← Back to news

డ్రగ్స్‌పై వ్యతిరేకంగా 21న అమిత్ షా బైక్ ర్యాలీ

By Lokesh· 1h ago· X
డ్రగ్స్‌పై వ్యతిరేకంగా 21న అమిత్ షా బైక్ ర్యాలీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 21న ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్‌లో పోలీసు అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం 90 మంది పోలీస్ రైడర్లతో కూడిన బైక్ ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ సహా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర బలగాలకు చెందిన పోలీసులు ఇందులో పాల్గొంటారు. ‘ఫైట్ అగైనెస్ట్ డ్రగ్స్’ థీమ్‌తో సాగే ఈ ర్యాలీలో పాల్గొనేవారు అక్టోబర్ 31న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌కు చేరుకుని ఏక్తా పరేడ్‌లో పాల్గొంటారు.

More in National