Latest

రుక్మిణి వసంత్ బికినీ పిక్చర్స్ ఫేక్
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న కన్నడ నటి రుక్మిణీ వసంత్ బికీనీ షూట్ విజువల్స్‌పై అన్నీ పూర్తిగా ఫేక్ .. ఆ ఫోటోలు, వీడియోలుడీప్‌ఫేక్ టెక్నాలజీతో ఎవరో కావాలనే తన ముఖాన్ని మార్చేసి క్రియేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ ఎవరూ వీటిని నమ్మవద్దని, వైరల్ చేయొద్దని కోరారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

CJP ఇన్ స్టా అకౌంట్ బ్లాక్ మళ్లీ రెస్టోర్
కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ డిజిటల్ క్రియేటర్ అభిజీత్ దీప్కేకు ఇన్‌స్టాగ్రామ్ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన రన్ చేస్తున్న CJP బ్యాకప్ అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ మే 23న కాసేపు బ్లాక్ చేసింది. రూల్స్ ఉల్లంఘించారంటూ అకౌంట్‌ను తొలగించినట్లు మెసేజ్ పంపారు. అయితే, ఆయన అప్పీల్ చేయడంతో కొద్దిసేపటికే అకౌంట్‌ను మళ్లీ రిస్టోర్ చేశారు. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బెంజ్ కారు ఉంటేనే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్?
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌ను కలవడంపై ఒక జనసైనికుడు చేసిన shocking కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒంటి నిండా బంగారం, లగ్జరీ బెంజ్ కార్లు ఉన్న వాళ్లకే ఆయన అపాయింట్‌మెంట్ దొరుకుతోందని, కామన్ కార్యకర్తలను పక్కన పెట్టేస్తున్నారని ఓపెన్‌గా చెప్తూ ఆ పార్టీ కార్యకర్త బాధపడ్డాడు. పవన్ చుట్టూ ఉన్న ఒక ‘కార్పొరేట్ గ్యాంగ్’ వల్లే ఆయన నార్మల్ పీపుల్‌కి దూరమవుతున్నారంటూ సోషల్ మీడియాలో జనసైనికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేన్స్‌లో ఐష్ బ్లూ మ్యాజిక్
వెయిటింగ్ ఓవర్! కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ రాయల్ ఎంట్రీ ఇచ్చారు. ఇండియన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన మెటాలిక్ బ్లూ మెర్మైడ్ గౌన్‌లో ఆమె దేవకన్యలా మెరిసిపోయారు. 1,500 గంటల చేతిపనితో తయారైన ఈ స్పెషల్ డ్రెస్, వింగ్స్ డిజైన్‌తో ‘మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ’ని ఇచ్చింది. 24వ సారి కేన్స్ రెడ్‌కార్పెట్‌పై నడిచిన ఐష్.. తన నమస్తే, ఫ్లయింగ్ కిస్సెస్‌తో కెమెరాలను తనవైపే తిప్పుకున్నారు.
హిస్టరీ క్రియేట్ చేసిన ఇండియన్స్… ఎవరెస్ట్ పైకి All Women Team
మన దేశ మహిళా శక్తి పవరేంటో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం (8,848 మీటర్లు) పై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుకి చెందిన మొదటి ‘ఆల్-ఉమెన్’ బృందం మే 21న ఉదయం 6:52 కి ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించింది. 14 మంది సభ్యులున్న ఈ టీమ్ లో 11 మంది మహిళా క్లైంబర్లు, ముగ్గురు సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. క్లిష్టమైన సౌత్ కోల్ రూట్ లో మైనస్ డిగ్రీల చలిని, తక్కువ ఆక్సిజన్ స్థాయిలను తట్టుకుంటూ వీరంతా పైకి చేరారు. 'క్లీన్ హిమాలయా' భాగంగా పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తను కూడా సేకరించి శభాష్ అనిపించుకున్నారు.

ఇవాంకా హత్యకు ఇరాన్ కుట్ర ..!
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను హత్య చేసేందుకు జరిగిన ఒక భారీ కుట్ర బయటపడింది. ఇరాన్ మద్దతున్న కతైబ్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన మహ్మద్ బాకర్ సాద్ దావుద్ అల్-సాది (32) అనే ఇరాకీ ఉగ్రవాదిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ ఖాసిం సులేమానీ చనిపోవడానికి రివెంజ్‌గా ఇవాంకాను టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఫ్లోరిడాలోని ఇవాంకా లగ్జరీ ప్యాలెస్ మ్యాప్, బ్లూప్రింట్ కూడా ఆ ఉగ్రవాది దగ్గర దొరకడం సంచలనంగా మారింది. అమెరికా అధికారులు అతనిని సీక్రెట్ గా విచారిస్తున్నారు.

తెలంగాణ నిప్పుల కుంపటి.. 20 జిల్లాల్లో 46 డిగ్రీలు
తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రోహిణి కార్తెకు ముందే ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 31 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి. సిర్పూర్‌లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఎండ తీవ్రతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కదులుతున్న ఒక స్కూటీ కూడా అగ్నికి ఆహుతైంది. మరో వారం రోజులు ఎండల ధాటి ఇలాగే ఉండనుంది.

అమెరికా గ్రీన్ కార్డు కావాలా ? అయితే మీ దేశం వెళ్లండి
అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డు పొందాలనుకునే వారికి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. టూరిస్టులు, స్టూడెంట్స్, టెంపరరీ వర్కర్లు ఎవరైనా గ్రీన్ కార్డ్ కావాలంటే సొంత దేశానికి వెళ్లి అప్లై చేసుకోవాలి. దీనికనుగుణంగా అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ ( USCIS ) మార్పులు చేసింది. ఇప్పటివరకు అమెరికాలోనే ఉంటూ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ (AOS) ద్వారా అంటే అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉండేది.ఇకపై అసాధారణ పరిస్థితుల్లో తప్ప, అందరూ సొంత దేశం నుంచే కన్సులర్ ప్రాసెస్ ద్వారా అప్లై చేయాలని USCIS స్పష్టం చేసింది.

10 రోజుల్లో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు హైక్
పశ్చిమాసియా సంక్షోభం ఎఫెక్ట్ మన జేబులపై గట్టిగానే పడుతోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచాయి. గడచిన 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి. మొత్తం మీద లీటర్‌కు దాదాపు రూ.5 వరకు భారం పెరగడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. పెట్రో ధరల పెంపుతో అన్ని నిత్యావసర సరుకులు కూడా పెరగనున్నాయి.
నా కారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు - యాంకర్ విష్ణు ప్రియ
సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్.పై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో యాంకర్ విష్ణు ప్రియ కంప్లయింట్ చేశారు. ఒక మహిళ అయి ఉండి కూడా ఒక యూ ట్యూబర్ తనపై అసభ్యంగా కామెంట్లు చేస్తోందని, ఇష్టాను సారం వార్తలు రాస్తోందని తానపై అసభ్య కథనాలు రాస్తూ క్యారక్టర్ అసాసినేషన్ చేస్తోందని మండి పడ్డారు.ఇ కపై ఊరుకునేది లేదని అందరిపై చర్యలు తప్పవనీ హెచ్చరించింది.

RRR కొత్త పార్టీ దిశగా అడుగులు..వేగంగా కదులుతున్న పావులు
ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రాబోతోంది. కాంట్రవర్సీలకు పేరెన్నికగన్న త్రిబుల్ ఆర్ గా పేరు పడిన ఎమ్మెల్యే రఘు రామకృష్ణం రాజు కొత్త పార్టీ పెడుతున్నారని టాక్. కొత్త రాజకీయ వేదిక కోసం ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ పేరుతో ఒక ఫోరం ను ఆయన రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగు వీర లేవరా అనే పేరుతో ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దాని ద్వారా తన భావాలను, అభిప్రాయాలను పంచుకుంటానని అన్నారు. ఆ తర్వాత కార్యాచరణ ఉంటుందని తెలుస్తోంది.

భోగాపురం ఎయిర్ పోర్ట్ జులై 8 నుంచి అందుబాటులోకి
ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ఎట్టకేలకు ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. రాబోయే జులై 8వ తేదీ నుండి ఈ కొత్త విమానాశ్రయం నుండి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు మొదలవుతాయని అఫీషియల్ సోర్సెస్ వెల్లడించాయి. జులై 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈఎయిర్ పోర్ట్ ఘనంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తుండటంతో పలు ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను కూడా అక్కడికే షిఫ్ట్ చేస్తున్నాయి.

హీట్ వేవ్స్. మంట.... ఏసీలా? కూలర్లా? ఏది బెస్ట్ ఛాయిస్?
హీట్ వేవ్స్ కంటిన్యూ అవుతున్న ఈ టైమ్ లో కూలర్లా? ఏసీలా ఏది బెస్ట్ అనే డౌట్ అందరికీ వస్తుంది.. అయితే ఎక్స్ పర్ట్స్ స్టడీ చేసి దేని ఇంపాక్ట్ దానిదేనంటున్నారు. కూలర్లు గొంతు, చర్మం డ్రై అవ్వకుండా నేచురల్ హ్యుమిడిటీని ఇస్తాయి. కానీ వాటర్ క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా, దోమలకి అడ్డాగా మారుతాయి. అదే ఏసీలు.. బాడీ టెంపరేచర్‌ని బ్యాలెన్స్ చేస్తూ హీట్‌స్ట్రోక్ రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా వృద్ధులు, బీపీ, హార్ట్ పేషెంట్స్‌కి ఏసీలే సేఫ్ ఆప్షన్. అయితే ఏసీని 24°C - 26°C మధ్య మెయింటైన్ చేయడం హెల్త్‌కి మంచిది. డ్రై క్లైమేట్ ఉంటే కూలర్ ఓకే, కానీ విపరీతమైన ఎండలు, ఉక్కపోత ఉంటే మాత్రం ఏసీనే బెస్ట్ ఛాయిస్!

ఎబోలా వైరస్ కు వ్యాక్సిన్ తయారీలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు
యూకే సైంటిస్టులు ‘బుందిబుగ్యో’ అనే రేర్ ఎబోలా స్ట్రెయిన్‌కి వ్యాక్సిన్ రెడీ చేస్తున్నారు. దీనికి ప్రజెంట్ ఎలాంటి ట్రీట్‌మెంట్ లేదు. కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు వాడిన చింపాంజీ కోల్డ్ వైరస్ టెక్నాలజీతోనే ఆక్స్‌ఫర్డ్ టీమ్ ఈ కొత్త వాక్సిన్ ను డెవలప్ చేస్తోంది. యానిమల్ ట్రయల్స్ సక్సెస్ అయితే 2-3 మంత్స్‌లో హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయని WHO చెప్పింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ను లార్జ్ స్కేల్ లో మాస్ ప్రొడక్షన్ చేయడానికి లైన్ క్లియర్ చేసుకుంది.

కొహ్లీ సైన్ చేసిన బ్యాట్ విజయ్ చేతిలో... ఫ్యాన్స్ కి పండగే ఇక
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌కు విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్‌ను MRF ఛైర్మన్ కె.ఎమ్. మామెన్ గిఫ్ట్ చేశారు. రాష్ట్రంలో ₹5,300 కోట్ల గ్రీన్‌ఫీల్డ్ తయారీ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించేందుకు వచ్చిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. విజయ్ చేతిలో బ్యాట్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో విజయ్ CSK బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించారు. ఇది చూసిన అటు క్రికెట్ అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

త్విషా శర్మ కేసులో కస్టడీలోకి భర్త... లాప్రాక్టీస్ పై వేటు
త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరారీలో ఉన్న నిందితుడు, ఆమె భర్త సమర్థ్ సింగ్‌ను భోపాల్ పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతని న్యాయవాద వృత్తి ప్రాక్టీస్‌పై తక్షణమే నిషేధం విధించింది. మరోవైపు, ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, మరణానికి గల అసలు కారణాలను తేల్చేందుకు ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) బృందంతో రెండవసారి పోస్ట్‌మార్టం (అటాప్సీ) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.పెళ్లయిన రెండు నెలలకే త్విషా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

ఆఫ్రికాలో ఎబోలా వైరస్... ఢిల్లీ ఎయిర్ పోర్టులో హై అలెర్ట్
సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఢిల్లీ విమానాశ్రయం అలెర్ట్ అయ్యింది. ఎబోలాకు ఎటువంటి ఆమోదిత వ్యాక్సిన్ లేదా చికిత్స లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. దీంతో విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్, టెన్సా బారికేడ్లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సూడాన్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్టులో కూడా 24 గంటల నిఘా వ్యవస్థను షురూ చేశారు.

ఓబీసీ కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా? సుప్రీం ఘాటు కామెంట్లు
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా, ఆర్థికాభివృద్ధి సాధించిన వెనుకబడిన తరగతుల (OBC) కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు కొనసాగించాలా అని ప్రశ్నించింది. ఐఏఎస్ అధికారుల పిల్లలకు మళ్లీ రిజర్వేషన్లు ఎందుకని, దీనివల్ల సామాజిక మార్పు రాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కర్ణాటకలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సంతానమైన ఒక అభ్యర్థిని 'క్రీమీలేయర్' కింద రిజర్వేషన్లకు అనర్హుడిగా ప్రకటించడాన్ని కోర్టు సమర్థించింది.ఒకే కుటుంబం తరతరాలుగా రిజర్వేషన్లు వాడుకుంటే, వెనుకబడిన వర్గాల్లోని నిజమైన పేదలకు ఎప్పటికీ న్యాయం జరగదని కోర్టు అభిప్రాయపడింది.

ఆయిల్ సప్లై బంద్.. గ్లోబల్ మార్కెట్‌కి 'రెడ్ జోన్' వార్నింగ్!
అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ సప్లై దారుణంగా దెబ్బతింది. మెయిన్ రూట్ అయిన హోర్ముజ్ జలసంధి క్లోస్ అవ్వడంతో.. డైలీ 13 నుండి 14 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ సప్లై ఆగిపోయిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) చీఫ్ ఫాతిహ్ బిరోల్ చెప్పారు. ఎమర్జెన్సీ ఆయిల్ నిల్వలు కూడా పూర్తిగా అయిపోవడంతో ఆయిల్ మార్కెట్ త్వరలోనే డేంజరస్ 'రెడ్ జోన్' లోకి వెళ్తుందని, దీనివల్ల రేట్లు విపరీతంగా పెరిగి గ్లోబల్ ఎకానమీ క్రైసిస్‌లో పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ఎలన్ మస్క్ వెనక వెయిట్రెస్ చైనా నిఘా వర్గమా?
బీజింగ్‌లో జరిగిన అధికారిక విందులో ఎలన్ మస్క్ వెనుక నిలబడిన సర్వర్ (వెయిట్రెస్), చైనా మిలిటరీకి చెందిన ఒక ఉన్నతాధికారి అని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఆరోపించారు. అమెరికా ప్రతినిధి బృందంపై నిఘా ఉంచేందుకు చైనా ఈ వ్యూహం పన్నిందని ఆమె పేర్కొన్నారు. గతంలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక కూడా చైనా ప్రమేయం ఉందంటూ జెంగ్ వివాదాస్పద ఆరోపణలు చేశారు.
అమ్మాయిని వెనక నుండి సీక్రెట్‌గా ఫోటోలు తీస్తూ దొరికాడు!
ఒక రైల్వే స్టేషన్‌లో shocking ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి నిల్చొని ఉండగా.. వెనక నుండి ఆమెకు తెలియకుండా ఒక ఓల్డ్ పర్సన్ మొబైల్‌లో తప్పుగా ఫోటోలు తీస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ విషయం కనిపెట్టిన ఆ అమ్మాయి.. వెంటనే అతడిని గట్టిగా నిలదీసి అందరి ముందు కొట్టింది. స్పాట్‌లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి, ఆ ఓల్డ్ పర్సన్ చేసిన పనికి అందరి ముందే కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అతని ఏజ్ ఏంటి అతను చేసే పని ఏంటి అంటూ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.