రోడ్లు లేక అవస్థలు.. పట్టించుకోని ప్రభుత్వం?

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి, డుంబ్రిగూడ మండలాల్లో మంజూరైన బీటీ రోడ్లను రద్దు చేయడం సరికాదని మాజీ MPTC బురిడి దశరథ్ అన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రహదారులు సరిగా లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోగులు, గర్భిణులను ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు.





