Parle-G ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రిచాయ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న 'Parle-G' బిస్కెట్ ఫ్యాక్టరీలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. పోలీసులు సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి అసలు కారణం ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాతే తెలుస్తుందని అన్నారు.


