పశ్చిమబెంగాల్ కు బుల్లెట్ రైలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ఆ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తొలి బుల్లెట్ రైలుని ప్రకటించింది. ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి మధ్య ఇప్పుడు రైల్లో ప్రయాణానికి ఒక రోజు పడుతుంది. ఈ బుల్లెట్ రైలు వస్తే 6 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ హైస్పీడ్ కారిడార్ లక్నో, వారణాసి, పాట్నా మీదుగా సాగుతుంది. బెంగాల్ రైల్వే అభివృద్ధికి ₹1 లక్ష కోట్లు కేటాయించామన్నారు. వచ్చే ఐదేళ్లలో కోల్‌కతా మెట్రోకు 60 న్యూ జనరేషన్ రైళ్లను అందిస్తామని మంత్రి తెలిపారు.


