ట్రోలింగ్ కు మరో విద్యార్థి బలి

సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక గోవాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శామ్యూల్ డిసౌజా (23) రోడ్డుపై చెత్త వేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో SMలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు శామ్యూల్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ వేధింపులు భరించలేక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని చనిపోయాడని శామ్యూల్ తండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో శామ్యూల్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసిన సైబర్ అకౌంట్లపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



