Latest

రేపల్లె హైవేపై తగలబడ్డ కారు..▶
General· 18 May 2026

రేపల్లె హైవేపై తగలబడ్డ కారు..

బాపట్ల జిల్లా,రేపల్లె నియోజకవర్గంలో రేపల్లె హైవే ప్రధాన రహదారిపై సోమవారం మచిలీపట్నం నుండి వస్తున్న కారు కృష్ణానది ఓవర్ బ్రిడ్జిపై రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రతకు కారు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ తో తగలబడినట్లు స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణికులు వెంటనే దిగి పరుగులు తీశారు. అదృష్టం కొద్దీ ఎవరూ గాయపడలేదు.

ఒకే చైర్‌లో 10 మంది బాయ్స్ లంచ్.. ఈ క్రేజీ చైన్ సిస్టమ్ చూశారా?▶
Viral· 18 May 2026

ఒకే చైర్‌లో 10 మంది బాయ్స్ లంచ్.. ఈ క్రేజీ చైన్ సిస్టమ్ చూశారా?

సోషల్ మీడియాలో ఒక మైండ్ బ్లోయింగ్ బాయ్స్ వీడియో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఒక ఫంక్షన్‌లో కొందరు అబ్బాయిలు తినడానికి కూర్చున్నారు. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే. ఒక అబ్బాయి చైర్‌లో కూర్చుంటే, ఆ అబ్బాయి లెగ్ పైన ఇంకో అబ్బాయి, అతని లెగ్ పైన మరో అబ్బాయి. ఇలా ఒక చైన్ సిస్టమ్ లాగా ఏకంగా 9 మంది ఒకరిపై ఒకరు కూర్చొని లంచ్ చేస్తున్నారు. ఈ క్రేజీ ఐడియా చూసి నెటిజన్స్ నవ్వి నవ్వి ఫుల్ ఫిదా అవుతున్నారు.

కోర్టులో నిందితుడిని హగ్ చేసుకున్న జడ్జ్!▶
Viral· 18 May 2026

కోర్టులో నిందితుడిని హగ్ చేసుకున్న జడ్జ్!

అమ్మ ప్రాణాలు కాపాడే మెడిసిన్ కోసం ఒక కొడుకు ఫేక్ చెక్ ఇచ్చి దొంగతనం చేశాడు. కోర్టులో నిలబడి తప్పు చేశానని ఏడుస్తున్న ఆ కొడుకు వెనకున్న పెయిన్‌ను జడ్జ్ అర్థం చేసుకున్నారు. రూల్స్ పక్కన పెట్టి, అతన్ని స్టేజ్ పైనే హగ్ చేసుకుని అన్ని చార్జెస్ డ్రాప్ చేసేశారు. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. వెళ్లి మీ అమ్మను చూసుకో అంటూ జడ్జ్ ఇచ్చిన కొత్త లైఫ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

తాతా మనవళ్ల క్రేజీ డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!▶
Viral· 18 May 2026

తాతా మనవళ్ల క్రేజీ డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

సౌరాష్ట్రకు చెందిన ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఒక తాత, మనవడు కలిసి ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ స్టెప్స్ చేస్తున్న విజువల్స్ చూసి నెటిజన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్‌లో కూడా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కు మన కల్చర్, ట్రెడిషన్స్ ఎలా పాస్ అవుతున్నాయో ఈ వీడియోలో చూడొచ్చు.

CM, PM మధ్య సీక్రెట్ లింక్? BJP MP అరవింద్ షాకింగ్ కామెంట్స్!▶
Politics· 18 May 2026

CM, PM మధ్య సీక్రెట్ లింక్? BJP MP అరవింద్ షాకింగ్ కామెంట్స్!

BJP MP ధర్మపురి అరవింద్ తెలంగాణ పాలిటిక్స్‌ గురుంచి క్రేజీ కామెంట్ చేశారు. CM రేవంత్ రెడ్డి, పీఎం నరేంద్ర మోదీ మధ్య లింక్ ఉందేమో అని ఆయన హింట్ ఇచ్చారు. బెంగాల్‌లో సువేందు అధికారి ఎలాగైతే BJPలోకి వచ్చారో, ఫ్యూచర్‌లో రేవంత్ రెడ్డి కూడా అలాగే మారే ఛాన్స్ ఉందేమో! నాకు తెలీదు.. BJPలో నేను చిన్న కార్యకర్తను అంటూ అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రెండు దేశాల మ్యూజిక్ ఒకే స్టేజ్ పై.. PM మోదీ రివ్యూ!▶
World· 18 May 2026

రెండు దేశాల మ్యూజిక్ ఒకే స్టేజ్ పై.. PM మోదీ రివ్యూ!

PM నరేంద్ర మోదీ రీసెంట్‌గా జరిగిన ‘సాత్ సాత్’ అనే మ్యూజిక్ ప్రోగ్రామ్‌ను చూసి ఫుల్ హ్యాపీ అయ్యారు. మ్యూజిక్, కల్చర్ ద్వారా అందరూ కలిసికట్టుగా ఉండటాన్ని ఈ ఈవెంట్ సూపర్బ్‌గా చూపించిందని మోదీ ట్వీట్ చేశారు. ఇండియన్, వెస్ట్రన్ క్లాసికల్ ట్రెడిషన్స్‌ను మిక్స్ చేసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ‘బారట్ డ్యూ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్’ టీమ్‌కు ఆయన స్పెషల్ గా థాంక్స్ చెప్పారు.

బామ్మ ప్రేమకు ఫిదా అయిన రాహుల్ గాంధీ!▶
Politics· 18 May 2026

బామ్మ ప్రేమకు ఫిదా అయిన రాహుల్ గాంధీ!

కేరళలో రీసెంట్‌గా జరిగిన ఒక మీటింగ్‌లో ఒక బామ్మ డైరెక్ట్‌గా స్టేజ్ పైకి వచ్చేసింది. రాహుల్ గాంధీని చూడగానే ఫుల్ ఎమోషనల్ అయిపోయి, ఆయన్ను గట్టిగా హగ్ చేసుకుంది. అంతే ఆప్యాయంగా రాహుల్ గాంధీ కూడా ఆ బామ్మను హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు ఆలయం.. అమితాబ్ పోస్ట్‌తో వైరల్
World· 18 May 2026

ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు ఆలయం.. అమితాబ్ పోస్ట్‌తో వైరల్

ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీలో ఉన్న 134 ఏళ్ల నాటి చారిత్రాత్మక లార్డ్ విష్ణు టెంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ దీనికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1892లో వ్యాపారం కోసం ఇరాన్ వెళ్లిన భారతీయ వ్యాపారులు ఈ గుడిని నిర్మించారు. ఇండియన్, పర్షియన్ ఆర్కిటెక్చర్ మిక్సింగ్‌తో ఉన్న ఈ టెంపుల్ గోడలపై శ్రీకృష్ణుడి పెయింటింగ్స్, బుద్ధుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. మన పూర్వీకుల ట్రేడ్ హిస్టరీకి ఇదో సూపర్ ఎగ్జాంపుల్!

హర్మూజ్ లో ఇరాన్ కొత్త గేమ్ ప్లాన్ ఏంటంటే..?
World· 18 May 2026

హర్మూజ్ లో ఇరాన్ కొత్త గేమ్ ప్లాన్ ఏంటంటే..?

ఇరాన్ సరికొత్త గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కేంద్రమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ Subsea కేబుల్స్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 99% ఇంటర్నెట్ డేటా, నిత్యం బిలియన్ల కొద్దీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ సముద్రపు కేబుల్స్ ద్వారానే సాగుతాయి. ఇప్పుడు ఇరాన్ సైన్యం (IRGC) వీటికి ‘డిజిటల్ టోల్ టాక్స్’ వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి టెక్ జెయింట్స్ తమ కేబుల్స్ ఇరాన్ జలాల నుంచి వెళ్తున్నందుకు ఫీజు కట్టాలని, లేదంటే డిజిటల్ ట్రాఫిక్‌ను నిలిపివేస్తామని ఇరాన్ పరోక్షంగా బెదిరిస్తోంది.

విజయ్ ప్రభుత్వంపై డీఎంకే ఎమ్మెల్యే సంచనల వ్యాఖ్యలు
Politics· 18 May 2026

విజయ్ ప్రభుత్వంపై డీఎంకే ఎమ్మెల్యే సంచనల వ్యాఖ్యలు

తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన విజయ్ ప్రభుత్వంపై డీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త ప్రభుత్వం 4 నుంచి 6 నెలలకు మించి అధికారంలో ఉండలేదని జోస్యం చెప్పారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోటీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, ఇతర పార్టీల మద్దతుతో విజయ్ సీఎం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

బింగ్, బింగ్, గాన్.. ఇరాన్‌కు ట్రంప్ గ్రాఫిక్ వార్నింగ్!
World· 18 May 2026

బింగ్, బింగ్, గాన్.. ఇరాన్‌కు ట్రంప్ గ్రాఫిక్ వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఇరాన్‌ను హెచ్చరిస్తూ కొన్ని AI జనరేటెడ్ పిక్చర్స్ షేర్ చేశారు. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ వెపన్‌తో ఇరాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పేల్చేస్తున్నట్లు ఉన్న ఆ ఇమేజ్‌లను పెడుతూ.. "బింగ్, బింగ్, గాన్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని కాల్పుల విరమణ దాదాపు ముగిపోతోందని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ గనుక సరిహద్దుల్లో తోక జాడిస్తే లేజర్ దాడులతో నాశనం చేస్తామంటూ ఈ రేంజ్ వార్నింగ్ ఇచ్చారు.

NEET లీక్ స్కామ్: బ్యూటీ పార్లర్ లింక్
India· 17 May 2026

NEET లీక్ స్కామ్: బ్యూటీ పార్లర్ లింక్

నీట్ పేపర్ లీక్ కేసులో CBI సంచలన విషయాలు బయటపెట్టింది. NTA పేపర్ సెట్టింగ్ కమిటీలోనే ఉంటూ పేపర్ లీక్ చేసిన ఇద్దరు ప్రొఫెసర్లు పీవీ కులకర్ణి, మనీష్ గురునాథ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే ముఠా. పుణేలో బ్యూటీ పార్లర్ నడిపే 'మనీషా వాగ్మారే' అనే మహిళ.. ఈ లెక్చరర్లకు, స్టూడెంట్లకు మధ్య మీడియేటర్‌గా వ్యవహరించింది. ఈమె ద్వారానే భారీగా డబ్బులు వసూలు చేసి, ఎగ్జామ్‌కు ముందే స్టూడెంట్లను ఇళ్లల్లో కూర్చోబెట్టి లీకైన ప్రశ్నలను నోట్స్‌లో రాయించారు. NTA నుంచి హ్యాండ్‌రిటెన్, టైప్ చేసిన రెండు సెట్ల క్వశ్చన్ పేపర్లు లీకైనట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు.

భారత్ బంగారు పిచ్చుక.. ఈ పేరు ఎలా వచ్చిందంటే ?
General· 17 May 2026

భారత్ బంగారు పిచ్చుక.. ఈ పేరు ఎలా వచ్చిందంటే ?

ప్రధాని మోదీ బంగారం కొనవద్దని ఇప్పుడంటున్నారు కానీ భారత్ కి, బంగారానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఒకప్పుడు మన దేశాన్ని బంగారు పిచ్చుక అని పిలిచేవారు. రోమన్ సామ్రాజ్యం మన దేశానికి ఈ పేరు పెట్టింది. భారతదేశంలో బంగారం గనులు తక్కువగా ఉన్నప్పటికీ, రోమ్, గ్రీస్, పర్షియాలకు మన సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, దంతాలను ఎగుమతి చేసేవాళ్లం. వీటికి బదులుగా వారు టన్నుల కొద్దీ బంగారు, వెండి నాణేలను భారత్‌కు చెల్లించేవారు. అలా విదేశీ వాణిజ్యం ద్వారా వచ్చిపడిన బంగారంతోనే మన దేశం అత్యంత సంపన్నమైన 'బంగారు పిచ్చుక'గా మారింది. ఆ తర్వాత మనం బంగారం తాకట్టుపెట్టుకునే దాకా కూడా వచ్చాం.ఇదంతా ఒక హిస్టరీ

సీఎం విజయ్ నిర్ణయంపై హీరో విశాల్ అసంతృప్తి!
India· 17 May 2026

సీఎం విజయ్ నిర్ణయంపై హీరో విశాల్ అసంతృప్తి!

తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయాలపై అందరూ లక్ష కళ్లతో గమనిస్తున్నారు. విజయ్ కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై నటుడు విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా రంగ అనుభవం లేని ఎగ్మూర్ ఎమ్మెల్యే రాజ్‌మోహన్‌కు ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇండస్ట్రీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విజయే ఈ సమస్యలను బాగా హ్యాండిల్ చేయగలరని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ టికెటింగ్ విండో, లోకల్ బాడీ టాక్స్ రద్దు, చిన్న చిత్రాలకు సబ్సిడీ పెంచాలని కోరారు. .

మాస్కోపై డ్రోన్ దాడి:  ఇండియన్ సహా నలుగురు మృతి
World· 17 May 2026

మాస్కోపై డ్రోన్ దాడి: ఇండియన్ సహా నలుగురు మృతి

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు సహా మొత్తం నలుగురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఎంబసీ అధికారులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందేలా చూస్తున్నారు. మృతుడి వివరాల కోసం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది.

ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన WHO
World· 17 May 2026

ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన WHO

ఆఫ్రికాలో ఎబోలా వేగంగా వ్యాపిస్తుండటంతో WHO చీఫ్ టెడ్రోస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పటివరకు కాంగో, ఉగాండాల్లో 336 మందికి పైగా దీని బారిన పడగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి వ్యాపిస్తున్న 'బుండిబుగ్యో' అనే రేర్ వేరియంట్‌కి ప్రస్తుతానికి వ్యాక్సిన్, ట్రీట్‌మెంట్ లేకపోవడంతో టెన్షన్ మొదలైంది. తీవ్రమైన జ్వరం, బ్లీడింగ్ దీని లక్షణాలు. బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది.

మరో వారం భానుడి భగభగలు.. తస్మాత్ జాగ్రత్త
General· 17 May 2026

మరో వారం భానుడి భగభగలు.. తస్మాత్ జాగ్రత్త

ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరో వారం రోజులు ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. వృద్ధులు, చిన్నారులు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.

ISIS టాప్ కమాండర్‌ ఖతం!
World· 16 May 2026

ISIS టాప్ కమాండర్‌ ఖతం!

ఐసిస్‌ టాప్ కమాండర్‌ అబు-బిలాల్ అల్-మినూకిని యూఎస్, నైజీరియా ఫోర్సెస్ ఖతం చేశాయని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. వీడు ఐసిస్‌లో నంబర్ 2 పొజిషన్. ఆఫ్రికాలో దాక్కుంటే ఎవ్వరూ గుర్తుపట్టరని అనుకున్నాడు, కానీ సీన్ రివర్స్ అయింది. ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టిన ట్రంప్, ‘ఇక వీడు మనల్ని భయపెట్టలేడు, గ్లోబల్ టెర్రర్ నెట్‌వర్క్ క్లోజ్’ అంటూ గట్టిగా చెప్పారు. యుఎస్ కి సపోర్ట్ చేసిన నైజీరియాకి థాంక్స్ అన్నారు.

ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌లో సీఎం విజయ్ ఫోటోలు!▶
Politics· 16 May 2026

ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌లో సీఎం విజయ్ ఫోటోలు!

తమిళనాడు CM విజయ్ అఫీషియల్ ఫోటోలు స్టేట్ లో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్‌కు వెళ్ళాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక నార్మల్ యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఈ రేంజ్‌లో సీఎం కుర్చీలో కూర్చోవడం రియల్‌గా ఒక బిగ్ ఇన్‌స్పిరేషన్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

బండి సంజయ్ ఇంట్లో పోలీసులు!▶
Politics· 16 May 2026

బండి సంజయ్ ఇంట్లో పోలీసులు!

సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కరీంనగర్ హౌస్ లో తెలంగాణ పోలీసులు సడన్‌గా రైడ్ చేశారు. పోక్సో కేసు పెట్టినప్పటి నుంచి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అబ్స్కాండ్ ఉన్నాడు. అతని కోసం పోలీసులు కరీంనగర్ ఇంట్లో వెతుకుతున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు పాలిటిక్స్‌లో ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది.

CBSE కొత్త రూల్!
Education· 16 May 2026

CBSE కొత్త రూల్!

CBSE ఒక క్రేజీ నిర్ణయం తీసుకుంది! 9వ తరగతి నుంచి ‘త్రిభాషా విధానం’ ప్రవేశపెడుతున్నారు. జూలై 1 నుంచి అమలయ్యే ఈ రూల్ ప్రకారం, స్టూడెంట్స్ చదివే మూడు భాషల్లో రెండు మన దేశానివే ఉండాలి. పిల్లలకి భాషల మీద అవగాహన పెంచడమే దీని మెయిన్ గోల్. 9, 10 క్లాస్ స్టూడెంట్స్ ఇక నుంచి ఎక్స్‌ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రెడీ అయిపోవాలి మరి!