Latest
బామ్మ ప్రేమకు ఫిదా అయిన రాహుల్ గాంధీ!
కేరళలో రీసెంట్‌గా జరిగిన ఒక మీటింగ్‌లో ఒక బామ్మ డైరెక్ట్‌గా స్టేజ్ పైకి వచ్చేసింది. రాహుల్ గాంధీని చూడగానే ఫుల్ ఎమోషనల్ అయిపోయి, ఆయన్ను గట్టిగా హగ్ చేసుకుంది. అంతే ఆప్యాయంగా రాహుల్ గాంధీ కూడా ఆ బామ్మను హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు ఆలయం.. అమితాబ్ పోస్ట్‌తో వైరల్
ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీలో ఉన్న 134 ఏళ్ల నాటి చారిత్రాత్మక లార్డ్ విష్ణు టెంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ దీనికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1892లో వ్యాపారం కోసం ఇరాన్ వెళ్లిన భారతీయ వ్యాపారులు ఈ గుడిని నిర్మించారు. ఇండియన్, పర్షియన్ ఆర్కిటెక్చర్ మిక్సింగ్‌తో ఉన్న ఈ టెంపుల్ గోడలపై శ్రీకృష్ణుడి పెయింటింగ్స్, బుద్ధుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. మన పూర్వీకుల ట్రేడ్ హిస్టరీకి ఇదో సూపర్ ఎగ్జాంపుల్!

హర్మూజ్ లో ఇరాన్ కొత్త గేమ్ ప్లాన్ ఏంటంటే..?
ఇరాన్ సరికొత్త గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కేంద్రమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ Subsea కేబుల్స్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 99% ఇంటర్నెట్ డేటా, నిత్యం బిలియన్ల కొద్దీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ సముద్రపు కేబుల్స్ ద్వారానే సాగుతాయి. ఇప్పుడు ఇరాన్ సైన్యం (IRGC) వీటికి ‘డిజిటల్ టోల్ టాక్స్’ వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి టెక్ జెయింట్స్ తమ కేబుల్స్ ఇరాన్ జలాల నుంచి వెళ్తున్నందుకు ఫీజు కట్టాలని, లేదంటే డిజిటల్ ట్రాఫిక్‌ను నిలిపివేస్తామని ఇరాన్ పరోక్షంగా బెదిరిస్తోంది.

విజయ్ ప్రభుత్వంపై డీఎంకే ఎమ్మెల్యే సంచనల వ్యాఖ్యలు
తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన విజయ్ ప్రభుత్వంపై డీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త ప్రభుత్వం 4 నుంచి 6 నెలలకు మించి అధికారంలో ఉండలేదని జోస్యం చెప్పారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోటీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, ఇతర పార్టీల మద్దతుతో విజయ్ సీఎం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

బింగ్, బింగ్, గాన్.. ఇరాన్‌కు ట్రంప్ గ్రాఫిక్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఇరాన్‌ను హెచ్చరిస్తూ కొన్ని AI జనరేటెడ్ పిక్చర్స్ షేర్ చేశారు. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ వెపన్‌తో ఇరాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పేల్చేస్తున్నట్లు ఉన్న ఆ ఇమేజ్‌లను పెడుతూ.. "బింగ్, బింగ్, గాన్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని కాల్పుల విరమణ దాదాపు ముగిపోతోందని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ గనుక సరిహద్దుల్లో తోక జాడిస్తే లేజర్ దాడులతో నాశనం చేస్తామంటూ ఈ రేంజ్ వార్నింగ్ ఇచ్చారు.

NEET లీక్ స్కామ్: బ్యూటీ పార్లర్ లింక్
నీట్ పేపర్ లీక్ కేసులో CBI సంచలన విషయాలు బయటపెట్టింది. NTA పేపర్ సెట్టింగ్ కమిటీలోనే ఉంటూ పేపర్ లీక్ చేసిన ఇద్దరు ప్రొఫెసర్లు పీవీ కులకర్ణి, మనీష్ గురునాథ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే ముఠా. పుణేలో బ్యూటీ పార్లర్ నడిపే 'మనీషా వాగ్మారే' అనే మహిళ.. ఈ లెక్చరర్లకు, స్టూడెంట్లకు మధ్య మీడియేటర్‌గా వ్యవహరించింది. ఈమె ద్వారానే భారీగా డబ్బులు వసూలు చేసి, ఎగ్జామ్‌కు ముందే స్టూడెంట్లను ఇళ్లల్లో కూర్చోబెట్టి లీకైన ప్రశ్నలను నోట్స్‌లో రాయించారు. NTA నుంచి హ్యాండ్‌రిటెన్, టైప్ చేసిన రెండు సెట్ల క్వశ్చన్ పేపర్లు లీకైనట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు.

భారత్ బంగారు పిచ్చుక.. ఈ పేరు ఎలా వచ్చిందంటే ?
ప్రధాని మోదీ బంగారం కొనవద్దని ఇప్పుడంటున్నారు కానీ భారత్ కి, బంగారానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఒకప్పుడు మన దేశాన్ని బంగారు పిచ్చుక అని పిలిచేవారు. రోమన్ సామ్రాజ్యం మన దేశానికి ఈ పేరు పెట్టింది. భారతదేశంలో బంగారం గనులు తక్కువగా ఉన్నప్పటికీ, రోమ్, గ్రీస్, పర్షియాలకు మన సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, దంతాలను ఎగుమతి చేసేవాళ్లం. వీటికి బదులుగా వారు టన్నుల కొద్దీ బంగారు, వెండి నాణేలను భారత్‌కు చెల్లించేవారు. అలా విదేశీ వాణిజ్యం ద్వారా వచ్చిపడిన బంగారంతోనే మన దేశం అత్యంత సంపన్నమైన 'బంగారు పిచ్చుక'గా మారింది. ఆ తర్వాత మనం బంగారం తాకట్టుపెట్టుకునే దాకా కూడా వచ్చాం.ఇదంతా ఒక హిస్టరీ

సీఎం విజయ్ నిర్ణయంపై హీరో విశాల్ అసంతృప్తి!
తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయాలపై అందరూ లక్ష కళ్లతో గమనిస్తున్నారు. విజయ్ కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై నటుడు విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా రంగ అనుభవం లేని ఎగ్మూర్ ఎమ్మెల్యే రాజ్‌మోహన్‌కు ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇండస్ట్రీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విజయే ఈ సమస్యలను బాగా హ్యాండిల్ చేయగలరని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ టికెటింగ్ విండో, లోకల్ బాడీ టాక్స్ రద్దు, చిన్న చిత్రాలకు సబ్సిడీ పెంచాలని కోరారు. .

మాస్కోపై డ్రోన్ దాడి: ఇండియన్ సహా నలుగురు మృతి
రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు సహా మొత్తం నలుగురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఎంబసీ అధికారులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందేలా చూస్తున్నారు. మృతుడి వివరాల కోసం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది.

ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన WHO
ఆఫ్రికాలో ఎబోలా వేగంగా వ్యాపిస్తుండటంతో WHO చీఫ్ టెడ్రోస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పటివరకు కాంగో, ఉగాండాల్లో 336 మందికి పైగా దీని బారిన పడగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి వ్యాపిస్తున్న 'బుండిబుగ్యో' అనే రేర్ వేరియంట్‌కి ప్రస్తుతానికి వ్యాక్సిన్, ట్రీట్‌మెంట్ లేకపోవడంతో టెన్షన్ మొదలైంది. తీవ్రమైన జ్వరం, బ్లీడింగ్ దీని లక్షణాలు. బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది.

మరో వారం భానుడి భగభగలు.. తస్మాత్ జాగ్రత్త
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరో వారం రోజులు ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. వృద్ధులు, చిన్నారులు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.

ISIS టాప్ కమాండర్ ఖతం!
ఐసిస్ టాప్ కమాండర్ అబు-బిలాల్ అల్-మినూకిని యూఎస్, నైజీరియా ఫోర్సెస్ ఖతం చేశాయని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. వీడు ఐసిస్‌లో నంబర్ 2 పొజిషన్. ఆఫ్రికాలో దాక్కుంటే ఎవ్వరూ గుర్తుపట్టరని అనుకున్నాడు, కానీ సీన్ రివర్స్ అయింది. ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టిన ట్రంప్, ‘ఇక వీడు మనల్ని భయపెట్టలేడు, గ్లోబల్ టెర్రర్ నెట్‌వర్క్ క్లోజ్’ అంటూ గట్టిగా చెప్పారు. యుఎస్ కి సపోర్ట్ చేసిన నైజీరియాకి థాంక్స్ అన్నారు.
ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌లో సీఎం విజయ్ ఫోటోలు!
తమిళనాడు CM విజయ్ అఫీషియల్ ఫోటోలు స్టేట్ లో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్‌కు వెళ్ళాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక నార్మల్ యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఈ రేంజ్‌లో సీఎం కుర్చీలో కూర్చోవడం రియల్‌గా ఒక బిగ్ ఇన్‌స్పిరేషన్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.
బండి సంజయ్ ఇంట్లో పోలీసులు!
సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కరీంనగర్ హౌస్ లో తెలంగాణ పోలీసులు సడన్‌గా రైడ్ చేశారు. పోక్సో కేసు పెట్టినప్పటి నుంచి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అబ్స్కాండ్ ఉన్నాడు. అతని కోసం పోలీసులు కరీంనగర్ ఇంట్లో వెతుకుతున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు పాలిటిక్స్‌లో ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది.

CBSE కొత్త రూల్!
CBSE ఒక క్రేజీ నిర్ణయం తీసుకుంది! 9వ తరగతి నుంచి ‘త్రిభాషా విధానం’ ప్రవేశపెడుతున్నారు. జూలై 1 నుంచి అమలయ్యే ఈ రూల్ ప్రకారం, స్టూడెంట్స్ చదివే మూడు భాషల్లో రెండు మన దేశానివే ఉండాలి. పిల్లలకి భాషల మీద అవగాహన పెంచడమే దీని మెయిన్ గోల్. 9, 10 క్లాస్ స్టూడెంట్స్ ఇక నుంచి ఎక్స్‌ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రెడీ అయిపోవాలి మరి!

CM విజయ్- లంచ్ బాక్స్‌తో సెక్రటేరియట్‌కు.. నార్మల్ ఎంప్లాయ్‌లా!
తమిళనాడు కొత్త CM విజయ్ తన సింప్లిసిటీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. మే 10న CM అయిన విజయ్, ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్‌లా టైం కంటే 15మినేట్స్ ముందే ఆఫీస్‌కు వచ్చేస్తున్నారు. ఇంటి నుంచే ఓన్ గా లంచ్ బాక్స్ తెచ్చుకుంటూ, బ్రేక్ టైంలో తన రూమ్‌లోనే లంచ్ ఫినిష్ చేసి వెంటనే డ్యూటీలో బిజీ అవుతున్నారు. ఆయన డిసిప్లిన్ చూసి ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
బండి సంజయ్ ని సెంట్రల్ మినిస్టర్ పొజిషన్ నుంచి తీసేయాలన్న కవిత!
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కె. కవిత ప్రెస్ మీట్‌లో సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై ఒక మైనర్ గర్ల్‌ను వేధించినట్లు చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయినా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటివరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదని ఆమె రియాక్ట్ అయింది. తండ్రి అంత పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంటే ఫెయిర్ ఎంక్వైరీ జరగదని, అందుకే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే తీసేయాలని పీఎం మోదీని ఆమె డిమాండ్ చేశారు.
25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్.. తోటి ఏనుగు చనిపోతే ఏడ్చిన మరో ఏనుగు!
రష్యాలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. జెన్నీ, మగ్దా అనే రెండు ఏనుగులు ఒక సర్కస్‌లో దాదాపు 25 ఇయర్స్ కలిసి పనిచేశాయి. అయితే, రీసెంట్‌గా జెన్నీ హఠాత్తుగా చనిపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోవడంతో తట్టుకోలేకపోయిన మగ్దా.. కన్నీళ్లు పెట్టుకుంటూ జెన్నీని లేపడానికి ట్రై చేసింది. అంతటితో ఆగకుండా, బాడీని గట్టిగా హగ్ చేసుకుని గంటల తరబడి ఏడ్చింది. ఇంకా లాస్ట్ గుడ్ బై చెప్పే వరకు కనీసం డాక్టర్లను కూడా దగ్గరకు రానివ్వకుండా మగ్దా చేసిన పని నెటిజన్స్ అందరినీ ఫుల్ ఎమోషనల్ చేస్తోంది.

బావి లోని మనవడిని కాపాడుతూ, తాత మృతి!
మిర్యాలగూడ ఊట్లపల్లిలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది భయ్యా. చేలో ఉన్న బోరుబావిలో ఒక 4 ఇయర్స్ బాబు యాక్సిడెంటల్‌గా పడిపోయాడు. అది చూసి షాకైన తాత వెంకన్న, మనవడిని ఎలాగైనా సేవ్ చేయాలని అందులోకి దిగాడు. కానీ బ్యాడ్ లక్, తాత కూడా అందులోనే స్ట్రక్ అయిపోయాడు. పోలీసులు ఇద్దరినీ బయటకు తీసి హాస్పిటల్‌కి షిఫ్ట్ చేస్తుండగా, ఊపిరాడక తాత వెంకన్న దారిలోనే చనిపోయాడు. బాబు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.
విడాకులు వచ్చే వరకు మూవీస్ చేయను.. జయం రవి షాకింగ్ స్టేట్‌మెంట్!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ప్రెస్ మీట్‌లో షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు divorce వచ్చే వరకు తన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావని, ఇకపై ఆక్ట్ చేయనని షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తనపై జరుగుతున్న ఇన్సల్ట్ భరించలేకపోతున్నానని, తనను ఇబ్బంది పెట్టాలనుకునే వారికి ఎదురు నిలబడటానికే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై తాను సైలెంట్‌గా ఉండే ప్రసక్తే లేదని, ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటానని ఫుల్ ఫైర్‌తో స్టేట్‌మెంట్ ఇచ్చారు.

న్యూడ్ ఫోటోలు తీసి అమ్మాయి తండ్రిని బెదిరించిన మైనర్లు!
కృష్ణగిరిలో ఒక ఘోరం జరిగింది భయ్యా. ఇద్దరు కుర్రాళ్లు ఒక 9th క్లాస్ అమ్మాయి ఇన్స్టా ఫొటోస్ డౌన్లోడ్ చేసి, మార్ఫింగ్ పిక్స్ తో బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో పెట్టకూడదంటే నగ్నంగా వీడియో తీసి పంపాలని ఫోర్స్ చేశారు. ఆ పాప భయపడి పంపేసింది. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆ వీడియోని అమ్మాయి నాన్న వాట్సాప్‌కి పంపి 10 లక్షలు డిమాండ్ చేశారు. తండ్రి అలర్ట్ అయి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో, ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ హోంకి పంపించారు.