పాత కక్షలతో యువకుడి హత్య

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బొంత సంతోష్ 19 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి పాత కక్షలతో శివరాత్రి అనిల్ అనే యువకుడు సంతోష్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



