Latest

జనసేన రాజ్యసభ కాండిడేట్ ఇయనేనా?
రాజ్యసభ ఎన్నికల రేసులో జనసేన పార్టీ తరపున లింగమణి రమేష్ పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కూటమి డీల్‌లో భాగంగా TDPకి 3 రాజ్యసభ సీట్లు, జనసేనకు 1 సీటు కేటాయించారు. ఈ ఒక్క సీటుకు లింగమణి రమేష్‌ను కాండిడేట్‌గా పెట్టాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు టాక్. ఈరోజు ఈవెనింగ్ లోపే పవన్ కళ్యాణ్ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఈ తరం గ్రాడ్యుయేట్స్ కి కెరీర్ అవకాశాలు ఎన్నో!
నేటితరం కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కోసం సరికొత్త కెరీర్ అవకాశాలు వేచి ఉన్నాయి. పాత కాలం నాటి రొటీన్ 9-టు-5 ఉద్యోగాల ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), గిగ్ ఎకానమీ, రిమోట్ వర్క్ వంటి సరికొత్త మార్పులతో ఉద్యోగ రంగం సరికొత్తగా రూపాంతరం చెందుతోంది. ఇలాంటి మారుతున్న కాలంలో కేవలం డిగ్రీలతోనే సరిపెట్టకుండా.. నిరంతరం కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ, అప్‌డేట్ అవ్వడమే నేటి యువత సక్సెస్ మంత్ర!

YCP EX MLA అరెస్ట్!
వైసీపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గండిపేటలో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి నకిలీ జీవోలు, తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినట్లు ఆయనపై కేసు ఫైల్ అయింది. ఈ ల్యాండ్ స్కామ్‌లో దాదాపు రూ.12 కోట్ల ఫైనాన్షియల్ డీలింగ్స్ జరిగినట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేయడంతో పరారీలో ఉన్న ఆయనను తమిళనాడులోని కాంచీపురంలో నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ టీమ్స్ కలిసి అదుపులోకి తీసుకున్నాయి.

డిజిటలైజ్ అవుతున్న జర్మన్ల లవ్ స్టోరీస్..
చరిత్రలోని 1700ల నాటి నుండి ఉన్న దాదాపు 60,000 ప్రేమ లేఖలను డిజిటలైజ్ చేసేందుకు జర్మనీలోని కోబ్లెంజ్ యూనివర్సిటీ పరిశోధకులు, వాలంటీర్లు నడుం బిగించారు. ఇదొక పెద్ద ‘సిటిజన్ సైన్స్’ ప్రాజెక్ట్. కాలంతో పాటు భాష, సమాజం, ప్రేమ ఎలా మారాయో తెలుసుకోవడమే దీని లక్ష్యం.ఎమోజీలు, వాట్సాప్ చాటింగుల ఈ కాలంలో.. పాత తరం నాటి ముద్దుల గుర్తులు, ఎండిపోయిన పువ్వులతో ఉన్న ఈ అసలైన ప్రేమ లేఖలను భద్రపరచడం నిజంగా గ్రేట్ కదా!
చిన్నారిపై రోబో దాడి!
చైనాలోని ఒక ఎగ్జిబిషన్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న ఒక హ్యూమనాయిడ్ రోబో. సడన్‌గా కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న చిన్నారి కడుపులో బలంగా తన్నింది. ఆ దెబ్బకు బాలుడు నొప్పితో అక్కడే కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన అధికారులు బాబుకి ఫస్ట్ ఎయిడ్ చేశారు, ప్రజెంట్ బాబు సేఫ్ గానే ఉన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
ప్రకాష్ రాజ్‌కు నటి హేమ కౌంటర్!
పవన్ కళ్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ‘దొర’ అని పిలవడంపై నటి హేమ రియాక్ట్ అయ్యారు. ఆ మాటలో క్లియర్ గా వెటకారం కనిపిస్తోందని, తెలంగాణలో ఆ వర్డ్ ని ఏ ఉద్దేశంతో వాడుతారో మీకు తెలియనిది కాదన్నారు. పవన్ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయొద్దని, ఆయన గురుంచి కోట్లాది మందికి తెలుసని చెప్పారు. మీరు బాగా చదువుతారు కదా. పాస్ట్‌లో ఇలా విమర్శించిన వాళ్లు ఏమైపోయారో ఒక్కసారి చరిత్ర చదివి తెలుసుకోండి అంటూ ప్రకాష్ రాజ్‌కు హేమ కౌంటర్ ఇచ్చారు.

ఓల్డేజ్ లుక్ కి ఇలా గుడ్ బై కొట్టేయ్యండి !
వయసు పైబడినట్లు కనిపించడానికి యాంటీ ఏజింగ్ క్రీములు, పిల్స్ వాడటం కంటే సరైన నిద్ర పోవడం చాలా ముఖ్యం. పరిశోధనల ప్రకారం.. రోజూ 6.5 నుండి 7.5 గంటల నిద్ర శరీరానికి చాలా అవసరం. నిద్ర తగ్గినా లేదా ఎక్కువైనా త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హెల్తీగా, యంగ్‌గా ఉండాలంటే నిద్రతో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి!
ఎన్నికల బరిలోకి అన్నామలై కొత్త పార్టీ!
త్వరలో కొత్త పొలిటికల్ పార్టీని పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేసిన అన్నామలై, తాజాగా తన నెక్స్ట్ ప్లాన్‌ను రివీల్ చేశారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ లీడర్లను, కార్యకర్తలను ప్రిపేర్ చేయబోతున్నట్లు అన్నామలై స్పష్టం చేశారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ఇలా స్పీడ్ పెంచడం.. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్‌లో చర్చకు దారి తీసింది.

భూమిని కాపాడుకుందామంటే.. ఇప్పుడే స్టార్ట్ చేయండి
ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాది రిపబ్లిక్ ఆఫ్ అజర్ బైజాన్ పర్యావరణ పరిరక్షణ ప్రోగ్రామ్స్ ని #NowForClimate నినాదంతో హోస్ట్ చేస్తోంది. రెస్సాన్పిబుల్ సిటిజన్స్ గా మనం ఏం చేయాలంటే.. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా మొక్కని నాటాలి, టెర్రస్ గార్డెనింగ్ కూడా చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేసి క్లాత్ బ్యాగ్స్ వాడాలి. రోజూ వారీ వాడకంలో నీటివృథాని అరికట్టాలి.. అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు వేయకుండా విద్యుత్ ని ఆదా చేయాలి . చిన్న చిన్న దూరాలకి బైక్ లు, కారులు వాడకుండా నడవడం లేదంటే సైకిల్ మీద వెళ్లాలి
ఎన్నికల బరిలోకి అన్నామలై కొత్త పార్టీ!
త్వరలో కొత్త పొలిటికల్ పార్టీని పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేసిన అన్నామలై, వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లో తన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ లీడర్లను, కార్యకర్తలను ప్రిపేర్ చేస్తాను అని చెప్పారు. BJPకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ఇలా స్పీడ్ పెంచడం తమిళనాడు పాలిటిక్స్‌లో చర్చకు దారి తీసింది.
CM విజయ్ ఫస్ట్ కేబినెట్ విజువల్స్ వైరల్!
తమిళనాడు పాలిటిక్స్‌లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. సీఎం విజయ్ అధ్యక్షతన తొలి కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆయన సీఎం అయిన తర్వాత లీడ్ చేసిన ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ ఇదే కావడంతో.. దీనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలు, రాష్ట్ర డెవలప్‌మెంట్‌పై ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం విజయ్ ఫస్ట్ కేబినెట్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సీడ్ బాల్స్ చేసిన పవన్ కళ్యాణ్!
AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పర్యావరణం కోసం ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే సందర్భంగా ఆయన స్వయంగా తన చేతులతో ‘సీడ్ బాల్స్’ (విత్తనపు బంతులు) రెడీ చేశారు. పచ్చదనాన్ని పెంచడానికి, అడవులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇలాంటి గ్రీన్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డిప్యూటీ CM స్వయంగా కూర్చుని సీడ్ బాల్స్ చేస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కొత్త పొలిటికల్ పార్టీ వైపు అన్నామలై అడుగులు!
BJPకి రిజైన్ చేసిన తమిళనాడు లీడర్ అన్నామలై. తన నెక్స్ట్ పొలిటికల్ చాప్టర్‌ను అనౌన్స్ చేశారు. పార్టీకి రిజైన్ చేసిన కొద్దిరోజుల్లోనే ఆయన ఈ డెసిషన్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త మూవ్‌మెంట్‌తో తమిళనాడు పాలిటిక్స్‌లో అన్నామలై ఎలాంటి చేంజ్ తీసుకురాబోతున్నారో అని అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అతను పెట్టబోయే పార్టీకి 'తమిళగ మక్కల్ కళగం' లేదా 'తమిళగ మక్కల్ కట్చి' అనే పేర్లు పెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్లాస్టిక్ వేస్ట్‌తో నెలకు ₹50K ఇన్‌కమ్!
ప్లాస్టిక్ వేస్ట్‌ని రీసైకిల్ చేస్తూ తెలంగాణలోని సూర్యాపేట, హుస్నాబాద్ మున్సిపాలిటీలు సూపర్ రికార్డ్ క్రియేట్ చేశాయి. సూర్యాపేటలో రోజూ టన్ను ప్లాస్టిక్ కలెక్ట్ చేసి. దాంతో టైల్స్, ఇటుకలు తయారు చేస్తూ నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నారు. అటు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంకులు పెట్టించడంతో ప్లాస్టిక్ వాడకం తగ్గింది. అక్కడ వేస్ట్ బాటిల్స్‌తో ఏకంగా ఒక భారీ హెలికాప్టర్ బొమ్మను రెడీ చేశారు. ఈ గ్రేట్ వర్క్‌కి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ‘ఉత్తమ పర్యావరణ అవార్డు’ కూడా అనౌన్స్ చేసింది.
సైకిల్ రైడ్‌తో CM చంద్రబాబు స్పెషల్ మెసేజ్!
వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే సందర్భంగా AP CM చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ తొక్కారు. ఎన్విరాన్‌మెంట్ ని కాపాడుకోవాలనే మెసేజ్ ఇస్తూ ఆయన ఈ రైడ్‌లో పాల్గొన్నారు. సిఎం సైకిల్ తొక్కుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రాజ్యాంగం మీదే భారం వేసి ఇండియాకు వస్తున్నా!
CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇండియాకు రిటర్న్ వస్తున్నారు. "నేను ఇండియాకు వస్తున్నాను. నా తలరాతను కాన్‌స్టిట్యూషన్ చేతుల్లో పెడుతున్నాను" అంటూ ఆయన ట్విట్టర్ (X) లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు ‘#JaiBhim’ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మమత రెబెల్ వర్గంలో చిచ్చు
పశ్చిమబెంగాల్‌లో TMC రెబెల్ వర్గంలో కొత్త వివాదం మొదలైంది. తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ మమతని కేవలం సలహాదారు పాత్రకే పరిమితం చేయాలని ప్రతిపాదించారు. దీనిపై పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "మమతే మా సుప్రీం లీడర్. ఆమెను సలహాలకే పరిమితం చేస్తే మేం ఈ వర్గంలో ఉండం" అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీఎంసీలో 80 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు మమతని ఎదిరించారు. వారి వెనుక బీజేపీ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో అసమ్మతి ఎమ్మెల్యేల్లో విభేదాలు బయటపడడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది

బీజేపీకి అన్నామలై గుడ్‌బై..
తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ షాకింగ్ నిర్ణయం వెలువడింది. అన్నామలై రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించినట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటుకే పరిమితం కావడం, అన్నామలైకి టిక్కెట్ కూడా దక్కకపోవడంతో ఆయన రిజైన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం అన్నామలై మీడియాతో మాట్లాడతారు. అప్పుడే ఆయన భవిష్యత్ పై ఒక స్పష్టత వస్తుంది.

DEOగా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కలకలం
TG: సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారిగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అధికారుల తప్పిదంతో DEO రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడదారి పడుతున్న సొసైటీని మంచిమార్గంలో నడిపించే విద్యాశాఖ అధికారులే తప్పులు రాస్తే ఎలా అని పలువురు ఫైర్ అవుతున్నారు.

మణిపూర్‌లో మళ్లీ హింస.. ముగ్గురు మృతి
మణిపూర్‌లోని కాంగ్‌పోక్‌పి జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు మరోసారి ఆయుధాలతో విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో ఏడు ఇళ్లను పూర్తిగా తగలబెట్టారు. ఈ షాకింగ్ అటాక్‌తో ఆ ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

చెట్లతోనే మానవ మనుగడ: మంత్రి సీతక్క
TG: చెట్లతోనే మానవ మనుగడ కొనసాగుతుందని, ప్రకృతి, పచ్చదనం ప్రాణవాయువు అని మినిస్టర్ సీతక్క అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ములుగు మండలం ఇంచర్ల ఏకోపార్క్‌లో ఆమె మొక్కలు నాటారు. రాష్ట్రంలో ములుగు జిల్లాలోనే దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయని, పచ్చని జిల్లాగా మార్చడానికి మొక్కలు నాటి వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతివ్యక్తిపై ఉందన్నారు. ఇక్కడి ప్రాంతంలో దట్టమైన అడవులతో పాటు దేవాలయాలు, సరస్సులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.