పోలవరంలో నీలిరంగులోకి గోదావరి

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది నీటి రంగు రాగి వర్ణం నుంచి ప్రశాంతమైన నీలిరంగులోకి మారింది. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గడం, వరద మట్టి, బురద మేటలు నిలిచిపోవడంతో పాటు సీలేరు ఉపనది నుంచి స్వచ్ఛమైన జలాలు వచ్చి కలవడంతో నీరు నీలిరంగులోకి మారినట్లు అధికారులు తెలిపారు. ఈ సహజ దృగ్విషయాన్ని వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.



