← Back to news

ఏలియన్ కి ఏకంగా గుడి .. ఎక్కడంటే

By aravinda nyayapati· 16 May 2026· Chennai
ఏలియన్ కి ఏకంగా గుడి .. ఎక్కడంటే

తమిళనాడులోని సేలం జిల్లా మల్లమూపంబట్టి గ్రామానికి చెందిన లోగనాథన్ అనే భక్తుడు ఏలియన్ల కోసం ఏకంగా ఒక గుడే కట్టేశాడు. సుమారు ముప్పావు ఎకరం భూమిలో, నేలకు 11 అడుగుల సెల్లార్ లో గుడిని నిర్మించాడు. భూమిపై వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించే శక్తి ఏలియన్స్‌కే ఉందని అతను నమ్ముతాడు. ఈ భూగర్భ ఆలయంలో నల్లటి ఏలియన్ విగ్రహంతో పాటు శివుడు, పార్వతి, మురుగన్, కాళిమాత విగ్రహాలను కూడా ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ వింత నమ్మకాలే ఇప్పుడు ఈ గుడిని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశాయి.

More in Viral

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!
Viral· 2d ago

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!

ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు. కోజికోడ్‌లో ఓ జ్యువెల్లరీ ఈవెంట్‌కు వచ్చిన ఆమె.. ఆ తర్వాత కేరళం CM వి.డి. సతీశన్‌ను కలిశారు. ఇక్కడ రొనాల్డోకు భారీ ఫ్యాన్ బేస్ ఉందని CM చెప్పగా, ఈ విషయం తనకు తెలియదని ఎల్మా అన్నారు. ఈ విషయాన్ని రొనాల్డోతో చెబుతానని చెప్పారు. చివర్లో ‘CM సార్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ ఫొటో అడగడంతో ఈ మూమెంట్ వైరల్‌గా మారింది. తరువాత CMతో దిగిన ఫొటోలను ఎల్మా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. <a href="https://x.com/vdsatheesan/status/2095026237718806895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2095026237718806895%7Ctwgr%5E0150c68c6d23d9ff94230cf5dcecf2cd9b6551b7%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fcristiano-ronaldos-sister-elma-visits-kerala-smr-1554789.html">వీడియో లింక్</a>

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!
Viral· 3d ago

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!

జర్మనీలో ఫుల్ రష్‌గా ఉన్న ఓ రైల్లో కొందరు గుజరాతి ఇండియన్ టూరిస్టులు గట్టిగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యూజర్ ఈ వీడియోను <a href="https://x.com/Amit24TD/status/2094429195527196793?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2094429195527196793%7Ctwgr%5Ea95b9a92608886003674bc8a8ac30d78b1151367%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fprathyekam%2Fgermany-train-viral-video-indian-tourists-singing-clapping-sparks-outrage-bsb-1554431.html">'ఎక్స్‌'లో</a> పోస్ట్ చేశారు. రైల్లోని ఇతర టూరిస్టులను సైలెంట్‌గా ఉండగా.. ఇండియన్స్ చేసిన హంగామాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విదేశాల్లో ఇలాంటి వారి బిహేవియర్‌తో ఇండియన్ టూరిస్టులపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని కామెంట్లు చేస్తున్నారు.