ప్లాస్టిక్ వేస్ట్‌తో నెలకు ₹50K ఇన్‌కమ్!

ప్లాస్టిక్ వేస్ట్‌ని రీసైకిల్ చేస్తూ తెలంగాణలోని సూర్యాపేట, హుస్నాబాద్ మున్సిపాలిటీలు సూపర్ రికార్డ్ క్రియేట్ చేశాయి. సూర్యాపేటలో రోజూ టన్ను ప్లాస్టిక్ కలెక్ట్ చేసి. దాంతో టైల్స్, ఇటుకలు తయారు చేస్తూ నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నారు. అటు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంకులు పెట్టించడంతో ప్లాస్టిక్ వాడకం తగ్గింది. అక్కడ వేస్ట్ బాటిల్స్‌తో ఏకంగా ఒక భారీ హెలికాప్టర్ బొమ్మను రెడీ చేశారు. ఈ గ్రేట్ వర్క్‌కి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ‘ఉత్తమ పర్యావరణ అవార్డు’ కూడా అనౌన్స్ చేసింది.



