Latest

కోహినూర్ ఇండియాకు ఇచ్చేయాలి : న్యూయార్క్ మేయర్ ▶
World· 30 Apr 2026

కోహినూర్ ఇండియాకు ఇచ్చేయాలి : న్యూయార్క్ మేయర్

కోహినూర్ వజ్రంపై మళ్లీ చర్చ మొదలైంది. ఆ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేయాలని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అన్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3తో తనకు విడిగా మాట్లాడే అవకాశం వస్తే వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఇచ్చేయమని చెబుతానని మమ్దానీ చెప్పారు. భారతీయ మూలాలున్న మమ్దానీ కొహినూర్ వజ్రం గురించి మాట్లాడడంపై చర్చ జరుగుతోంది.

మనోళ్లు ఉన్నారే ..! న్యూయార్క్ రోడ్లపై పెళ్లి బారాత్ ▶
World· 30 Apr 2026

మనోళ్లు ఉన్నారే ..! న్యూయార్క్ రోడ్లపై పెళ్లి బారాత్

అమెరికాలో మనోళ్లు చేసే కొన్ని పనులు ఇంటర్నెట్ లో చర్చకు దారి తీస్తున్నాయి. న్యూయార్క్ లోని ఫిఫ్త్ అవెన్యూలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక ఇండియన్ కపుల్ భారీ బారాత్ నిర్వహించి రోడ్లపైనే డ్యాన్స్ లతో హోరెత్తించారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే మాన్ హాటన్ వీధిని తాత్కాలికంగా మూసేశారు. ఈ జంట న్యూయార్క్ అధికారలకు వేల డాలర్లు చెల్లించి అనుమతులు తీసుకున్నారు. బట్… మరీ ఇలా రోడ్లు బ్లాక్ చేసే పెళ్లి వేడుకలు అవసరమా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.

యుద్ధాన్ని ఆపకపోతే పాక్ ఖాళీ
World· 30 Apr 2026

యుద్ధాన్ని ఆపకపోతే పాక్ ఖాళీ

అమెరికా, యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదంలో పడింది. చమురు ధరలు పెరగడం, సప్లై చైన్ దెబ్బ తినడం వల్ల సామాన్యుల బతుకు భారంగా మారింది. యుద్ధానికి ముందు పాక్ చమురు దిగుమతుల బిల్లు 300 మిలియన్ డాలర్లు ఉంటే అదిప్పుడు ఏకంగా 800 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షరీఫ్ షెహబాజే స్వయంగా చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకి అందరూ కలసి కట్టుగా కృషి చేయాలన్నారు.

కొత్త ఆయుధంతో సిద్ధం : అమెరికాకు ఇరాన్ వార్నింగ్
World· 30 Apr 2026

కొత్త ఆయుధంతో సిద్ధం : అమెరికాకు ఇరాన్ వార్నింగ్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. శాంతి చర్చల కోసం ఇరాన్ ప్రతిపాదనల్ని డొనాల్డ్ ట్రంప్ నిర్మొహమాటంగా తిరస్కరించడంతో పరిస్థితి మరింత ముదిరింది. ఇకపై తాను మంచివాడిగా ఉండనంటూ ట్రంప్ అనడం కలకలం రేపుతోంది. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందిస్తూ తాము ఒక కొత్త ఆయుధంతో సిద్ధంగా ఉన్నామని చెప్పింది. దానిని చూసి అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రుదేశాలకు హార్ట్ అటాక్ వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.

తమిళనాడు సీఎం విజయే ? Axis my india క్రెడిబులిటీ ఎంత ?
Politics· 30 Apr 2026

తమిళనాడు సీఎం విజయే ? Axis my india క్రెడిబులిటీ ఎంత ?

తమిళనాడులో టీవీకే విజయం సాధించి విజయ్ సీఎం అవుతాడని చెప్పిన ఏకైక సర్వే సంస్థ Axis My India. ఈ సంస్థ గత 11 ఏళ్లలో 69 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తే 65 సార్లు చెప్పింది కరెక్ట్ అయింది. అంటే 93% Accuracy. దీనికి కారణం శాంపిల్ సైజ్ చాలా పెద్దది. 5 లక్షల మందికి పైగా ఓటర్లతో మాట్లాడి వీళ్లు ఫలితాలు అంచనా వేస్తుంటారు. ఈ సంస్థ హెడ్ ప్రదీప్ గుప్తాకి కూడా SMలో మంచి క్రేజ్ ఉంది. టైట్ ఫైట్ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ సంస్థ కచ్చితమైన ఫలితాల్సి అంచనా వేయగలిగింది. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఈ సంస్థ బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పి బోర్లా పడింది. మరిప్పుడు విజయ్ గెలుస్తారా ? వెయిట్ అండ్ సీ

ఫ్రీ బస్సులపై అనంతపురం లేడీస్ ఆగ్రహం !
Local· 29 Apr 2026

ఫ్రీ బస్సులపై అనంతపురం లేడీస్ ఆగ్రహం !

ఫ్రీ బస్సుల వల్ల ప్రతీ రోజు ఇబ్బందులు పడుతున్నామని వాటిని ఎత్తేయాలంటూ అనంతపురం మహిళలు అంటున్నారు. పెద వడుగూరుకు చెందిన మహిళలు అనంతపురం వెళ్లడానికి గుత్తి బస్టాండ్ కు వచ్చారు. బస్సులు స్టాండ్ లో ఆపకుండా బస్టాండ్ వెనక వైపు నుంచి వెళిపోతున్నాయని మండిపడ్డారు. బస్సుల కోసం చూసే ఓపిక నశించిందన్నారు. మహిళలంటే అంత చులకన ఏంటనీ, మరీ టికెట్ కొనలేని స్థితిలో ఎవరూ లేరని, ఫ్రీ బస్సులు ఎత్తేయాలని చిరాకు పడ్డారు.

EC తీరుపై మమతా బెనర్జీ ఫైర్!▶
Politics· 29 Apr 2026

EC తీరుపై మమతా బెనర్జీ ఫైర్!

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ (EC) తీరుపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బోర్డర్ కాపాడాల్సిన Central Forcesని ఎలక్షన్ డ్యూటీకి వాడటం ఏంటని ప్రశ్నించారు. ఈ పనులన్నీ State Police చూసుకోవాలని, కానీ వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. తన పార్టీ వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని.. తన కెరీర్‌లో EC ఇంతలా అరాచకంగా ప్రవహించడం ఎప్పుడూ చూడలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెంగాల్ బీజేపీదే - ఎగ్జిట్ పోల్స్ అంచనా
Politics· 29 Apr 2026

బెంగాల్ బీజేపీదే - ఎగ్జిట్ పోల్స్ అంచనా

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్ లో బీజేపీదే ఈ సారి అధికారమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 150 నుంచి 160 సీట్లు గెలుస్తుందని, టీఎంసీ 130-140, కాంగ్రెస్ 2-4 వస్తాయని అంచనా వేసింది. P -Marq సంస్థ ప్రకారం బీజేపీ 150-175, టీఎంసీ 118-138, ఇతరులు 2-6 సీట్లు వస్తాయని అంచనా Matrize సంస్థ ప్రకారం బీజేపీ 146-161. టీఎంసీకి 125-140 ఇక పీపుల్స్ పల్స్ మాత్రం టీఎంసీకి 177-187 సీట్లు వస్తాయని బీజేపీకి 95 నుంచి 110 సీట్లు వస్తాయని వెల్లడించింది.

తమిళనాడు, బెంగాల్  పార్టీకి  - పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే
Politics· 29 Apr 2026

తమిళనాడు, బెంగాల్ పార్టీకి - పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే

తమిళనాడులో.. -------------- DMK+ 125-145 AIADMK+ 65-80 TVK -- 18-24 Others --2-6 బెంగాల్ లో ----------- TMC --177-187 BJP-- 95-110 left --0-1 congress -- 1-3

వైభవ్ బ్యాట్‌లో AI చిప్? పాక్ విశ్లేషకుడికి మాస్ రిప్లై.▶
Sports· 29 Apr 2026

వైభవ్ బ్యాట్‌లో AI చిప్? పాక్ విశ్లేషకుడికి మాస్ రిప్లై.

ఐపీఎల్ 2026లో 36 బాల్స్ లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. అయితే, అతని బ్యాట్‌లో AI Chip ఉందంటూ పాకిస్థాన్ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్ విమర్శలు చేశాడు. దీనిపై వైభవ్ రియాక్ట్ అవుతూ.. నా బ్యాట్‌లో ఏదో ఉందని దేవుడే ముందే చెప్పాడు, నేను ఆ బ్యాట్‌నే వాడుతున్నాను" అంటూ ఘాటైన సమాధానమిచ్చి విమర్శలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బుధవారం రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 యే రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్నంటే..-పీపుల్స్  పల్స్ సర్వే అంచనాలు
Politics· 29 Apr 2026

యే రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్నంటే..-పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు

కేరళలో ------- UDF 75-85 LDF 55-65 BJP alliance 0-3 అస్సాంలో-- -------- BJP 68-72 congress 22-26 AGP 7-10 Others 8-9

అస్సాం, బెంగాల్ పుదుచ్చేరిలలో కమలం హవా-చాణక్య ఎగ్జిట్ పోల్స్ సర్వే
Politics· 29 Apr 2026

అస్సాం, బెంగాల్ పుదుచ్చేరిలలో కమలం హవా-చాణక్య ఎగ్జిట్ పోల్స్ సర్వే

అస్సాం, బెంగాల్, పుదుచ్చేరిలలో బీజేపి కూటమి ఘన విజయం సాధిస్తుందని చాణక్య సంస్థ ఎగ్జిట్ పోల్స్ సర్వే లో తేలింది. అస్సాంలో బీజేపికి ఇది హాట్రిక్ కానుంది. తమిళనాడులో మరోసారి డీఎంకే ఘన విజయం సాధిస్తుందని , పుదుచ్చేరిలో బీజేపి కూటమి గెలుస్తుందని కేరళలోయూడిఎఫ్ కూటమి ఘన విజయం సాధిస్తుందని చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా. అస్సాంలో బీజేపి గెలిస్తే ఇది హాట్రిక్ అవుతుంది.

పోలీస్ స్టేషన్ లో కన్న పిల్లలను వదిలేసి పారిపోయిన పేరెంట్స్!▶
Viral· 29 Apr 2026

పోలీస్ స్టేషన్ లో కన్న పిల్లలను వదిలేసి పారిపోయిన పేరెంట్స్!

కరీంనగర్‌లో ఒక దారుణం జరిగింది. భర్త తాగుడు విషయంపై కౌన్సెలింగ్ జరుగుతుండగా భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆ కోపంలో భార్య తన మంగళసూత్రాన్ని తీసేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తమ ఇద్దరు చిన్న కుమార్తెలను అక్కడే వదిలేసి పారిపోయారు.. ఏడుస్తున్న ఆ పిల్లలను పోలీసులు ఓదార్చి, వారి తాతయ్య, నానమ్మలకు అప్పగించారు. కన్నబిడ్డల పట్ల ఆ పేరెంట్స్ ఇంత దారుణంగా ప్రవర్తించడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది

కోతికి కొత్త జీవితం!▶
News· 29 Apr 2026

కోతికి కొత్త జీవితం!

భారత్‌లో Skin Diseaseతో సఫర్ అవుతున్న ఒక మంకీని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ officials గుర్తించి సేఫ్ గా పట్టుకున్నారు. దానికి అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ చేశారు, అది కంప్లీట్ గా క్యూర్ అయ్యేలా చేశారు. దాని హెల్త్ క్యూర్ అయ్యాక ఆ మంకీని తిరిగి ఫారెస్ట్ లోకి పంపించేశారు. Wildlifes పట్ల ఆఫీసర్స్ చూపిన ఈ consern పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు

మళ్ళీ వాయిదా పడ్డ "టాక్సిక్"!
Cinema· 29 Apr 2026

మళ్ళీ వాయిదా పడ్డ "టాక్సిక్"!

యష్ సినిమా కోసం 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫాన్స్ కు మళ్ళీ బ్యాడ్ న్యూస్! ఈ ఏడాది జూన్ 4న యష్ హీరో గా చేస్తున్న "టాక్సిక్" సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. వరల్డ్ వైడ్ డియన్స్ ఆసక్తిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు, సినీ నటుడు యష్ అధికారికంగా ప్రకటించారు. కాబట్టి, మళ్ళీ ఎప్పుడు విడుదలౌతుందో అని కొత్త డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

లైవ్ మ్యాచ్‌లో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన రాజస్థాన్ కెప్టెన్!▶
Sports· 29 Apr 2026

లైవ్ మ్యాచ్‌లో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన రాజస్థాన్ కెప్టెన్!

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. స్టేడియం లోపల స్మోకింగ్ చేయడం BCCI రూల్స్ ప్రకారం నేరం. పైగా ఇండియా లో సిగరెట్ స్మోకింగ్ బ్యాన్ చేశారు. బ్యాటింగ్‌లో సరిగ్గా ఆడటం లేదని ఇప్పటికే విమర్శలు ఫేస్ చేస్తున్న పరాగ్, ఇప్పుడు ఈ పనితో మరింత చిక్కుల్లో పడ్డాడు. దీనిపై బోర్డు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది.

రేపే AP లో 10th రిసల్ట్స్!
News· 29 Apr 2026

రేపే AP లో 10th రిసల్ట్స్!

రిజల్ట్స్ కోసం గత నెల రోజులుగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న 10th స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్! రేపు ఉదయం 11 గంటలకు డిజిటల్ పద్ధతిలో ఈ రిజల్ట్స్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ ఇయర్ మార్చ్ 16th నుంచి ఏప్రిల్ 1st వరకు జరిగిన 10th ఎగ్జామ్స్ కి స్టేట్ లో దాదాపు 6.30 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. వారిలో ఎవ్వరూ ఫెయిల్ అవ్వరని గట్టి నమ్మకంతో ఉన్నారు. అది నిజమో కాదో రేపు తెలుస్తుంది.

పేరెంటింగ్ టిప్స్ .. పిల్లల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే ▶
Motivational· 29 Apr 2026

పేరెంటింగ్ టిప్స్ .. పిల్లల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే

ఈ స్పీడ్ యుగంలో పేరెంటింగ్ గురించి అందరూ తెలుసుకోవాలి. SMలో థెరపిస్ట్ Jeffrey Meltzer మీ పిల్లల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపాలంటే పేరెంట్స్ పాటించాల్సిన మూడు టిప్స్ గురించి చెప్పారు. ఫస్ట్ మీ పిల్లల్ని బేషరతుగా ప్రేమించండి. వాళ్ల బిహేవియర్ ఎలా ఉన్నా పేరెంట్స్ ప్రేమిస్తారన్న నిజం వారిలో ఎంతో ధైర్యాన్ని నింపుతుంది. రెండోది వారు పడే కష్టాన్ని గుర్తించండి. రిజల్ట్ ఏంటన్నది అసలు మ్యాటర్ కాదు. ఇక మూడోది తోటి పిల్లలతో వాళ్లు ఎలా ఆడాలో నేర్పించాలి. అంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అలవాటు చేస్తే పిల్లల మధ్య హెల్దీ రిలేషన్ బిల్డ్ అవుతుంది. వాళ్లలో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది.

చిత్తూర్ లో జర్నలిస్ట్ హత్య!
Crime· 29 Apr 2026

చిత్తూర్ లో జర్నలిస్ట్ హత్య!

ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అయిన వారణాసి జగన్ మోహన్ రెడ్డి అలియాస్ జగన్(49)ను, నిన్న మంగళవారం ఉదయం 7:30 నిమిషాల ప్రాంతంలో వీకోట మండలంలోని ధన్నూపురం గ్రామంలో, మరో జర్నలిస్ట్ సుబ్రమణ్యం తో పాటు వాకింగ్ చేస్తున్న టైమ్లో, మహబూబ్ బాష అలియాస్ తానీమ్ అనే రౌడీ షీటర్ మటన్ కొట్టే కత్తి తో బైక్ పై తన బావమరిధి సుభాన్ తో వచ్చి దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన సుబ్రమణ్యం ను తోసివేశాడు. అనతరం వారిద్దరూ బైక్ పై పారిపోయారు. ప్రస్తుతం వారిద్దహరి కొసం పోలీసులు వెతుకుతున్నారు.

వాటర్ ట్యాంక్‌ను స్విమ్మింగ్ పూల్‌గా మార్చారు!▶
Health· 29 Apr 2026

వాటర్ ట్యాంక్‌ను స్విమ్మింగ్ పూల్‌గా మార్చారు!

ముజఫర్‌నగర్‌లో ఇద్దరు వ్యక్తులు 200 అడుగుల ఎత్తులో ఉన్న డ్రింకింగ్ వాటర్ ట్యాంకుపైకి ఎక్కి అందులో స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ (Viral) అవుతోంది. విలేజ్ మొత్తం తాగే వాటర్ ని ఇలా Pollute చేయడం వల్ల పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వైరల్ వీడియో చూసిన పబ్లిక్ వెంటనే ఈ ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సిస్టర్ అస్థిపంజరంతో బ్యాంకుకు.. మీడియా పవర్‌తో దిగొచ్చిన ఆఫీసర్స్!▶
Politics· 29 Apr 2026

సిస్టర్ అస్థిపంజరంతో బ్యాంకుకు.. మీడియా పవర్‌తో దిగొచ్చిన ఆఫీసర్స్!

ఒడిశాలోని కియోంఝర్‌లో జితు ముండా అనే పర్సన్, తన చనిపోయిన సిస్టర్ అకౌంట్‌లో ఉన్న మనీ కోసం ఆమె అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకు వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గవర్నమెంట్ immediate గా రియాక్ట్ అయింది. వెంటనే బ్యాంక్ ఆఫీసర్స్ అతని ఇంటికి వెళ్లి రూ. 19,400 Duesతో పాటు extra రూ. 30,000 ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. CM ఈ ఇన్సిడెంట్ పై సీరియస్ అయ్యి ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించారు.