Latest

 ప్రజా సమస్యలపై కవిత పాంచజన్యం▶
Politics· 25 Apr 2026

ప్రజా సమస్యలపై కవిత పాంచజన్యం

ప్రజా సమస్యలపై కవిత పాంచజన్యం పూరించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని అప్పుడు అయిదు అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. తెలంగాణ తల్లిగా తాను ప్రజల జేబులు చూడనని, వారి కడుపు చూస్తానని కవిత పదే పదే చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి , సామాజిక న్యాయమే తమ పార్టీ ఎజెండా అన్నారు. ఆడపిల్లల భద్రతపై కూడా తాము కచ్చితంగా దృష్టి పెడతామని అన్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు తమకు ప్రత్యర్థులేనని వారిపైనే యుద్ధం చేస్తామని ప్రకటించారు.

కేసీఆర్ మన మనిషి కాదు : కవిత విమర్శలు ▶
Politics· 25 Apr 2026

కేసీఆర్ మన మనిషి కాదు : కవిత విమర్శలు

కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కవిత బీఆర్ఎస్ పార్టీపైన, తండ్రి కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. మునీరాబాద్ సభలో మాట్లాడుతూ కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారని అన్నారు. కేసీఆర్ మన మనిషి కాదు. ఆత్మలేని మరబొమ్మ. అందుకే నేను యుద్ధం చేస్తున్నాను. మన కేసీఆర్ అయి ఉంటే ఆయన పాలమూరు ప్రాజెక్టు కట్టించేవారు అని అన్నారు. అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారని విమర్శించారు.

కవిత కొత్త పార్టీ పేరు TRS▶
Politics· 25 Apr 2026

కవిత కొత్త పార్టీ పేరు TRS

కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన.. (TRS) ఒకప్పుడు తండ్రి కేసీఆర్ పార్టీ పేరు టీఆర్ఎస్ అని వచ్చేలా పేరు పెట్టి రాజకీయంగా ఒక పెద్ద ముందడుగు వేశారు. కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించగానే కార్యకర్తలందరూ గట్టిగా అరుస్తూ సందడి చేశారు. రాష్ట్రానికి కాబోయే సీఎం కవితేనంటూ సీఎం సీఎం సీఎం అని అరుస్తూ కవితలో ఉత్సాహం నింపారు.

కొత్త పార్టీ ప్రకటనకు ముందు కవిత పూజలు ▶
Politics· 25 Apr 2026

కొత్త పార్టీ ప్రకటనకు ముందు కవిత పూజలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ కొత్త పార్టీ ప్రకటించనున్నారు. మునీరాబాద్ లో ఆవిర్భావ సభకు వెళ్లడానికి ముందు ఆమె తన నివాసంలో భర్తతో కలిసి పూజలు చేశారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన మహిళలతో కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు.

భారత్ ఖజానా ఫుల్.. $700 బిలియన్లు దాటిన ఫారెక్స్ నిల్వలు!
Business· 25 Apr 2026

భారత్ ఖజానా ఫుల్.. $700 బిలియన్లు దాటిన ఫారెక్స్ నిల్వలు!

భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) సరికొత్త రికార్డును సృష్టించాయి. తాజా గణాంకాల ప్రకారం 703.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మన ఖజానాలో బంగారం నిల్వలు కూడా భారీగా పెరిగి 122.1 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం. గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి ఉన్నప్పటికీ, రూపాయి బలపడడానికి ఈ భారీ నిల్వలు ఆర్బీఐ (RBI)కి అతి పెద్ద ప్లస్ పాయింట్. భారత్ ఆర్థికంగా మరింత స్ట్రాంగ్‌గా మారుతుందనడానికి ఇదొక సంకేతం.

అమెరికాతో ఫేస్ టు ఫేస్ చర్చలుండవ్ : ఇరాన్
World· 25 Apr 2026

అమెరికాతో ఫేస్ టు ఫేస్ చర్చలుండవ్ : ఇరాన్

అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ ద్వారా సందేశాలు పంపాలని ఇరాన్ నిర్ణయించుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్లామబాద్ చేరుకున్నారు. కానీ ఆయన అమెరికా ప్రతినిధులతో ఫేస్ టు ఫేస్ చర్చించాలని అనుకోవడం లేదు. ఇరు దేశాలు పాక్ అధికారుల ద్వారా తమ సందేశాలు పంపుతారు. మరోవైపు అమెరికా తరఫున ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ లు పాకిస్థాన్ కు వచ్చారు. ఈ చర్చల పురోగతిని బట్టి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వేన్స్ చర్చలకు వస్తారు.

3 ఏళ్లు H1B వీసాలకు బ్రేక్ ? వీసా విధానంలో భారీ మార్పులు
World· 25 Apr 2026

3 ఏళ్లు H1B వీసాలకు బ్రేక్ ? వీసా విధానంలో భారీ మార్పులు

అమెరికా వెళ్లాలనుకునే ఇండియన్ టెక్కీలకు షాకింగ్ న్యూస్. ట్రంప్ సర్కార్ మూడేళ్లు H-1B వీసాల జారీని నిలిపివేసి భారీ మార్పులు చేపట్టడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి End H-1B Visa Abuse Act of 2026 రిపబ్లికన్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం మూడేళ్లు వీసాల జారీని నిలిపివేసి వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తారు. ఏడాదికి జారీ చేసే వీసాల సంఖ్యను 65,000 నుండి ఏకంగా 25,000కి తగ్గించనున్నారు. అంతేకాదు లాటరీ విధానానికి స్వస్తి పలికి ఏడాదికి కనీసం వేతనం 2 లక్షల డాలర్లు ఇచ్చే అత్యధిక కంపెనీలకే ప్రాధాన్యత ఇచ్చేలా రూల్స్ మారుస్తారు. ఈ బిల్లు చట్టమైతే తక్కువ ప్యాకేజీకి అమెరికా వెళ్లడం ఇంపాజిబుల్

ఆర్టీసీ విలీనానికి కమిటీ.. రోడ్డెక్కిన బస్సులు
Local· 25 Apr 2026

ఆర్టీసీ విలీనానికి కమిటీ.. రోడ్డెక్కిన బస్సులు

ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కార్మికుల జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. 11% ఫిట్ మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో ఒక కమిటీ వేస్తామని అర్థరాత్రి దాటాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో సమ్మెకు తెరపడింది. ఇవాళ ఉదయం నుంచి యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి.

 ఢిల్లీ హంతకుడు ఆన్ లైన్ గేమ్స్ కి బానిస... డబ్బు కోసం హత్య !
Crime· 25 Apr 2026

ఢిల్లీ హంతకుడు ఆన్ లైన్ గేమ్స్ కి బానిస... డబ్బు కోసం హత్య !

ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి సంబంధించి వింతైన వివరాలు వెలుగులోకి వచ్చాయి .రాహుల్ (23) 10వ తరగతిలో 73% మరియు 12వ తరగతిలో 90% మార్కులు సాధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాడని, వాటి కోసం ఇంటి సామాను అమ్మాడని వారు పేర్కొన్నారు. భారీ అప్పుల కారణంగా అతను ఢిల్లీకి వచ్చి, తన మాజీ యజమాని (IRS) కుమార్తెపై అత్యాచారం, హత్యకు పాల్పడి, నగదు, బంగారం దొంగిలించినట్లు సమాచారం..

ఆర్టీసీలో మరో డ్రైవర్ ఆత్మహత్యా యత్నం !
Local· 25 Apr 2026

ఆర్టీసీలో మరో డ్రైవర్ ఆత్మహత్యా యత్నం !

ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. తాజాగా భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన రవీందర్ అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు.పురుగు మందు తాగిన అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీనితో ఇప్పటి వరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య నలుగురికి చేరుకుంది.

 ఎండల ఎఫెక్ట్... గ్రిడ్ లపై  తీవ్రమైన  స్ట్రెస్
Local· 24 Apr 2026

ఎండల ఎఫెక్ట్... గ్రిడ్ లపై తీవ్రమైన స్ట్రెస్

ఈఏడాది కరెంట్ వాడకం సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది.. సమ్మర్ లో ప్రతీ ఏటా విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. మే 2024లో నమోదైన 250 GW దేశ చరిత్రలోనే ఆల్-టైమ్ రికార్డు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ లోనే రికార్డు స్థాయిలో 240 GW కి చేరుకుంది. సమ్మర్ హీట్ వేవ్ తీవ్రంగా ఉండటం వల్ల ఆ డిమాండ్ 270 GW కి చేరుకోవచ్చని విద్యుత్ శాఖ అంచనా. కరెంటును పొదుపుగా వాడాలని, మిస్ యూజ్ చేయద్దని విద్యుత్ శాఖ ఇప్పటికే పిలుపునిచ్చింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు !
Business· 24 Apr 2026

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు !

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏప్రిల్ 24, 2026 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) లైసెన్స్‌ను రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద తీసుకున్న ఈ చర్యతో, పేటీఎం ఇకపై దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించలేదు. బ్యాంకును పూర్తిగా మూసివేసే ప్రక్రియ కోసం ఆర్‌బీఐ త్వరలో హైకోర్టుకి వెళ్లనుంది. అటు డిపాజిటర్లకు, ఇటు బ్యాంకుకు ఏ విధమైన సేఫ్టీ లేకుండానే బ్యాంకు నిర్వహణ బీ ఆర్క్ట్ యాక్ట్ ను ఉల్లంఘించడమేనని ఆర్ బీఐ ప్రకటించింది.

రాజ్యసభలో అతిపెద్ద కూటమిగా ఎన్డీఏ !!
Politics· 24 Apr 2026

రాజ్యసభలో అతిపెద్ద కూటమిగా ఎన్డీఏ !!

ఆప్‌కు చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో రాజ్య సభలో ఎన్డీఏ అతిపెద్ద కూటమిగా నిలిచింది. రాజ్యసభలో మొత్తం 245 సీట్లకు గాను రాష్ట్రాలనుంచి 233 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో బీజేపికి 106 సీట్లుఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏడుగురు ఆప్ ఎంపీల చేరికతో ఈ నెంబర్ 113కు పెరిగింది. మిత్రపక్ష ఎంపీలతో కలసి బీజేపికి ఇప్పుడు 125 సీట్లు ఉన్నాయి.

 ఇండియాను వణికిస్తున్న జోంబీ డ్రగ్స్ ఫీవర్ !!
Politics· 24 Apr 2026

ఇండియాను వణికిస్తున్న జోంబీ డ్రగ్స్ ఫీవర్ !!

దేశంలో 'జోంబీ డ్రగ్' వ్యాప్తి చెందుతోందనే వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. చండీగఢ్, లూథియానా, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, బీహార్లలో యువత వింతగా, కదలకుండా నిలబడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, దీనికి జైలజైన్ (Xylazine) కారణమని ప్రచారం జరుగుతున్నా, అధికారులు దీనిని ఇంకా ధృవీకరించలేదు. పాత డ్రగ్స్ వాడకం లేదా మానసిక సమస్యల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ డ్రగ్ తీసుకున్నవారు గంటల తరబడి ఒకే పొజిషన్ లో కదలకుండా ఉండిపోతారు. సాధారణంగా జంతువులకు సర్జరీలు చేసేటప్పుడు ఈ మందు వాడతారు.

అప్పు ఇస్తున్నారా? ఈ చిన్న పేపర్ లేకపోతే మీ మనీకి రిస్క్ బాస్!
Politics· 24 Apr 2026

అప్పు ఇస్తున్నారా? ఈ చిన్న పేపర్ లేకపోతే మీ మనీకి రిస్క్ బాస్!

మీ ఫ్రెండ్ కో లేదా తెలిసిన వారికో అప్పు ఇచ్చేటప్పుడు కేవలం మాట మీద నమ్మకంతో కాకుండా ప్రామిసరీ నోట్ రాయించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో 1. అప్పు తీసుకునే వ్యక్తి వివరాలు 2. తీసుకున్న అమౌంట్ 3. వడ్డీ రేటు 4. తిరిగి ఇచ్చే డేట్ స్పష్టంగా అంకెల్లోనూ, అక్షరాల్లోనూ రాయాలి. ముఖ్యంగా నోటుపై రెవెన్యూ స్టాంప్ అంటించి సంతకం చేయించుకోవాలి. అలాగే ఇద్దరితో సాక్షి సంతకాలు తప్పనిసరి. ఇలా లీగల్ గైడ్‌లైన్స్ ఫాలో అయితే మీరు అప్పిచ్చే డబ్బుకు పూర్తి భరోసా ఉంటుంది.

రాఘవ్ చడ్డా రిసైన్ పై.. అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్!
Politics· 24 Apr 2026

రాఘవ్ చడ్డా రిసైన్ పై.. అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్!

ఆమ్ ఆద్మీ పార్టీ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ రాఘవ్ చడ్డాతో సహా ఏడుగురు ఎంపీలు పార్టీకి రిసైన్ చేసి BJPలో జాయిన్ ఔతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. బీజేపీ పంజాబీలను మోసం చేసిందని ఎక్స్ లో పోస్టు చేశారు. Operation Lotus లో భాగంగానే ED, CBI లతో భయపెట్టి తమ లీడర్ లను లాక్కుంటున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ చర్య ఇప్పుడు నేషనల్ పోలిటిక్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.

ఫిరాయింపు గురించి కేజ్రీవాల్ కు  ముందే తెలుసా?
Politics· 24 Apr 2026

ఫిరాయింపు గురించి కేజ్రీవాల్ కు ముందే తెలుసా?

ఏడుగురు ఆప్ ఎంపీల ఎగ్జిట్ గురించి కేజ్రీవాల్ కు ముందే తెలిసినట్లుంది. రాఘవ్ చద్దా అనౌన్స్ మెంట్ కు కొన్ని గంటల ముందే కేజ్రీవాల్ తాను ప్రభుత్వం కేటాయించిన గవర్నమెంట్ బంగ్లాకు మారినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఇప్పటి వరకూ ఎంపీ అశోక్ మిట్టల్ కు ఫిరోజ్ షా మార్గ్ లో కేటాయించిన బంగ్లాలో ఉంటూ వచ్చారు. అయితే ఫిరాయింపు విషయం ముందే లీక్ అయి ఉండొచ్చని అందుకే తాను బంగ్లా ఖాళీ చేసినట్లు కేజ్రీవాల్ ప్రకటించారని అంటున్నారు.అశోక్ మిట్టల్ రాఘవ్ చద్దా వెంట బీజేపి లోకి ఫిరాయించారు.

'ఘోస్ట్ సైకిల్' చూశారా ఎప్పుడైనా !
Technology· 24 Apr 2026

'ఘోస్ట్ సైకిల్' చూశారా ఎప్పుడైనా !

గుజరాత్‌కు చెందిన శివమ్ మౌర్య అనే వ్యక్తి 'ఘోస్ట్ సైకిల్'ను తయారు చేసి అందరినీ షాక్ చేశాడు. ఓన్లీ 35 వేల ఖర్చుతో AI టెక్నాలజీని వాడి దీనిని తయారు చేశాడు. ఈ సైకిల్ తనంతట తానుగా బ్యాలెన్స్ చేసుకుంటూ, అడ్డంకులను గుర్తిస్తూ ముందుకు వెళ్తుంది. దీనిని smartphone లేదా Remote తో కూడా కంట్రోల్ చేయవచ్చు. సైకిల్ వెళ్తుంటే ఎవరో అదృశ్య వ్యక్తి తొక్కుతున్నట్లుగా కనిపించడం దీని స్పెషాలిటీ.

 భార్య టార్చర్ ను సీక్రెట్ గా రికార్డ్ చేసిన బాధితుడు!
Crime· 24 Apr 2026

భార్య టార్చర్ ను సీక్రెట్ గా రికార్డ్ చేసిన బాధితుడు!

భార్యలని హింసించే భర్తలని చూశాం. కానీ ఓ భార్య తన భర్తను రెండేళ్లుగా హింసిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ భార్యా బాధితుడు తాను అనుభవిస్తున్న టార్చర్ ను తన లాప్ టాప్ లో సీక్రెట్ గా రికార్డు చేయడంతో ఇది బయటపడింది. అందులో భార్య అతడిని కొట్టడం, తిట్టడం, కాలితో తన్నడం లాంటి విజువల్స్ ఉన్నాయి. కానీ ఈ వీడియో ఎక్కడది? ఇందులో ఉన్న వారెవరు అన్న డిటైల్స్ మాత్రం లేవు. విశాల్ మాల్వి అనే వ్యక్తి షేర్ చేసినట్లుగా ఉంది. అందుకే పెళ్లికి ముందు రెండుసార్లు ఆలోచించుకోండి బ్రో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో ట్రైన్లో వెళ్లొచ్చా?
Politics· 24 Apr 2026

ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో ట్రైన్లో వెళ్లొచ్చా?

చాలామందికి ఉండే డౌట్ ఇది. రైల్వే రూల్స్ ప్రకారం, మీరు ఒకసారి రిసర్వ్డ్ టికెట్ తీసుకున్నాక ట్రైన్ మిస్ అయితే, అదే టికెట్‌తో మరో ట్రైన్లో జర్నీ చేయడానికి ఛాన్స్ ఉండదు. అలా చేస్తే టికెట్ చెకింగ్ సిబ్బంది మీకు భారీగా ఫైన్ వేస్తారు. ఓన్లీ జనరల్ టికెట్ విషయంలో మాత్రమే కొన్ని Restrictions ఉంటాయి. కాబట్టి, ట్రైన్ మిస్ అయితే కొత్త టికెట్ తీసుకోవడం లేదా చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం మంచిది.

 బెంగాల్, తమిళనాడులపై ఇంటర్నేషనల్ బెట్టింగ్ !!
World· 24 Apr 2026

బెంగాల్, తమిళనాడులపై ఇంటర్నేషనల్ బెట్టింగ్ !!

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అంతర్జాతీయంగా బెట్టింగ్ జోరందుకుంది. అమెరికాకు చెందిన 'పాలీమార్కెట్' వేదికగా ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల పైగా పందాలు కాశారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీకి 52%, టీఎంసీకి 47% గెలుపు అవకాశాలు ఉన్నట్లు పందెం రాయుళ్లు అంచనా వేస్తున్నారు. భారతీయ చట్టాల ప్రకారం ఈ సైట్లు నిషిద్ధమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలపై భారీగా పెట్టుబడులు రావడం విశేషం