Latest
విడాకులు వచ్చే వరకు మూవీస్ చేయను.. జయం రవి షాకింగ్ స్టేట్‌మెంట్!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ప్రెస్ మీట్‌లో షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు divorce వచ్చే వరకు తన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావని, ఇకపై ఆక్ట్ చేయనని షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తనపై జరుగుతున్న ఇన్సల్ట్ భరించలేకపోతున్నానని, తనను ఇబ్బంది పెట్టాలనుకునే వారికి ఎదురు నిలబడటానికే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై తాను సైలెంట్‌గా ఉండే ప్రసక్తే లేదని, ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటానని ఫుల్ ఫైర్‌తో స్టేట్‌మెంట్ ఇచ్చారు.

న్యూడ్ ఫోటోలు తీసి అమ్మాయి తండ్రిని బెదిరించిన మైనర్లు!
కృష్ణగిరిలో ఒక ఘోరం జరిగింది భయ్యా. ఇద్దరు కుర్రాళ్లు ఒక 9th క్లాస్ అమ్మాయి ఇన్స్టా ఫొటోస్ డౌన్లోడ్ చేసి, మార్ఫింగ్ పిక్స్ తో బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో పెట్టకూడదంటే నగ్నంగా వీడియో తీసి పంపాలని ఫోర్స్ చేశారు. ఆ పాప భయపడి పంపేసింది. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆ వీడియోని అమ్మాయి నాన్న వాట్సాప్‌కి పంపి 10 లక్షలు డిమాండ్ చేశారు. తండ్రి అలర్ట్ అయి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో, ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ హోంకి పంపించారు.
రిటర్న్ జర్నీ కూడా సైకిల్‌పైనే ముగించిన AP మంత్రి!
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ‘నో వెహికల్ డే’ ఛాలెంజ్‌ను పక్కాగా పూర్తి చేశారు. ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పోలవరం నిర్వాసితుల Compensation డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిన ఆయన.. తిరిగి విజయవాడ క్యాంప్ ఆఫీస్‌కు కూడా అదే సైకిల్‌పై వెళ్ళాడు. రానుపోను మొత్తం 20KM సైకిల్ తొక్కాడు. ఈ సైకిల్ జర్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సైకిల్‌పై 10KM ప్రయాణించిన AP మినిస్టర్!
ఏపీ వాటర్ రీసోర్సెస్ మినిస్టర్ డాక్టర్ నిమ్మల రామానాయుడు అందరికీ ఒక మంచి ఇన్‌స్పిరేషన్ గా నిలిచారు. ‘నో వెహికల్ డే’ సందర్భంగా ఆయన విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ నుండి ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు దాదాపు 10 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించారు. పర్యావరణాన్ని కాపాడాలనే మంచి మెసేజ్‌తో ఆయన చేసిన ఈ సైకిల్ జర్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లొంగిపోక తప్పని పరిస్థితిలో బండి భగీరథ్!
ఒక మైనర్ అమ్మాయిని వేధించిన కేసులో బండి సంజయ్ కొడుకు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో అతనికి లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కొడుకుని సరెండర్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, అపోజిషన్ లీడర్స్ ప్రెజర్ పెంచడంతో ఈరోజు భగీరథ్ లొంగిపోయే ఛాన్స్ ఉంది. దీంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ISIS గ్లోబల్ నంబర్ 2 ఖతం: ట్రంప్ సంచలన ప్రకటన!
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ISISను అమెరికా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సంస్థ గ్లోబల్ సెకండ్-ఇన్-కమాండ్ అబు-బిలాల్ అల్-మినును ఆఫ్రికాలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.అమెరికా సైన్యం, నైజీరియా సాయుధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన అత్యంత రహస్య, సంక్లిష్టమైన ఆపరేషన్‌లో ఈ ఉగ్రవాది హతమయ్యాడు. ఆఫ్రికాలో దాక్కోవచ్చని అతడు భావించాడు, కానీ మా నిఘా వర్గాలు వాడి ప్రతి కదలికపై కన్నేసి ఉంచి చంపేశాయని ట్రంప్ వెల్లడించారు.

గుత్తా జ్వాల కాదు. గుత్తా చైతన్యం
భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఒక రియల్ మదర్. ఆమె చేసిన పని వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక తల్లిగా ఎవరూ చేయలేని పని చేసి SMలో శెభాష్ అనిపించుకుంటున్నారు. తనకి డెలివరీ అయిన ఏడాది కాలంలో ఆమె హైదరాబాద్, చెన్నైలో 60 లీటర్ల తల్లిపాలను దానం చేశారు. ప్రాణాల కోసం పోరాడే ప్రీమెచ్యూర్ బేబీస్ కి అమృతం లాంటి అమ్మ పాలు అంది వారు ఊపిరిపోసుకున్నారు. "కేవలం 100 మిల్లీలీటర్ల తల్లిపాలు NICU ప్రాణాల కోసం పోరాడే కిలో బరువున్న పసికందుకు కొన్ని రోజుల పాటు ప్రాణాధారం అవుతాయి" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఎందరిలోనూ చైతన్యాన్ని నింపుతోంది.
అస్సాం పాప నోట తెలుగు పాట.. ‘వచ్చిందమ్మా’ వీడియో వైరల్!
అస్సాంకు చెందిన ఒక చిన్నారి, తెలుగు హిట్ సినిమా ‘గీత గోవిందం’ లోని "వచ్చిందమ్మా" పాటను ఎంతో క్యూట్‌గా పాడింది. లాంగ్వేజ్ తెలియకపోయినా, ఆ పాప ఎంతో క్లియర్ గా, ఫుల్ జోష్‌తో పాడటం అందరినీ surprise చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఏలియన్ కి ఏకంగా గుడి .. ఎక్కడంటే
తమిళనాడులోని సేలం జిల్లా మల్లమూపంబట్టి గ్రామానికి చెందిన లోగనాథన్ అనే భక్తుడు ఏలియన్ల కోసం ఏకంగా ఒక గుడే కట్టేశాడు. సుమారు ముప్పావు ఎకరం భూమిలో, నేలకు 11 అడుగుల సెల్లార్ లో గుడిని నిర్మించాడు. భూమిపై వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించే శక్తి ఏలియన్స్‌కే ఉందని అతను నమ్ముతాడు. ఈ భూగర్భ ఆలయంలో నల్లటి ఏలియన్ విగ్రహంతో పాటు శివుడు, పార్వతి, మురుగన్, కాళిమాత విగ్రహాలను కూడా ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ వింత నమ్మకాలే ఇప్పుడు ఈ గుడిని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశాయి.

నీట్ పేపర్ లీకేజీ కేసు.. సూత్రధారి పుణె ప్రొఫసర్ అరెస్ట్
NEET UG 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ (CBI) కీలక సూత్రధారిని అరెస్ట్ చేసింది. పుణెకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కుల్కర్ణిని ఈ స్కామ్ కింగ్‌పిన్‌గా తేల్చి అదుపులోకి తీసుకుంది.NTA తరపున ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే టీమ్ లో కులకర్ణి మెంబర్ .మనీషా వాఘ్మారే అనే మహిళ సాయంతో విద్యార్థులను చేరదీసి, తన ఇంట్లోనే రహస్య కోచింగ్ ఇచ్చాడు. అక్కడ కుల్కర్ణి నోట్‌బుక్స్‌లో రాయించిన ప్రశ్నలు, సమాధానాలు.. మే 3న జరిగిన అసలు పరీక్షా పత్రంతో వంద శాతం సరిపోలడం సంచలనం రేపుతోంది. విద్యార్థుల నుండి ఇందుకోసం లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది.

ఇక భగీరథ్ అరెస్టేనా ? మధ్యంత బెయిల్ కి హైకోర్టు నో
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్ట్ తప్పేలా లేదు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన వేసిన పిటిషన్ పై హైకోర్టులో చుక్కెదురైంది. ఈ దశలో బెయిల్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. భగీరథ్ పిటిషన్ పై జస్టిస్ మాధవి దేవి అర్ధరాత్రి 12 గంటల వరకు విచారణ జరిపారు. బాధితురాలు డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి వివిధ పత్రాలను పరిశీలించాక ఆమె 2008 ఆగస్టు 12న పుట్టినట్టు తేలింది. దీంతో ఆమె మైనరేనంటూ బాధితురాలి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
భార్య కోసం భర్త గ్రేట్ సాక్రిఫైస్.. రియల్ లవ్ అంటే ఇదే!
క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా తన భార్యకు గుండు చేయాల్సి రావడంతో, ఒక భర్త స్వయంగా తన చేతులతోనే ఆమె జుట్టును కట్ చేశాడు. ఆ టైంలో ఆమెకు సపోర్ట్ గా ఉండటానికి, ఆమె బాధను షేర్ చేసుకోవడానికి వెంటనే ఆ భర్త కూడా తన తలని షేవ్ చేసుకున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నేను ఉన్నాను అని ఆయన ఇచ్చిన భరోసా నెటిజన్ల హార్ట్స్ గెలుచుకుంటోంది. ఈ హార్ట్ టచ్చింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

NEET రీ-ఎగ్జామ్ డేట్ ఫిక్స్
NEET UG 2026 పేపర్ లీక్ వివాదంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ (NTA) కీలక నిర్ణయం తీసుకున్నాయి. రద్దయిన పరీక్షను జూన్ 21న (ఆదివారం) మళ్లీ నిర్వహించనున్నారు. పాత రిజిస్ట్రేషన్లే చెల్లుతాయని, విద్యార్థులు కొత్తగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు మళ్లీ ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఈ కేసును CBI విచారిస్తోంది.

వ్యక్తిగత వివరాలు ప్రచారం చేయొద్దు : మీడియాకి బాధితురాలి తల్లి లేఖ
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు పెట్టిన బాధితురాలి తల్లి ఇవాళ మీడియాకి 4 పేజీల లేఖని విడుదల చేశారు. అందులో వారు మానసికంగా ఎంత క్షోభకి గురవుతున్నారో వివరించారు. బాధితురాలు మైనారా ? మేజరా ? అన్న అంశంపై అంతలా చర్చ జరగడం తమను తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తోందన్నారు. వ్యక్తిగత వివరాలు బయటపెట్టందంటూ మీడియాకి ఆమె చేతులు జోడించి వేడుకుంటున్నట్టు చెప్పారు. తమ మైనర్ బిడ్డకు పట్టిన దుస్థితి మరే పిల్లకు రాకూడదని ఆమె కోరుకున్నారు.

ముంబైలోవాటర్ క్రైసిస్ : హౌసింగ్ సొసైటీల కఠిన ఆంక్షలు!
ముంబైలో నీటి సంక్షోభం పీక్స్ కి చేరుకుంది. ఇవాళ నుండి 10% నీటి కోత విధిస్తున్నట్లు BMC ప్రకటించింది. తీవ్రమైన ఎండలతో సరస్సుల్లో నీటి మట్టం పడిపోవడమే దీనికి కారణం. దీంతో హౌసింగ్ సొసైటీలు కార్ వాషింగ్, గార్డెనింగ్ కోసం నీటి వినియోగంపై నిషేధం విధించాయి. స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలని, షవర్లకు బదులు బకెట్లు వాడాలని నిబంధనలు పెట్టారు. ముంబైకి నీరు అందించే ఏడు సరస్సుల్లో ప్రస్తుతం కేవలం 13-14% నీటి నిల్వలే మిగిలి ఉన్నాయని BMC డేటా చెబుతోంది. సాధారణంగా జూలైలో వర్షాల వరకూ ఈ నీటితోనే గడుపుకోవాలి. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో అసలు వర్షాలు కురుస్తాయా అన్న అనుమానాలు ఉన్నాయి.

ఒకప్పుడు సక్సెస్ స్టార్స్.. ఇప్పుడు లీకేజీ మాస్టర్స్
రాజస్థాన్‌లోని ఒక కుగ్రామానికి చెందిన బివాల్ కుటుంబం హెడ్ లైన్స్ కి ఎక్కింది. గత ఏడాది ఈ కుటుంబానికి చెందిన నలుగురు NEET క్లియర్ చేసి సక్సెస్ ఫ్యామిలీగా వార్తలకెక్కారు. కానీ ఇప్పుడు అదే కుటుంబం NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో సెంటర్ గా మారింది. ఈ కేసులో మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు బ్రదర్స్ దే కీ రోల్ అని పోలీసులు చెబుతున్నారు. దీంతో బివాల్ సొంతూరులో అందరూ షాక్ తిన్నారు. ఒకప్పుడు బెస్ట్ ర్యాంకర్లుగా మీడియా చుట్టుముడితే ఇప్పుడు లీకేజీ ముఠాగా మీడియా చుట్టుముడుతోంది.

అమెరికాలో అదానీపై కేసులు క్లోజ్ ..?
అదానీ గ్రూప్ చైర్మన్ Gautam Adaniకి అమెరికాలో పెద్ద రిలీఫ్ లభించే ఛాన్సెస్ ఉన్నాయి. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఆయనపై ఉన్న fraud, bribery కేసులను మూసివేసే దిశగా అడుగులు వేస్తోందని Bloomberg రిపోర్ట్ చేసింది. 2024లో అమెరికా అధికారులు అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై $250 మిలియన్ లంచాల కేసు నమోదు చేశారు. ఇండియాలో సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టుల కోసం ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి… ఆ విషయాన్ని అమెరికన్ ఇన్వెస్టర్లకు దాచారని ఆరోపించారు.. ట్రంప్‌కు సన్నిహితుడైన లాయర్ Robert Giuffra అదానీ తరఫున వాదించడం, అమెరికాలో అదానీ కోట్లాది డాలర్లు ఇన్వెస్ట్ చేయడంతో ఈ కేసులు మూసే ఛాన్స్ ఉంది.

పెట్రో మంట.. పెట్రోల్, డీజిల్ ధర లీటర్ కి రూ.3 పెంపు
పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులతో మన దేశంలో పెట్రో ధరల మంట మండింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ పై రూ.3, డీజిల్ పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల భారీగా ప్రచారం జరిగింది. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ధరలు పెరిగే ఛాన్స్ ఉందని ముందే హెచ్చరించారు. సీఎన్ జీ ధర కూడా కిలోకి 2 రూపాయలు పెరిగింది.
సనీటిజర్ తో మ్యాజిక్: టాలెంట్ కి ఏజ్ లిమిట్ లేదు బ్రో!
ఈ 4th క్లాస్ చిన్నారి చేసిన Invisible Fire ఎక్స్‌పెరిమెంట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే బ్రో! శానిటైజర్‌తో మంట ఎలా వస్తుందో సైన్స్‌తో ప్రూవ్ చేసింది. టాలెంట్‌కి వయస్సుతో అస్సలు సంబంధం లేదు అని ఈ పిల్లే ఒక ఎగ్జామ్పుల్. సైన్స్ అంటే భయం కాకుండా ఇలాంటి క్రేజీ ఐడియాలతో అదరగొట్టేసింది. చిన్న వయసులోనే ఇంత క్రియేటివిటీ అంటే మామూలు విషయం కాదు!

కేరళ కొత్త సీఎం వి.డి. సతీశన్
కేరళలో కాంగ్రెస్ పార్టీ సస్పెన్స్‌కు తెరదించింది. కొత్త ముఖ్యమంత్రిగా V. D. Satheesan పేరు ప్రకటించింది. సీఎం రేసులో VD Satheesan, K. C. Venugopal, Ramesh Chennithala పేర్లు వినిపించాయి. దాదాపు 10 రోజుల చర్చల తర్వాత హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.సతీశన్ ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రజల్లో మంచి ఇమేజ్, UDF మిత్రపక్షాల మద్దతు ఆయనకు కలిసొచ్చిన అంశాలుగా చెబుతున్నారు.
పండల్ తో పాటు మనిషి కూడా గాలి లో ఎగిరిపోయాడు!
యూపీ భదోహిలో జరిగిన ఈ సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది బ్రో! సినిమాల్లో కూడా ఇలాంటి స్టంట్స్ చూడలేం. పెళ్లి పందిరి సెట్ చేస్తుంటే, గాలివానకి ఆ పందిరితో పాటే ఒక వ్యక్తి గాలిలో ఎగిరిపోయాడు. అది చూడ్డానికి చాలా షాకింగ్‌గా ఉంది. యూపీలో తుఫాను బీభత్సం వల్ల ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి!