Latest
సిస్టర్ అస్థిపంజరంతో బ్యాంకుకు.. మీడియా పవర్‌తో దిగొచ్చిన ఆఫీసర్స్!
ఒడిశాలోని కియోంఝర్‌లో జితు ముండా అనే పర్సన్, తన చనిపోయిన సిస్టర్ అకౌంట్లో ఉన్న మనీ కోసం ఆమె అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకు వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గవర్నమెంట్ immediate గా రియాక్ట్ అయింది. వెంటనే బ్యాంక్ ఆఫీసర్స్ అతని ఇంటికి వెళ్లి రూ. 19,400 Duesతో పాటు extra రూ. 30,000 ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. CM ఈ ఇన్సిడెంట్ పై సీరియస్ అయ్యి ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించారు.
మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు : ట్రంప్ ని రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్
వైట్ హౌస్ స్టేట్ డిన్నర్లో కింగ్ చార్లెస్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీద వేసిన పంచ్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "అమెరికా సాయం లేకపోతే యూరోపియన్లు జర్మన్ మాట్లాడేవారు" అన్న ట్రంప్ కామెంట్స్‌కి చార్లెస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. "బ్రిటిష్ వాళ్లే లేకపోతే మీరు ఇప్పుడు ఫ్రెంచ్ మాట్లాడేవారు" అని ఆయన అనగానే అక్కడ అందరూ గట్టిగా నవ్వారు. సీరియస్ పాలిటిక్స్ మధ్య ఇదొక రిలాక్సింగ్ మూమెంట్! మీరేమంటారు కామెంట్ చేయండి

ఇక్కడ పని కోసం గర్భసంచి తీయించుకుంటున్న మహిళలు!
మహారాష్ట్రలోని చెరకు తోటల్లో పనిచేసే ఆడవాళ్ళు బతకడం కోసం తమ గర్భసంచిని ఆపరేషన్ చేయించుకుని తీసేయించుకుంటున్నారు. పీరియడ్స్ వల్ల వర్క్ కి లీవ్ తీసుకుంటే మనీ కట్ అవుతుందని, అప్పులు పెరుగుతాయని భయపడి ఈ decision తీసుకుంటున్నారు. almost 13 వేల మందికి పైగా ఆడవాళ్ళు ఈ గర్భసంచి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఓన్లీ మనీ కోసం తమ హెల్త్ ని రిస్క్‌లో పెట్టుకోవడం అక్కడ చాలా కామన్‌గా మారిపోయింది.

AI మనుషుల్ని మింగేస్తుంది : మస్క్ వార్నింగ్
AI వల్ల మనుషులకే డేంజర్ ఉందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బాంబు పేల్చారు. కాలిఫోర్నియా కోర్టులో OpenAIకి వ్యతిరేకంగా పోరాడుతున్న మస్క్ ఈ కేసు విచారణ సందర్భంగా తన అభిప్రాయాలు చెప్పారు. మనకి కావల్సింది టెర్మినేటర్ మూవీలాంటి టెక్నాలజీ కాదన్నారు. AIని కంట్రోల్ చేయకపోతే అది మనల్నే హతం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఏఐ కంపెనీలు లాభాల కోసం సేఫ్టీని వదిలేస్తే ఈ 'డిజిటల్ దేవుడు' మనుషులకే ముప్పుగా మారుతాడని మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘజియాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో హై రైజ్ బిల్డింగ్ గౌర్ గ్రీన్ అవెన్యూ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక ఫ్లాట్‌లో మొదలైన మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. దీంతో కమ్యూనిటీ వాసులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అగ్నిప్రమాద విజువల్స్ భయం గొలిపేలా ఉన్నాయి.
అదానీ కోసం గ్రేట్ నికోబార్ ఐలాండ్‌లో విధ్వంసంః రాహుల్
అండమాన్ నికోబార్‌లోని గ్రేట్ నికోబార్ ఐలాండ్‌లో ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ కోసం లక్షల్లో చెట్లను నరికివేయడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఒక్క బిజినెస్ మ్యాన్ అదానీ కోసం కేంద్రం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ నివసించే ఆదివాసీల మనుగడకు ముప్పు ఉందన్నారు. రాహుల్ స్వయంగా ఆ ఏరియాలో పర్యటించి ఆ వీడియోని SMలో పోస్ట్ చేశారు. ఆయన ఏమన్నారో ఈ వీడియోలో మీరూ చూసేయండి
బెంగాల్ రెండో దశ పోలింగ్ హింసాత్మకం
బెంగాల్ సెకండ్ ఫేజ్ పోలింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే చాప్రా, శాంతిపూర్ వంటి ఏరియాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. హౌరాలో పలుచోట్ల EVMలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ ఫైర్ అవుతూ.. సెంట్రల్ ఫోర్సెస్ అంతా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. దీంతో పారామిలటరీ సిబ్బంది పలువురి అదుపులోనికి తీసుకుని ఇలా ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఆయిల్ దాచలేక ఇరాన్ పాట్లు
గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఇదొక పెద్ద సెన్సేషన్ న్యూస్. చమురు లేక అన్ని దేశాలు కష్టాలు పడుతూ ఉంటే ఇరాన్ మాత్రం ఆయిల్ ఎక్కువైపోయి అమ్ముకోలేక నానా తంటాలు పడుతోంది. హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా నేవీ దిగ్బంధం చేయడంతో ఇరాన్ ఆయిల్ ఎగుమతులు భారీగా పడిపోయాయి. గతంలో రోజుకి 18. 5 లక్షల బ్యారెల్స్ చమురుని ఎగుమతి చేస్తే ఇప్పుడు రోజుకి 5.67 లక్షల బ్యారెళ్లను మాత్రమే ఎగుమతి చేయగలుగుతోంది. తవ్వి తీసిన ఆయిల్ దాచుకోవడానికి నిల్వ కేంద్రాలు కూడా మరో రెండు వారాల్లో ఫుల్ అయిపోయేలా ఉన్నాయి. దీంతో ఇరాన్ ఆయిల్ ఇండస్ట్రీ కూడా సంక్షోభంలో పడనుంది.

Passport పై ఇక ట్రంప్ ఫోటో !
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రచారం పిచ్చి పీక్స్ కి చేరింది. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 250 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ జులైలో స్పెషల్ గా కొన్ని పాస్ పోర్టులు మంజూరు చేయనున్నారు. ఆ పాస్ పోర్టులపై ట్రంప్ తన ఫోటోతో పాటు ధగధగలాడే గోల్డెన్ సిగ్నేచర్ని ముద్రిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో దేశ గొప్పతనాన్ని చాటే చారిత్రక వారసత్వ కట్టడాలు ఎవరైనా ముద్రిస్తారు. కానీ ట్రంప్ రూటే సెపరేట్. ఇప్పటికే ట్రంప్ కరెన్సీ నోట్లపై సంతకం వేశారు. అది చాలదన్నట్టు పాస్ పోర్ట్ లపై ఫోటో వేయించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

సెకండ్ ఫేజ్ లో మమత వెర్సస్ సువేందు.. రాత్రి 7 గంటలకు ఎగ్జిట్ పోల్స్
పశ్చిమ బెంగాల్ లో చివరి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుంటే తొలిదశలో 152 చోట్ల పోలింగ్ పూర్తయింది. ఇవాళ మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్ లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి తలపడుతున్న భవానీపూర్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 92% పోలింగ్ నమోదు కావడంతో అధికార వ్యతిరేకత పని చేస్తుందా అన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇవాళ సాయంత్రం 7 గంటలకి ఎగ్జిట్ పోల్స్ వెలువడితే అయిదు రాష్ట్రాల్లో ఫలితాల ట్రెండ్ ని కొంతవరకు అంచనా వేయొచ్చు

తెలంగాణ కొత్త పోలీసు బాస్ ఆనంద్
తెలంగాణ రాష్ట్ర DGPగా 1991 బ్యాచ్ కు చెందిన అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2028 జూన్ వరకు ఆనంద్ ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ నెల 30 పదవీ విరమణ చేస్తారు. మే1న ఆనంద్ బాధ్యతలు స్వీకరిస్తారు.

ఓపెక్ నుంచి బయటకు వచ్చేసిన UAE
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓపెక్ కూటమినుంచి బయటకు వచ్చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. పైకి కారణం చెప్పకపోయినా..కొంత కాలంగా యూఎఈ చాలా అసంతృప్తితో ఉంది. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా లాంటి దేశాలు స్పందించి , తమకు మద్దతు పలకకపోవడంతో UAE తీవ్రఅసంతృప్తితో ఉంది. ఈ డెవలప్ మెంట్ తో భవిష్యత్తులో ఓపెక్ బలహీన పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే హర్ముజ్ మూసివేయడంతో ఆయిల్ దొరకక ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే ఇప్పుడు యూఏఈ కూడా గట్టి షాకే ఇచ్చింది.

అమరావతి పనులకు డీజిల్ ఇవ్వలేం - కేంద్రం
రాజధాని పనులకోసం డీజిల్ కావాలని ఏపీ సర్కార్ కేంద్రానికి విన్నవించింది. అయితే రిటైల్ బంకుల ద్వారా డీజిల్ సరఫరా కుదరదని ఏపీ ప్రభుత్వం తమ విన్నపాన్ని ఉపసంహరించుకుని రిటైల్ ఔట్ లెట్ లనుంచి బల్క్ గా సరఫరా చేయించుకోమని సూచన చేసింది. ఏపీ సర్కార్ విన్నపం నిబంధనలకు విరుద్ధమని నేరుగా ఆయిల్ కంపెనీలనుంచి ఆయిల్ కొనుక్కోవాలని సూచించింది.

నక్సలైట్స్ కి గవర్నమెంట్ జాబ్స్!
లొంగిపోయిన నక్సలైటు లకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. వారిని Tourism Departmenలో 'Giri Darshak' గైడ్లుగా అపాయింట్ చేసింది. భద్రాచలం, ములుగు వంటి ఏరియాల్లో వచ్చే టూరిస్టులకు వీరు గైడ్లుగా హెల్ప్ చేస్తారు. వీరికి గవర్నమెంట్ ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇచ్చింది. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి గౌరవంగా బతికేలా ఈ సరికొత్త అవకాశం ఇచ్చారు.
ఏపి బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత, ఓ ఆక్వారైతు ఆక్రందన
ఏపీలో ప్రధాన బంకుల్లో పెట్రోల్ , డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడ చూసినా బంకుల దగ్గర చాంతాడంత క్యూ కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల బంకులను డీజిల్ లేక మూసేస్తున్నారు.అనేక చోట్ల రూల్స్ పాటించని బంకులను అధికారులు సీజ్ చేస్తున్నారు.పల్నాడు జిల్లాలో మూడు,నర్సరావు పేట, పిడుగురాళ్ల, చిలకలూరి పేటల్లో బంకులను సీజ్ చేశారు. ఇటీవల ఓ బంకు దగ్గర ఆక్వారైతన్న 500 రూ. ల విలువైన డీజిల్ పోయండి. నా రొయ్య పిల్లలు చనిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్ గా మారుతోంది.

ప్లైట్స్ ఆపేస్తాం - ఇండియన్ ఎయిర్ లైన్స్ వార్నింగ్
పెరిగిన ఆయిల్ ధరలు (ATF prices) వార్ ఎఫెక్ట్ కారణంగా జర్నీకి లాంగర్ రూట్స్ ఎంచుకోవచడం వల్ల ఇండియన్ ఎయిర్‌లైన్స్ క్రైసిస్ లో పడిపోతోంది. Air India, IndiGo మరియు SpiceJet తమ యాక్టివిటీ నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన పడుతు న్నాయి. ప్రభుత్వం అర్జెంట్ గా జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. ఈ నష్టాల నుండి బయటపడేందుకు Federation of Indian Airlines (FIA) సివిలేవియేషన్ శాఖకు ఎమర్జెన్సీ నోట్ రాసింది.

ముంబై రోడ్లపై బర్త్ డే రీల్ ఫైర్ !!-నిందితుడు అరెస్ట్
బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో ముంబైలో ఓ ఆటో డీలర్ రోడ్డుపై తన ఏజ్ ను వేసి దానికి నిప్పంటించి ఇన్ స్టా గ్రామ్ రీల్ చేశాడు. ఆ ఆటో డీలర్ వయసు 33 కావడంతో 33 ఆకారంలో పెట్రోల్ పోసి దానికి నిప్పంటించి రీల్ షూట్ చేసి అప్ లోడ్ చేశాడు. ఆన్లైన్ లో వైరల్ అయిన దానిని చూసిన ముంబై గురేగావ్ పోలీసులు ఆ డీలర్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ మంటల ధాటికి రోడ్డు పాడైపోయింది. లోకల్స్ అనేకమంది చాలా ఇబ్బంది కూడా పడ్డారు. బర్త్ డే వీడియోపై నెటిజన్లు ఏకి పారేశారు.

అమరావతి టు హైదరాబాద్ ఇక 70 నిమిషాల్లో !!
మోడీ ప్రభుత్వానికి దక్షిణాది అంటే చిన్న చూపు కాదని ప్రేమ అనీ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కామెంట్ చేశారు. హై స్పీడ్ డైమండ్ పేరుతో దక్షిణాదిన ఇక బుల్లెట్ రైళ్లు దూసుకు పోతాయ న్నారు. ఇంపార్టెంట్ సిటీస్ మధ్య బుల్లెట్ రైల్ కనెక్షన్ పెరుగుతుందన్నారు. అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వీటి మధ్య ఈ రైళ్లు నడుస్తాయ న్నారు. కేవలం 70 నిమిషాల్లో అమరా వతినుంచి హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ లో రావొచ్చునన్నారు. విపక్షాల విమర్శలను డెవలప్ మెంట్ తో తిప్పి కొడతామన్నారు.గూగుల్ డేటా సెంటర్ శంకుస్థా పనలో ఈ మేటర్ చెప్పారు.

తెలంగాణలో వడదెబ్బకు నలుగురు బలి!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్‌లో 46 Degrees టెంపరేచర్ నమోదైంది. ఈ వడదెబ్బ కారణంగా ముగ్గురు చనిపోగా, పిడుగుపడి మరొకరు చనిపోయారు. afternoon ఎండలో బైటికి రావద్దని, తగినంత వాటర్ తాగుతూ సేఫ్ గా ఉండమని డాక్టర్స్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.

యుద్ధం ఎఫెక్ట్- ప్రభుత్వం ఆదుకోకుంటే ఫ్లైట్స్ ఆపేస్తాం!
విమానాల్లో వాడే ఇంధనం రేట్స్ విపరీతంగా పెరగడంతో ఎయిర్ ఇండియా, ఇండిగో కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. వార్ కారణంగా రేట్స్ పెరగడంతో ఫ్లైట్స్ నడపడం చాలా కష్టంగా మారింది. గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయకపోతే కంపెనీలు క్లోస్ చేయాల్సి వస్తుంది అని ఏయిర్ లైన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఫైనాన్షియల్ హెల్ప్ చేయమని సెంట్రల్ కి లెటర్ రాశారు.

రక్తపు మడుగులో యువతి డెడ్ బాడి!
బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్లో జార్ఖండ్‌కు చెందిన 34years పూజా దత్తా నగ్నంగా, రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఫ్లాట్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడంతో పోలీసులు డోర్స్ బ్రేక్ చేసి చూడగా ఈ దారుణం బయటపడింది. రూమ్ లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె Suicide చేసుకుందా లేక ఎవరైనా Murder చేశారా అనే angleలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.