Latest

రాఘవ లారెన్స్ బిగ్ అనౌన్స్ మెంట్ పోస్ట్‌పోన్!
News· 10 Jun 2026

రాఘవ లారెన్స్ బిగ్ అనౌన్స్ మెంట్ పోస్ట్‌పోన్!

రాఘవ లారెన్స్ తన లైఫ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్‌ను పోస్ట్‌పోన్ చేశాడు. యాక్చువల్ గా జూన్ 11న గురువారం మార్నింగ్ ఈ అప్‌డేట్ ఇవ్వాల్సింది. కానీ డైరెక్టర్ భారతీరాజా చనిపోవడంతో, ఇండస్ట్రీ మొత్తం బాధలో ఉంటే ఇప్పుడు అనౌన్స్ మెంట్ చేయడం కరెక్ట్ కాదని ఆపేశాడు. మళ్లీ ఈ అనౌన్స్ మెంట్‌ను జూన్ 12న friday మార్నింగ్ 10AMకి రిలీజ్ చేయబోతున్నట్లు లారెన్స్ ట్వీట్ చేశాడు.

PM మోదీపై కమల్ హాసన్ ప్రశంసలు..
Politics· 10 Jun 2026

PM మోదీపై కమల్ హాసన్ ప్రశంసలు..

ఇండియా హిస్టరీలోనే ఎక్కువ కాలం PMగా రికార్డ్ క్రియేట్ చేసిన నరేంద్ర మోదీకి స్టార్ హీరో కమల్ హాసన్ కంగ్రాట్స్ చెప్పారు. మనలాంటి పెద్ద దేశంలో ఇన్నేళ్లు పబ్లిక్ నమ్మకాన్ని గెలుచుకోవడం మామూలు విషయం కాదంటూ మెచ్చుకున్నారు. మన ఫోకస్ అంతా ఎప్పుడూ దేశం ఇంప్రూవ్ అవ్వడం, జనాలు బాగుండటం పైనే ఉండాలని ట్వీట్ చేశారు. ప్రజెంట్ కమల్ హాసన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

రేపే 'కాక్రోచెస్ ప్రొటెస్ట్'..▶
Politics· 10 Jun 2026

రేపే 'కాక్రోచెస్ ప్రొటెస్ట్'..

కాక్రోచెస్ పార్టీకి సపోర్ట్ గా జూన్ 11న పుణెలో జరగబోయే బిగ్ ప్రొటెస్ట్ లో సోనమ్ వాంగ్చుక్ జాయిన్ కాబోతున్నారు. పేపర్ లీక్ ఇష్యూస్ పై సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ కి స్టూడెంట్స్, పబ్లిక్ అందరూ భారీ సంఖ్యలో తరలిరావాలని కాక్రోచెస్ పార్టీ ఫౌండర్ పిలుపునిచ్చారు. ప్రజెంట్ ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

'పెద్ది' సినిమా టికెట్ రేట్ల పెంపు ఇల్లీగల్!
Cinema· 10 Jun 2026

'పెద్ది' సినిమా టికెట్ రేట్ల పెంపు ఇల్లీగల్!

తెలంగాణ హోమ్ సెక్రటరీ శిఖా గోయల్‌పై హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ అయింది. రూల్స్ (జీవో 151) ఫాలో అవ్వకుండా ఈ నెల 2న 'పెద్ది' సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఆమె ఇచ్చిన జీవో ఇల్లీగల్ అని కోర్టు సీరియస్ అయింది. టికెట్ రేట్ల పెంపు జీవో కరెక్ట్ కాదంటూ. ఈ కేస్ నెక్స్ట్ హియరింగ్‌ను ఈ నెల 15కి పోస్ట్‌పోన్ చేసింది

మమతా బెనర్జీ సామ్రాజ్యం క్లోజ్? TMCలో తిరుగుబాటు!
Politics· 10 Jun 2026

మమతా బెనర్జీ సామ్రాజ్యం క్లోజ్? TMCలో తిరుగుబాటు!

అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయాక మమతా బెనర్జీ పార్టీ TMCలో ఇంటర్నల్ ఫైట్స్ బహిర్గతమవుతున్నాయి. MLA రితబ్రత బెనర్జీ 58 మంది MLAల సపోర్ట్ తో ప్రతిపక్ష నేత పదవి అడుగుతుండగా. మరోవైపు MP కాకోలి ఘోష్ 19 మంది MPలతో కలిసి NDAకి సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. లీడర్స్ అందరూ తిరుగుబాటు చేస్తుండటంతో దీదీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

22 జిల్లాల సర్వే.. రిపోర్ట్ లో ఏముంది?
News· 10 Jun 2026

22 జిల్లాల సర్వే.. రిపోర్ట్ లో ఏముంది?

తెలంగాణలో కౌలు రైతుల సమస్యలపై 'రైతు స్వరాజ్య వేదిక' ఆధ్వర్యంలో ఒక important సర్వే రిపోర్ట్ రిలీజ్ అయింది. 22 జిల్లాల్లో 1816 మంది కౌలు రైతులను ఇంటర్వ్యూ చేసి ఈ నివేదికను తయారు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ప్రముఖులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇచ్చి, అన్ని రకాల ప్రభుత్వ స్కీమ్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 2011 భూ కౌలుదారుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, CM దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరారు.

RMP డాక్టర్ క్రేజీ ట్రీట్మెంట్.. దెబ్బ తగిలితే పిన్నులు కొట్టాడు!
Crime· 10 Jun 2026

RMP డాక్టర్ క్రేజీ ట్రీట్మెంట్.. దెబ్బ తగిలితే పిన్నులు కొట్టాడు!

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఉపాధి పనుల్లో రాములమ్మ కి వేలికి గాయమైతే.. మంజునాథ్ అనే RMP డాక్టర్ ఏకంగా పేపర్లకి కొట్టే పిన్నుల మిషన్ (స్టేప్లర్) తో కుట్లు వేశాడు. నొప్పి తగ్గకపోవడంతో ఆమె '104' మెడికల్ క్యాంప్‌కి వెళ్ళింది. వేలికి ఉన్న పిన్నులను చూసి అక్కడి గవర్నమెంట్ డాక్టర్లు, స్టాఫ్ అందరూ మైండ్ బ్లాక్ అయి షాకయ్యారు.

నెల రోజుల క్రితమే పెళ్లి, ఇంతలోనే ఘోరం!
Crime· 10 Jun 2026

నెల రోజుల క్రితమే పెళ్లి, ఇంతలోనే ఘోరం!

కర్ణాటకలోని మండ్యలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. బిజినెస్ లాసెస్, హోమ్ లోన్ అప్పులు ఎక్కువవడంతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన ప్రభాకర్ అనే బట్టల వ్యాపారి.. తన భార్య జ్యోతి, కొడుకు సంతోష్‌లను చంపేసి, ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. నెల రోజుల క్రితమే సంతోష్‌కి మ్యారేజ్ అయింది. పక్క రూమ్‌లోనే పడుకున్న కొత్త పెళ్లికూతురు ఉదయం లేచి చూసేసరికి ముగ్గురూ శవాలై కనిపించడంతో షాక్‌లోకి వెళ్ళిపోయింది.

అప్పులు తీర్చలేక తల్లిని చంపిన కొడుకు
Crime· 10 Jun 2026

అప్పులు తీర్చలేక తల్లిని చంపిన కొడుకు

AP: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన రఘువంశీ హైదరాబాద్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన యువకుడు భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం విస్సన్నపేటలో ఉన్న తమ ఇల్లు అమ్మాలంటూ తన తల్లి రమాదేవిపై గత కొంతకాలంగా ఫ్రెజర్ చేశాడు. అయితే ఇల్లు అమ్మడానికి ఆమె నిరాకరించడంతో తీవ్ర కక్ష పెంచుకున్న కుమారుడు దారుణంగా కొట్టి ఆమెను హతమార్చాడు. విస్సన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

హిస్టరీ క్రియేట్ చేసిన మోదీ!▶
Politics· 10 Jun 2026

హిస్టరీ క్రియేట్ చేసిన మోదీ!

ఇండియా హిస్టరీలోనే ఎక్కువ కాలం పీఎంగా రికార్డ్ క్రియేట్ చేసిన నరేంద్ర మోదీకి కేంద్ర క్యాబినెట్ కంగ్రాట్స్ తెలిపింది. దేశం కోసం ఆయన రాత్రి పగలు కష్టపడే తత్వాన్ని, లీడర్‌షిప్‌ని మెచ్చుకుంటూ మంత్రులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి విషెస్ చెప్పారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మోదీకి ఇటలీ PM జార్జియా మెలోని స్పెషల్ విషెస్!
Politics· 10 Jun 2026

మోదీకి ఇటలీ PM జార్జియా మెలోని స్పెషల్ విషెస్!

ఇండియాలో ఎక్కువ కాలం పీఎంగా ఉండి రికార్డ్ క్రియేట్ చేసిన నరేంద్ర మోదీకి కంగ్రాట్స్ చెప్తూ ఇటలీ పీఎం జార్జియా మెలోని ట్వీట్ చేశారు. రీసెంట్ గా రోమ్ లో మోదీని కలవడం చాలా హ్యాపీగా ఉందంటూ ఆమె పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజల ఫ్యూచర్ కోసం, సరికొత్త అవకాశాల కోసం ఒక స్పెషల్ డీల్ సెట్ చేసుకున్నామని చెప్పారు. ప్రజెంట్ మెలోని పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

The Clear Cut News Headlines- ముఖ్యాంశాలు▶
News· 10 Jun 2026

The Clear Cut News Headlines- ముఖ్యాంశాలు

* డిగ్రీ ఉంటే చాలు.. SBI లో 7,150 జాబ్స్! * విశాఖ స్టీల్ ప్లాంట్‌ దగ్గరికి చేరుకున్న YS జగన్.. *క్యాన్సర్ పిల్లల మధ్య బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్! *తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

గంజాయి ముఠా రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు
Crime· 10 Jun 2026

గంజాయి ముఠా రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు

AP: అల్లూరిసీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న ముఠా సభ్యులు హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడిచేశారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, నలుగురిని పట్టుకున్నారు. నిందితులు ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. 290కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

అవినీతి అనకొండకు 14రోజుల రిమాండ్
Crime· 10 Jun 2026

అవినీతి అనకొండకు 14రోజుల రిమాండ్

TG: తెలంగాణ R & B ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్‌కు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACB అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికారులు ఆయన్ను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. మియాపూర్‌లోని ఆయన నివాసం, నిజామాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.

సినిమా మేకింగ్ లో రియలిజానికి కేరాఫ్ అడ్రస్ !
Politics· 10 Jun 2026

సినిమా మేకింగ్ లో రియలిజానికి కేరాఫ్ అడ్రస్ !

భారతీ రాజా మూవీస్ లో సాంగ్స్ కి ప్రయారిటీ ఎక్కువ. మాస్ట్రో ఇళయ రాజా, ఆయనది గోల్డెన్ కాంబో. ఆ తర్వాత ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా భారతీ రాజాకు మంచి హిట్స్ ని ఇచ్చింది. వారిద్దరితోనూ ఈగో క్లాషెస్ వచ్చినా కాలక్రమంలో ఓల్డేజ్ కు వచ్చాక వారితో మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేశారు. భారతీ రాజా డైరక్టరే కాదు.. నటుడు కూడా. తమిళ్ బేస్డ్ తెలుగు ఫిలింస్ యువ, తిరు సినిమాల్లో ఆయన రోల్స్ అందరినీ మెప్పించాయి. ఇండస్ట్రీ కి చేసిన సేవలకి గుర్తింపుగా ఆయనకు అనేక జాతీయ అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది.

డిగ్రీ ఉంటే చాలు.. SBI లో 7,150 జాబ్స్!▶
News· 10 Jun 2026

డిగ్రీ ఉంటే చాలు.. SBI లో 7,150 జాబ్స్!

బ్యాంక్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్లకి SBI గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 7,150 ట్రైనీ పోస్టుల అప్లికేషన్ లాస్ట్ డేట్‌ను జూన్ 15, 2026 వరకు పొడగించింది. ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు దీనికి ఎలిజిబుల్. సెలెక్ట్ అయిన వాళ్లకి one year ట్రైనింగ్ ఇచ్చి, నెలకు 15 వేల పాకెట్ మనీ (స్టైపెండ్) ఇస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామ్ బేస్ చేసుకొని సెలెక్షన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు SBI అఫీషియల్ సైట్ లో అప్లై చేసుకోవచ్చు.

తెలుగులో సూపర్, డూపర్ హిట్ సాంగ్స్ భారతీ రాజావే
Cinema· 10 Jun 2026

తెలుగులో సూపర్, డూపర్ హిట్ సాంగ్స్ భారతీ రాజావే

ఇళయరాజాతో ఆయన కాంబినేషన్ ఒక గోల్డెన్ ఎరా. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్‌ను కూడా తన 'కిజక్కు చీమయిలే' (తెలుగులో 'పలనాటి పౌరుషం') సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చేలా ప్రోత్సహించారు. సీతాకోక చిలుక మూవీలో మిన్నేటి సూరీడు పాట, ఆరాధన మూవీలో అరె ఏమైందీ సాంగ్, ఎర్రగులాబీలులో ఎదలో లయలు, పెదవుల శ్రుతులు లాంటి సాంగ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. భారతీ రాజా మూవీస్ లో ఈ సాంగ్స్ వినడానికే కాదు, పల్లెటూరి పచ్చదనం కళ్లముందు కదలాడుతుంది.

జెన్ జీ లొ నయా ట్రెండ్... ఏకాంత ప్రదేశాలలోనే రిలాక్సేషన్ !
Health· 10 Jun 2026

జెన్ జీ లొ నయా ట్రెండ్... ఏకాంత ప్రదేశాలలోనే రిలాక్సేషన్ !

ప్రస్తుత డిజిటల్ యుగంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న జెన్ జీ యువత సరికొత్త మార్గాల వైపు మొగ్గు చూపుతోంది. రద్దీగా ఉండే నగరాలు, సోషల్ మీడియాకు దూరంగా... మాల్స్, ఆఫీసుల్లోని ఖాళీగా ఉండే ప్రదేశాలలోవారు మానసిక ప్రశాంతతను, ఉపశమనాన్ని పొందుతున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ కొత్త లైఫ్‌స్టైల్ ట్రెండ్ యువతలో ఒంటరితనాన్ని దూరం చేస్తూ, కొత్త ఊరటనిస్తోంది.

నామినేషన్ రిజెక్ట్.. ECI ఆఫీస్‌కి మీనాక్షి నటరాజన్!
Politics· 10 Jun 2026

నామినేషన్ రిజెక్ట్.. ECI ఆఫీస్‌కి మీనాక్షి నటరాజన్!

రాజ్యసభ ఎన్నికల నామినేషన్ రిజెక్ట్ అవ్వడంతో కాంగ్రెస్ కాండిడేట్ మీనాక్షి నటరాజన్ అలర్ట్ అయ్యారు. నామినేషన్ క్యాన్సిల్ అయిన మరుసటి రోజే ఆమె ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ (ECI) ఆఫీస్‌కి వెళ్లారు. అసలు నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందో క్లారిటీ తెచ్చుకోవడానికి ఈసీఐ అధికారులను కలవనున్నారు. ప్రజెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ ఇష్యూ ఫుల్ హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు ఇండస్ట్రీకి క్లాసిక్స్ నిచ్చిన గ్రేట్ డైరక్టర్ !
Cinema· 10 Jun 2026

తెలుగు ఇండస్ట్రీకి క్లాసిక్స్ నిచ్చిన గ్రేట్ డైరక్టర్ !

తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన తన చిత్రాలను తెలుగులో కూడా రీమేక్ చేసి ఇక్కడి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మేటి డైరక్టర్ భారతీ రాజా. ముఖ్యంగా కమల్ , శ్రీదేవి నటించిన "ఎర్ర గులాబీలు" (తమిళంలో సిగప్పు రోజాక్కళ్), కే జె యేసుదాస్ అద్భుతమైన పాటలతో వచ్చిన "కొత్త జీవితాలు", అలాగే "సీతాకోకచిలుక" వంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. పరిశ్రమకు ఎందరో నటీనటులను, టెక్నీషియన్లను పరిచయం చేసిన క్రెడిట్ ఆయనదే. ప్రముఖ యాక్ట్రెస్ రాధిక, రాధ, రేవతి, విజయశాంతి, కాజల్ కిరణ్ వంటి ఎందరో స్టార్ హీరోయిన్లు ఆయన సినిమాల ద్వారానే పరిచయం అయ్యారు.

Today CM రేవంత్ రెడ్డి షెడ్యూల్!
Politics· 10 Jun 2026

Today CM రేవంత్ రెడ్డి షెడ్యూల్!

తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించనున్నారు. సాయంత్రం 5:30PM కు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఆఫీస్ బిల్డింగ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత CM రేవంత్ రెడ్డి అక్కడ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.