Latest

 ఇరాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి సర్వీసులు షురు !
World· 25 Apr 2026

ఇరాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి సర్వీసులు షురు !

ఇరాన్ లోని ఇమామ్ ఖొమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లైట్ సర్వీసులు రీ ఓపెన్ అయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి విమాన సర్వీసులు మొదలయ్యాయని, కీలక విమాన సర్వీసులు గతంలోలాగే యధాప్రకారం నడుస్తాయని ఇరాన్ వార్తాసంస్థ మెహర్ తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఘర్షణల కారణంగా విమాన సర్వీసులు ప్రపంచ వ్యాప్తంగా ఎఫెక్ట్ అయ్యాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో యుగతులసి ఛైర్మన్ కు నోటీసులు
Politics· 25 Apr 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో యుగతులసి ఛైర్మన్ కు నోటీసులు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో మరోసారి సాక్షులను విచారించాలని నిర్ణయించారు. యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ , టి.టి.డి మాజీ సభ్యులు కె. శివకుమార్ కు సిట్ నోటీసులిచ్చింది. మే 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనుంది.

Rowdyలు ఇక "జైలుకు లేదా పైకి"
Politics· 25 Apr 2026

Rowdyలు ఇక "జైలుకు లేదా పైకి"

పశ్చిమ బెంగాల్ election campaignలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టేట్ లో rowdyism చేసేవారిని ఏరివేస్తామని, వారు జైలులో ఉండాలి లేదా పైకి పోవాలని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో కాంప్రమైస్ కామని, TMC గూండాలకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని స్పష్టం చేశారు. మే 4త్ రిసల్ట్స్ తర్వాత ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత !!
Local· 25 Apr 2026

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత !!

ఏపీలో పెట్రోల్, డీజిల్ లకు కొరత ఏర్పడింది. అనేక బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. కర్నూలులో బంక్ ల దగ్గర రద్దీ పెరిగింది . కొరత వస్తోందన్న భయంతో జనం క్యూ కట్టేస్తున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో డీజిల్ కొరతతో వెహికల్స్ నానా అగచాట్లు పడుతున్నాయి.నిడమర్రు, గణపవరం, భీమడోలులో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. కాకినాడ పెట్రోల్ బంకుల దగ్గర చాంతాడంత క్యూ కనిపిస్తోంది. ఇవే కాదు.. ఇంకా చాలా చోట్ల పెట్రోల్, డీజిల్ కొరతతో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.

చనిపోయిన వ్యక్తి కోసం డ్యాన్సర్లను పిలిపించిన ఫ్యామిలీ!
World· 25 Apr 2026

చనిపోయిన వ్యక్తి కోసం డ్యాన్సర్లను పిలిపించిన ఫ్యామిలీ!

సాధారణంగా అంత్యక్రియలు సాడ్ గా జరుగుతాయి, కానీ థాయిలాండ్ లో ఒక పర్సన్ తన డెత్ ని అందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకున్నాడు. అతడి చివరి కోరిక మేరకు ఫ్యామిలీ మెంబర్స్ శవపేటిక ముందే Dancersతో డాన్స్ చేయించారు. బౌద్ధ టెంపుల్ లో జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పబ్లిక్ రకరకాలుగా రియాక్ట్ ఔతున్నారు.

నా డెడ్ బాడీని తండ్రి తాకద్దుః కాన్పూర్ లాయర్ సంచలన పోస్ట్ !!
Crime· 25 Apr 2026

నా డెడ్ బాడీని తండ్రి తాకద్దుః కాన్పూర్ లాయర్ సంచలన పోస్ట్ !!

కాన్పూర్ కోర్టు భవనంపై నుంచి దూకి పాతికేళ్ల లాయర్ ప్రియాన్షు శ్రీవాస్తవ చనిపోయాడు. ఆత్మ హత్యకు ముందు వాట్సప్ లో సూసైడ్ నోట్ వైరల్ గా మారింది. బాల్యంలో తండ్రి అకృత్యాలే సూసైడ్ కి కారణమని నోట్‌లో ఆరోపించాడు ప్రియాన్షు. తండ్రి కఠినంగా వ్యవహరించడంవల్ల మెంటల్ టెన్షన్ పెరిగిందని, ఇష్టం లేని చదువువల్ల ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్లు అందులో రాశాడు.ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి పెరిగి, ఆత్మన్యూనత భావంతో బాధపడ్డానని పేర్కొన్నాడు.“నా డెడ్ బాడీని నా తండ్రి తాకకూడదు” అని రాయడం సంచలనం. తన తల్లిని నిందించొద్దని అతడు కోరాడు.

కమర్షియల్ టాక్సెస్ శాఖ అటెండర్ ఇంట్లో కోట్లాది ఆస్తులు !!
Crime· 25 Apr 2026

కమర్షియల్ టాక్సెస్ శాఖ అటెండర్ ఇంట్లో కోట్లాది ఆస్తులు !!

విజయవాడలో వాణిజ్య పన్నుల శాఖ అటెండర్‌ కొండపల్లి శ్రీనివాసరావుపై ACB కేసు నమోదైంది. ఆతని ఇల్లు, సోదరుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నట్లు అధికారులు నిర్ధారించారు..760 గ్రాముల బంగారం,5 గోల్డ్ బిస్కెట్లు,7.8 కిలోల వెండి ఆభరణాలు సీజ్ చేశారు. బ్యాంక్ ఖాతాల్లో రూ.22 లక్షల క్యాష్ ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు పేరిట .ఖరీదైన బంగ్లా,, స్థలం ఉన్నట్లు బయటపడ్డాయి..బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ACB అధికారులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

 తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనగణన
Local· 25 Apr 2026

తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనగణన

తెలంగాణలో తొలిసారిగా జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి ప్రకటించారు. జనగణన రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో ఏప్రిల్ 26 నుంచి మే 9 వరకు ఆన్ లైన్ లో డీటైల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. తుది దశలో ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన నిర్వహిస్తారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది.

 కేజ్రీ కొత్త బంగ్లా శీష్ మహల్- 2 ః బిజేపి
Politics· 25 Apr 2026

కేజ్రీ కొత్త బంగ్లా శీష్ మహల్- 2 ః బిజేపి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన కొత్త బంగళాను బీజేపీ 'శీష్ మహల్ 2'గా అభివర్ణించింది. ఈ బంగ్లా కో సం భారీగా ఖర్చు చేశారని, విలాసవంతమైన సౌకర్యాల కోసం ప్రైవేట్ డబ్బును ఉపయోగించారని బీజేపీ నేత పర్వేష్ వర్మ ఆరోపిస్తూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు. అయితే, అవి నకిలీవని, వాటిని 'పింటరెస్ట్' నుండి డౌన్‌లోడ్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గట్టిగా బదులిచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆప్ మండిపడింది.

CSK ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ అవుట్!
Sports· 25 Apr 2026

CSK ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ అవుట్!

ముంబై ఇండియన్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టిన CSKకి బిగ్ షాక్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ రీసన్ తో సడన్‌గా టీమ్‌ను విడిచి పుణే వెళ్లారు. దీంతో సండే Gujarat Titansతో జరిగే మ్యాచ్‌లో ఆయన ఆడటం అనుమానంగా మారింది. ఒకవేళ రుతురాజ్ రాకపోతే, MS ధోనీ మళ్ళీ కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి భార్య, బిడ్డను చంపేసింది!
Politics· 25 Apr 2026

బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి భార్య, బిడ్డను చంపేసింది!

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. బాయ్ ఫ్రెండ్ లలితేశ్ ఇంటికి వెళ్లిన సరోజిని అనే యువతి, అతని వైఫ్ రీనా, సన్ ఆదిత్యపై నైఫ్ తో ఎటాక్ చేసింది. ఈ ఎటాక్ లో వారిద్దరూ చనిపోయారు. తన డాటర్స్ ని కాపాడుకోవడానికి రీనా ప్రాణాలకు తెగించి పోరాడింది. టీవీ సౌండ్ పెంచి ఈ ఎటాక్ చేసింది సరోజి. విషయం తెల్సుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

రాఘవ చద్దా డెసిషన్  జెన్ జీ కి నచ్చలేదా?
Politics· 25 Apr 2026

రాఘవ చద్దా డెసిషన్ జెన్ జీ కి నచ్చలేదా?

రాఘవ చద్దా బీజేపిలో చేరడాన్ని జెన్ జీ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుంది. ఆయన బీజేపి లో చేరిన మరుక్షణమే ఆయన ఇన్ స్టా గ్రామ్ ఫాలోయర్లు పది లక్షల మంది తగ్గిపోయారు. ఆయనకు ఇన్ స్టాలో 14.6 మిలియన్ల ఫాలోయర్లు ఉండగా, నిన్నటికి ఇవాల్టికి ఆ సంఖ్య 13.5 మిలియన్లకు పడిపోయింది. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేసే రాఘవ్ చద్దాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఈమధ్య ఆయన బీజేపిని ఎక్కువగా తిట్టడం లేదు.

కేజ్రీవాల్‌పై స్వాతి మాలివాల్ ఫైర్.. నన్ను రౌడీలతో కొట్టించారు!
Politics· 25 Apr 2026

కేజ్రీవాల్‌పై స్వాతి మాలివాల్ ఫైర్.. నన్ను రౌడీలతో కొట్టించారు!

ఆమ్ ఆద్మీ పార్టీని వొదిలి BJPలో చేరిన ఎంపీ స్వాతి మాలివాల్, కేజ్రీవాల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సొంత ఇంట్లోనే తనను ఒక రౌడీ లతో కొట్టించారని, ఆ కంప్లయింట్ వెనక్కి తీసుకోవాలని స్ట్రెస్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఉమెన్ వ్యతిరేకి అని విమర్శిస్తూ.. prime minister మోదీ లీడర్షిప్ పై నమ్మకంతోనే బీజేపీలో చేరానని ఆమె స్పష్టం చేశారు.

రోహిత్ శర్మ కమ్ బ్యాక్: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు పండగే!
Sports· 25 Apr 2026

రోహిత్ శర్మ కమ్ బ్యాక్: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు పండగే!

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మళ్ళీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. muscle injure కారణంగా గత కొన్ని మ్యాచులకు దూరమైన రోహిత్, ఏప్రిల్ 29న SRHతో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న MI టీమ్‌కు రోహిత్ ఎంట్రీ బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. రోహిత్ ఎంట్రీతో ముంబై ఇండియన్స్ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉండొచ్చు అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సమ్మర్‌లో వికారం, వాంతులా? ఇలా చేయండి!
Health· 25 Apr 2026

సమ్మర్‌లో వికారం, వాంతులా? ఇలా చేయండి!

ఎండల వల్ల Dehydration, వికారం, నీరసం వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ తాగకుండా, కొద్దికొద్దిగా తాగుతూ బాడీని Hydrate చేయాలి. Coconut Water లేదా ORS తీసుకోవడం వల్ల బాడీకి ఎనర్జీ అందుతుంది. మసాలా ఫుడ్స్ కి దూరంగా ఉండి, గంజి లేదా అరటిపండు లాంటి నార్మల్ ఫుడ్ తీసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి!

కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్ షాకింగ్ కామెంట్స్!
Politics· 25 Apr 2026

కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్ షాకింగ్ కామెంట్స్!

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కవితకు BJP ఇప్పటికే రాజకీయ సమాధి కట్టిందని అంటూ. పిట్టల దొరను చూశాం, ఇప్పుడు ఈ "పిట్టల దొరసాని"ని చూస్తున్నామంటూ వెటకారంగా స్పందించారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేస్తూ, BRS లీడర్స్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఈ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Sugarcane Juice: ఈ 3 రకాల వ్యక్తులు అస్సలు తాగొద్దు!
Politics· 25 Apr 2026

Sugarcane Juice: ఈ 3 రకాల వ్యక్తులు అస్సలు తాగొద్దు!

సమ్మర్లో Sugarcane Juice తాగడం మంచిదే, కానీ అందరికీ కాదు! ఇందులో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల Diabetes ఉన్నవారు దూరంగా ఉండాలి. అలాగే weight loss అవ్వాలనుకునేవారు, digestion problems ఉన్నవారు కూడా జాగ్రత్త పడాలి. ఎనీ టైమ్ ఓన్లీ ఫ్రెష్ జ్యూస్ మాత్రమే తాగండి, emty stomachతో అస్సలు తాగకండి. ఓవర్ గా తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు.

కవిత పార్టీ పేరుపై BRS షాకింగ్ పోస్ట్!
Politics· 25 Apr 2026

కవిత పార్టీ పేరుపై BRS షాకింగ్ పోస్ట్!

కవిత తన కొత్త పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) అని అనౌన్స్ చేయగానే BRS పార్టీ నుంచి Response వచ్చింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ తన ఎక్స్ (X) అకౌంటు లో ఒక పవర్ ఫుల్ల్ పోస్ట్ పెట్టింది. కవిత పాత పార్టీ పేరునే కొంచెం అటు ఇటుగా వాడటంపై BRS ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా వార్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఉప్పు ఎక్కువ తింటున్నారా? అయితే జాగ్రత్త!
Health· 25 Apr 2026

ఉప్పు ఎక్కువ తింటున్నారా? అయితే జాగ్రత్త!

ఫుడ్ లో సాల్ట్ ఎక్కువైతే బాడీలోని Calcium యూరిన్ ద్వారా బయటకు పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మీ Bones వీక్ అయ్యి, టీత్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. WHO ప్రకారం రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సాల్ట్ తీసుకోవడమే హెల్తీ. అందుకే సాల్ట్ తగ్గించి.. మిల్క్, కర్ద్ వంటి Calcium Rich Food ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.

ఈ దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి HIV!
Health· 25 Apr 2026

ఈ దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి HIV!

దక్షిణాఫ్రికాలోని Eswatini అనే చిన్న దేశంలో HIV చాలా స్పీడ్ గా స్ప్రెడ్ ఔతుంది. అక్కడ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడం భయాందోళన కలిగిస్తోంది. మొత్తం 12 లక్షల పాపులేషన్ లో దాదాపు 3 లక్షల మంది దీని బారిన పడ్డారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎయిడ్స్ కేసులు ఉన్న దేశంగా Eswatini నిలిచింది. ఈ Shocking న్యూస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.

కవిత ఇచ్చిన ఆ 5 హామీలు ఇవే
Politics· 25 Apr 2026

కవిత ఇచ్చిన ఆ 5 హామీలు ఇవే

తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అధికారంలోకి వస్తే అయిదు అంశాలపైనే తమ పార్టీ పని చేస్తుందని కవిత అన్నారు. ఆవిర్భావ సభలో ఆమె ఇచ్చిన హామీలు ఏంటంటే.. 1. ఉచిత విద్య .. ప్రైవేటు స్కూళ్లలో కూడా ఉచిత విద్య 2. ఉచిత వైద్యం.. అందరికీ అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం 3. వ్యవసాయం .. రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం. 4 ఉపాధి .. 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు యువతకి రుణాలు .. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ఒకే నోటిఫికేషన్ తో 4 లక్షల ఉద్యోగాల కల్పన 5, సామాజిక న్యాయం .. బీసీలకు 50% రిజర్వేషన్ వచ్చేలా పోరాటం. అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం అందేలా చర్యలు