Latest

నార్వేలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ !
పదహారేళ్ల లోపు పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నార్వే ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియాలో వారు పార్టిసిపేట్ చేయకుండా ఏజ్ లిమిట్ వెరిఫికేషన్ చేసే అవకాశాన్ని పరిశీలించమని టెక్ కంపెనీలను కోరింది. ఆస్ట్రేలియాను చూసి స్ఫూర్తి పొందిన నార్వే పీఎం స్టోరే పిల్లలను డిజిటల్ మీడియాకు దూరంగా ఉంచి స్క్రీన్ ఫ్రీ బాల్యం వారికి అందించాలని ఆలోచిస్తున్నారు. టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ లను కూడా ఈ బ్యాన్డ్ లిస్టులో చేరుస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు.

అహంకారంపై పూరి జగన్నాథ్ హాట్ కామెంట్స్!
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన Puri Musings లో 'అహంకారం' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సక్సెస్ రాగానే హ్యూమన్ బిహేవియర్ చేంజ్ ఔతుందని, అది అహంకారమని చుట్టూ ఉన్న వాళ్లకు తెలుస్తుంది కానీ చేసేవాడికి మాత్రం అది Self-Confidence లా అనిపిస్తుందని అన్నారు. అహంకారం వల్ల రిలేషన్షిప్స్ దెబ్బతింటాయని, ఎదగాలంటే Humble గా ఉండటం ఇంపార్టెంట్ అని చెప్పారు. అహంకారి పక్కన ఉండేవారు ఫేస్ మీదే తిట్టకపోయినా, వారు నాశనం అవ్వాలని కోరుకుంటారని పూరి హెచ్చరించారు.

బీజెపిలోకి AAP ఫిరాయింపు దార్లు వీరే !!
ఆప్ నుంచి ఏడుగురు ఎంపీలు బీజేపిలో చేరుతున్నారు. వారెవరెవరంటే రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, రాజీందర్ గుప్తా, విక్రమ్ సహనీ,స్వాతీ మలివాల్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్. వీరంతా ఆప్ ఎంపీలే.. పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా ఉండాలంటే మూడింటా రెండొంతుల మంది పార్టీ మారాలి. ఆప్ కు రాజ్యసభలో పది మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు పంజాబ్ నుంచి కాగా ముగ్గురు ఢిల్లీ నుంచి ఎంపికయ్యారు. ఇక సంత్ బల్ బీర్ సింగ్ సీచేవాల్, సంజయ్ సింగ్, ఎన్ డి గుప్తా మాత్రమే ఆప్ కు మిగిలిన రాజ్య సభ ఎంపీలు

పంజాబ్ ను బీజేపి మోసగించింది-అరవింద్
ఆప్ ఎంపీల ఫిరాయింపుపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపి మళ్లీ పంజాబ్ ప్రజలను మోసం చేసిందని అన్నారు. వాస్తవానికి రాఘవ్ చద్దా కొంత కాలంగా ప్రధాని మోడీని గానీ, బీజేపిని గానీ విమర్శించడం మానేశారు. సొంత పార్టీ నేతలు ఈ విషయంలో అనేక సార్లు రాఘవ్ చద్దాను తప్పుబట్టారు. కేంద్ర మంత్రి పదవి కోసమే చద్దా బీజేపి పట్ల మెతక వైఖరితో ఉంటున్నారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఏడుగురు ఎంపీలతో కలిసి పార్టీ మారడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్.

రంగు తగ్గుతోందనే గోల్ఫ్ మానేశా ః రకుల్
నటి రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ షేర్ చేశారు. చిన్నప్పటినుంచి తనకు గోల్ఫ్ ఆడటం ఇష్టమని, కానీ ఎండలో గంటల తరబడి ఆడటం వల్ల తన శరీరం రంగు కోల్పోతోందని అందువల్ల ఆడటం మానేశాననీ తెలిపారు. రకుల్ తన10వ ఏట నుంచే గోల్ఫ్ ఆడుతోంది. ఈమధ్యనే పెళ్లి అయ్యాక సినిమాల జోరు తగ్గించిన ఈ నటిఎక్కువ బాలీవుడ్ మూవీస్ నే ఎంచుకుంటోంది.

ఆమ్ ఆద్మీ పార్టీని BJPలో కలిపేసిన రాఘవ్ చెద్దా
ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ చద్దా షాకిచ్చారు. చెద్దా సహా ఏడుగురు ఎంపీలు కలిసి రాజ్యసభలో ఆప్ ని బీజేపీలో మర్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మధ్యే ఆప్ ఆయన్ను RS డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా తొలగించాక చద్దా తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు. రాజ్యసభలో ఆప్ 2/3 ఎంపీలు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాం, RSలో ఆప్ ని బీజేపీలో విలీనం చేస్తున్నాం అని ప్రకటించారు. Chairmen కి లెటర్ ఇచ్చారు. 15 ఏళ్ల పాటు తాను ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కష్టపడ్డాననీ, పార్టీ అసలు ఆశయాలకు దూరం జరిగిపోవడంతో ఇకపై మోదీ, అమిత్ షాలతో కలిసి పని చేస్తా అని ప్రెస్ మీట్లో చెద్దా చెప్పారు.
ఎస్సీ ఎమ్మెల్యేలను తొక్కేస్తున్నారు: TDP MLA!
గంగాధర నెల్లూరు constituency TDP MLA థామస్ తమ సొంత పార్టీ నాయకత్వం పైనే హాట్ కామెంట్స్ చేశారు. SC MLAలను కొందరు టార్గెట్ చేస్తున్నారని, వారిపై వివక్ష చూపిస్తున్నారని ఫైర్ అయ్యాడు. గెలిపించేటప్పుడు SCలు కావాలి కానీ, రూలింగ్ లో ఉండకూడదా? మేము బానిసలుగా ఉండాలా? అంటూ నిలదీశారు. SC MLAలను తొక్కేయాలని చూడటం కరెక్ట్ కాదని, ఇలాంటి పద్ధతి మార్చుకోవాలని పార్టీ నాయకత్వాన్ని నిలదీశాడు. ఈ స్పీచ్ ఇప్పుడు ఏపీ పోలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో మండుతున్న ఎండలు. పలు చోట్ల 45 డిగ్రీలు !
ఏపీలో ఎండలు దంచేస్తున్నాయి. పలుజిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి కొనసాగుతున్నాయి. పగటి పూట ఉదయం ఏడు గంటల నుంచే ఎండ ధాటి తీవ్రంగా ఉంటోంది. రాష్ట్రంలోని 151 మండలాలలొ ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 62 మండలాల్లో తీవ్రమైన, 89 మండలాల్లో సాధారణ ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచిస్తోంది.

ఇష్టం లేని గర్భాన్ని బలవంతం చేయలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
15 ఏళ్ల బాలిక గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇష్టం లేకపోయినా గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను బలవంతం చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇది మహిళల మెంటల్ హెల్త్ మరియు రాజ్యాంగ హక్కులకు సంబంధించిందని పేర్కొంది. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకే ఉంటుందని, బలవంతం చేస్తే వారు ప్రాణాపాయం ఉన్నా సరే చట్టవిరుద్ధమైన అబార్షన్ సెంటర్స్ కు వెళ్లే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

భారత్‌పై ట్రంప్ మరోసారి విషం కక్కాడు.. గట్టిగా బుద్ధి చెప్పిన ఇరాన్!
భారత్, చైనాలను 'నరక కూపాలు' అని విమర్శించిన డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ గట్టిగా బుద్ధి చెప్పింది. ముంబైలోని ఇరాన్ కార్యాలయం, మహారాష్ట్ర గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది.. ఒకసారి భారత్‌కు వచ్చి ఇక్కడి గొప్పతనాన్ని చూసి మాట్లాడు అంటూ ట్రంప్‌కు చురకలు అంటించింది. ఇప్పటికే భారత్, చైనా దేశాలు ట్రంప్ మాటలను తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా స్నేహానికి ఏమాత్రం సంబంధం లేనివని మన విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
పోలీసులనే ఎదిరించిన గంజాయి బ్యాచ్!
హైదరాబాద్‌లోని బోడుప్పల్ కమాన్ దగ్గర కొందరు యువకులు గంజాయి మత్తులో నానా హంగామా చేశారు. నైట్ టైమ్ రోడ్డుపై వెళ్లే పబ్లిక్ ని ఆపి దాడులకు దిగారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి వస్తే, వారిని చూసి కూడా భయపడకుండా పోలీసుల మీదకే తిరగబడ్డారు. గంజాయికి బానిసలై యువత ఇలా ప్రవర్తించడం చూసి జనం భయపడుతున్నారు. పోలీసులు ఈ గంజాయి బ్యాచ్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్ 40% మంది రిటర్న్ జర్నీకి రెడీ!
ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. కార్నెగీ ఎండోమెంట్, YouGov సంయుక్తంగా నిర్వహించిన 'ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (IAAS) 2026' లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో సుమారు 40% మంది తిరిగి ఇండియాకి వచ్చేద్దామని అనుకుంటున్నారట. ట్రంప్ నిర్ణయాలు, గన్ కల్చర్ పెరిగిపోవడం, ఇమ్మిగ్రేషన్ కష్టాలే దీనికి మెయిన్ రీజన్స్ అని ఈ రిపోర్ట్ సారాంశం. అమెరికాలో భారతీయులు ఉండటం ఇప్పుడు బిగ్ ఛాలెంజ్ గా మారిందని ఈ సర్వే చెబుతోంది.
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. స్థానిక RDO ఉమారాణి శంకర్ గౌడ్ కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి RTCలో ఉద్యోగం ఇస్తామని తెలిపారునర్సంపేట కాంగ్రెస్ MLA దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా రూ.5 లక్షల సాయం ప్రకటించారు.

శవంపై బంగారు కమ్మలు మాయం!
జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో మానవత్వం మంటగలిసింది. అనారోగ్యంతో చనిపోయిన 80 ఏళ్ల బాలవ్వ అనే వృద్ధురాలి చెవులకు ఉన్న బంగారు కమ్మలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. డెడ్ బాడిని ఇంటికి తీసుకెళ్లాక నగలు లేకపోవడాన్ని గమనించిన చుట్టాలు షాక్ అయ్యారు. హాస్పిటల్‌లోని సెక్యూరిటీ గార్డ్ ని నిలదీయగా తనకు తెలియదని చెప్పడంతో, బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అభిమానుల సమక్షంలో సచిన్ బర్త్ డే
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 53వ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా ముంబైలో తన నివాసం బయట అభిమానుల సమక్షంలో సచిన్ కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో ఆయన భార్య అంజలి టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. అభిమానులంటూ హ్యాపీ బర్త్ టూ యూ అంటూ గట్టిగా అరుస్తూ సందడి చేశారు.

బీజేపీ ఆఫీసుకి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఇవాళ బీజేపీ కార్యాలయానికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ఆమె భేటీ అయ్యారు. దీంతో ఆమె బీజేపీలో చేరతారని, ఆ పార్టీ నుంచి ఎంపీ సీటు ఆశిస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మల్లారెడ్డి తన కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలుసుకున్నారు. మల్లారెడ్డి గ్రూప్ , గూగుల్ తో కలిసి ప్రారంభించనున్న డిజిటల్ ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లినట్టుగా అప్పట్లో మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.

రికార్డ్ ఓటింగ్.. విజయ్ మేజిక్ చేసినట్టేనా?
తమిళనాడులో నిన్న జరిగిన పోలింగ్ లో ఏకంగా 84.69% ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి భారీ ఓటింగ్ కు విజయ్ కొత్త పార్టీ TVK ఎంట్రీనే మెయిన్ రీజన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యూత్, ఫస్ట్ టైమ్ ఓటర్లు గంటల కొద్దీ క్యూలో నిలబడి ఓటేశారు. ఇది అధికార DMK శిబిరంలో గుబులు రేపుతోంది. గత చరిత్రను చూస్తే, రాష్ట్రంలో ఓటింగ్ శాతం భారీగా పెరిగినప్పుడల్లా ప్రభుత్వ వ్యతిరేకతతో పవర్ చేతులు మారింది. 1991, 1996, 2011 ఎన్నికలే దీనికి నిదర్శనం. ఈ సారి విజయ్ ద్రవిడ పార్టీల కోటలు బద్దలు కొడతారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ . మే 4న ఫలితాలు వచ్చేవరకు లెట్స్ వెయిట్ సీ
ఇంఫాల్ లో టార్చి ర్యాలీ
మణిపూర్ లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ ప్రతీ రోజూ నిరసనల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంఫాల్ లో వేలాది మంది స్థానికులు టార్చ్ ర్యాలీ చేసి తమ నిరసన తెలిపారు.
స్వగ్రామానికి చేరుకున్న శంకర్ గౌడ్ మృతదేహం
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) మృతదేహం ఆయన స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. శంకర్ గౌడ్ ఆత్మహత్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చింది.

రాకేష్ బేడికి కోటి రూపాయల బోనస్
లీడ్ హీరోలకు కోట్లలో రెమ్యూనరేషన్ రావడం కామనే, కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ₹1 కోటి బోనస్ రావడం అంటే మామూలు విషయం కాదు. రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ సినిమాలో పాక్ పొలిటీషియన్ గా నటించిన రాకేష్ బేడి తన పెర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పించారు. సినిమా వరల్డ్ వైడ్ ₹1,700 కోట్లకు పైగా వసూలు చేయడంతో, డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆయనకు కోటి రూపాయల బోనస్ ఇచ్చారు. ధురంధర్ రెండు పార్ట్స్ లో నటించినందుకు ఆయనకు ఇచ్చిన రెమ్యునరేషన్ 50 లక్షలే. ఈ మూవీలో "బచ్చా హై తూ మేరా" అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్‌గా మారిపోయింది!
గంగా నదిలో ప్రధాని పడవ విహారం
పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కాస్త రిలాక్స్ అయ్యారు. హౌరా నుంచి కోల్ కతా వరకు రోడ్ షో చేస్తూ వచ్చిన ఆయన ఇవాళ ఉదయం గంగా నదిలో కాసేపు పడవలో విహరించారు. హుగ్లీ నది అందాలను తన కెమెరాలో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.