Latest

అర్హతకి మించి విద్యార్హత ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు పనికి రారు : సుప్రీం
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అర్హతగా ఏం చదవాలని చెప్పారో వారినే తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ చదువుకుంటే వారు ఆ పోస్టుకి అర్హులు కారని తీర్పు చెప్పింది. తమిళనాడు బ్యాంకులో టెంపరరీ అటెండర్ పోస్టుకు ఉద్యోగం పొందిన డిగ్రీ హోల్డర్ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఉద్యోగం నుంచి అతడిని తొలగించడాన్ని జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల బెంచ్ సమర్థించింది. కావాల్సిన దానికంటే అధిక విద్యార్హత ఉన్నవారికి ఉద్యోగాలిస్తే తక్కువ చదువుకున్నవారు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది.

లిక్కర్ షాపులే పార్టీల ATMలా మారాయా? సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు సీఎం విజయం తన తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే TASMAC మద్యం దుకాణాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. TASMAC ద్వారా పొలిటికల్ పార్టీలకు అక్రమ మార్గాల్లో ఫండ్స్ వసూలు చేసే విధానానికి చెక్ పెట్టారు. ప్రభుత్వ అంచనా ప్రకారం, TASMAC వ్యవస్థలో నెలకు సుమారు ₹102 కోట్లు అనధికారికంగా పార్టీ ఫండ్ పేరుతో మళ్లుతోంది. గత 5 ఏళ్లలో దాదాపు ₹1,600 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఎలాంటి వారిని వదలవద్దని, వెంటనే అందరినీ అరెస్ట్ చేయాలని విజయ్ ఆదేశించారు.

మళ్లీ బండ పడింది… గ్యాస్ సిలండర్ పై రూ.29 పెంపు
సామాన్యుల నెత్తి మీద మళ్లీ గ్యాస్ ధరల బండ పడింది. డొమస్టిక్ LPG సిలిండర్ ధరపై రూ.29 పెరిగింది. కొత్త ధర ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ పెంపుతో హైదరాబాద్ లో ధర దాదాపుగా వెయ్యికి చేరువలో ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యు ప్రజలకి ఇది మరింత భారం కానుంది

AI వచ్చినా భయం లేదు- రేవంత్
ఏఐ వచ్చినా ఎవరూ భయపడాల్సిన పని లేదంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్.. వైట్ కాలర్ జాబ్స్ కు ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ జాబ్స్.. దీనికి ప్రత్యామ్నాయం సృష్టించడం ఏఐ తరం కాదు అన్నారు రేవంత్. ఏఐ ఎన్ని అద్భుతాలు చేసినా రాజకీయ నాయకుడిని సృష్టించలేదని కాబట్టి పొలిటీషియన్లకు భయం లేదు. నేటితరం ప్రత్యామ్నాయ టెక్నాలజీ పై దృష్టి పెట్టాలి అని హిందూ పత్రిక ఇండియా కాంక్లేవ్ ది హిందూ హడుల్ 2026 లో ఎడిటర్ ఎన్ . రామ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

ఏపీతో కాదు.. ప్రపంచంతోనే మా పోటీ- రేవంత్
తెలంగాణకు ప్రపంచంతోనే అసలైన పోటీ.. పొరుగు రాష్ట్రాలు లెక్క కాదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చైనా జపాన్.సౌత్ కొరియాలతోనే మాపోటీ అన్నారాయన. తాను 15 ఏళ్ల క్రితమే చైనా విజట్ చేసినట్లు అందుకే తన నినాదం చైనాప్లస్ వన్ అని అన్నారు.చైనా యూజ్ చేసే టెక్నాలజీ తనను బాగా అట్రాక్ట్ చేస్తుందని ఇండియా కాంక్లేవ్ ది హిందూ హడుల్-2026 లో ఆ పత్రిక ఎడిటర్ ఎన్. రామ్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

పెట్రోల్ బాదుడుకి చెక్... దేశంలోకి E-85 పెట్రోల్
మన దేశంలోకి కొత్త రకం పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. E-85 అనే ఈ పెట్రోల్ ధర చవక.. దీని రేట్ లీటర్ రూ. 82 రూపాయలు మాత్రమే. తొలిసారిగా ఢిల్లీలో ఈ టైప్ పెట్రోల్ బంక్ ను తెరిచారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లోకి కూడా అందు బాటులోకి తెస్తారు.అయితే ఈ పెట్రోల్ ఫ్లెక్స్ - ఫ్లూయల్ వెహికల్స్ కు మాత్రమే యూజ్ అవుతుంది. మామూలు పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ఉంటే ఈ E-85 రకంలో ఇథనాల్ చాలా ఎక్కువగా ఉంటుంది.మైలేజ్ కూడా తక్కువే. ఈ బంకుల్లో E85 డిస్పెన్సర్‌కు ప్రత్యేకంగా పర్పుల్ రంగు నాజిల్ ,బ్రాండింగ్ ఉంటుంది.

రేపు రాత్రి నుంచి చేపమందు పంపిణీ కి సర్వం సిద్ధం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ల్ మృగశిర కార్తె సందర్భంగా ఆస్త్మా రోగులకు చేపమందు ప్రసాదం పంపిణీకి అంతా రెడీ అయింది. రేపు రాత్రి 9 గంటలనుంచి మరుసటి రోజు రాత్రి వరకూ ఈ సప్లయ్ కంటిన్యుయస్ గా జరుగుతుంది. 179 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చేపమందు ప్రసాదం కోసం దూధ్ బౌలిలోని సొంతింట్లో బత్తిన సోదరులు ఈ ప్రసాదాన్ని తయారు చేసి పంపిణీ చేస్తారు.

స్పై మూవీస్ లోనూ లవ్ సాంగ్స్ చేయచ్చు - శాశ్వత్ సచ్ దేవ్
కథలో భావోద్వేగం బలంగా ఉంటే స్పై మూవీస్ లోనూ లవ్ ట్రాక్స్ పెట్టొచ్చని మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ అన్నారు. ఆయన మ్యూజిక్ చేసిన యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రాలు 'ధురంధర్' 'ధురంధర్: ది రివెంజ్'ఆల్బమ్స్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ₹325 కోట్ల బిజినెస్ వాల్యూని జనరేట్ చేసి రికార్డు సృష్టించాయి. స్పై మూవీస్ లో ప్రేమ గీతాల ఇంపార్టెన్స్ ను ఆయన మింట్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బెర్లిన్ సింథసైజర్ల వంటి వెస్ట్రన్ ఎలక్ట్రానిక్ సంగీతాన్ని, 70 ఏళ్ల నాటి సాంప్రదాయ ఖవ్వాలీ వంటి ఇండియన్ ఫోక్ సంగీతాన్ని మిక్స్ చేసి ఈ చిత్రాల కోసం ఎమోషనల్ లవ్ ట్రాక్స్ ను ఆయన చేశారు.

లాలూ బంగ్లాకు కర్రలతో కాపలా
RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ సీఎం రబ్రీ దేవి దంపతులకు కేంద్రం Z+ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవడం బీహార్ పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది. కేంద్రం డెసిషన్ ని వ్యతిరేకిస్తూ RJD కార్యకర్తలు తమ ప్రతాపం చూపిస్తామని ముందుకొచ్చారు. తమ నేతకు తామే రక్షణగా ఉంటామని వందలాది మంది కార్యకర్తలు చేతుల్లో లాఠీలు, కర్రలతో లాలూ బంగ్లా బయట డే అండ్ నైట్ కాపలా కాస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం భద్రతను తగ్గించిందని ఆరోపించారు. తమ నాయకుడి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లినా మోదీ సర్కార్ దే బాధ్యతని ఆర్జేడీ కార్యకర్తలు హెచ్చరించారు.

కాక్రోచెస్ ప్రొటెస్ట్ విజువల్స్ పై ధ్రువ్ రాఠీ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
ఢిల్లీ జంతర్ మంతర్ లో జరుగుతున్న కాక్రోచ్ పార్టీ నిరసనలపై ఫేమస్ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ప్రొటెస్ట్ స్పాట్ లో ఉన్న వేలాది మంది జనాన్ని చూపిస్తూ, "అక్కడ ఉన్న క్రౌడ్ ని ఒకసారి చూడండి" అంటూ ట్వీట్ చేశారు. గ్రౌండ్ ప్రొటెస్ట్ కోసం ఇచ్చిన జస్ట్ ఫస్ట్ కాల్ కే ఈ రేంజ్ లో జనాలు రావడం గ్రేట్ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ధ్రువ్ రాఠీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ఫుల్ వైరల్ గా మారింది.

కాక్రోచెస్ మూవ్‌మెంట్ కి అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్..
జంతర్ మంతర్ లో జరుగుతున్న కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్ కి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవ్‌మెంట్ దేశంలోని యూత్ కోపానికి నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు. నిరసనలు చేస్తున్న యువతను యాంటీ నేషనల్స్ అనడం ఆపి, మోదీ ప్రభుత్వం వాళ్ల ఇష్యూస్ ని సాల్వ్ చేయాలని కోరారు. ప్రైమ్ మినిస్టర్ వెంటనే విద్యాశాఖ మంత్రిని పదవి నుండి తీసేయాలన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

నైరుతి ఎఫెక్ట్.. 17 రాష్ట్రాల్లో వర్షాలు
ఇన్నాళ్లూ ఎండలతో ఉక్కిరిబిక్కిరైన దేశ ప్రజలు సేద తీరుతున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రుతుపవనాలు కేరళం నుంచి ఏపీని తాకాయి. రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని 17 రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మైదాన ప్రాంతాలలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.
కాక్రోచెస్ కి సపోర్ట్ గా 70 ఏళ్ల పెద్దాయన!
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కేవలం జెన్ జీ కే పరిమితం కాలేదు. భయం లేని భారతదేశం కోసం యూత్ చేస్తున్న ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ ఇవ్వడానికి 70 ఏళ్ల ఒక పెద్దాయన జంతర్ మంతర్ కి వచ్చారు. దీనిపై పీక్ టీవీతో ఆయన మాట్లాడుతూ.. యువత చేస్తున్న ఈ పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ పెద్దాయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ఫుల్ వైరల్ గా మారింది.
జంతర్ మంతర్ లో సోనమ్ వాంగ్‌చుక్ పవర్‌ఫుల్ మెసేజ్!
యూత్ కోసం లడఖ్ నుండి వచ్చిన సోనమ్ వాంగ్‌చుక్ జంతర్ మంతర్ లో ఒక రేంజ్ లో ఇన్స్‌పైర్ చేశారు. కొన్ని నెలల క్రితం NSA కింద జైలుకి వెళ్లినా భయపడకుండా కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా యూత్ కి మీ మెసేజ్ ఏంటని రిపోర్టర్ అడగ్గా.. యువత అంతా ఒక్కటై ఒక పవర్‌ఫుల్ ఫోర్స్ లా మారాలని చెప్పారు. చాలా ప్రశాంతంగా ఉంటూనే, మన హక్కుల కోసం గట్టిగా నిలబడాలంటూ వాంగ్‌చుక్ ఇచ్చిన ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
త్వరలో దేశమంతటా కాక్రోచెస్ ప్రొటెస్ట్‌లు!
జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నిరసనలు కేవలం ఢిల్లీకే పరిమితం కావని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని, లేదంటే దేశమంతటా ఈ ప్రొటెస్ట్‌లు కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజలను చాలా లైట్ తీసుకుందని, అందుకే తాము ఈ రేంజ్ లో ఫైట్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

పశ్చిమబెంగాల్ కు బుల్లెట్ రైలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ఆ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తొలి బుల్లెట్ రైలుని ప్రకటించింది. ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి మధ్య ఇప్పుడు రైల్లో ప్రయాణానికి ఒక రోజు పడుతుంది. ఈ బుల్లెట్ రైలు వస్తే 6 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ హైస్పీడ్ కారిడార్ లక్నో, వారణాసి, పాట్నా మీదుగా సాగుతుంది. బెంగాల్ రైల్వే అభివృద్ధికి ₹1 లక్ష కోట్లు కేటాయించామన్నారు. వచ్చే ఐదేళ్లలో కోల్‌కతా మెట్రోకు 60 న్యూ జనరేషన్ రైళ్లను అందిస్తామని మంత్రి తెలిపారు.

ట్రోలింగ్ కు మరో విద్యార్థి బలి
సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక గోవాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శామ్యూల్ డిసౌజా (23) రోడ్డుపై చెత్త వేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో SMలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు శామ్యూల్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ వేధింపులు భరించలేక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని చనిపోయాడని శామ్యూల్ తండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో శామ్యూల్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసిన సైబర్ అకౌంట్లపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అభిజీత్ దిప్కే: హిందూ-ముస్లిం పాలిటిక్స్ తో ఎవరికి లాభం?
జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ అభిజీత్ దిప్కే హిందూ-ముస్లిం పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత 10-12 ఏళ్లుగా వీళ్ళు మనల్ని ఇలాంటి పాలిటిక్స్ లోనే ట్రాప్ చేసి ఉంచారని, అసలు దీనివల్ల ఎవరికి యూజ్ అయిందని ఆయన ప్రశ్నించారు. ఈ హిందూ-ముస్లిం పాలిటిక్స్ దేశంలో ఎవరికైనా జాబ్స్ తెచ్చిపెట్టాయా అంటూ నిలదీశారు. యూత్ ని ఆలోచింపజేసేలా ఉన్న ఈ పవర్‌ఫుల్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

‘బందార్’లో బాబీ డియోల్ యాక్టింగే స్పెషల్ అట్రాక్షన్
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన బందార్ చిత్రంలో బాబీ డియోల్ నటన ప్రధాన బలంగా నిలిచిందని ఫిలిం క్రిటిక్ రేణుకా వ్యావహారే తన సమీక్షలో పేర్కొన్నారు. అత్యాచారం కేసు నేపథ్యంలో సాగే ఈ కోర్టు డ్రామా న్యాయవ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. బలమైన కథనం, నటీనటుల ప్రదర్శన సినిమాకు అదనపు బలంగా మారాయని తన రివ్యూలో పేర్కొన్నారు.
కాక్రోచెస్ ప్రొటెస్ట్ లో 83 ఏళ్ల పెద్దాయన!
జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు 83 ఏళ్ల ఒక పెద్దాయన స్వయంగా ప్రొటెస్ట్ స్పాట్ కి వచ్చారు. దీనిపై 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' అకౌంట్ లో పోస్ట్ చేస్తూ. పెద్దల ఆశీస్సులు కూడా కాక్రోచ్ పార్టీకే ఉన్నాయని రాసుకొచ్చారు. యూత్ తో పాటు ఈ పెద్దాయన కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అమెరికా హెచ్‌ఆర్ విభాగాల సృష్టి కర్తలు ఇండియన్సే !
అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేక ప్రచారం మధ్య ఆసక్తికర అంశాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. హిప్పోక్రాటిక్ ఏఐ, బ్లూమ్‌రీచ్, ఎయిట్‌ఫోల్డ్ ఏఐ వంటి బిలియన్ డాలర్ల సంస్థలను భారతీయులు స్థాపించి వేలాది ఉద్యోగాలను సృష్టించారని పేర్కొంది. ఉద్యోగాలు లాక్కుంటున్నారనే విమర్శలకంటే, కొత్త హెచ్‌ఆర్ విభాగాలనే నిర్మించే స్థాయిలో భారతీయులు ఉపాధి అవకాశాలను పెంచుతున్నారని అధ్యయనం వివరించింది.