జ్

బీహార్‌లోని బక్సర్ వద్ద ఇటార్హీ రైల్వే క్రాసింగ్ సమీపంలో, ధన్‌సోయ్ లేదా బరుణా వైపు లింక్ చేసే కొత్త రైలు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌ ఇలా ఓపెన్ చేశారో లేదో అలా కుంగిపోయింది. ఒక స్తంభం సమీపంలో స్లాబ్ కుంగిపోవడంతో పెద్ద గ్యాప్ ఏర్పడగా, కొన్ని చోట్ల కాంక్రీట్ కూడా ఊడిపడింది. ట్రాఫిక్‌ ప్రారంభించిన కేవలం 3–4 రోజులకే ఈ వంతెనలో తీవ్రమైన నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఈ వంతెన ను మొన్న మే నెల 31 నుంచి ఓపెన్ చేయగా లోపాలు జూన్ 4–6 మధ్య బయటపడ్డాయి. సుమారు ₹26.4 కోట్ల వ్యయంతో కట్టిన బ్రిడ్జి దుస్థితి ఇది..

More in India