చెట్లతోనే మానవ మనుగడ: మంత్రి సీతక్క

TG: చెట్లతోనే మానవ మనుగడ కొనసాగుతుందని, ప్రకృతి, పచ్చదనం ప్రాణవాయువు అని మినిస్టర్ సీతక్క అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ములుగు మండలం ఇంచర్ల ఏకోపార్క్‌లో ఆమె మొక్కలు నాటారు. రాష్ట్రంలో ములుగు జిల్లాలోనే దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయని, పచ్చని జిల్లాగా మార్చడానికి మొక్కలు నాటి వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతివ్యక్తిపై ఉందన్నారు. ఇక్కడి ప్రాంతంలో దట్టమైన అడవులతో పాటు దేవాలయాలు, సరస్సులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.



